విశేషములతో నుండు బ్రహ్మ, అవయవములతోనుండు బ్రహ్మ; సాకారబ్రహ్మ; ఆకారముతో నుండు బ్రహ్మ.
స విశేషత్వం వాఙ్మానస గోచరత్వం -
(పరబ్రహ్మ సవిశేషమనగా కంటికి, మనసునకు గోచరించువాడు - అని అర్థము, ఆకారము కలిగియుండిన కంటికి గోచరమగును, ఆకారము మనసులో నుంచుకొని ధ్యానించుటకు వీలగును).
“సర్వకర్మా, సర్వకామః, సర్వ గంధః సర్వరసః” ఇత్యాదినా బ్రహ్మణః సవిశేషత్వం శ్రూయతే “పరబ్రహ్మః” సర్వకర్మాః, సర్వకామః, సర్వగంధః, సర్వరసః అని శ్రుతి చెప్పుటచేత బ్రహ్మ సవిశేషము అని తెలియుచున్నది.
“సర్వకామః, సర్వగంధః, సర్వరసః” ఇత్యాదినా బ్రహ్మణః సవిశేషత్వం శ్రూయతే. అస్థూలమ నణు ఇత్యాదిన నిర్విశేషత్వం. తత్రకిం ఉభయ శ్రుత్యనురోధాత్ ఉభయ రూపం బ్రహ్మ ఉతైకరూపం. ఏకరూపమత్యత్రాపి సవిశేషం సవిశేషం నిర్విశేషం వేతి. సందేహే ద్విరూపమతి పూర్వః పక్షః, సిద్ధాంతస్తు న తావ త్పరస్య బ్రహ్మణః ఉభయ లింగం, ఉభయ రూపత్వం సంభవతి. సత్యస్య వస్తునో ద్వెరూప్యాయోగాత్ నహ్యేకమేవ వస్తు ఏకదా తద్వత్తద భావ వచ్చ దృష్టం. ఏకేన మూర్ఛావస్థా దృష్టాంతో వైలక్షణ్Yఆన్నిరస్తః నాపి స్తానతః ఉపాధితః ఉభయ రూపత్వం తాత్వికం యుక్తం అగ్ని సం యోగమాత్రేణ జలస్థోష్ణస్య తత్స్వభాహత్వా ద్సర్శనాత్ - అతః ఏక రూప మేవ బ్రహ్మణః హి యస్మాత్ సర్వత్ర సర్వేషు వేదాంతేషు అశబ్ద మస్పర్శమ రూపః” ఇత్యాది బ్రహ్మ తరేషు సవిశేషత్వ నిరాసేన నిర్విశేష మై నేక రూపం బ్రహ్మోపదిశ్యతే ఇత్యర్థః” (బ్రహ్మతత్వప్రకాశికా - బ్రహ్మ సూత్రములు)
సర్వకామః.
(సర్వకామః, సర్వగంధః, సర్వరసః : (కామములన్నియు, గంధములన్నియు, రసములన్నియు అతనే) అను మొదలగునవి శ్రుతిలో చెప్పబడి యుండిన దానిని బట్టి పరబ్రహ్మ సవిశేషమని చెప్పబడినది. “అస్థూలమనణు” (స్థూలముకానిది - పెద్దది కానిది చిన్నదికానిది) అని పరబ్రహ్మ గుఱించి శ్రుతిలో చెప్పబడియుండుటవలన పరబ్రహ్మ నిర్విశేషమని చెప్పబడినది. ఇట్లు విరుద్ధముగా శ్రుతి చెప్పుటవలన పరబ్రహ్మ సవిశేషము, నిర్విశేషము కూడానా, లేక, ఆ రెండింటిలో ఏదో ఒకటేనా ఒకే రూపము కలవాడయిన యడల సవిశేషమా ?, లేక, నిర్విశేషమా? అని సందేహము. పూర్వ పక్షమువారు బ్రహ్మ సవిశేషము, నిర్విశేషము అను రెండు రూపములుకలది యని యభిప్రాయపడుచున్నారు -, కాని పరమాత్మకి రెండు రూపములు కలుగ నేరవు అని సిద్ధాంతము - పరబ్రహ్మ సత్యము, అనగా, నాశము లేక ఎల్లకాలమునందుండునది, ఎల్లపుడు ఒకే రూపముతో నుండునది. అందుచేత పరబ్రహ్మకు రెండురూపములుండుట సంభవింపదు. ఒకే వస్తువు ఒకే సమయమందు ఒక రూపముగా నుండుట, నుండకపోవుట సంభవింపదు - స్థానము వలన, ఉపాధివలన అయినను రెండురూపములుండవు. అగ్ని నీటితో కలిసినను దాని స్వభావము, మారలేదు. అందుచేత పరబ్రహ్మకు ఒకే రూపము కలదు - ఉపషత్తులన్నింటిలోను, అన్ని సందర్భములందును “అశబ్ద మస్పర్శ మరూపము” (నిరాకారము, నిర్విశేషము అని చెప్పబడియుండుటవలన పరబ్రహ్మ నిర్విశేషమే).
