← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ satyaṃ jñānamanaṃtaṃ brahma

Original — తెలుగు
  1. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం ఓరమే వ్యోమన్ |

సో(అ)శ్ను తే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చత్ |”

అత్ర సత్యాదీని విశేషాణి లక్షణార్థ ప్రథానాను, న విశేషణ ప్రధాన్యేవ - - - అత్ర సత్త్యాది శబ్దాః నపరస్పరంసంబంధ్యతే పదార్థత్వాత్. అతః ఏకైకో విశేషణ శబ్దః పరస్పర నిరపేక్షో బ్రహ్మ శబ్దెన సంబధ్యతే - సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మేతి. సత్య శబ్దః సత్స్వఫ్రూపం బ్రహ్మ లక్షయిత్వా స్వరూపస్యానృతత్వ నిషేదతి. జ్ఞాన శబ్దః జ్ఞప్తి స్వరూపం బ్రహ్మ లక్షయిత్వా జడత్వం నిషేదతి. ఆనంద శబ్దః సుఖస్వరూపం బ్రహ్మ లక్ష యిత్వా దుఃఖాత్మకత్వమ్నిషేదతి”

(సత్యము, జ్ఞానము, అనంతము అను లక్షణములు గలిగినటువంటిన్నీ, గుహవంటి ఉపాధిలో దాగి ఉన్నటువంటిన్నీ, పరాకాశమందున్నంటువంటి పరబ్రహ్మను తెలుసుకొనినవాడు అన్ని కోరికలు పొందనగును; అతను బ్రహ్మతో ఐక్యమగును అని శ్రుతి చెప్పుచున్నది. సత్యము, జ్ఞానము, అనంతము అను బ్రహ్మ విశేషములు బ్రహ్మ లక్షణమును తెలియచేయునవి. కాని ఒక విశేషణమునకు ఇంకొక విశేషణమునకు పరస్పర సంబంధములేదు - బ్రహ్మ ఒక్కొక్క విశేషణము గలవాడు - అనగా, బ్రహ్మ సత్యము, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ అనంతము. బ్రహ్మ సత్యము అనగా బ్రహ్మ సత్పదార్థము - అన్ని కాలములందుండువాడు, అనృతస్వరూపుడు కానివాడు అని అర్థము - జ్ఞానము బ్రహ్మ అనగా జ్ఞప్తి స్వరూపము, మఱియు జడము కదాని చెప్పుట. బ్రహ్మ ఆనంద లక్షణము కలది అనగా బ్రహ్మ సుఖస్వరూపుడు - ంఫ్క్షము పరమసుఖము కనుక మోక్షస్వరూపుడు. దుఃఖమనునది లేనివాడని తెలియచేయును).

  1. “బ్రహ్మణః లక్షణార్థం వాక్యం, సత్యాదీనిహి త్రీణి విశేషణార్థాని పదాని, నిశేషస్య బ్రహ్మణః విశేష్యం బ్రహ్మ వివక్షితత్వాత్, వేద్యత యా వేద్యత్వేన యతః బ్రహ్మ ప్రాధాన్యేన వివక్షితం, తస్మాత్ విశేష్యం విజేయు - - - సత్యాదిభిః త్రిభిర్విశేషణైః విశేష్యమాణం బ్రహ్మ విశేష్యాంతరే భ్యో నిర్థార్యతే - - సత్యాది శబ్దాః న పరస్పరం సంబంధ్యతే, పరార్థత్వాత్ విశేష్యార్థా హితే. అతః ఏవ ఏకైకోవిశేషణ శబ్దః పరస్పరం నిరపేక్షో బ్రహ్మ శబ్దేన సంబధ్యతే - సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఇతి”.

(బ్రహ్మముయొక్క లక్షణములు తెలియచేయు వాక్యము - “సత్యము, జ్ఞానము అనంతము” అను మూడు పదములు విశేష్యమైన బ్రహ్మకు విశేషణములు. ఈ మూడింటివల్ల విశేష్యమైన బ్రహ్మ తెలియబడును కనుక ఇవి విశేషణములు. ఈ మూడింటి వల్ల బ్రహ్మ లక్షణము ముఖ్యముగా తెలుపబడుచున్నది; కనుక బ్రహ్మ విశేష్యము; ఇవి విశేషణములు - “సత్యం, జ్ఞాన్మ్, అనంతం” అను మూడు పదములు ఒకటికొకటి సంబంధములేనివి, అవి విశేషార్థములుకలవి, ఒకదానితో ఇంకొకదానికి అపేక్షలేదు, దేనికదే వేఱు వేఱుగా బ్రహ్మ గుఱించి చెప్పునవి - అనగా బ్రహ్మ సత్యము, బ్రహ్మజ్ఞానము అనంతము).

