← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాత్విక సుఖము sātvika sukhamu

Original — తెలుగు
  1. “యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం |

తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 37)

(ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్వికమని చెప్పబడినది).

“యత్ సుఖం అగ్రే - యో గోపక్రమవేలాయా, ప్రథమ సన్నిపాతౌ, అత్యంతాయా సపూర్వకత్వాత్ విషమివ దుఃఖాత్మకం భవతి, పరిణామే - విపాకే అభాసబలేన వివిక్త స్వరూపావిర్భావే - అమృత సమం భవతి, తత్సుఖం సాత్వికం భవతి”.

(ప్రారంభములో మిక్కిలి ఆయాసముతోకూడినందువల్ల విషమువలె కనుపించినను, ఆ పని పూర్తి అయిన తర్వాత అమృతమువలె కలిగించు సుఖము సాత్విక సుఖము).

(ఔషధము సేవించునపుడు అప్రీతిగానున్నను, బలవంతముగా నైనను సేవించవలసినదే - ఆరోగ్యము కొఱకు. ఒక ఱాయి దేవ విగ్రహముగా మారుటకు మొదట ఉలి దెబ్బలు తినినట్లును, బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తినినట్లును, అనంతమగు బ్రహ్మానందము ననుభవించుటకు ముందు జీవుడొకింత త్యాగము చేయవలసియుండును -).

Transliteration
  1. “yattadagrē viṣamiva pariṇāmē amṛtōpamaṃ |

tatsukhaṃ sātvikaṃ prōktaṃ ātma buddhi prasādajaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 37)

(ē sukhamu prāraṃbhamunaṃdu viṣamuvalenu, paryavasānamaṃdu amṛtamunu bōlinadiganu nuṃḍunō, tana buddhiyokka nirmalatvamucē galugunaṭṭi ā sukhamu sātvikamani ceppabaḍinadi).

“yat sukhaṃ agrē - yō gōpakramavēlāyā, prathama sannipātau, atyaṃtāyā sapūrvakatvāt viṣamiva duḥkhātmakaṃ bhavati, pariṇāmē - vipākē abhāsabalēna vivikta svarūpāvirbhāvē - amṛta samaṃ bhavati, tatsukhaṃ sātvikaṃ bhavati”.

(prāraṃbhamulō mikkili āyāsamutōkūḍinaṃduvalla viṣamuvale kanupiṃcinanu, ā pani pūrti ayina tarvāta amṛtamuvale kaligiṃcu sukhamu sātvika sukhamu).

(auṣadhamu sēviṃcunapuḍu aprītigānunnanu, balavaṃtamugā nainanu sēviṃcavalasinadē - ārōgyamu koṟaku. oka ṟāyi dēva vigrahamugā māruṭaku modaṭa uli debbalu tininaṭlunu, baṃgāramu śirōbhūṣaṇamugā māruṭaku svarṇakāruni sutti debbalu tininaṭlunu, anaṃtamagu brahmānaṃdamu nanubhaviṃcuṭaku muṃdu jīvuḍokiṃta tyāgamu cēyavalasiyuṃḍunu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.