“నను నీదృశం నిర్విశేషం బ్రహ్మేత్యత ఆహ:- ఆహశ్రుతి శ్చైతన్య మాత్రం విలక్షణ రూపాంతర రహితం నిర్విశేషం బ్రహ్మ” - ” సయథా సైంధవ ఘనో అనంతరో, (అ)బాహ్యః కృత్స్నో రస ఘన ఏవ ఏవంవా అరే అయమాత్మా (అ)నంతరో (అ)బాహ్యః కృత్స్నః, ప్రజ్ఞాన ఘన ఏవేతి” ఏతమక్తం భవతి నాస్యాత్మనో (అ)oతర్బహిర్వా చైతన్యాదన్య రూపమస్తి, చైతన్య మేవతు నిరంతర మస్య స్వరూపం - యథా సైంధవ ఘనస్యాంతర్బహిశ్చ లవణ రస ఏవ నిరంతరో భవతి, న రసాంతరం. తదైవేతి. (శ్రీ శంకరః)
(నిర్విశేష బ్రహ్మ అనగా - ఎటువంటివాడు ? ఈ విషయమై శ్రుతి ఇట్లు చెప్పుచున్నది - పరబ్రహ్మ చైతన్య మాత్రము - ఇతర లక్షణములుగాని, రూపములు గాని లేనిది - విశేషములు లేనిది - అవయవములు లేనిది. ఉప్పు కణిక లోనకాని, పైన కాని ఇంకేదియు లేక అంతా ఉప్పు రసముతో నిండియుండును - అట్లే ఈ ఆత్మ లోపలకాని, పైనకాని ఏమియు లేక అంతా ప్రజ్ఞానమే అయినవాడు. ఈ ఆత్మకు లోపలకాని, చైతన్యము (చేతన శక్తి చిచ్ఛక్తి) కాక ఇతర రూపము లేదు. ఎల్లపుడు చైతన్యమే దీని రూపము - ఉప్పు గలు లోపల పైన ఉప్పురసమే ఎల్లపుడు ఎట్లుండునో, ఇతర రసముండదో - అట్లే).