  1. “యతో వా ఇమాని భూతాని జాయంతే” ఇత్యాది కారణవాక్యేన ప్రతిపన్నస్య జగజ్జన్మాది కారణస్య బ్రహ్మణః సకలేతర వ్యావృత్తం సవ్రూపం అభిధీయతే - “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” ఇతి. తత్ర సత్య పదం నిరుపాధిక సత్తా యోగి బ్రహ్మాహ - తేన వికారాస్పదం అచేతనం తత్ సంసృష్టః చేతనశ్చ వ్యావృత్తిః నామాంతర, భజనావస్థానాంతర యోగేన తయోర్నిరుపాధిక సత్తా యోగ రహితత్వాత్ - జ్ఞానపదం నిత్యా సంకుచిత జ్ఞానైకాకార మాహ. మేనకదాచిత్ సంకుచిత జ్ఞానత్వేన ముక్తాః వ్యావృత్తాః అనంతపదః దేశకాల వస్తు పరిచ్చేదరహితం స్వరూపం ఆహ సగుణత్వాత్, స్వరూపస్య స్వరూపేణ గుణైశ్చ అనంత్యం తేన పూర్వ పద ద్వయ వ్యావృత్తికాది ద్వయ విలక్షణాః సాతిశయ స్వరూప గుణాః నిత్యా వ్యావృత్తా విశేషణానాం వ్యావర్తకత్వాత్ తతః” సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ + ఇత్యనేన వాక్యేంబ జగజ్జన్మాదినా వగతస్య రూపం బ్రహ్మ సకలేతరవస్తు విసజాతీయం ఇతి లక్షతే. ఇత్ నాన్యో న్యాశ్రయణం ఇతి “.

(ఈ భూతములు దేనివలన పుట్టుచున్నవో దేనివలన పోషింపబడుచున్నవో, దేనిలో లయమగుచున్నవో అది బ్రహ్మ అను శ్రుతి వాక్యమువలన జగత్తు సృష్టి మొదలగువాటికి కారణమైన పరబ్రహ్మయొక్క ఇతరవ్యావృత్త సవ్రూపములు అన్నియు, “సత్యము, జ్ఞానము, అనంతము బ్రహ్మ” అని చెప్పబడినవి. ఆ వాక్యములోని ‘సత్యం’ అనగా ఏ విధమైన ఉపాధి లేనటువంటిన్నీ, ‘సత్’ పదార్థము (సత్తాతో కూడిన పరబ్రహ్మ) చెప్పబడినది - ఇందువలన ప్రకృతి వికారము అయిన అచేతనము మినహాయింపబడినది. ‘జ్ఞానము’ అనుటచేత జ్ఞానమొకటే ఆకారము (చైతన్యమాత్రము) గలది అని చెప్పబడినది. ‘అనంతుడు’ అని చెప్పుటవలన దేశకాల వస్తువులవలన పరిచ్ఛేదము లేనిది, సగుణుడు అనుటచేత అనంతమంగళకర గుణములు, అనంతరూపములు కలవాడు అంతములేనివాడు - ఎప్పటికీ తానే ఆ రీతిగనే - (పరబ్రహ్మముగానే) ఉండువాడు, అందుచేత “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అను మాటచేత జగత్తు పుట్టుటకు, పెరుగుటకు, నశీంచుటకు కారణమైన పరబ్రహ్మ - తనవంటి, తనవంటి పరబ్రహ్మ మఱియొకటి లేదని, తనకంటె మఱియొక వస్తువే లేదని చెప్పడమైనది).

  1. “నీలం మహత్ సుగంధి ఉత్పలం” ఇత్యత్రి యథా నీలాది పదత్రయం విశేషణం, ఉత్పల పదం విశేష్యం తథా సత్యాది పదత్రయం విశేషణం బ్రహ్మ పదం విశేష్యం ఇతి చేన్న, బ్రహ్మణః నిర్విశేష సామాన్యత్వేన స్వజాతీయ, విజాతీయ స్వగత భేద వైరల్యాత్ నహి విశేషణ విశేష్య భావః సంభవతి. నిస్సామాన్య విశేషకం “ఏకమేవాద్వితీయం” ఇతి శ్రుతేః లక్ష్య లక్షక భావః సాదితిచేన్న. తస్మాత్ విశేషేణ విశేష్య లక్ష్యల లక్షణాది కలనాసహ్నవ సిద్ధం బ్రహ్మ నిష్ప్రతియోగిక స్వమాత్రతయా అవశిష్యతే.

