← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యం satyaṃ

Original — తెలుగు
  1. సత్యవచనం; యథా వ్యాఖ్యాతార్థం వా

(నిజమైన వాక్కు, వ్యాఖ్యానించబడిన అర్థము)

  1. సత్య భాషణం (సత్యము పలుకుట, నిజము పలుకుట)

  2. యథార్థ భాషణం; వాచా యధార్థ భాషణం; సూనృత భాషనం; సత్యభాషణం -

(నిజము పలుకుట - విషయమెట్లున్న అట్లు పలుకుట)

  1. యధార్థం (ఉన్నది ఉన్నట్లు పలుకుట)

  2. వాచిక సుకృతం -

(వాక్కుతో చేయు పుణ్యము).

  1. యత్ప్రత్యక్ష మవగమ్యతే తదేవ సత్యం - చక్షుసా యత్పశ్యతి తదేవ సత్యం ఇతి శ్రుతేః - యదేవం న దృశ్యతే తవ సత్యమితి సిద్ధం -

(ఏది ప్రత్యక్షముగా తెలుసుకొనబడుచున్నదో అదియే సత్యము - కళ్ళతో దేనిని చూచునో అది సత్యము - అని శ్రుతి చెప్పుచున్నది. ఇట్లు కనబడనిది అసత్యము అనుట సిద్ధమే)

  1. “యధా దృష్ట గోచర భూతహిత వాక్యం” (శ్రీమాన్ రామానుజః)

(దృష్టికి గోచరించినది, తాను చూచునది, భూతములకు హితమైన వాక్యము సత్యము)

యదా దృష్టార్థ వచనేనైవ సత్యవాదీ భవతి,

(వస్తువును చూచి నట్టుగా చెప్పువాడు సత్యవాది)

  1. “సత్యం నామ మనో వాక్కాయ కర్మభిః భూతహిత యధార్థాభి భాషణం” (శాండిల్యోపనిషత్)

(త్రికరణశుద్ధితో భూతములకు హిఉతమైన మాట, మంచిమాట - పలుకుట సత్యము)

  1. “అప్రియా నృత వర్జితం యథా భూతార్థ వచనం” (శ్రీశంకరః)

(ఇష్టముకానిది, అనృతమైనది - కాక జరిగినది జరిగినట్టుగా చెప్పుట సత్యము).

  1. పరప్రియ హిత యద్గార్థ వాక్ -

(ఇతరులకు ప్రియమైనది, ఇష్టమైనది, నిజమైనది అయిన వాక్కు).

“సత్యం భూతహితం ప్రోక్తం” (సత్యమనగా భూతము హితమైనది చెప్పుట).

  1. యథా దృష్ట విషయం భూతహిత రూపం వచనం తదనుగుణా మనోవృత్తిః -

(చూచిన విషయమును చూచినట్లుగా భూతములకు ఇష్టమైనదానిని చెప్పుట).

  1. “యథా దృష్టస్య యథా శ్రుతస్య వా ఆత్మానుభవస్య పరబుద్ధి సంక్రాంతయే తదైవ ఉచ్ఛార్యమా నం వాక్కు సత్యం ఉచ్యతే” (శ్రీశంకరః)

(ఆత్మానుభవమువలన తాను చూచినది చూచినట్లుగా, వినినది వినినట్లుగ చెప్పువాక్యము సత్యము)

  1. మనసా యథా వస్తు చింతనం ఋతం, వాచా తదుచ్చారణం సత్యం -

(మనసులో యే వస్తువుగుఱించి ఆలోచించునో, దానిని వాక్కులో ఉచ్చరించుట సత్యము)

  1. “యేన సత్య భాషణేన హింసా బహవ్తి తత్సత్యం సత్యం న భవతి; కింతు దయాన్వితం దయయా అన్యకల్యాణార్థం ప్రయుజ్యమానం అపి అనృతం సత్యమేవ భవతి”.

(సత్యము పలుకుటచేత హింస కలిగెనేని అది సత్యము కాదు. ఇతరుల మేలుకొఱకు - కల్యానము, శుభము కొఱకు - ఉపయోగపడు అబద్దము సత్యమే యగును).

  1. “క. ఉన్నది, కన్నది, విన్నది

యున్నట్లుగ పలుకటయును నొరునకు సత్యా

విన్నతగలుగగ గల్యా

ణోన్నతి గల కల్లమాట యను సత్యమగున్“.

(ఉన్నసంగతి ఉన్నట్లుగను, చూచిన సంగతి చూచినట్లుగను, వినిన సంగతి వినినట్లుగను చెప్పుటయు, ఒకనికి కల్గు ఆపద తప్పి మేలుకలుగుటకై యాడిన కల్లమాత యును సత్యమే యగును)

  1. “సమ దర్శనం - ఋతం తు సూనృతా వాణీ సత్యంతు సమదర్శనం”

(ఋతమనగా నిజమైన వాక్కు - నిజము పలుకుట. సత్యమనగా సమదర్శనము - అని చెప్పబడియున్నందున సత్యమనగా సమదర్శనము).

  1. అనృత విరలం (అబద్దము కానిది)

  2. “యథా దృష్టం శ్రుతం వాస్యాత్ వచనేన, లేఖనేన సంకేతేనవా వస్తుతః తాదృశమేవ వృత్తం పరం బోధయితుం మనో వృత్తిర్లక్షణం. వాచా ఏతాదృశా నామేవ శబ్దానాం ఉచ్ఛారణం యే సత్యా భవేయుః - తథా సహైన మధురా హిత కారకాశ్చ భవేయుః.

(చూచినది చూచునట్లు, వినినది వినినట్లు, మాటలాడుటగాని, వ్రాయుటగాని, చేయుట లేక బోధించు మనోవృత్తి లక్షణము సత్యము. అట్టి మాటలే మధురమైనవి, ఇంపైనవి, ఇష్టమును చేకూర్చునవి యగును).

  1. కాలే సమయే సత్యవాక్యం యధార్థభాషణం చ తథా ధర్మోపదేశ శ్రవణాదితి భావః. అత్ర “బ్రాహ్మణార్థే, నిషేథా భావ శ్రవణాత్ కాలః ఇత్యుక్తం”

(కాలమును బట్టి, సమయమును బట్టి సత్యవాక్యమనగా యధార్థభాషణం - నిజము చెప్పుట, ఈ ప్రకారముగానే సత్య ధర్మము చెప్పబడినది. బ్రాహ్మణులకు సంబంధించినపుడు, గోవులకు సంబంధించినపుడు” అని శ్రుతి చెప్పుటవలన వీరి విషయమై బాధ కలుగునని తెలిసినపుడు పలికిన అసత్యవచనము (అబద్దము) ఆడకూడదని నిషేధింపబడినందున కూడా సత్యమే యగును - ‘కాలే’ (కాలమనదు - కాలముననుసరించి) అని పైన చెప్పుటలో ఇదియే అభిప్రాయము - కొన్ని కాలములందు - కొన్ని సమయములందు - అబద్దము పలికినను అది సత్యమే యగును - అని అభిప్రాయము).

  1. ఆ. వారిజాక్షులందు వైవాహికములందు

ప్రాణ విత్త మాన భంగంబులందు

జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు

బొంకవచ్చు నఘము జెందదధిప”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 585)

(పై పద్యములో వివాహకాలమందు, ప్రాణహాని, మానహాని అని చెప్పబడుటవలన ఆయా కాలము చెప్పబడినది. ఆ కాలములో అబద్ధమాడినను దోషము లేదు - అది సత్యభాషణమే యగును -).

  1. “శ్లో||. సత్యేనార్కః ప్రతవతి సత్యే తిష్టతి మేదినీ |

సత్యే చోక్తః పరో ధర్మః స్వర్గః సత్యే ప్రతిష్టితః |

అశ్వమేధ సహస్రం తు తులయాధృతం |

అశ్వమేధ సహస్రాత్ హి సత్యమేకం విశిష్యతే ||“. (దేవీ భాగవతం)

(సత్యము చేతనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు, భూమి సత్యమందే ప్రతిష్టింపబడియున్నది. సత్యమే పరమధర్మము అని చెప్పబడినది. స్వర్గము సత్యమందే ప్రతిష్టింపబడినది. నూరు అశ్వమేధయాగములు ఒక సత్యమును తులలో తూచగా వేయి అశ్వమేధయాగములు కంటె ఒక్క సత్యమే హెచ్చు అగును –

  1. క. వలయంగ నశ్వమేధ

మ్ములు వేయును, నొక్క సత్యమును నిరుగడలం

దులనిడి తూపగ సత్యము

వలన న ములుసూపు గౌరవంబున పేర్మిన్.

తే. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద

సమధిగమము సత్యమ్ముతో సరియుగావున

ఎఱుగుమెల్ల ధర్మముల కంటె బెద్ద

యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు -) (మహాభారతము)

  1. సత్య ప్రతిజ్ఞత్వం - (సత్యప్రతిజ్ఞ - శ్రీరాముడు, హరిశ్చంద్రుడు)

  2. “సత్యం బ్రూయాన్ని చానృతం”

(సత్యము పలుకవలెను - అబద్దమాదరాదు)

  1. “నాస్తి సత్యసమం సుఖం, నాస్తిరాగసమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం”.