(నిష్కలుడు - (కళలు లేనివాడు) - నిష్క్రియుడు (క్రియలు లేనివాడు); శాంతుడు. నిరవద్యుడు, నిరంజనుడు, నిర్గుణుడు అని శ్రుతులు చెప్పుటవలన పరబ్రహ్మయొక్క నిష్కలత్వము (నిరవయవత్వము), నిష్క్రియత్వము, నిర్గుణము తెలియచేయుచున్నవి. ఈ ప్రకారము శ్రుతులు జగత్తు పరబ్రహ్మ కంటె వేఱుకాదని చెప్పుటవలనను, పరబ్రహ నిర్గుణుడు, నిష్క్రియుడు అని చెప్పుటవలన నిర్విశేషమని ప్రతీతి కలుగుచున్నది. “పరబ్రహ్మ ఒక్కడే యున్నాడు - ఇతర వస్తువు లేదు” అని చెప్పుటవలన పరబ్రహ్మయొక్క ఏకత్వము అద్వితీయత్వము చెప్పుటవలన కూడా పరబ్రహ్మ నిర్విశేషమనియే తెలుచున్నది. కాని, సర్వజ్ఞుడు (సర్వమును తెలిసినవాడు) జ్ఞానమయుడు - చిన్మయుడనిన్నీ, సత్యకాముడు, సత్యసంకల్పుడు, ఇతని శక్తి గొప్పది, అనేక విధములుగా నున్నది, అతని స్వభావసిద్ధమైన శక్తి, జ్ఞానము, బలము క్రియకలది అని శ్రుతులు చెప్పుటవలనను, “తేజస్సు, బలము, ఐశ్వర్యము, జ్ఞానము, వీర్యము, శక్తి అని షడ్విధిశ్వర్యములకు ఒకే నిధి అయినవాడు” అని చెప్పియుండుటవలనను “నీ ఆనంత గుణములలోను షడ్విధైశ్వర్య ములను ఆరు గుణములు ముఖ్యమైనవి” అనిన్నీ శ్రుతులు చెప్పుటవలన పరబ్రహ్మ సవిశేషమని తెలియుచుండుటవలన, ముందు చెప్పబడినట్లు పరబ్రహ్మ ఒక్కడే యున్నాడు - ఉన్నది ఒకటే, అదియే పరబ్రహ్మ. రెండవ వస్తువు లేదు - అని చెప్పుటకూడాపరబ్రహ్మ విశేషమనియే యర్థమగుచున్నది. అందుచేత అద్వైతము (అద్వైతమతము) - పరబ్రహ్మ ఒక్కడే, రెండవ వస్తువు లేదు అను మతము నిర్విశేషాద్వైతమని. సవిశేషాద్వైతమని రెండు విధములుగా నున్నవి. (అద్వైతము, విశిష్టాద్వైతమని రెండు విధములుగా నున్నవి. ఇదియే గొప్ప విచిత్రము)
(శ్రీమాన్ రామానుజః)
(జగత్తునకు ఉపాదానకారణమైన పరబ్రహ్మ తనకంటె వేఱు అధిష్టాత లేనందునను, విచిత్రమైన శక్తి యోగము కలవాడగుటచేతను అద్వితీయుడు అని చెప్పుటకు “సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ” అని చెప్పినందువలన బ్రహ్మ సవిశేషమే అని ప్రతిపాదించబడినది).
(“ఎవనికి భూమి శరీరమో, ఎవనికి ఆత్మ శరీరమో, ఎవనికి అవ్యక్తము (ప్రకృతి) శరీరమో, ఎవనికి అక్షరము శరీరమో” అనిన్నీ, ఇతను సమస్త భూతములకు అంతరాత్మగానున్నాడు, అపహతపాపుడు, దివ్యమైన దేవుడు, ఒకడే అయిన నారాయణుడు అని చెప్పు శ్రుతి వాక్యములు ఏ అవస్థలో నున్నవైనను చిత్ అచిత్ వస్తువులు పరమాత్మయొక్క శరీరము, పరమాత్మ తాదాత్మ్యములు అని చెప్పి కార్య వస్తువులు వాటికి కారణమైన భగవంతుడు ఒకటే అనియు, “సత్పదార్థమొక్కటే సృష్టికి ముందున్నదినిన్నీ” “ఈ కనబడు ప్రపంచమంతయు ఆత్మయే (ఆ పరమాత్మయే) అనిన్నీ,” ఇదంతయు - ఈ ప్రపంచమంతయు బ్రహ్మమ అని కూడ చెప్పుచున్నవి. చిత్ అచిద్వస్తులనియు పరమాత్మ శరీరము, అవన్నియు పరమాత్మయే అనుటవలన విరోధము కనబడును. ఆత్మయొక్క విశేషరూపమే అయిన మనుష్య శరీరమును చూచి., ఈ ఆత్మ (శరీరి) సుఖముగా నున్నాడు అనినట్లు ఆత్మయనగా శరీరము).
