← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక జ్ఞానము sātvika jñānamu

Original — తెలుగు
  1. “సర్వ భూతేషు యేనైకం భావమవ్యయం మీక్షతే |

అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 20)

“సర్వ భూతేషు అవ్యక్తాది స్ద్థావరాంతేషు భూతేషు యేన జ్ఞానేన ఏకం భావం వస్తు (భావ శబ్దః వస్తు వాచీ) ఏకం ఆత్మ వస్తు ఇత్యర్థః - అవ్యయం ఈక్షతే ప్రశ్యతి; యేన జ్ఞానేన తం చ భావం అవిభక్తం ప్రతి దేహం విభక్తేషు (దేహ భేదేషు) న విభక్తం తత్ ఆత్మవస్తు (వ్యోమవత్ నిరంతరం ఇత్యర్థః) తత్ జ్ఞానం సాక్షాత్ సమ్యక్ దర్శనం, అద్వైతాత్మ విషయం సాత్వికం”. (శ్రీశంకరః)

(అవ్యక్తము - ప్రకృతి - మొదలు స్థావరములవరకు గల సమస్త భూతములందు ఏ జ్ఞానముచేత - ఏ జ్ఞానము కలుగుటచేత అవ్యయమైన ఒకే ఆత్మను చూచునో, అవిభక్తమైన ఆత్మ దేహములలో ప్రవేశించి యుండుటచేత విభక్తమైనను అవిభక్తమే యని యే జ్ఞానముచేత తెలుసుకొనునో ఆ జ్ఞానము సాక్షాత్ సమ్యగ్దర్శనము అద్వైతాత్మ విషయమైనది. సాత్విక జ్ఞానము).

  1. “బ్రాహ్మణ క్షత్రియ బ్రహ్మచారి గృహస్తాది రూపేణ విభక్తేషు సర్వేషు భూతేషు కర్మాధి కారిషు యేన జ్ఞానేనైకం ఆత్మాఖ్యం భావం తత్రాస్య విభక్తం బ్రాహ్మణత్వా ద్యనేకా కారేషు అపి భూతేషు సి తదీర్ఘాది విభాగవత్సు జ్ఞానాకారః ఆత్మని విభాగరహితం అవ్యయం అవికృతం ఫలాదిసంగా నర్హం చ కర్మాధికార వేకాయాం ఈక్షతే, తత్ జ్ఞానం సాత్వికం -”. (శ్రీమాన్ రామానుజః)

(కర్మాదికారులందు ఒకటే ఆత్మ అను భావము కలిగి యుండుట- బ్రాహ్మణులు మొదలగు అనేకాకారములుగల భూతములందు ఆ ఆత్మ విభక్తముగా ఒకటే అయి యున్నదను భావము కలిగియుండుట, ఆత్మ అన్నింటిలోను ఉన్నను విభాగరహితము - మార్పు లేనిది, ఒకే రూపములో నుండునది యను భావము కలిగియుండు జ్ఞానము సాత్విక జ్ఞానము).

(అజ్ఞానుల దృష్టికి - స్థూల దృష్టికి, భౌతిక నేత్రమునకు - ఈ ప్రాపంచము, సమస్త పదార్థములు, సమస్త ప్రాణులు, విభజింపబడియున్నట్లు - వేరు వేరుగా నున్నట్లు కానిపించును - కాని జ్ఞానుల దృష్టికి, అంతయు అవిభక్తముగను. సర్వత్ర నాశరహితమగు ఒకే ఆత్మ వస్తువు (పరబ్రహ్మ) వ్యాపించి యున్నట్లును గోచరించును - ఏ జ్ఞానముచే అట్టి అవిభక్తిత్వము వారికి అనుభూతమగునో అట్టి జ్ఞానము సాత్విక జ్ఞానము).

Transliteration
  1. “sarva bhūtēṣu yēnaikaṃ bhāvamavyayaṃ mīkṣatē |

avibhaktaṃ vibhaktēṣu tat jñānaṃ viddhi sātvikaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 20)

“sarva bhūtēṣu avyaktādi sdthāvarāṃtēṣu bhūtēṣu yēna jñānēna ēkaṃ bhāvaṃ vastu (bhāva śabdaḥ vastu vācī) ēkaṃ ātma vastu ityarthaḥ - avyayaṃ īkṣatē praśyati; yēna jñānēna taṃ ca bhāvaṃ avibhaktaṃ prati dēhaṃ vibhaktēṣu (dēha bhēdēṣu) na vibhaktaṃ tat ātmavastu (vyōmavat niraṃtaraṃ ityarthaḥ) tat jñānaṃ sākṣāt samyak darśanaṃ, advaitātma viṣayaṃ sātvikaṃ”. (śrīśaṃkaraḥ)

(avyaktamu - prakṛti - modalu sthāvaramulavaraku gala samasta bhūtamulaṃdu ē jñānamucēta - ē jñānamu kaluguṭacēta avyayamaina okē ātmanu cūcunō, avibhaktamaina ātma dēhamulalō pravēśiṃci yuṃḍuṭacēta vibhaktamainanu avibhaktamē yani yē jñānamucēta telusukonunō ā jñānamu sākṣāt samyagdarśanamu advaitātma viṣayamainadi. sātvika jñānamu).

  1. “brāhmaṇa kṣatriya brahmacāri gṛhastādi rūpēṇa vibhaktēṣu sarvēṣu bhūtēṣu karmādhi kāriṣu yēna jñānēnaikaṃ ātmākhyaṃ bhāvaṃ tatrāsya vibhaktaṃ brāhmaṇatvā dyanēkā kārēṣu api bhūtēṣu si tadīrghādi vibhāgavatsu jñānākāraḥ ātmani vibhāgarahitaṃ avyayaṃ avikṛtaṃ phalādisaṃgā narhaṃ ca karmādhikāra vēkāyāṃ īkṣatē, tat jñānaṃ sātvikaṃ -”. (śrīmān rāmānujaḥ)

(karmādikārulaṃdu okaṭē ātma anu bhāvamu kaligi yuṃḍuṭa- brāhmaṇulu modalagu anēkākāramulugala bhūtamulaṃdu ā ātma vibhaktamugā okaṭē ayi yunnadanu bhāvamu kaligiyuṃḍuṭa, ātma anniṃṭilōnu unnanu vibhāgarahitamu - mārpu lēnidi, okē rūpamulō nuṃḍunadi yanu bhāvamu kaligiyuṃḍu jñānamu sātvika jñānamu).

(ajñānula dṛṣṭiki - sthūla dṛṣṭiki, bhautika nētramunaku - ī prāpaṃcamu, samasta padārthamulu, samasta prāṇulu, vibhajiṃpabaḍiyunnaṭlu - vēru vērugā nunnaṭlu kānipiṃcunu - kāni jñānula dṛṣṭiki, aṃtayu avibhaktamuganu. sarvatra nāśarahitamagu okē ātma vastuvu (parabrahma) vyāpiṃci yunnaṭlunu gōcariṃcunu - ē jñānamucē aṭṭi avibhaktitvamu vāriki anubhūtamagunō aṭṭi jñānamu sātvika jñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.