(సత్యముతో సమానమైన సుఖము లేదు - రాగముతో సమానమైన దుఃఖములేదు - త్యాగముతో సమానమైన సుఖము లేదు-)

  1. సత్యం కంఠస్య భూషణం

సత్యము కంఠమునకు భూషణము వంటిది - అలంకారము వంటిది)

  1. “నశంకరాత్ వైష్ణవశ్చ న సహిష్ణు ర్థరాపరా |

న చ సత్యా త్పరో ధర్మా న సాధ్వీ పార్వతీ పరా ||“. (బ్రహ్మవైబర్తపురాణే - బ్రహ్మఖండే)

(శివునికంటె గొప్ప విష్ణుభక్తుడు లేడు - తారకమంత్రము ఎల్లపుడు జపించుచున్నందున - భూమికంటె ఓర్పుగలది లేదు - చరాచరములను మోయుచున్నది కనుక - సత్యము కంటె ఉత్కృష్ట ధర్మము లేదు -, పార్వతి కంటె ఉత్తమమైన సాధ్వి - పతివ్రత లేదు)

  1. అనుష్టీయ మానో ధర్మః -

(అనుష్టింపబడు ధర్మము)

  1. బ్రహ్మ -

  2. “అవితధ రూపత్వాత్ పరమాత్మా సత్యః” -

(అనితధస్వరూపుడు - నిత్యస్వరూపుడు, నిత్యుడు అగుటవలన పరమాత్మ ‘సత్యము’ అని చెప్పబడుచున్నాడు).

  1. సత్తా మాత్రత్వాత్ సత్యః -

(త్రికాలములందును సత్తా - చైతన్య శక్తి యే అయి యుండువాడు కనుక బ్రహ్మ సత్యము)

  1. ద్రువం (ఏ కాలమందైనను నుండువాడు కనుక బ్రహ్మ సత్యము)

  2. త్రికాలా బాధ్యం, అబాధ్యం

(భూత భవిష్యద్వర్తమాన కాలములందును నశింపనివాడు కనుక బ్రహ్మ సత్యము) (నశింపనివాడు)

  1. కాలత్రయ వర్తీ

(భూతభవిష్యద్వర్తమానములను మూడు కాలములందుండువాడు - ఎల్లపుడు ఉండువాడు)

  1. కాలత్రయే ప్యేకరూపం -

(మూడుకాలములందు - అన్ని కాలములందు - ఎల్లపుడు ఒకే రూపము - చైతన్యమాత్రము - గలవాడు)

  1. సత్యశబ్దోహి అబాధితౌ రూడో బ్రహ్మవాచకః, తదన్యస్య మిధ్యాత్వాత్ -

(పరబ్రహ్మకాక మిగిలినవన్నియు మిధ్య యగుటవలన సత్యమనగా నశింపని బ్రహ్మను వచించునది - పరబ్రహ్మ)

  1. యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి తత్సత్యం; యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం వ్యభిచర త్తదనృత మత్యుచ్యతే - అతో వికారో అనృతం.

(ఏ రూపము గలదని ఏది నిశ్చయింపబడినదో ఆ రూపము మారనిది సత్యము - ఏ రూపము గలదని యేది నిశ్చయింపబడినదో ఆ రూపము నుండి మారునది అనృతము - అందుచేత వికారము - మార్పు - అనృతము).

  1. నిర్వికారం

(మార్పులు లేనిది - ఎల్లపుడు ఒకే రీతిగానుండు వాడు).

  1. గుణతః అప్యవికారం

(గుణమునుబట్టి కూడ మార్పులేనివాడు)

  1. “ఉత్పత్తి వినాశాది షడ్భావ వికార శూన్యం”. (శ్రీరంగ రామానుజః)

(జనన మరణములు మొదలైన ఆరు వికారములు లేనివాడు - జననము లేనివానికి మిగిలిన అయిదు వికారములుండవు. పరబ్రహ్మ జన్మ లేనివాడు, అందుచేత వికారము లేనివాడు)

  1. “మృగి జలం ఉండగానే దబ్బరైనట్లు, ఆకాశమందు నీలత్వముండగానే దబ్బరైనట్లు, ఈ ప్రపంచము విచారిస్తే మిధ్య, బ్రహ్మమే సత్యము. సకలము కలిగి లేకుండును, కేవల బ్రహ్మ చైతన్యమే సత్యము”.

  2. బాహ్యాభ్యంతరంబులం గలిగి స్వప్రాకాశంబై భగవచ్ఛబ్ద వాచ్యంబును నైన బ్రహ్మం బొకటి సత్యంబు, జగత్తసత్యంబగును”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

  1. పరమార్థ భూతం -

(పరమ పురుషార్థరూపమైన ంఓక్షరూపమైనది కనుక సత్యం)

  1. “సదేవ సత్యం” ఇతి శ్రుతేః -

(సత్ అని చెప్పబడు సత్పదార్థమే - సన్మాత్రవస్తువే - సత్యము అని శ్రుతి చెప్పుచున్నది).

  1. బ్రహ్మణః సర్వ కారణత్వేన విద్యమానత్వాత్ సత్యత్వం నిరంకుశం -

(పరబ్రహ్మ అన్నింటికిని కారనమైనవాడు అని స్పష్టమగుటచేత అతను ‘సత్యం’ అనుట ఖండింప వీలులేనిది)

  1. సత్య పదేన నిరుపాధిక సత్తా యోగి యోగి బ్రహ్మ ఆహ. తేన వికారాస్పద మచేతనం తత్సం సృష్టశ్చేతనశ్చ వ్యావృత్తః -

(ఏ విధమైన ఉపాధి లేని కేవలము సత్తామాత్ర బ్రహ్మమే సత్యము -

  1. “స దితి శ్రౌత ప్రతీతి లక్ష్యం సత్యం అసదిత్య వాచ్యం సత్యం, త్రికాలాబాధ్యం సత్యం, త్రికాలాను స్యూతం సత్యం, య దస్తి తత్ సత్యం, ఏకమేవా ద్వితీయం సత్యం, సజాతి విజాతి భేదరహితం సత్యం, సర్వకల్పనాధిష్ఠానం వా సత్యం; అవినాసకమితి, దేశకాల వస్తు నిమిత్తాదుషువినశ్యత్సు యన్న వినశ్య తీతి” (సర్వసారోపనిషత్)

(శ్రుతిలో ‘సత్’ అని ప్రఖ్యాతి పొందినది సత్యము; ‘అసత్’ అని చెప్పబడకూడనిది సత్యము - భూత భవిష్యద్వర్తమానములను మూడు మూడు కాలమౌలందు నాశము లేనిది సత్యము; మూడుకాలములందు ప్రపంచమంతటిలోను, లోపల పైన అనిస్యూతమై అల్లుకొని వ్యాపించి యుండునది సత్యము, ఉన్నది అని చెప్పబడునది సత్యము; (ప్రపంచమంతయు మిధ్యయే యగుతవలన లేనిదే); ఉన్నదంతయు ఒకే వస్తువు పరబ్రహ్మమే, పరబ్రహ్మకానిది లేదు, అదియే సత్యము, సజాతీయ భేదము, విజాతీయ భేదము లేనిది సత్యము, కల్పించబడినదానికంతకును, - సృష్టించబడినదానికంతకును అధిష్ఠానమైనది సత్యము - నాసము లేనిది సత్యము - అనగా, దేశకాల వస్తువులు కారణముగా నశించునవి నశుంచుచున్నను తాను నశింపనిది సత్యము)

  1. చక్షురాదీంద్రియై ర్దృష్టం శ్రుతం, ఘ్రాతం మునీశ్వర |

తస్యైనోక్తిర్భవేత్సత్యం, విప్ర, తమ్నాన్యథా భవేత్ |

సర్వం సత్యం పరంబ్రహ్మ నాన్యదితి మతిః |

తచ్చ సత్యం వరం ప్రోక్తం వ్బేదాంత జ్ఞానసారనైః ||” (దర్శినోపనిషత్)

(కన్నులు మొదలగు ఇంద్రియములచేత చూడబడునది, వినబడునది, వాసన చూడబడునది సత్యమని చెప్పబడును, ఇతరములుకాదు. ప్రపంచమంతయు పరబ్రహ్మమే కనుక అది అంతయు సత్యమే అను అభిప్రాయము కూడ సత్యము - అని ఉపనిషదర్థములు తెలిసినవారు చెప్పుదురు).

  1. “అపూర్వాన పరంబ్రహ్మ స్వత్మానం సత్యమద్వయం” (సూతసంహితాయాం)

(వెనుక ముందు లేనిది బ్రహ్మ - అనగా బ్రహ్మ పుట్టకముందు ఏమియు లేనిది - తనవంటిది లేదు, పుట్టిన తర్వాత కూడ అటువంటిదేమియు లేదు - అందుచేత ఉన్నదంతయు బ్రహ్మమే - పరబ్రహ్మ కానిదేదియు లేదు).

  1. “సర్వ ప్రమానములచే లేదు అను శంక కలుగకుండునది”.

  2. “స ఏష భగవాన్ విష్ణుః సత్యమిత్యభిధీయతే |

సర్వోత్తమత్వాత్, పూర్ణత్వాత్ సర్వజ్ఞత్వాత్ తదైవచ ||“.