“యతః శ్రుతి శ్చినమాత్రమాహ అతశ్చ విశేషో మిథ్యా ఇతి సూత్రార్థమాహ”.
(“పరబ్రహ్మ చిన్మాత్రము - చైతన్యమాత్రము, చైతన్యమే కలది, ఇంకొక రీతిది కాదు” అనిన్నీ, స్వయంప్రకాశము (తనంతట తానే ప్రకాశించునది, ప్రకాశించుటకు ఇతర వస్తువు యొక్క సహాయము అవసరము లేనిదే ప్రకా శించునది) అనిన్నీ చెప్పుటవలన పరబ్రహ విశేషము కలది - సవిశేషము - అని చెప్పుట మిధ్య -).
(ప్రపంచములో నున్న వస్తువులన్నియు చెప్పి, ఒక్కొక్క దానిని ఇది కాదు (ఇది బ్రహ్మ కాదు) అని త్రోసివేసి మిగిలినది పరబ్రహ్మయని శ్రుతి చెప్పుచున్నది. స్మృతి కూడా (శ్రీమద్భగవద్గీత కూడా) పరబ్రహ్మ ఆది లేనిది (జన్మ లేనిది) సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు (ప్రపంచములోని వస్తువులన్నియు సద్వస్తువులు, అసద్వస్తువులు) అని ప్రపంచములోని వస్తువులన్నింటినీ నిషేధించి మిగిలినది పరబ్రహ్మ యని చెప్పబడినది. అందుచేత పరబ్రహ్మ సవిశేషముకాదు, నిర్విశేషమే).
(బ్రహ్మ స్వభావమే ప్రపంచము, ప్రపంచస్వభావము బ్రహ్మకాదు ఇట్లనుటచేత నామములు రూపములు తో నిండియున్న ఈ ప్రపంచమును త్రోసివేసిన బ్రహ్మతత్వము తెలియనగును. కారణవస్తువే కార్య వస్తువు యొక్క స్వరూపము. కార్య వస్తువైన కుండ నశించినను మిగిలినది దాని కారణవస్తువైన మట్టియే. ఆ ప్రకారముగానే కార్యవస్తువైన ప్రపంచము నశించినను (లయించినను) మిగిలినది ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మమే).
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా ” (రామతాపిన్యుపనిషత్)
” చిన్మయస్యే త్యాది విశేషణ విశిష్ట బ్రహ్మణః నిర్విశేషత్వ న వికల్పా సహిత్వేపి భక్త పటల స్వపదాప్త్యుపాయార్థం రూపాది విశేష కల్పనా, న స్వతః ఇత్యర్థః - “.
(చిన్మయుడు - చైతన్యమయుడు -, అద్వితీయుడు (తను కాక రెండవ వస్తువే లేనివాడు), నిష్కలుడు (శరీరము లేనివాడు, రూపము లేనివాడు)
పరబ్రహ్మ అని చెప్పుటవలన అతను నిర్విశేషుడైనప్పటికీ ఉపాసకుల నిమిత్తము - భక్తుల కొఱకు - భక్తులు తన పాదములు చేరుటకు ఉపాయము కలుగుటకు పరబ్రహ్మకు రూపము మొదలగు విశేషములు కల్పించబడినవి. అందుచేత బ్రహ్మము సాకారము - ఆకారము కలది, నిరాకారము కాదు అని చెప్పబడినది. అవయవకల్పనచే బ్రహ్మ సవిశేషమగును –
క. అగుణండగు పరమేశుడు
జగముల సృష్టింప తలచి మాయా నగుణుండగు - - -
(సవిశేష బ్రహ్మోపాసనవలన - ఆకారముతోడనున్న పరబ్రహ్మోపాసనవలన నిర్విశేష నిరాకార పరబ్రహ్మను పొందనగును) (చూడుము - ‘సగుణబ్రహ్మ’, ‘సాకారబహ్మ’).