(“ఉత్పలము నల్లకలువ - బాగా నీలముగాను మంచి వాసనగలదిగాను ఉన్నది” అని చెప్పినపుడు నీలము మొదలగు పదములు - నీలము, గొప్ప సుగంధము కలది అను మూడు పదములు - విశేషణములు. ఉత్పక్లము అనుమాట విశేష్యము - అట్లే, “సత్యం, జ్ఞానం, అనంతం” అను మూడు పదములు విశేషణములు. బ్రహ్మ అనుమాత విశేష్యము అని చెప్పినదికాదు - ఎందుచేతననగా బ్రహ్మ నిర్విశేషము అని సామాన్యముగా చెప్పబడియుండుటచేత్నూ, స్వజాతీయ విజాతీయ స్వగతభేదములు లేనివాడగుటచేత బ్రహ్మ విషయములో విశేష్యము, విశేషణములు అనుట సంభవింపదు - బ్రహ్మ అనునది ఒక్కటే, బ్రహ్మ కాక రెండవ వస్తువు లేనే లేదు” అని శ్రుతి చెప్పుచున్నందున బ్రహ్మ విషయములో లక్ష్య లక్షణభావము లేదు - అందుచేత విశేషణ విశేష్య భావము గాని లక్ష్య లక్షణభావము గాని లేనిది బ్రహ్మ - తన తత్వము - స్వస్వరూపము - లోనే ఉండునది).

  1. స్తయ్జ్ఞానాదివాక్యం సర్వతో వ్యావృత్తత్వ పరదర్శనార్థముపాత్తం -

(పరబ్రహ్మ సత్యము, జ్ఞానము, అనంతము అనుట సర్వతోవ్యావృత్తి గలదని ప్రదర్శిచుటకు చెప్పబడినది).

  1. “సత్యజ్ఞాన మనంత మచ్యుత మజిం చావ్యాకృతం - - - పూర్ణం పూర్ణతరం పురాణ పురుషం రామం భజే తారకం”

(శ్రీరామకర్ణామృతం - 2 - 41)

సత్యజ్ఞానమనంతము,

(అచ్యుతుడు, జన్మలేనివాడు, పూర్తిగా సృష్టి అంతటలోను వ్యాపించియున్నవాడు, మొట్టమొదటి పురుషుడు - ప్రకృతితో కలిసియున్నవారిలో - పురుషులలో - మొదటివాడు, సంసారమునుండి తరింప చేయువాడు అయిన శ్రీరామచంద్రుని గుఱించి భజన చేయుచున్నాను).

Transliteration
  1. “satyaṃ jñānamanaṃtaṃ brahma yō vēda nihitaṃ guhāyāṃ ōramē vyōman |

sō(a)śnu tē sarvān kāmān saha brahmaṇā vipaścat |”

atra satyādīni viśēṣāṇi lakṣaṇārtha prathānānu, na viśēṣaṇa pradhānyēva - - - atra sattyādi śabdāḥ naparasparaṃsaṃbaṃdhyatē padārthatvāt. ataḥ ēkaikō viśēṣaṇa śabdaḥ paraspara nirapēkṣō brahma śabdena saṃbadhyatē - satyaṃ brahma, jñānaṃ brahma, anaṃtaṃ brahmēti. satya śabdaḥ satsvaphrūpaṃ brahma lakṣayitvā svarūpasyānṛtatva niṣēdati. jñāna śabdaḥ jñapti svarūpaṃ brahma lakṣayitvā jaḍatvaṃ niṣēdati. ānaṃda śabdaḥ sukhasvarūpaṃ brahma lakṣa yitvā duḥkhātmakatvamniṣēdati”

(satyamu, jñānamu, anaṃtamu anu lakṣaṇamulu galiginaṭuvaṃṭinnī, guhavaṃṭi upādhilō dāgi unnaṭuvaṃṭinnī, parākāśamaṃdunnaṃṭuvaṃṭi parabrahmanu telusukoninavāḍu anni kōrikalu poṃdanagunu; atanu brahmatō aikyamagunu ani śruti ceppucunnadi. satyamu, jñānamu, anaṃtamu anu brahma viśēṣamulu brahma lakṣaṇamunu teliyacēyunavi. kāni oka viśēṣaṇamunaku iṃkoka viśēṣaṇamunaku paraspara saṃbaṃdhamulēdu - brahma okkokka viśēṣaṇamu galavāḍu - anagā, brahma satyamu, brahma jñānamu, brahma anaṃtamu. brahma satyamu anagā brahma satpadārthamu - anni kālamulaṃduṃḍuvāḍu, anṛtasvarūpuḍu kānivāḍu ani arthamu - jñānamu brahma anagā jñapti svarūpamu, maṟiyu jaḍamu kadāni ceppuṭa. brahma ānaṃda lakṣaṇamu kaladi anagā brahma sukhasvarūpuḍu - ṃphkṣamu paramasukhamu kanuka mōkṣasvarūpuḍu. duḥkhamanunadi lēnivāḍani teliyacēyunu).