(అన్నింటికంటెను ఉత్తముడగుటచేతను, అన్నింటిలోను - ప్రపంచమంతటిలోను - పూర్తిగా వ్యాపించి నిండియుండుటవలనను, సర్వజ్ఞుడగుటవలనను భగవంతుడు శ్రీమహావిష్ణువే ‘సత్యం’ అని చెప్పబడుచున్నాడు)

  1. “ఒకటే సత్యం గలుగంబట్టి మిధ్యయొకటి వెలసె తత్వం విచారిస్తే సత్యము నిజాకారమై మిధ్య జగజ్జీవాకారమై, అది తన అంకురమై, తానే ఆనంద కందం, ఆది బీజం, సమస్తానకును అక్కడనుండి ప్రపంచం విస్తారమాయెను. సకలమున్నూ చైతన్యానకు వ్యతిరిక్తం కాదు”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” (తైత్తీరీయోపనిషత్)

- సత్యం జ్ఞానాది వాక్యాభి హితం బ్రహ్మ. (సత్యము, జ్ఞానము, అనంతము అయినది బ్రహ్మ అని శ్రుతివాక్యములో చెప్పబడిన బ్రహ్మమే సత్యము).

  1. “తత్ సత్యం” - ‘సత్’ ఇతి ప్రాణః, ‘తి’ ఇత్యన్నం, యం ఇత్యసావాదిత్యోః, తదేతత్ త్రివృత్. (ఐతరీయోపనిషత్)

(సత్యం = సత్ + తి + యం) సత్యం అను పదములోని ‘సత్’నగా ప్రాణము, ’తి’ అనగా అన్నము, యం అనగా సూర్యుడు - ఈ మూడు కలిసి ‘సత్యం’ అయినది- పరబ్రహ్మ - “తేన ప్రాణాన్నాదిత్య రూపత్వాత్ వా సత్యం”

  1. ‘తదేతత్ త్ర్యక్షరం సత్యం’ సత్ ఇత్యేక మక్షరం, ‘తి’ ఇత్యేకమక్షరం, ‘యం’ ఇత్యర్కమస్కహరం, ప్రథమోత్తమే అక్షరే సత్యం, మధ్యతో (అ)నృతః.- తదేత దమృత ముభయతః సత్యేన పరిగృహీతం సత్యభూయమేవ భవతి ఇతి శ్రుతేః.

(సత్యం అనుమాట మూడు అక్షరములు కలిసి యున్నది - ‘సత్’ అనునది ఒక అక్షరము, ‘తి’ అనునది ఒక అక్షరము, ‘యం’ అనునదొక అక్షరము - ఈమూడు అక్షరములలో మొదటిది, చివరిది ‘సత్యం’ మధ్యనున్నది అనృతము - ‘సత్’, ‘యం’ అను రెండు అక్షరముల మధ్యనున్నది కనుక ‘తి’ కూడ సత్యమే అనిపించుకొనును).

(సత్యం అనుమాట మూడు అక్షరములు కలిసి యున్నది - ‘సత్’ అనునది ఒక అక్షరము, ‘తి’ అనునది ఒక అక్షరము, ‘యం’ అనునదొక అక్షరము - ఈమూడు అక్షరములలో మొదటిది, చివరిది ‘సత్యం’ మధ్యనున్నది అనృతము - ‘సత్’, ‘యం’ అను రెండు అక్షరముల మధ్యనున్నది కనుక ‘తి’ కూడ సత్యమే అనిపించుకొనును).

  1. “యత్ పారమార్థికం తదేవసత్ ‘సత్’ ఇతి ప్రాణః ‘యం’ అసౌ ఆనిత్యః, సర్వాత్మా తత్ర సచ్చబ్దౌఅం శబ్ద వాచ్య ప్రాణాది త్యౌ సత్పదవాచ్యౌ; మధ్యస్థ తకారః ఇకారస్తు (త్ + ఇ = తి) అనృత శబ్దవాచ్యః - తస్య ఉభయతః స్త్వేన భిన్నత్వాత్ తదపి సత్యమేవ”.

(పరమార్థము - పరమపురుషార్థము - మోక్షము - మోక్షరూపమైనదేదో అదియే, పరబ్రహ్మమే సత్. ‘సత్’ అనగా ప్రాణము, ‘యం’ అనగా ఆదిత్యుడు - సర్వాత్మ. ఈ రెండు అక్షరములవలన చెప్పబడిన ప్రాణము, ఆదిత్యుడు సత్పదవాచ్యములు - (సత్ అని చెప్పబడినవి). ఈ రెండు అక్షరములకు మధ్యనున్న ‘త’ కార ‘ఇ’ కారములు (త్ _ ఇ - తి) ఆనృతమును తెలియచేయునవి. కాని, ఇరు ప్రక్కలసత్యమును తెలియచేయు ‘సత్’, ‘యం’ అను రెండు అక్షరములమధ్య నుండుటచేత ‘తి’ అను అక్షరము కూడ సత్యమని చెప్పబడుచున్నది).

  1. “తస్యహవా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి, తాని హావా ఏతాని త్రీణి అక్షరాణి ‘సత్’, ‘త్’, ‘యం’ ఇతి తత్ యత్ ‘సత్’ తదమృతం; అధయత్ ‘తి’ తన్మర్త్యం, అధ యత్ ‘యం’ తేన ఉభేయచ్చతి, యదనేన ఉభేయచ్చతి తస్మాత్ ‘యం’ అహరహర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి : ఇతి” సత్ + ‘తి’ + ‘యం’ ఇతి సత్యనామత్ర్యక్షరాత్మకం ఇత్యర్థః. తద్యత్ సత్ తదమృతం, అధ యత్ ‘తి’ తన్మర్త్యం. అత్ర అమృత మర్త్య శబ్దాభ్యాం చేతనా చేతనౌ నిర్దిశ్యతే. అధ యద్యంతేన ఉభే యచ్చతి అమృతత్వ మర్తృత రూపేణ ఉపలక్షితే ఉభేయచ్చతి ఇతి ‘యం’ ఇత్యర్థః తదేవ ఉప సం హరిత యదనేన ఉభే యచ్ఛతి తస్మాత్ ‘యం’ ఇతి. అనేన చేతనా చేతన స్వరూపేణ ఉపలక్షితే ఉభే యతో యచ్ఛతి తస్మాత్ ‘యం’ ఇత్యర్థః).

(‘సత్యం’ అనునది పరబ్రహ్మ యొక్క నామము. ‘సత్య’ అను మాటలో మూడు అక్షరములు కలిసియున్నవి - ‘సత్’, ‘తి’, ‘యం’ అనునవి. వాటిలో ‘సత్’ అంగా అమృతము - నాసము లేనిది, నిత్య్మైనది. ‘తి’ అనగా మర్త్యము - నశిఉంచునది - అమృతము, మర్త్యము అనగా చేతనములు, అచేతనములు, ‘యం’ ఈ రెండును - చేతనాచేతనములు తానే అయినది, అని తెలియచేయును. పైన చెప్పిన ప్రకారము ప్రతి దినము ఎవరు తెలుసుకొనెదరో వారు స్వర్గమును పొందుదురు)

  1. సత్ + తి + యం = సత్యం - ‘సత్’ అనగా ఆత్మ, ఎప్పుడును మార్పు చెందక యుండునది, నిత్యమైనది, శాశ్వతముగా నుండునది, ‘తి’ అనగా మారునది - ప్రకృతి - వికారము నొందునది. ఈ రెంటిని కలిపి నియమించువాడు - జీవుని ప్రకృతితో కలిపి వాటిని నియమించువాడు - పరమాత్మ

  2. “యథా నామధేయ మాత్రతా కారణం మృదా ద్వే సత్యం తథా ఆకాశాదీనాం నామధేయ మాత్రతా,బ్రహ్మైవ సత్యం - లౌకిక ప్రతీతి సిద్ధం కారణాత్ కార్యస్య అనన్యత్వం తాన త్ యథా ఏక మృత్పిండారబ్థానాం ఘట శరావాదీని తస్మాదనతిరిక్త ద్రవ్యతయా త జ్ఞానేన జ్ఞాత్వా ఇత్యర్థః -అత్ర కారణాదివాదేన కారణాత్ సర్యస్య బుద్ధి శబ్దాంతరాదిభిః ద్రవ్యాంతరత్వం ఆ శంక్య లోక ప్రతీత్యైవ కారణాత్ కార్యస్య అనన్యతా ఉపపాద్యతే -).

(కార్య వస్తువులు వేరు వేరు పేర్ల్జు కలిగియుండుట నామ మాత్రము; వాటికి మట్టి కారణమగుట సత్యము. అట్లే ఆకారము మొదలగువాటికిపేర్లు నామధేయములు మాత్రమే. బ్రహ్మమే సత్యము - వాటి అన్నింటికి కారణమైన పరబ్రహ్మమే - లోకములో కార్యవస్తువు కారణవస్తువుకంటె వేఱుకాదు అని ప్రతీతి కలదు మట్టితో తయారుచేయబడిన కుండ మూకుడు మొదలగునవి మట్టి మట్టి ద్రవ్యము కంటె వేరుకానిదే).

