సత్యమైన కోరిక గలవాడు.
సత్యా అవితధాః కామాః యస్య సోయం సత్యకామః - వితధా హి సంసారిణాం కామాః - ఈశ్వరస్తు తద్విపరీతః. అప్రతిహత కామః ఇత్యర్థః -
(సంసారుల కామములు వి తధములు - ఈశ్వరుడు సంసారులకంటె - జీవులకంటె - విపరీతమైనవాడు - అందుచేత అవితధ కాముడు - ప్రతిహతకాముడు - కామములు (కోరికలు) నెఱవేర్చుకొనుటలో అడ్డు లేనివాడు -
(అన్నికోరికలు తీర్చుకొనినవాడు - కోరిన కోర్కెను సామర్థ్యముతో ఫలింప చేసుకొనువాడు).
అప్రతిహతమైన కోరికగలవాడు - “స అకామయత, సలోకానసృజాత” (భగవంతునికి తానొక్కడే అయినను - అనేకముగా - (ప్రపంచముగా - ప్రపంచములోని అన్ని వస్తువులుగా) అగుదును అను కోరిక కలిగెను - దాని ప్రకారముగా లోకములను సృజించెను) “సత్య కామస్సత్య సంకల్పః” - సత్యమైన కామములు, సత్యమైన సంకల్పము గలవాడు - కోరినకోరికను, సంకల్పించిన సంకల్పమును నెఱ వేఱ్చుకొను సామర్థ్యము కలవాడు.
మోక్ష కామః = సత్యము అనగా మోక్షము - నిత్యమైనది, భగవంతుని నిత్యరూపము - అట్టి మోక్షము కోరువాడు).
satyamaina kōrika galavāḍu.
satyā avitadhāḥ kāmāḥ yasya sōyaṃ satyakāmaḥ - vitadhā hi saṃsāriṇāṃ kāmāḥ - īśvarastu tadviparītaḥ. apratihata kāmaḥ ityarthaḥ -
(saṃsārula kāmamulu vi tadhamulu - īśvaruḍu saṃsārulakaṃṭe - jīvulakaṃṭe - viparītamainavāḍu - aṃducēta avitadha kāmuḍu - pratihatakāmuḍu - kāmamulu (kōrikalu) neṟavērcukonuṭalō aḍḍu lēnivāḍu -
(annikōrikalu tīrcukoninavāḍu - kōrina kōrkenu sāmarthyamutō phaliṃpa cēsukonuvāḍu).
apratihatamaina kōrikagalavāḍu - “sa akāmayata, salōkānasṛjāta” (bhagavaṃtuniki tānokkaḍē ayinanu - anēkamugā - (prapaṃcamugā - prapaṃcamulōni anni vastuvulugā) agudunu anu kōrika kaligenu - dāni prakāramugā lōkamulanu sṛjiṃcenu) “satya kāmassatya saṃkalpaḥ” - satyamaina kāmamulu, satyamaina saṃkalpamu galavāḍu - kōrinakōrikanu, saṃkalpiṃcina saṃkalpamunu neṟa vēṟcukonu sāmarthyamu kalavāḍu.
mōkṣa kāmaḥ = satyamu anagā mōkṣamu - nityamainadi, bhagavaṃtuni nityarūpamu - aṭṭi mōkṣamu kōruvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.