  1. “brahmaṇaḥ lakṣaṇārthaṃ vākyaṃ, satyādīnihi trīṇi viśēṣaṇārthāni padāni, niśēṣasya brahmaṇaḥ viśēṣyaṃ brahma vivakṣitatvāt, vēdyata yā vēdyatvēna yataḥ brahma prādhānyēna vivakṣitaṃ, tasmāt viśēṣyaṃ vijēyu - - - satyādibhiḥ tribhirviśēṣaṇaiḥ viśēṣyamāṇaṃ brahma viśēṣyāṃtarē bhyō nirthāryatē - - satyādi śabdāḥ na parasparaṃ saṃbaṃdhyatē, parārthatvāt viśēṣyārthā hitē. ataḥ ēva ēkaikōviśēṣaṇa śabdaḥ parasparaṃ nirapēkṣō brahma śabdēna saṃbadhyatē - satyaṃ brahma jñānaṃ brahma anaṃtaṃ brahma iti”.

(brahmamuyokka lakṣaṇamulu teliyacēyu vākyamu - “satyamu, jñānamu anaṃtamu” anu mūḍu padamulu viśēṣyamaina brahmaku viśēṣaṇamulu. ī mūḍiṃṭivalla viśēṣyamaina brahma teliyabaḍunu kanuka ivi viśēṣaṇamulu. ī mūḍiṃṭi valla brahma lakṣaṇamu mukhyamugā telupabaḍucunnadi; kanuka brahma viśēṣyamu; ivi viśēṣaṇamulu - “satyaṃ, jñānm, anaṃtaṃ” anu mūḍu padamulu okaṭikokaṭi saṃbaṃdhamulēnivi, avi viśēṣārthamulukalavi, okadānitō iṃkokadāniki apēkṣalēdu, dēnikadē vēṟu vēṟugā brahma guṟiṃci ceppunavi - anagā brahma satyamu, brahmajñānamu anaṃtamu).

  1. “yatō vā imāni bhūtāni jāyaṃtē” ityādi kāraṇavākyēna pratipannasya jagajjanmādi kāraṇasya brahmaṇaḥ sakalētara vyāvṛttaṃ savrūpaṃ abhidhīyatē - “satyaṃ jñānamanaṃtaṃ brahma” iti. tatra satya padaṃ nirupādhika sattā yōgi brahmāha - tēna vikārāspadaṃ acētanaṃ tat saṃsṛṣṭaḥ cētanaśca vyāvṛttiḥ nāmāṃtara, bhajanāvasthānāṃtara yōgēna tayōrnirupādhika sattā yōga rahitatvāt - jñānapadaṃ nityā saṃkucita jñānaikākāra māha. mēnakadācit saṃkucita jñānatvēna muktāḥ vyāvṛttāḥ anaṃtapadaḥ dēśakāla vastu pariccēdarahitaṃ svarūpaṃ āha saguṇatvāt, svarūpasya svarūpēṇa guṇaiśca anaṃtyaṃ tēna pūrva pada dvaya vyāvṛttikādi dvaya vilakṣaṇāḥ sātiśaya svarūpa guṇāḥ nityā vyāvṛttā viśēṣaṇānāṃ vyāvartakatvāt tataḥ” satyaṃ jñānamanaṃtaṃ brahma + ityanēna vākyēṃba jagajjanmādinā vagatasya rūpaṃ brahma sakalētaravastu visajātīyaṃ iti lakṣatē. it nānyō nyāśrayaṇaṃ iti “.