  1. “యథా మృద్ద్రవ్యసాను వర్తమానం తదతిరిక్తస్య వ్యావర్తమానత్వం రజ్జు సర్పాదిషు హ్యనువర్తమానస్య అధిష్టాన భూతస్య రజ్జ్వాదేః సత్యతావ్యావర్తమానస్య సర్పాదేః సత్యతా దృష్టా.తధాన వర్తమానస్య అధిష్టాన బూతం మృద్ధ్రవ్యమేవ సత్యం వ్యావర్తమానాస్తు ఘట శరా వాదయః అసత్య భూతాః తథా నిర్విశేష సన్మా త్రాత్ సర్వాధిష్ఠాన భూతాత్ బ్రహ్మణః అన్యః అహంకారాది వ్యవహారాలంబనః - కృత్స్నః ప్రపంచ మిధ్యా కారణ భూతం సన్మాత్రం బ్రహ్మైవ సత్యం. కించ సతః ఆత్మనః వినాశాయోగాత్ అసతః శశవిషాణాదౌః ఉపలబ్దృ భావాత్ ఉపలబ్ద వినాశయోగౌ కార్యం సద సద్భ్యాం అనిర్వచనీయమితి గమ్యతే - అనిర్వచనీయం శుక్తికార జతాది వత్ మేషైవ, తస్యుచ అనిర్వచనీయత్వం ప్రతీతి చాదాఖ్యాం సిద్ధం”.

(మట్టి తన ద్రవ్యమును అనసరించే యుండి దానికంటె వేరుకాని కుండ, మూకుడుగా మారును. అట్లే రాత్రివేళ త్రాడును చూచి పాము అని భ్రమించి నపుడు పాము అసత్యము, త్రాడే సత్యము - మట్టి కుండ మూకుడుగా మారిన వాటి యధార్థ ద్రవ్యము అగు మట్టియే సత్యము - త్రాడే సత్యము - మట్టి కుండ, మూకుడుగా మారిన కుండ, మూకుడు అసత్యము, వాటి యదార్థ ద్రవ్యము అగు మట్టియే సత్యము - అనగా, మట్టి, కుండ, మూకుడు మొదలగు వాటిగా మారినను దానిలోని ద్రవ్యము మట్టియే సత్యము - మార్పులూయిన కుండ, మూకుడు అసత్యము.ఆ ప్రకారముగానే నిర్విశేషము, సన్మాత్రము, అన్నింటికీ అధిష్ఠానభూతము అయిన పరబ్రహ్మకంటె వేరయిన అహంకారము మొదలుగాగల ఈ ప్రపంచమంతయుమిధ్యగా కల్పించబడినది. స్కన్మాత్రమైన పరబ్రహ్మము సత్యము, సన్మాత్రమైన ఆత్మ (పరబ్రహ్మము) నాశములేనిదగుటచేతను,కుందేటికొమ్ము వంటి అనాత్మవస్తువులు లభించనందునను ‘సత్’ పదార్థము ‘అసత్’ పదార్థమునకు అనిర్వచనీయము - చెప్పుటకు వీలు కానిది. అనిర్వచనీయమనగా - ముత్యపు చిప్పను చూచివెండియనుకొనుట మృషయే అయినట్లు).

  1. “సచ్చ త్యచ్చా భవత్” (తైత్తిరీయోపనిషత్)

(సత్ = మూర్త స్వరూపుడు, త్యత్ - అమూర్తస్వరూపుడు - అనగా, వ్యక్తస్వరూపుడు, అవ్యక్తస్వరూపుడు, ఈ రెండును భగవంతుడే ఆయెను - అని శ్రుతి చెప్పి యుండుటచేత సత్యం అనగా వ్యక్తావ్యక్త వస్తువులన్నియు తానే అయిన భగవంతుడు)

  1. ‘సత్’ శబ్దేన పృధివ్యస్తేజోంసి, ‘త్య’ శబ్దేన వాయ్వాకాశౌచ ఉచ్యంతే - సత్ చత్యం సత్య మిత్యేకవ ద్భావః - భూత పంచకం.

(సత్ అనగా భూమి, జలము, అగ్ని, త్యం అనగా వాయువు, ఆకాశము అని చెప్పబాడినది. ‘సత్’ ‘త్యం’ కలిసి ఒకటే భావమగును అని ఆ అయిదు భూతములు - పంచభూతములు - ఈ రెండు భగవంతుడే).

(“మూర్తా మూర్తాత్మ కత్వాద్వా” -మూర్తములు అమూర్తములు - (రూపము కలవి, రూపములేనివి) భగవంతుడే కనుక సత్యం).

  1. “సత్ చిద్వ్యష్టిః, ‘త్యం’ అచిద్వ్యష్టిః, తదుభయం తథా సత్ త్యత్ శబ్ద యోః చిదచిద్వ్యష్ట్యోః ప్రయోగః - శ్రుతి - తదను ప్రవిశ్య సత్ చ త్యత్ చ అభవత్” ఇత్యాది శ్రుతౌ ప్రసిద్ధిః తథా సత్య శబ్ద యోః తత్పరత్వే శ్రుతిః - “అధ యద్దేవేభ్యః ప్రాణిభ్యః చ తత్సత్ - అధ యద్దేవాశ్చత్యం తదేక వాచా సమ భివ్యా ప్రియతే సత్యం” ఇతి దేవాః దేవాధిష్ఠితానీంద్రియాణి తేభ్యః పరః తత్సం సృష్టః చేతనస్సత్, దేవాద్యభిద్వ్యష్టస్తుత్వం, తదేతదుభయం సత్యం ఇత్యేకవాచా ఏక శబ్దేన సమభివ్యా ప్రియతే ఇతి తదర్థః ”

(సత్ నగా చిద్వ్యష్టి; త్యం అనగా అచిత్ వ్యష్టి - ఈ రెండు కలిసి సత్యం చిదచిద్వ్యష్టి అయిన సత్ _ త్యం శ్రుతిలో ఈ క్రిందనుప్రయోగింపబడీంది - తత్ సృష్ట్వా - దానిని - లోకమును - సృష్టించి, “తదేవాను ప్రావిశత్” - దానిలో ప్రవేశించెను, “తత్ ప్రవిశ్య” (దానిలో ప్రవేశించి), “సచ్చ త్యచ్చ - అభవత్” (= సత్ అనగా చిద్వ్యష్టి, చిత్ అనగా అచిద్వ్యష్టి, ఈ రెండును తానదె ఆయెను. ఇంకను ‘అత్’, ‘త్యం’ అనునవి భగవత్పరములే - భగవంతుని గుఱించి చెప్పునవియే యనుటకు శ్రుతి యీ లాగున చెప్పుచున్నది. ఇంద్రియ దేవతలు - ఇంద్రియములనధిష్టించి యుండు దేవతలు, వీటికంటె ఉత్కృష్టమైనది అచేతనము ‘సత్’ ఆ దేవతలు మొదలగునవి అచిత్. ఈ ‘సత్’, ‘చిత్’ లు రెండును సత్యం అను ఒకే మాటకు అర్థము)

  1. సచ్చిదానంద నిత్య పరిపూర్ణః - అనెడి అయిదు పదాలలోను చిత్పదానకు వ్యతిరిక్తమైన నాలుగు పదాలున్నూ అనుభవమందు వేద్యమై ఉండును గనుక వాటిని నేతిముఖాన త్రోసి నిలిచిన చిన్మాత్ర జ్ఞప్తి స్వరూపమే ఆత్మ; ‘నేతి’ ముఖాన తెలిసిన సకల ప్రపంచానకున్నూ సం యోగ, సమవాయ నిమిత్తకారణాలనెడి కారణ త్రయమున్నూ లేదు కనుక ప్రపంచంలేదు అనేదే సత్యం “అఘటన ఘటనా పటీ యసీ మాయా” అని కలదుకనుక మాయ ఘటించి తీచును అని అంటే ఆ మాయ అవిచారమందే సత్యము; విచారపూర్వకంగా చూస్తే అసత్యము - మిధ్యయనుట. అయితే జగత్తు తోచగదే అంటే, ఘటమందు తోచిన భావమెల్లాను మృత్తికేకారి ఘటమనేది లేదు - చిన్మాత్రమైన తనయందు ప్రపంచము లేదనేదిసత్యం. ఇందుకు శ్రుతి - “నామ రూపే వ్యాకరవాణి” వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం“;”ఏకం సత్యం బహుథా కల్పయంతి” అని ఛాందోగ్యం; “తదేతత్కృతకం, తత్తదనిత్యం” అని - (బ్రహ్మసుధార్ణవము - 2)

  2. “ఓం భూః ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం”.

(భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము - అను ఏడు లోకములు - ఊర్థ్వ లోకములు - పరబ్రహ్మమే అని శ్రుతి చెప్పుచున్నందున సత్యం అనగా సత్యలోకరూపుడైన పరబ్రహ్మమే -

  1. “నామరూపములకు చైతన్యమును, వృద్ధి క్షయములను కలుగచేయునది?.

  2. నిర్దుఃఖ నిత్య నిరతిశయానందాద్యనుభవ రూపం.

(దుఃఖము లేనిదిన్నీ, నిత్యము, గొప్ప ఆనందము కలుగచేయునది).

  1. “ఓం ఇతి అంగీకారేణ యత్రోక్తం తత్సత్యం”.

(అంగీకరించినపుడు ‘ఓం’ అని ఎక్కడ చెప్పబడినను అది సత్యము).

  1. “సత్య వచన ధర్మ రూపత్వాత్ సత్యం” (శ్రీశంకరః)

(సత్య వచనమగు ధర్మమే రూపము అయినవాడు)

  1. “సత్యస్య సత్యమితి : (సత్యమునకు సత్యమైనవాడు)

  2. అబాద్యం

(భాద లేనిది - తప్పుకానిది, నిజమైనది)

  1. అనితధం, అతః అమృతం

(కొట్టబడనిది - అందుచేత నాశము లేనిది)

  1. కైవల్యము (మోక్షము)

  2. బ్రహ్మము నిస్సంగము - అన్నింటిలోనున్నప్పటికిన్నీ దేనినైనను అంటకుండ నుండువాడు కనుక బ్రహ్మము సత్యం.

