← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్యస్య సత్యం satyasya satyaṃ

Original — తెలుగు
  1. సత్యస్య, ప్రపంచస్య సత్యం వినాశ రహిత విలయస్థానం ఇత్యర్థః అనేన ప్రళయే అపి స్థితి రుక్తా, యద్వా, జీవోభ్యో అపి సత్యం జీవానాం స్వరూపతః నిర్వికారత్వేన సత్యత్వేపి స్వభావ వికారవత్వాత్ తేభ్యో అపి ధర్మతో నిర్వికారమత్యార్థః -

(సత్యమనగా ప్రపంచమునకు సత్యమైనవాడు - అనగా వినాశములేని లయస్థానమైనవాడు - ఇట్లు చెప్పుటచేత ప్రళయమందుకూడ నుండువాడు - లేక జీవులకు కూడ సత్యమైనవాడు - జీవులుకూడ తనరూపమే అయినందున వికారము లేనివారగుటవలన సత్యమే అయినను స్వభావముచేత వికారము - మార్పు - కలిగియుండునవగుటచేత వాటికి కూడ నిర్వికారములట్లు చేయువాడు)

  1. సత్యస్య ఏకస్య సత్యం పారమార్థికం, తన్నశౌ అపి అవశిష్యమాణరూపం -

(సత్యమనగా ఒకటే అయిన ప్రపంచము - దానికంటె పారమార్థికసత్యము - ప్రపంచము నశించినను మిగిలియుండునది - సత్యస్య సత్యం.

  1. సత్యస్య పాంచభౌతిక కార్య కారణాత్మకస్య సంఘాతస్య బాహ్య గిరి నదీ సముద్రాదేశ్చ వ్యావహారిక సత్యస్య అధిష్ఠానభూత మాత్యంతికం పారమార్థిక సత్యం బ్రహ్మ ఇత్యర్థం.

(సత్యమనగా పంచభూతముల సమ్మేళనవలన కలుగు కార్య వస్తువులు గల ప్రపంచం వ్యావహారిక సత్యము - సత్యము అని వ్యవహరిమోబడుచున్నది. దీని అధిష్ఠాన భూతము అత్యంత పారమార్థికం అయిన సత్యము పరబ్రహ్మ అని అర్థము)

  1. సత్యమునకు సత్యము బ్రహ్మ - స్థూలశరీరముకంటె ఎక్కువకాలముండునని సూక్ష్మ శరీరము కనుక అది సత్యము. దాని కంటె శాశ్వతముగా నుండునది కనుక పరబ్రహ్మ దానికంటె సత్యము)

  2. జగతః సత్యం విష్ణుః, తస్య విష్ణోః సత్యస్య సత్యమితి సత్యమిత్యుచ్యతే తేషాం ప్రాణానాం ఏష విష్ణుః సత్యమిత్యర్థః - “ద్వేవావ బ్రహ్మ ణః రూపే మూర్తంచా మూర్తంచ, స్థితం చ యచ్చ సచ్చత్యచ్చ ఇతి” - తత్ర మూర్తం స్థితం ఇతి సదితి చ ఉచ్యతే అమూర్తంతు యదితి త్యదితి చ ఉచ్యతే ఇత్యర్థః తధాచ సచ్చ త్యచ్చ సత్య మత్యుక్తం భవతి

(జగత్తుయొక్క సత్యము విష్ణువు. ఆ విష్ణువునకు కూడ సత్యమైనవాడు - ఆ ప్రాణులకు కూడ విష్ణువు సత్యము - “బ్రహ్మరూపములు రెండు విద్జములు - మూర్తము, అమూర్తము - ఆకారము కలది, ఆకారములేనిది. అని శ్రుతి చెప్పుచున్నది. మూర్తము ‘సత్’ అమూర్తము ‘త్యత్’ అని చెప్పబడుచున్నది, ‘సత్’, ‘త్యత్’ కలసి ‘సత్యం’ అని అర్థమగుచున్నది).

Transliteration
  1. satyasya, prapaṃcasya satyaṃ vināśa rahita vilayasthānaṃ ityarthaḥ anēna praḷayē api sthiti ruktā, yadvā, jīvōbhyō api satyaṃ jīvānāṃ svarūpataḥ nirvikāratvēna satyatvēpi svabhāva vikāravatvāt tēbhyō api dharmatō nirvikāramatyārthaḥ -

(satyamanagā prapaṃcamunaku satyamainavāḍu - anagā vināśamulēni layasthānamainavāḍu - iṭlu ceppuṭacēta praḷayamaṃdukūḍa nuṃḍuvāḍu - lēka jīvulaku kūḍa satyamainavāḍu - jīvulukūḍa tanarūpamē ayinaṃduna vikāramu lēnivāraguṭavalana satyamē ayinanu svabhāvamucēta vikāramu - mārpu - kaligiyuṃḍunavaguṭacēta vāṭiki kūḍa nirvikāramulaṭlu cēyuvāḍu)

  1. satyasya ēkasya satyaṃ pāramārthikaṃ, tannaśau api avaśiṣyamāṇarūpaṃ -

(satyamanagā okaṭē ayina prapaṃcamu - dānikaṃṭe pāramārthikasatyamu - prapaṃcamu naśiṃcinanu migiliyuṃḍunadi - satyasya satyaṃ.

  1. satyasya pāṃcabhautika kārya kāraṇātmakasya saṃghātasya bāhya giri nadī samudrādēśca vyāvahārika satyasya adhiṣṭhānabhūta mātyaṃtikaṃ pāramārthika satyaṃ brahma ityarthaṃ.

(satyamanagā paṃcabhūtamula sammēḷanavalana kalugu kārya vastuvulu gala prapaṃcaṃ vyāvahārika satyamu - satyamu ani vyavaharimōbaḍucunnadi. dīni adhiṣṭhāna bhūtamu atyaṃta pāramārthikaṃ ayina satyamu parabrahma ani arthamu)

  1. satyamunaku satyamu brahma - sthūlaśarīramukaṃṭe ekkuvakālamuṃḍunani sūkṣma śarīramu kanuka adi satyamu. dāni kaṃṭe śāśvatamugā nuṃḍunadi kanuka parabrahma dānikaṃṭe satyamu)

  2. jagataḥ satyaṃ viṣṇuḥ, tasya viṣṇōḥ satyasya satyamiti satyamityucyatē tēṣāṃ prāṇānāṃ ēṣa viṣṇuḥ satyamityarthaḥ - “dvēvāva brahma ṇaḥ rūpē mūrtaṃcā mūrtaṃca, sthitaṃ ca yacca saccatyacca iti” - tatra mūrtaṃ sthitaṃ iti saditi ca ucyatē amūrtaṃtu yaditi tyaditi ca ucyatē ityarthaḥ tadhāca sacca tyacca satya matyuktaṃ bhavati

(jagattuyokka satyamu viṣṇuvu. ā viṣṇuvunaku kūḍa satyamainavāḍu - ā prāṇulaku kūḍa viṣṇuvu satyamu - “brahmarūpamulu reṃḍu vidjamulu - mūrtamu, amūrtamu - ākāramu kaladi, ākāramulēnidi. ani śruti ceppucunnadi. mūrtamu ‘sat’ amūrtamu ‘tyat’ ani ceppabaḍucunnadi, ‘sat’, ‘tyat’ kalasi ‘satyaṃ’ ani arthamagucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.