కర్మీ కర్మజ లోక భోగ రసికస్త స్మిన్నుపాయే రతః |
అస్మాకంతు నవీన వారిద రుచిర్మండ స్మితే నాంచితో |
గోగోపీ జనవత్సలః సుఖనిధిః కృష్ణః శరణ్యో గతిః || (గీతాభావప్రకాశము - 6 - 254)
(యోగాభ్యాసము చేయు యోగి యగువాడు తాను చేయు యోగబలము చేత నీ సంసారమును వదలి ఆత్మసౌఖ్య మందుండును - కర్మయోగము నవలంభించినవాడు - కర్మలవలన కలుగు భోగముల ననుభవించువాడు - ఆ ఉపాయమందే, కర్మయోగమందే రతి కలిగి యుండును. మాకు మట్టుకు క్రొత్త మేఘము వంటి కాంతి (రంగు) గలవాడున్నూ, చిరునవ్వుగలవాడున్నూ, గీవుల యడల, గోపికలయడల వాత్సల్యము గలవాడున్నూ, సుఖమునకు నిధి యైనవాడున్నూ అయిన శ్రీకృష్ణభగవానుడే శరణు పొందతగినవాడున్నూ, పరమగతియునైన వాడున్నూ, నిర్గుణ పరబ్రహ్మోపాసన కంటె సాకారబ్రహ్మోపాసనయే నాకు ఇష్టమని సూచన - ఇది శ్రీమద్భగవద్గీతకు సంసృత శ్లోక రూపములో వ్యాఖ్యానము వ్రాసిన శ్రీసదానంద వ్యాసులవారి అభిప్రాయము)
(నిర్విశేష, నిరాకార, నిర్గుణ పరబ్రహ్మోపాసన కన్న సగుణ బ్రహ్మోపాసన సులభము. నీతి నియమములు అవసరము లనిది. ఎవడైనను, ఎట్టి సందర్భములోనైనను చేయ వచ్చును - అందుచేత సగుణ బ్రహ్మోపాసనయే మేలు –
“యేత్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే |
- - - క్లేశో అధిక తరస్తే షామ వ్యక్తా స చేతసాం |
అవక్తాహి గతిర్దుఃఖం దహవద్భిరవాప్యతే ||“, (శ్రీమద్భగవద్గీత - 12- 3,4,5)
(వ్యక్తము కానటువంటి నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మోపాసన వలన క్లేశము అధికమగును - కాయ క్లేశము ఫలించును గాని కామిత ఫలము లభించుట కష్టము అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు - సవిశేష బ్రహ్మోపాసన యనిన - “రామాన్నాస్తి జగత్రయైక సులభో” (రామును కంటె ధ్యానము చేయుటలో సులభమైన దైవము లేడు అనిన్నీ,
“రామ మూర్తి కిన్ | రెండవసాటి దైవమికలేడని - - - మత్త వేదండమునెక్కి సాటిదను” (భక్త రామదాసు - గోపన్న) అనిన్నీ,
“రామాన్నాస్తి పరం పదం : (రాముని కంటె వేఱుగా పరమపదమనునది లేదని - రాముడే పరమపదమనిన్నీ”
(శ్రీరామ కర్ణామృతం - 3 - 77)
“రఘునందన ఏవ దైవతం నో, రఘువంశోద్భవ ఏవ దైవతం నః |
భరతాగ్రజ ఏవ దైవతం నో భగవాన్ రాఘవ ఏవ దైవతం నః ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 71)
అనిన్నీ చెప్పబడినది. అద్వైత మతాచార్యులగు శ్రీమచ్ఛంకరభగవత్పాదులు “శ్రీరామకర్ణామృతం” లో సవిశేష, సాకార సగుణ బ్రహ్మ అని శ్రీరాముని స్తోత్రము చేసి నాలుగు అధ్యాయములు రచించినారు - అందులో శ్రీరామచంద్రుడు నిర్గుణ పరబ్రహ్మ, సగుణ పరబ్రహ గాను (నిర్విశేషపరబ్రహ్మగాను, సవిశేష పరబ్రహ్మగాను కూడ) నిరూపించినారు - సవిశేష బ్రహమోపాసనలో తనకు గల నమ్మకము సూచించినారు – “శివసామ్యుండగు నాది శంకరులు మున్ శ్రీరామకర్ణామృతంబవనిన్ సంస్కృతమేర్పరించె” (1-103) అని ఆ సంస్కృత గ్రంధమును తెనిగించిన చేకూరు సిద్ధ కవి పేర్కొనెను. శ్రీరాముడు మా ఇష్ట దైవము, మా యిలవేలుపు - ఎన్నియో సందర్భములలో ఎన్నియో విధముల తానున్నట్లునూ, సహకరించినట్లునూ ఆధారములు కలుగచేసి పాయని నమ్మకము కలుగచేసిన ప్రభువు). ఏ కోవెలలో ఏ దేవుని రూపము చూచినను, ఏ పఠములో అట్టి రూపమును చూచినను అవన్నియు శ్రీరామచంద్ర పరబ్రహ్మరూపములే యని - సవిశేష పరబ్రహ్మ అనియే స్పురణకు వచ్చుచుండును. శ్రీరామచంద్రుడనిగాని, శివుడనిగాని మఱియే ఇతర నామము గలవాడుగా చెప్పబడు దేవతా విగ్రహములన్నియు శ్రీ నిర్విశేష పరబ్రహ్మ యొక్క సవిశేషరూపములే - పరబ్రహ్మ యొక్క సవిశేష రూపము ధ్యానించుటకు ఉపయోగ పడుచున్నది. అందుచేత అవిధ్యేయ బ్రహ్మ అనియు, నిరాకార నిర్విశేష పరబ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ అనియు చెప్పబడినది) (తెలుసుకొనతగినది).
viśēṣamulatō nuṃḍu brahma, avayavamulatōnuṃḍu brahma; sākārabrahma; ākāramutō nuṃḍu brahma.
sa viśēṣatvaṃ vāṅmānasa gōcaratvaṃ -
(parabrahma saviśēṣamanagā kaṃṭiki, manasunaku gōcariṃcuvāḍu - ani arthamu, ākāramu kaligiyuṃḍina kaṃṭiki gōcaramagunu, ākāramu manasulō nuṃcukoni dhyāniṃcuṭaku vīlagunu).
“sarvakarmā, sarvakāmaḥ, sarva gaṃdhaḥ sarvarasaḥ” ityādinā brahmaṇaḥ saviśēṣatvaṃ śrūyatē “parabrahmaḥ” sarvakarmāḥ, sarvakāmaḥ, sarvagaṃdhaḥ, sarvarasaḥ ani śruti ceppuṭacēta brahma saviśēṣamu ani teliyucunnadi.
“sarvakāmaḥ, sarvagaṃdhaḥ, sarvarasaḥ” ityādinā brahmaṇaḥ saviśēṣatvaṃ śrūyatē. asthūlama naṇu ityādina nirviśēṣatvaṃ. tatrakiṃ ubhaya śrutyanurōdhāt ubhaya rūpaṃ brahma utaikarūpaṃ. ēkarūpamatyatrāpi saviśēṣaṃ saviśēṣaṃ nirviśēṣaṃ vēti. saṃdēhē dvirūpamati pūrvaḥ pakṣaḥ, siddhāṃtastu na tāva tparasya brahmaṇaḥ ubhaya liṃgaṃ, ubhaya rūpatvaṃ saṃbhavati. satyasya vastunō dverūpyāyōgāt nahyēkamēva vastu ēkadā tadvattada bhāva vacca dṛṣṭaṃ. ēkēna mūrchāvasthā dṛṣṭāṃtō vailakṣaṇYānnirastaḥ nāpi stānataḥ upādhitaḥ ubhaya rūpatvaṃ tātvikaṃ yuktaṃ agni saṃ yōgamātrēṇa jalasthōṣṇasya tatsvabhāhatvā dsarśanāt - ataḥ ēka rūpa mēva brahmaṇaḥ hi yasmāt sarvatra sarvēṣu vēdāṃtēṣu aśabda masparśama rūpaḥ” ityādi brahma tarēṣu saviśēṣatva nirāsēna nirviśēṣa mai nēka rūpaṃ brahmōpadiśyatē ityarthaḥ” (brahmatatvaprakāśikā - brahma sūtramulu)
sarvakāmaḥ.