  3. ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానులు వారి అనుభవము వలన, బ్రహ్మ సత్యమను చుండుటవలన బ్రహ్మ బ్రహ్మ సత్యము -

  4. బ్రహ్మము కన్న వేఱు ద్రష్టలేదు కనుక బ్రహ్మ సత్యము -

  5. యేనా పరస్య అహితం భవేత్ తత్సత్యమపి వాంచనీయం నాస్తి -

(తనకు పరుడు కానివానికి ఇష్టములేనిది సత్యమైనను వాంఛనీయము కాదు)

  1. “సత్యం పరం ధీమహి” (నిర్దుఃఖ నిరతిశయానందానుభవరూపం - అట్టి పరబ్రహ్మను ధ్యానము చేయుచున్నాను)
Transliteration
  1. satyavacanaṃ; yathā vyākhyātārthaṃ vā

(nijamaina vākku, vyākhyāniṃcabaḍina arthamu)

  1. satya bhāṣaṇaṃ (satyamu palukuṭa, nijamu palukuṭa)

  2. yathārtha bhāṣaṇaṃ; vācā yadhārtha bhāṣaṇaṃ; sūnṛta bhāṣanaṃ; satyabhāṣaṇaṃ -

(nijamu palukuṭa - viṣayameṭlunna aṭlu palukuṭa)

  1. yadhārthaṃ (unnadi unnaṭlu palukuṭa)

  2. vācika sukṛtaṃ -

(vākkutō cēyu puṇyamu).

  1. yatpratyakṣa mavagamyatē tadēva satyaṃ - cakṣusā yatpaśyati tadēva satyaṃ iti śrutēḥ - yadēvaṃ na dṛśyatē tava satyamiti siddhaṃ -

(ēdi pratyakṣamugā telusukonabaḍucunnadō adiyē satyamu - kaḷḷatō dēnini cūcunō adi satyamu - ani śruti ceppucunnadi. iṭlu kanabaḍanidi asatyamu anuṭa siddhamē)

  1. “yadhā dṛṣṭa gōcara bhūtahita vākyaṃ” (śrīmān rāmānujaḥ)

(dṛṣṭiki gōcariṃcinadi, tānu cūcunadi, bhūtamulaku hitamaina vākyamu satyamu)

yadā dṛṣṭārtha vacanēnaiva satyavādī bhavati,

(vastuvunu cūci naṭṭugā ceppuvāḍu satyavādi)

  1. “satyaṃ nāma manō vākkāya karmabhiḥ bhūtahita yadhārthābhi bhāṣaṇaṃ” (śāṃḍilyōpaniṣat)

(trikaraṇaśuddhitō bhūtamulaku hiutamaina māṭa, maṃcimāṭa - palukuṭa satyamu)

  1. “apriyā nṛta varjitaṃ yathā bhūtārtha vacanaṃ” (śrīśaṃkaraḥ)

(iṣṭamukānidi, anṛtamainadi - kāka jariginadi jariginaṭṭugā ceppuṭa satyamu).

  1. parapriya hita yadgārtha vāk -

(itarulaku priyamainadi, iṣṭamainadi, nijamainadi ayina vākku).

“satyaṃ bhūtahitaṃ prōktaṃ” (satyamanagā bhūtamu hitamainadi ceppuṭa).

  1. yathā dṛṣṭa viṣayaṃ bhūtahita rūpaṃ vacanaṃ tadanuguṇā manōvṛttiḥ -

(cūcina viṣayamunu cūcinaṭlugā bhūtamulaku iṣṭamainadānini ceppuṭa).

  1. “yathā dṛṣṭasya yathā śrutasya vā ātmānubhavasya parabuddhi saṃkrāṃtayē tadaiva ucchāryamā naṃ vākku satyaṃ ucyatē” (śrīśaṃkaraḥ)

(ātmānubhavamuvalana tānu cūcinadi cūcinaṭlugā, vininadi vininaṭluga ceppuvākyamu satyamu)

  1. manasā yathā vastu ciṃtanaṃ ṛtaṃ, vācā taduccāraṇaṃ satyaṃ -

(manasulō yē vastuvuguṟiṃci ālōciṃcunō, dānini vākkulō uccariṃcuṭa satyamu)

  1. “yēna satya bhāṣaṇēna hiṃsā bahavti tatsatyaṃ satyaṃ na bhavati; kiṃtu dayānvitaṃ dayayā anyakalyāṇārthaṃ prayujyamānaṃ api anṛtaṃ satyamēva bhavati”.

(satyamu palukuṭacēta hiṃsa kaligenēni adi satyamu kādu. itarula mēlukoṟaku - kalyānamu, śubhamu koṟaku - upayōgapaḍu abaddamu satyamē yagunu).

  1. “ka. unnadi, kannadi, vinnadi

yunnaṭluga palukaṭayunu norunaku satyā

vinnatagalugaga galyā

ṇōnnati gala kallamāṭa yanu satyamagun”.

(unnasaṃgati unnaṭluganu, cūcina saṃgati cūcinaṭluganu, vinina saṃgati vininaṭluganu ceppuṭayu, okaniki kalgu āpada tappi mēlukaluguṭakai yāḍina kallamāta yunu satyamē yagunu)

  1. “sama darśanaṃ - ṛtaṃ tu sūnṛtā vāṇī satyaṃtu samadarśanaṃ”

(ṛtamanagā nijamaina vākku - nijamu palukuṭa. satyamanagā samadarśanamu - ani ceppabaḍiyunnaṃduna satyamanagā samadarśanamu).

  1. anṛta viralaṃ (abaddamu kānidi)

  2. “yathā dṛṣṭaṃ śrutaṃ vāsyāt vacanēna, lēkhanēna saṃkētēnavā vastutaḥ tādṛśamēva vṛttaṃ paraṃ bōdhayituṃ manō vṛttirlakṣaṇaṃ. vācā ētādṛśā nāmēva śabdānāṃ ucchāraṇaṃ yē satyā bhavēyuḥ - tathā sahaina madhurā hita kārakāśca bhavēyuḥ.

(cūcinadi cūcunaṭlu, vininadi vininaṭlu, māṭalāḍuṭagāni, vrāyuṭagāni, cēyuṭa lēka bōdhiṃcu manōvṛtti lakṣaṇamu satyamu. aṭṭi māṭalē madhuramainavi, iṃpainavi, iṣṭamunu cēkūrcunavi yagunu).

  1. kālē samayē satyavākyaṃ yadhārthabhāṣaṇaṃ ca tathā dharmōpadēśa śravaṇāditi bhāvaḥ. atra “brāhmaṇārthē, niṣēthā bhāva śravaṇāt kālaḥ ityuktaṃ”

(kālamunu baṭṭi, samayamunu baṭṭi satyavākyamanagā yadhārthabhāṣaṇaṃ - nijamu ceppuṭa, ī prakāramugānē satya dharmamu ceppabaḍinadi. brāhmaṇulaku saṃbaṃdhiṃcinapuḍu, gōvulaku saṃbaṃdhiṃcinapuḍu” ani śruti ceppuṭavalana vīri viṣayamai bādha kalugunani telisinapuḍu palikina asatyavacanamu (abaddamu) āḍakūḍadani niṣēdhiṃpabaḍinaṃduna kūḍā satyamē yagunu - ‘kālē’ (kālamanadu - kālamunanusariṃci) ani paina ceppuṭalō idiyē abhiprāyamu - konni kālamulaṃdu - konni samayamulaṃdu - abaddamu palikinanu adi satyamē yagunu - ani abhiprāyamu).

  1. ā. vārijākṣulaṃdu vaivāhikamulaṃdu

prāṇa vitta māna bhaṃgaṃbulaṃdu

jakita gōkulāgra janma rakṣaṇamaṃdu

boṃkavaccu naghamu jeṃdadadhipa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 585)

(pai padyamulō vivāhakālamaṃdu, prāṇahāni, mānahāni ani ceppabaḍuṭavalana āyā kālamu ceppabaḍinadi. ā kālamulō abaddhamāḍinanu dōṣamu lēdu - adi satyabhāṣaṇamē yagunu -).

  1. “ślō||. satyēnārkaḥ pratavati satyē tiṣṭati mēdinī |

satyē cōktaḥ parō dharmaḥ svargaḥ satyē pratiṣṭitaḥ |

aśvamēdha sahasraṃ tu tulayādhṛtaṃ |

aśvamēdha sahasrāt hi satyamēkaṃ viśiṣyatē ||“. (dēvī bhāgavataṃ)

(satyamu cētanē sūryuḍu prakāśiṃcucunnāḍu, bhūmi satyamaṃdē pratiṣṭiṃpabaḍiyunnadi. satyamē paramadharmamu ani ceppabaḍinadi. svargamu satyamaṃdē pratiṣṭiṃpabaḍinadi. nūru aśvamēdhayāgamulu oka satyamunu tulalō tūcagā vēyi aśvamēdhayāgamulu kaṃṭe okka satyamē heccu agunu –

  1. ka. valayaṃga naśvamēdha

mmulu vēyunu, nokka satyamunu nirugaḍalaṃ

dulaniḍi tūpaga satyamu

valana na mulusūpu gauravaṃbuna pērmin.

tē. sarvatīrthābhigamanaṃbu sarvavēda

samadhigamamu satyammutō sariyugāvuna

eṟugumella dharmamula kaṃṭe bedda

yaṃḍru satyaṃbu dharmajñulaina munulu -) (mahābhāratamu)

  1. satya pratijñatvaṃ - (satyapratijña - śrīrāmuḍu, hariścaṃdruḍu)

  2. “satyaṃ brūyānni cānṛtaṃ”

(satyamu palukavalenu - abaddamādarādu)

  1. “nāsti satyasamaṃ sukhaṃ, nāstirāgasamaṃ duḥkhaṃ nāsti tyāga samaṃ sukhaṃ”.

