← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్వం satvaṃ

Original — తెలుగు
  1. వస్తువు, బలము, ప్రాణము -

  2. పృధివ్యాది సంఘాత దేహాః -

(భూమి మొదలగు పంచభూతముల కూటమిచే కలిగిన దేహములు).

  1. స్వభావము -

  2. సత్యము, రజస్సు, తమస్సు అను త్రిగుణములలో నొకటి - మొదటిది, సత్వగుణము - ప్రకృతియొక్క మూడుగుణములలో నొకటి.

  3. చరాచరాత్మకమైన వస్తువు లేక పదార్థము.

  4. 6. ప్రాణి జాతం (ప్రాణముగల జీవులు) - (జీవులకు ప్రాణమే సత్వము - బలము).

  5. శుద్ధం, శుద్ధ సత్వాత్మకం రూపం

(శుద్ధసత్వము - ప్రకృతితో కలిఉయని - అందుచేత ప్రకృతివలన కలుగు దోషములు - లేని సత్వము) (Pure Energy)

  1. “యావత్సంజాయతే కించిత్సత్వం స్థావర జంగమం |

క్షేత్ర క్షేత్రజ్ఞ సం యోగా త్తద్విద్ధి భరతర్షభ.

(ఈ సృష్టిలో ఏ కొంచమైనదైనను సత్వముగలది = ప్రాణము గలది, సత్వముగలది. ప్రాణముగలది, స్థావరముగాని, జంగమముగాని - చరముగాని, అచరముగాని పుట్టినచో అది ఆ వస్తువు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు - అనగా పురుషుడు (పరబ్రహ్మ), ప్రకృతియొక్క సం యోగమువననే జరుగుచున్నదని తెలుసుకొనుము - పరబ్రహ్మ (పురుషుడు) తన చైతన్యశక్తితో ప్రకృతిలో ప్రవేశించుటచేతనే ప్రకృతిలోనుండి మఱియొక వస్తువు పుట్టుచున్నది. సృష్టిలోని ప్రతి వస్తువులోని ప్రకృతి అంశ, భగవంతుని అంస (చిచ్ఛక్తి) ఉన్నది. ఈ రెండు ప్రతి వస్తువులోను ఉండుటవలననే ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది. క్షేత్రము అనగా ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అనగా పరబ్రహ్మ)

  1. న తదస్తి పృధివ్యాం నాదివి దేవేషువా పునః |

సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యా త్త్రిభిర్గుణైః ||

(భూమిమీద కాని, ఆకాసములో కాని, దేవతులలో గాని ప్రకృతిగునములైన సత్వరజస్తమోగుణములు లేని వస్తువు లేదు).

“పృధివ్యాం - మనిష్యాదిషు -, దివి (దేవేషువా) ప్రకృతి సంసృష్టేషు బ్రహ్మాది స్థావరాతేషు, ప్రకృతిజాతైః త్రిగుణైః ముక్తం - పరిత్యక్తం యత్సత్వం, ప్రాణిజాతం, న తదస్తి)

(భూమిమీదకాని, అనగా, మనుష్యులలోగాని, దేవలోకమందుకాని, అనగా, దేవతులలోగాని, ప్రకృతివలన కలిగిన చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గల ప్రాణులలో ఏదియు ప్రకృతిలోని గుణములైన సతవ్రజసతమములు లేనిది లేదు).

  1. “భేజిరే మునయో (అ)ధాగ్రే భగవంత మధోక్షజం |

సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే యే యే (అ)నుతానీహ ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 -25)

“తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి”.

(శ్రీమహావిష్ణువు సత్వగుణమయుడు - అందుచేత మునులు పూర్వము అతనిని కొలిచిరి).

Transliteration
  1. vastuvu, balamu, prāṇamu -

  2. pṛdhivyādi saṃghāta dēhāḥ -

(bhūmi modalagu paṃcabhūtamula kūṭamicē kaligina dēhamulu).

  1. svabhāvamu -

  2. satyamu, rajassu, tamassu anu triguṇamulalō nokaṭi - modaṭidi, satvaguṇamu - prakṛtiyokka mūḍuguṇamulalō nokaṭi.

  3. carācarātmakamaina vastuvu lēka padārthamu.

  4. 6. prāṇi jātaṃ (prāṇamugala jīvulu) - (jīvulaku prāṇamē satvamu - balamu).

  5. śuddhaṃ, śuddha satvātmakaṃ rūpaṃ

(śuddhasatvamu - prakṛtitō kaliuyani - aṃducēta prakṛtivalana kalugu dōṣamulu - lēni satvamu) (Pure Energy)

  1. “yāvatsaṃjāyatē kiṃcitsatvaṃ sthāvara jaṃgamaṃ |

kṣētra kṣētrajña saṃ yōgā ttadviddhi bharatarṣabha.

(ī sṛṣṭilō ē koṃcamainadainanu satvamugaladi = prāṇamu galadi, satvamugaladi. prāṇamugaladi, sthāvaramugāni, jaṃgamamugāni - caramugāni, acaramugāni puṭṭinacō adi ā vastuvu kṣētramu, kṣētrajñuḍu - anagā puruṣuḍu (parabrahma), prakṛtiyokka saṃ yōgamuvananē jarugucunnadani telusukonumu - parabrahma (puruṣuḍu) tana caitanyaśaktitō prakṛtilō pravēśiṃcuṭacētanē prakṛtilōnuṃḍi maṟiyoka vastuvu puṭṭucunnadi. sṛṣṭilōni prati vastuvulōni prakṛti aṃśa, bhagavaṃtuni aṃsa (cicchakti) unnadi. ī reṃḍu prati vastuvulōnu uṃḍuṭavalananē oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi. kṣētramu anagā prakṛti, kṣētrajñuḍu anagā parabrahma)

  1. na tadasti pṛdhivyāṃ nādivi dēvēṣuvā punaḥ |

satvaṃ prakṛti jairmuktaṃ yadēbhiḥ syā ttribhirguṇaiḥ ||

(bhūmimīda kāni, ākāsamulō kāni, dēvatulalō gāni prakṛtigunamulaina satvarajastamōguṇamulu lēni vastuvu lēdu).

“pṛdhivyāṃ - maniṣyādiṣu -, divi (dēvēṣuvā) prakṛti saṃsṛṣṭēṣu brahmādi sthāvarātēṣu, prakṛtijātaiḥ triguṇaiḥ muktaṃ - parityaktaṃ yatsatvaṃ, prāṇijātaṃ, na tadasti)

(bhūmimīdakāni, anagā, manuṣyulalōgāni, dēvalōkamaṃdukāni, anagā, dēvatulalōgāni, prakṛtivalana kaligina caturmukhabrahma modalu sthāvaramulavaraku gala prāṇulalō ēdiyu prakṛtilōni guṇamulaina satavrajasatamamulu lēnidi lēdu).

  1. “bhējirē munayō (a)dhāgrē bhagavaṃta madhōkṣajaṃ |

satvaṃ viśuddhaṃ kṣēmāya kalpaṃtē yē yē (a)nutānīha ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 -25)

“tolli munulu satvamayuṃḍani bhagavaṃtu hari nadhōkṣajuṃ goliciri”.

(śrīmahāviṣṇuvu satvaguṇamayuḍu - aṃducēta munulu pūrvamu atanini koliciri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.