(ī bhūtamulu dēnivalana puṭṭucunnavō dēnivalana pōṣiṃpabaḍucunnavō, dēnilō layamagucunnavō adi brahma anu śruti vākyamuvalana jagattu sṛṣṭi modalaguvāṭiki kāraṇamaina parabrahmayokka itaravyāvṛtta savrūpamulu anniyu, “satyamu, jñānamu, anaṃtamu brahma” ani ceppabaḍinavi. ā vākyamulōni ‘satyaṃ’ anagā ē vidhamaina upādhi lēnaṭuvaṃṭinnī, ‘sat’ padārthamu (sattātō kūḍina parabrahma) ceppabaḍinadi - iṃduvalana prakṛti vikāramu ayina acētanamu minahāyiṃpabaḍinadi. ‘jñānamu’ anuṭacēta jñānamokaṭē ākāramu (caitanyamātramu) galadi ani ceppabaḍinadi. ‘anaṃtuḍu’ ani ceppuṭavalana dēśakāla vastuvulavalana paricchēdamu lēnidi, saguṇuḍu anuṭacēta anaṃtamaṃgaḷakara guṇamulu, anaṃtarūpamulu kalavāḍu aṃtamulēnivāḍu - eppaṭikī tānē ā rītiganē - (parabrahmamugānē) uṃḍuvāḍu, aṃducēta “satyaṃ jñānaṃ anaṃtaṃ brahma” anu māṭacēta jagattu puṭṭuṭaku, peruguṭaku, naśīṃcuṭaku kāraṇamaina parabrahma - tanavaṃṭi, tanavaṃṭi parabrahma maṟiyokaṭi lēdani, tanakaṃṭe maṟiyoka vastuvē lēdani ceppaḍamainadi).

  1. “nīlaṃ mahat sugaṃdhi utpalaṃ” ityatri yathā nīlādi padatrayaṃ viśēṣaṇaṃ, utpala padaṃ viśēṣyaṃ tathā satyādi padatrayaṃ viśēṣaṇaṃ brahma padaṃ viśēṣyaṃ iti cēnna, brahmaṇaḥ nirviśēṣa sāmānyatvēna svajātīya, vijātīya svagata bhēda vairalyāt nahi viśēṣaṇa viśēṣya bhāvaḥ saṃbhavati. nissāmānya viśēṣakaṃ “ēkamēvādvitīyaṃ” iti śrutēḥ lakṣya lakṣaka bhāvaḥ sāditicēnna. tasmāt viśēṣēṇa viśēṣya lakṣyala lakṣaṇādi kalanāsahnava siddhaṃ brahma niṣpratiyōgika svamātratayā avaśiṣyatē.

(“utpalamu nallakaluva - bāgā nīlamugānu maṃci vāsanagaladigānu unnadi” ani ceppinapuḍu nīlamu modalagu padamulu - nīlamu, goppa sugaṃdhamu kaladi anu mūḍu padamulu - viśēṣaṇamulu. utpaklamu anumāṭa viśēṣyamu - aṭlē, “satyaṃ, jñānaṃ, anaṃtaṃ” anu mūḍu padamulu viśēṣaṇamulu. brahma anumāta viśēṣyamu ani ceppinadikādu - eṃducētananagā brahma nirviśēṣamu ani sāmānyamugā ceppabaḍiyuṃḍuṭacētnū, svajātīya vijātīya svagatabhēdamulu lēnivāḍaguṭacēta brahma viṣayamulō viśēṣyamu, viśēṣaṇamulu anuṭa saṃbhaviṃpadu - brahma anunadi okkaṭē, brahma kāka reṃḍava vastuvu lēnē lēdu” ani śruti ceppucunnaṃduna brahma viṣayamulō lakṣya lakṣaṇabhāvamu lēdu - aṃducēta viśēṣaṇa viśēṣya bhāvamu gāni lakṣya lakṣaṇabhāvamu gāni lēnidi brahma - tana tatvamu - svasvarūpamu - lōnē uṃḍunadi).

  1. stayjñānādivākyaṃ sarvatō vyāvṛttatva paradarśanārthamupāttaṃ -

(parabrahma satyamu, jñānamu, anaṃtamu anuṭa sarvatōvyāvṛtti galadani pradarśicuṭaku ceppabaḍinadi).

  1. “satyajñāna manaṃta macyuta majiṃ cāvyākṛtaṃ - - - pūrṇaṃ pūrṇataraṃ purāṇa puruṣaṃ rāmaṃ bhajē tārakaṃ”

(śrīrāmakarṇāmṛtaṃ - 2 - 41)

satyajñānamanaṃtamu,

(acyutuḍu, janmalēnivāḍu, pūrtigā sṛṣṭi aṃtaṭalōnu vyāpiṃciyunnavāḍu, moṭṭamodaṭi puruṣuḍu - prakṛtitō kalisiyunnavārilō - puruṣulalō - modaṭivāḍu, saṃsāramunuṃḍi tariṃpa cēyuvāḍu ayina śrīrāmacaṃdruni guṟiṃci bhajana cēyucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.