(satyamutō samānamaina sukhamu lēdu - rāgamutō samānamaina duḥkhamulēdu - tyāgamutō samānamaina sukhamu lēdu-)

  1. satyaṃ kaṃṭhasya bhūṣaṇaṃ

satyamu kaṃṭhamunaku bhūṣaṇamu vaṃṭidi - alaṃkāramu vaṃṭidi)

  1. “naśaṃkarāt vaiṣṇavaśca na sahiṣṇu rtharāparā |

na ca satyā tparō dharmā na sādhvī pārvatī parā ||“. (brahmavaibartapurāṇē - brahmakhaṃḍē)

(śivunikaṃṭe goppa viṣṇubhaktuḍu lēḍu - tārakamaṃtramu ellapuḍu japiṃcucunnaṃduna - bhūmikaṃṭe ōrpugaladi lēdu - carācaramulanu mōyucunnadi kanuka - satyamu kaṃṭe utkṛṣṭa dharmamu lēdu -, pārvati kaṃṭe uttamamaina sādhvi - pativrata lēdu)

  1. anuṣṭīya mānō dharmaḥ -

(anuṣṭiṃpabaḍu dharmamu)

  1. brahma -

  2. “avitadha rūpatvāt paramātmā satyaḥ” -

(anitadhasvarūpuḍu - nityasvarūpuḍu, nityuḍu aguṭavalana paramātma ‘satyamu’ ani ceppabaḍucunnāḍu).

  1. sattā mātratvāt satyaḥ -

(trikālamulaṃdunu sattā - caitanya śakti yē ayi yuṃḍuvāḍu kanuka brahma satyamu)

  1. druvaṃ (ē kālamaṃdainanu nuṃḍuvāḍu kanuka brahma satyamu)

  2. trikālā bādhyaṃ, abādhyaṃ

(bhūta bhaviṣyadvartamāna kālamulaṃdunu naśiṃpanivāḍu kanuka brahma satyamu) (naśiṃpanivāḍu)

  1. kālatraya vartī

(bhūtabhaviṣyadvartamānamulanu mūḍu kālamulaṃduṃḍuvāḍu - ellapuḍu uṃḍuvāḍu)

  1. kālatrayē pyēkarūpaṃ -

(mūḍukālamulaṃdu - anni kālamulaṃdu - ellapuḍu okē rūpamu - caitanyamātramu - galavāḍu)

  1. satyaśabdōhi abādhitau rūḍō brahmavācakaḥ, tadanyasya midhyātvāt -

(parabrahmakāka migilinavanniyu midhya yaguṭavalana satyamanagā naśiṃpani brahmanu vaciṃcunadi - parabrahma)

  1. yadrūpēṇa yanniścitaṃ tadrūpaṃ na vyabhicarati tatsatyaṃ; yadrūpēṇa yanniścitaṃ tadrūpaṃ vyabhicara ttadanṛta matyucyatē - atō vikārō anṛtaṃ.

(ē rūpamu galadani ēdi niścayiṃpabaḍinadō ā rūpamu māranidi satyamu - ē rūpamu galadani yēdi niścayiṃpabaḍinadō ā rūpamu nuṃḍi mārunadi anṛtamu - aṃducēta vikāramu - mārpu - anṛtamu).

  1. nirvikāraṃ

(mārpulu lēnidi - ellapuḍu okē rītigānuṃḍu vāḍu).

  1. guṇataḥ apyavikāraṃ

(guṇamunubaṭṭi kūḍa mārpulēnivāḍu)

  1. “utpatti vināśādi ṣaḍbhāva vikāra śūnyaṃ”. (śrīraṃga rāmānujaḥ)

(janana maraṇamulu modalaina āru vikāramulu lēnivāḍu - jananamu lēnivāniki migilina ayidu vikāramuluṃḍavu. parabrahma janma lēnivāḍu, aṃducēta vikāramu lēnivāḍu)

  1. “mṛgi jalaṃ uṃḍagānē dabbarainaṭlu, ākāśamaṃdu nīlatvamuṃḍagānē dabbarainaṭlu, ī prapaṃcamu vicāristē midhya, brahmamē satyamu. sakalamu kaligi lēkuṃḍunu, kēvala brahma caitanyamē satyamu”.

  2. bāhyābhyaṃtaraṃbulaṃ galigi svaprākāśaṃbai bhagavacchabda vācyaṃbunu naina brahmaṃ bokaṭi satyaṃbu, jagattasatyaṃbagunu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

  1. paramārtha bhūtaṃ -

(parama puruṣārtharūpamaina ṃōkṣarūpamainadi kanuka satyaṃ)

  1. “sadēva satyaṃ” iti śrutēḥ -

(sat ani ceppabaḍu satpadārthamē - sanmātravastuvē - satyamu ani śruti ceppucunnadi).

  1. brahmaṇaḥ sarva kāraṇatvēna vidyamānatvāt satyatvaṃ niraṃkuśaṃ -

(parabrahma anniṃṭikini kāranamainavāḍu ani spaṣṭamaguṭacēta atanu ‘satyaṃ’ anuṭa khaṃḍiṃpa vīlulēnidi)

  1. satya padēna nirupādhika sattā yōgi yōgi brahma āha. tēna vikārāspada macētanaṃ tatsaṃ sṛṣṭaścētanaśca vyāvṛttaḥ -

(ē vidhamaina upādhi lēni kēvalamu sattāmātra brahmamē satyamu -

  1. “sa diti śrauta pratīti lakṣyaṃ satyaṃ asaditya vācyaṃ satyaṃ, trikālābādhyaṃ satyaṃ, trikālānu syūtaṃ satyaṃ, ya dasti tat satyaṃ, ēkamēvā dvitīyaṃ satyaṃ, sajāti vijāti bhēdarahitaṃ satyaṃ, sarvakalpanādhiṣṭhānaṃ vā satyaṃ; avināsakamiti, dēśakāla vastu nimittāduṣuvinaśyatsu yanna vinaśya tīti” (sarvasārōpaniṣat)

(śrutilō ‘sat’ ani prakhyāti poṃdinadi satyamu; ‘asat’ ani ceppabaḍakūḍanidi satyamu - bhūta bhaviṣyadvartamānamulanu mūḍu mūḍu kālamaulaṃdu nāśamu lēnidi satyamu; mūḍukālamulaṃdu prapaṃcamaṃtaṭilōnu, lōpala paina anisyūtamai allukoni vyāpiṃci yuṃḍunadi satyamu, unnadi ani ceppabaḍunadi satyamu; (prapaṃcamaṃtayu midhyayē yagutavalana lēnidē); unnadaṃtayu okē vastuvu parabrahmamē, parabrahmakānidi lēdu, adiyē satyamu, sajātīya bhēdamu, vijātīya bhēdamu lēnidi satyamu, kalpiṃcabaḍinadānikaṃtakunu, - sṛṣṭiṃcabaḍinadānikaṃtakunu adhiṣṭhānamainadi satyamu - nāsamu lēnidi satyamu - anagā, dēśakāla vastuvulu kāraṇamugā naśiṃcunavi naśuṃcucunnanu tānu naśiṃpanidi satyamu)

  1. cakṣurādīṃdriyai rdṛṣṭaṃ śrutaṃ, ghrātaṃ munīśvara |

tasyainōktirbhavētsatyaṃ, vipra, tamnānyathā bhavēt |

sarvaṃ satyaṃ paraṃbrahma nānyaditi matiḥ |

tacca satyaṃ varaṃ prōktaṃ vbēdāṃta jñānasāranaiḥ ||” (darśinōpaniṣat)

(kannulu modalagu iṃdriyamulacēta cūḍabaḍunadi, vinabaḍunadi, vāsana cūḍabaḍunadi satyamani ceppabaḍunu, itaramulukādu. prapaṃcamaṃtayu parabrahmamē kanuka adi aṃtayu satyamē anu abhiprāyamu kūḍa satyamu - ani upaniṣadarthamulu telisinavāru ceppuduru).

  1. “apūrvāna paraṃbrahma svatmānaṃ satyamadvayaṃ” (sūtasaṃhitāyāṃ)

(venuka muṃdu lēnidi brahma - anagā brahma puṭṭakamuṃdu ēmiyu lēnidi - tanavaṃṭidi lēdu, puṭṭina tarvāta kūḍa aṭuvaṃṭidēmiyu lēdu - aṃducēta unnadaṃtayu brahmamē - parabrahma kānidēdiyu lēdu).

  1. “sarva pramānamulacē lēdu anu śaṃka kalugakuṃḍunadi”.