(sarvakāmaḥ, sarvagaṃdhaḥ, sarvarasaḥ : (kāmamulanniyu, gaṃdhamulanniyu, rasamulanniyu atanē) anu modalagunavi śrutilō ceppabaḍi yuṃḍina dānini baṭṭi parabrahma saviśēṣamani ceppabaḍinadi. “asthūlamanaṇu” (sthūlamukānidi - peddadi kānidi cinnadikānidi) ani parabrahma guṟiṃci śrutilō ceppabaḍiyuṃḍuṭavalana parabrahma nirviśēṣamani ceppabaḍinadi. iṭlu viruddhamugā śruti ceppuṭavalana parabrahma saviśēṣamu, nirviśēṣamu kūḍānā, lēka, ā reṃḍiṃṭilō ēdō okaṭēnā okē rūpamu kalavāḍayina yaḍala saviśēṣamā ?, lēka, nirviśēṣamā? ani saṃdēhamu. pūrva pakṣamuvāru brahma saviśēṣamu, nirviśēṣamu anu reṃḍu rūpamulukaladi yani yabhiprāyapaḍucunnāru -, kāni paramātmaki reṃḍu rūpamulu kaluga nēravu ani siddhāṃtamu - parabrahma satyamu, anagā, nāśamu lēka ellakālamunaṃduṃḍunadi, ellapuḍu okē rūpamutō nuṃḍunadi. aṃducēta parabrahmaku reṃḍurūpamuluṃḍuṭa saṃbhaviṃpadu. okē vastuvu okē samayamaṃdu oka rūpamugā nuṃḍuṭa, nuṃḍakapōvuṭa saṃbhaviṃpadu - sthānamu valana, upādhivalana ayinanu reṃḍurūpamuluṃḍavu. agni nīṭitō kalisinanu dāni svabhāvamu, māralēdu. aṃducēta parabrahmaku okē rūpamu kaladu - upaṣattulanniṃṭilōnu, anni saṃdarbhamulaṃdunu “aśabda masparśa marūpamu” (nirākāramu, nirviśēṣamu ani ceppabaḍiyuṃḍuṭavalana parabrahma nirviśēṣamē).
“nanu nīdṛśaṃ nirviśēṣaṃ brahmētyata āha:- āhaśruti ścaitanya mātraṃ vilakṣaṇa rūpāṃtara rahitaṃ nirviśēṣaṃ brahma” - ” sayathā saiṃdhava ghanō anaṃtarō, (a)bāhyaḥ kṛtsnō rasa ghana ēva ēvaṃvā arē ayamātmā (a)naṃtarō (a)bāhyaḥ kṛtsnaḥ, prajñāna ghana ēvēti” ētamaktaṃ bhavati nāsyātmanō (a)otarbahirvā caitanyādanya rūpamasti, caitanya mēvatu niraṃtara masya svarūpaṃ - yathā saiṃdhava ghanasyāṃtarbahiśca lavaṇa rasa ēva niraṃtarō bhavati, na rasāṃtaraṃ. tadaivēti. (śrī śaṃkaraḥ)
(nirviśēṣa brahma anagā - eṭuvaṃṭivāḍu ? ī viṣayamai śruti iṭlu ceppucunnadi - parabrahma caitanya mātramu - itara lakṣaṇamulugāni, rūpamulu gāni lēnidi - viśēṣamulu lēnidi - avayavamulu lēnidi. uppu kaṇika lōnakāni, paina kāni iṃkēdiyu lēka aṃtā uppu rasamutō niṃḍiyuṃḍunu - aṭlē ī ātma lōpalakāni, painakāni ēmiyu lēka aṃtā prajñānamē ayinavāḍu. ī ātmaku lōpalakāni, caitanyamu (cētana śakti cicchakti) kāka itara rūpamu lēdu. ellapuḍu caitanyamē dīni rūpamu - uppu galu lōpala paina uppurasamē ellapuḍu eṭluṃḍunō, itara rasamuṃḍadō - aṭlē).