  2. “sa ēṣa bhagavān viṣṇuḥ satyamityabhidhīyatē |

sarvōttamatvāt, pūrṇatvāt sarvajñatvāt tadaivaca ||“.

(anniṃṭikaṃṭenu uttamuḍaguṭacētanu, anniṃṭilōnu - prapaṃcamaṃtaṭilōnu - pūrtigā vyāpiṃci niṃḍiyuṃḍuṭavalananu, sarvajñuḍaguṭavalananu bhagavaṃtuḍu śrīmahāviṣṇuvē ‘satyaṃ’ ani ceppabaḍucunnāḍu)

  1. “okaṭē satyaṃ galugaṃbaṭṭi midhyayokaṭi velase tatvaṃ vicāristē satyamu nijākāramai midhya jagajjīvākāramai, adi tana aṃkuramai, tānē ānaṃda kaṃdaṃ, ādi bījaṃ, samastānakunu akkaḍanuṃḍi prapaṃcaṃ vistāramāyenu. sakalamunnū caitanyānaku vyatiriktaṃ kādu”

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “satyaṃ jñānamanaṃtaṃ brahma” (taittīrīyōpaniṣat)

- satyaṃ jñānādi vākyābhi hitaṃ brahma. (satyamu, jñānamu, anaṃtamu ayinadi brahma ani śrutivākyamulō ceppabaḍina brahmamē satyamu).

  1. “tat satyaṃ” - ‘sat’ iti prāṇaḥ, ‘ti’ ityannaṃ, yaṃ ityasāvādityōḥ, tadētat trivṛt. (aitarīyōpaniṣat)

(satyaṃ = sat + ti + yaṃ) satyaṃ anu padamulōni ‘sat’nagā prāṇamu, ’ti’ anagā annamu, yaṃ anagā sūryuḍu - ī mūḍu kalisi ‘satyaṃ’ ayinadi- parabrahma - “tēna prāṇānnāditya rūpatvāt vā satyaṃ”

  1. ‘tadētat tryakṣaraṃ satyaṃ’ sat ityēka makṣaraṃ, ‘ti’ ityēkamakṣaraṃ, ‘yaṃ’ ityarkamaskaharaṃ, prathamōttamē akṣarē satyaṃ, madhyatō (a)nṛtaḥ.- tadēta damṛta mubhayataḥ satyēna parigṛhītaṃ satyabhūyamēva bhavati iti śrutēḥ.

(satyaṃ anumāṭa mūḍu akṣaramulu kalisi yunnadi - ‘sat’ anunadi oka akṣaramu, ‘ti’ anunadi oka akṣaramu, ‘yaṃ’ anunadoka akṣaramu - īmūḍu akṣaramulalō modaṭidi, civaridi ‘satyaṃ’ madhyanunnadi anṛtamu - ‘sat’, ‘yaṃ’ anu reṃḍu akṣaramula madhyanunnadi kanuka ‘ti’ kūḍa satyamē anipiṃcukonunu).

(satyaṃ anumāṭa mūḍu akṣaramulu kalisi yunnadi - ‘sat’ anunadi oka akṣaramu, ‘ti’ anunadi oka akṣaramu, ‘yaṃ’ anunadoka akṣaramu - īmūḍu akṣaramulalō modaṭidi, civaridi ‘satyaṃ’ madhyanunnadi anṛtamu - ‘sat’, ‘yaṃ’ anu reṃḍu akṣaramula madhyanunnadi kanuka ‘ti’ kūḍa satyamē anipiṃcukonunu).

  1. “yat pāramārthikaṃ tadēvasat ‘sat’ iti prāṇaḥ ‘yaṃ’ asau ānityaḥ, sarvātmā tatra saccabdauaṃ śabda vācya prāṇādi tyau satpadavācyau; madhyastha takāraḥ ikārastu (t + i = ti) anṛta śabdavācyaḥ - tasya ubhayataḥ stvēna bhinnatvāt tadapi satyamēva”.

(paramārthamu - paramapuruṣārthamu - mōkṣamu - mōkṣarūpamainadēdō adiyē, parabrahmamē sat. ‘sat’ anagā prāṇamu, ‘yaṃ’ anagā ādityuḍu - sarvātma. ī reṃḍu akṣaramulavalana ceppabaḍina prāṇamu, ādityuḍu satpadavācyamulu - (sat ani ceppabaḍinavi). ī reṃḍu akṣaramulaku madhyanunna ‘ta’ kāra ‘i’ kāramulu (t _ i - ti) ānṛtamunu teliyacēyunavi. kāni, iru prakkalasatyamunu teliyacēyu ‘sat’, ‘yaṃ’ anu reṃḍu akṣaramulamadhya nuṃḍuṭacēta ‘ti’ anu akṣaramu kūḍa satyamani ceppabaḍucunnadi).

  1. “tasyahavā ētasya brahmaṇō nāma satyamiti, tāni hāvā ētāni trīṇi akṣarāṇi ‘sat’, ‘t’, ‘yaṃ’ iti tat yat ‘sat’ tadamṛtaṃ; adhayat ‘ti’ tanmartyaṃ, adha yat ‘yaṃ’ tēna ubhēyaccati, yadanēna ubhēyaccati tasmāt ‘yaṃ’ aharaharvā ēvaṃ vit svargaṃ lōkaṃ ēti : iti” sat + ‘ti’ + ‘yaṃ’ iti satyanāmatryakṣarātmakaṃ ityarthaḥ. tadyat sat tadamṛtaṃ, adha yat ‘ti’ tanmartyaṃ. atra amṛta martya śabdābhyāṃ cētanā cētanau nirdiśyatē. adha yadyaṃtēna ubhē yaccati amṛtatva martṛta rūpēṇa upalakṣitē ubhēyaccati iti ‘yaṃ’ ityarthaḥ tadēva upa saṃ harita yadanēna ubhē yacchati tasmāt ‘yaṃ’ iti. anēna cētanā cētana svarūpēṇa upalakṣitē ubhē yatō yacchati tasmāt ‘yaṃ’ ityarthaḥ).

(‘satyaṃ’ anunadi parabrahma yokka nāmamu. ‘satya’ anu māṭalō mūḍu akṣaramulu kalisiyunnavi - ‘sat’, ‘ti’, ‘yaṃ’ anunavi. vāṭilō ‘sat’ aṃgā amṛtamu - nāsamu lēnidi, nitymainadi. ‘ti’ anagā martyamu - naśiuṃcunadi - amṛtamu, martyamu anagā cētanamulu, acētanamulu, ‘yaṃ’ ī reṃḍunu - cētanācētanamulu tānē ayinadi, ani teliyacēyunu. paina ceppina prakāramu prati dinamu evaru telusukonedarō vāru svargamunu poṃduduru)

  1. sat + ti + yaṃ = satyaṃ - ‘sat’ anagā ātma, eppuḍunu mārpu ceṃdaka yuṃḍunadi, nityamainadi, śāśvatamugā nuṃḍunadi, ‘ti’ anagā mārunadi - prakṛti - vikāramu noṃdunadi. ī reṃṭini kalipi niyamiṃcuvāḍu - jīvuni prakṛtitō kalipi vāṭini niyamiṃcuvāḍu - paramātma

  2. “yathā nāmadhēya mātratā kāraṇaṃ mṛdā dvē satyaṃ tathā ākāśādīnāṃ nāmadhēya mātratā,brahmaiva satyaṃ - laukika pratīti siddhaṃ kāraṇāt kāryasya ananyatvaṃ tāna t yathā ēka mṛtpiṃḍārabthānāṃ ghaṭa śarāvādīni tasmādanatirikta dravyatayā ta jñānēna jñātvā ityarthaḥ -atra kāraṇādivādēna kāraṇāt saryasya buddhi śabdāṃtarādibhiḥ dravyāṃtaratvaṃ ā śaṃkya lōka pratītyaiva kāraṇāt kāryasya ananyatā upapādyatē -).

(kārya vastuvulu vēru vēru pērlju kaligiyuṃḍuṭa nāma mātramu; vāṭiki maṭṭi kāraṇamaguṭa satyamu. aṭlē ākāramu modalaguvāṭikipērlu nāmadhēyamulu mātramē. brahmamē satyamu - vāṭi anniṃṭiki kāraṇamaina parabrahmamē - lōkamulō kāryavastuvu kāraṇavastuvukaṃṭe vēṟukādu ani pratīti kaladu maṭṭitō tayārucēyabaḍina kuṃḍa mūkuḍu modalagunavi maṭṭi maṭṭi dravyamu kaṃṭe vērukānidē).

  1. “yathā mṛddravyasānu vartamānaṃ tadatiriktasya vyāvartamānatvaṃ rajju sarpādiṣu hyanuvartamānasya adhiṣṭāna bhūtasya rajjvādēḥ satyatāvyāvartamānasya sarpādēḥ satyatā dṛṣṭā.tadhāna vartamānasya adhiṣṭāna būtaṃ mṛddhravyamēva satyaṃ vyāvartamānāstu ghaṭa śarā vādayaḥ asatya bhūtāḥ tathā nirviśēṣa sanmā trāt sarvādhiṣṭhāna bhūtāt brahmaṇaḥ anyaḥ ahaṃkārādi vyavahārālaṃbanaḥ - kṛtsnaḥ prapaṃca midhyā kāraṇa bhūtaṃ sanmātraṃ brahmaiva satyaṃ. kiṃca sataḥ ātmanaḥ vināśāyōgāt asataḥ śaśaviṣāṇādauḥ upalabdṛ bhāvāt upalabda vināśayōgau kāryaṃ sada sadbhyāṃ anirvacanīyamiti gamyatē - anirvacanīyaṃ śuktikāra jatādi vat mēṣaiva, tasyuca anirvacanīyatvaṃ pratīti cādākhyāṃ siddhaṃ”.

(maṭṭi tana dravyamunu anasariṃcē yuṃḍi dānikaṃṭe vērukāni kuṃḍa, mūkuḍugā mārunu. aṭlē rātrivēḷa trāḍunu cūci pāmu ani bhramiṃci napuḍu pāmu asatyamu, trāḍē satyamu - maṭṭi kuṃḍa mūkuḍugā mārina vāṭi yadhārtha dravyamu agu maṭṭiyē satyamu - trāḍē satyamu - maṭṭi kuṃḍa, mūkuḍugā mārina kuṃḍa, mūkuḍu asatyamu, vāṭi yadārtha dravyamu agu maṭṭiyē satyamu - anagā, maṭṭi, kuṃḍa, mūkuḍu modalagu vāṭigā mārinanu dānilōni dravyamu maṭṭiyē satyamu - mārpulūyina kuṃḍa, mūkuḍu asatyamu.ā prakāramugānē nirviśēṣamu, sanmātramu, anniṃṭikī adhiṣṭhānabhūtamu ayina parabrahmakaṃṭe vērayina ahaṃkāramu modalugāgala ī prapaṃcamaṃtayumidhyagā kalpiṃcabaḍinadi. skanmātramaina parabrahmamu satyamu, sanmātramaina ātma (parabrahmamu) nāśamulēnidaguṭacētanu,kuṃdēṭikommu vaṃṭi anātmavastuvulu labhiṃcanaṃdunanu ‘sat’ padārthamu ‘asat’ padārthamunaku anirvacanīyamu - ceppuṭaku vīlu kānidi. anirvacanīyamanagā - mutyapu cippanu cūciveṃḍiyanukonuṭa mṛṣayē ayinaṭlu).

  1. “sacca tyaccā bhavat” (taittirīyōpaniṣat)

(sat = mūrta svarūpuḍu, tyat - amūrtasvarūpuḍu - anagā, vyaktasvarūpuḍu, avyaktasvarūpuḍu, ī reṃḍunu bhagavaṃtuḍē āyenu - ani śruti ceppi yuṃḍuṭacēta satyaṃ anagā vyaktāvyakta vastuvulanniyu tānē ayina bhagavaṃtuḍu)

  1. ‘sat’ śabdēna pṛdhivyastējōṃsi, ‘tya’ śabdēna vāyvākāśauca ucyaṃtē - sat catyaṃ satya mityēkava dbhāvaḥ - bhūta paṃcakaṃ.

(sat anagā bhūmi, jalamu, agni, tyaṃ anagā vāyuvu, ākāśamu ani ceppabāḍinadi. ‘sat’ ‘tyaṃ’ kalisi okaṭē bhāvamagunu ani ā ayidu bhūtamulu - paṃcabhūtamulu - ī reṃḍu bhagavaṃtuḍē).

(“mūrtā mūrtātma katvādvā” -mūrtamulu amūrtamulu - (rūpamu kalavi, rūpamulēnivi) bhagavaṃtuḍē kanuka satyaṃ).

  1. “sat cidvyaṣṭiḥ, ‘tyaṃ’ acidvyaṣṭiḥ, tadubhayaṃ tathā sat tyat śabda yōḥ cidacidvyaṣṭyōḥ prayōgaḥ - śruti - tadanu praviśya sat ca tyat ca abhavat” ityādi śrutau prasiddhiḥ tathā satya śabda yōḥ tatparatvē śrutiḥ - “adha yaddēvēbhyaḥ prāṇibhyaḥ ca tatsat - adha yaddēvāścatyaṃ tadēka vācā sama bhivyā priyatē satyaṃ” iti dēvāḥ dēvādhiṣṭhitānīṃdriyāṇi tēbhyaḥ paraḥ tatsaṃ sṛṣṭaḥ cētanassat, dēvādyabhidvyaṣṭastutvaṃ, tadētadubhayaṃ satyaṃ ityēkavācā ēka śabdēna samabhivyā priyatē iti tadarthaḥ ”

(sat nagā cidvyaṣṭi; tyaṃ anagā acit vyaṣṭi - ī reṃḍu kalisi satyaṃ cidacidvyaṣṭi ayina sat _ tyaṃ śrutilō ī kriṃdanuprayōgiṃpabaḍīṃdi - tat sṛṣṭvā - dānini - lōkamunu - sṛṣṭiṃci, “tadēvānu prāviśat” - dānilō pravēśiṃcenu, “tat praviśya” (dānilō pravēśiṃci), “sacca tyacca - abhavat” (= sat anagā cidvyaṣṭi, cit anagā acidvyaṣṭi, ī reṃḍunu tānade āyenu. iṃkanu ‘at’, ‘tyaṃ’ anunavi bhagavatparamulē - bhagavaṃtuni guṟiṃci ceppunaviyē yanuṭaku śruti yī lāguna ceppucunnadi. iṃdriya dēvatalu - iṃdriyamulanadhiṣṭiṃci yuṃḍu dēvatalu, vīṭikaṃṭe utkṛṣṭamainadi acētanamu ‘sat’ ā dēvatalu modalagunavi acit. ī ‘sat’, ‘cit’ lu reṃḍunu satyaṃ anu okē māṭaku arthamu)

  1. saccidānaṃda nitya paripūrṇaḥ - aneḍi ayidu padālalōnu citpadānaku vyatiriktamaina nālugu padālunnū anubhavamaṃdu vēdyamai uṃḍunu ganuka vāṭini nētimukhāna trōsi nilicina cinmātra jñapti svarūpamē ātma; ‘nēti’ mukhāna telisina sakala prapaṃcānakunnū saṃ yōga, samavāya nimittakāraṇālaneḍi kāraṇa trayamunnū lēdu kanuka prapaṃcaṃlēdu anēdē satyaṃ “aghaṭana ghaṭanā paṭī yasī māyā” ani kaladukanuka māya ghaṭiṃci tīcunu ani aṃṭē ā māya avicāramaṃdē satyamu; vicārapūrvakaṃgā cūstē asatyamu - midhyayanuṭa. ayitē jagattu tōcagadē aṃṭē, ghaṭamaṃdu tōcina bhāvamellānu mṛttikēkāri ghaṭamanēdi lēdu - cinmātramaina tanayaṃdu prapaṃcamu lēdanēdisatyaṃ. iṃduku śruti - “nāma rūpē vyākaravāṇi” vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ mṛttikā ityēva satyaṃ”; “ēkaṃ satyaṃ bahuthā kalpayaṃti” ani chāṃdōgyaṃ; “tadētatkṛtakaṃ, tattadanityaṃ” ani - (brahmasudhārṇavamu - 2)

  2. “ōṃ bhūḥ ōṃ bhuvaḥ, ōṃ suvaḥ, ōṃ mahaḥ, ōṃ janaḥ, ōṃ tapaḥ, ōṃ satyaṃ”.

(bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu, maharlōkamu, janalōkamu, tapōlōkamu, satyalōkamu - anu ēḍu lōkamulu - ūrthva lōkamulu - parabrahmamē ani śruti ceppucunnaṃduna satyaṃ anagā satyalōkarūpuḍaina parabrahmamē -

  1. “nāmarūpamulaku caitanyamunu, vṛddhi kṣayamulanu kalugacēyunadi?.

  2. nirduḥkha nitya niratiśayānaṃdādyanubhava rūpaṃ.

(duḥkhamu lēnidinnī, nityamu, goppa ānaṃdamu kalugacēyunadi).

  1. “ōṃ iti aṃgīkārēṇa yatrōktaṃ tatsatyaṃ”.

(aṃgīkariṃcinapuḍu ‘ōṃ’ ani ekkaḍa ceppabaḍinanu adi satyamu).

  1. “satya vacana dharma rūpatvāt satyaṃ” (śrīśaṃkaraḥ)

(satya vacanamagu dharmamē rūpamu ayinavāḍu)

  1. “satyasya satyamiti : (satyamunaku satyamainavāḍu)

  2. abādyaṃ

(bhāda lēnidi - tappukānidi, nijamainadi)

  1. anitadhaṃ, ataḥ amṛtaṃ

(koṭṭabaḍanidi - aṃducēta nāśamu lēnidi)

  1. kaivalyamu (mōkṣamu)

  2. brahmamu nissaṃgamu - anniṃṭilōnunnappaṭikinnī dēninainanu aṃṭakuṃḍa nuṃḍuvāḍu kanuka brahmamu satyaṃ.

  3. upaniṣattulu, brahmajñānulu vāri anubhavamu valana, brahma satyamanu cuṃḍuṭavalana brahma brahma satyamu -

  4. brahmamu kanna vēṟu draṣṭalēdu kanuka brahma satyamu -

  5. yēnā parasya ahitaṃ bhavēt tatsatyamapi vāṃcanīyaṃ nāsti -

(tanaku paruḍu kānivāniki iṣṭamulēnidi satyamainanu vāṃchanīyamu kādu)

  1. “satyaṃ paraṃ dhīmahi” (nirduḥkha niratiśayānaṃdānubhavarūpaṃ - aṭṭi parabrahmanu dhyānamu cēyucunnānu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.