(niṣkaluḍu - (kaḷalu lēnivāḍu) - niṣkriyuḍu (kriyalu lēnivāḍu); śāṃtuḍu. niravadyuḍu, niraṃjanuḍu, nirguṇuḍu ani śrutulu ceppuṭavalana parabrahmayokka niṣkalatvamu (niravayavatvamu), niṣkriyatvamu, nirguṇamu teliyacēyucunnavi. ī prakāramu śrutulu jagattu parabrahma kaṃṭe vēṟukādani ceppuṭavalananu, parabraha nirguṇuḍu, niṣkriyuḍu ani ceppuṭavalana nirviśēṣamani pratīti kalugucunnadi. “parabrahma okkaḍē yunnāḍu - itara vastuvu lēdu” ani ceppuṭavalana parabrahmayokka ēkatvamu advitīyatvamu ceppuṭavalana kūḍā parabrahma nirviśēṣamaniyē telucunnadi. kāni, sarvajñuḍu (sarvamunu telisinavāḍu) jñānamayuḍu - cinmayuḍaninnī, satyakāmuḍu, satyasaṃkalpuḍu, itani śakti goppadi, anēka vidhamulugā nunnadi, atani svabhāvasiddhamaina śakti, jñānamu, balamu kriyakaladi ani śrutulu ceppuṭavalananu, “tējassu, balamu, aiśvaryamu, jñānamu, vīryamu, śakti ani ṣaḍvidhiśvaryamulaku okē nidhi ayinavāḍu” ani ceppiyuṃḍuṭavalananu “nī ānaṃta guṇamulalōnu ṣaḍvidhaiśvarya mulanu āru guṇamulu mukhyamainavi” aninnī śrutulu ceppuṭavalana parabrahma saviśēṣamani teliyucuṃḍuṭavalana, muṃdu ceppabaḍinaṭlu parabrahma okkaḍē yunnāḍu - unnadi okaṭē, adiyē parabrahma. reṃḍava vastuvu lēdu - ani ceppuṭakūḍāparabrahma viśēṣamaniyē yarthamagucunnadi. aṃducēta advaitamu (advaitamatamu) - parabrahma okkaḍē, reṃḍava vastuvu lēdu anu matamu nirviśēṣādvaitamani. saviśēṣādvaitamani reṃḍu vidhamulugā nunnavi. (advaitamu, viśiṣṭādvaitamani reṃḍu vidhamulugā nunnavi. idiyē goppa vicitramu)
(śrīmān rāmānujaḥ)
(jagattunaku upādānakāraṇamaina parabrahma tanakaṃṭe vēṟu adhiṣṭāta lēnaṃdunanu, vicitramaina śakti yōgamu kalavāḍaguṭacētanu advitīyuḍu ani ceppuṭaku “satyaṃ, jñānamanaṃtaṃ brahma” ani ceppinaṃduvalana brahma saviśēṣamē ani pratipādiṃcabaḍinadi).
(“evaniki bhūmi śarīramō, evaniki ātma śarīramō, evaniki avyaktamu (prakṛti) śarīramō, evaniki akṣaramu śarīramō” aninnī, itanu samasta bhūtamulaku aṃtarātmagānunnāḍu, apahatapāpuḍu, divyamaina dēvuḍu, okaḍē ayina nārāyaṇuḍu ani ceppu śruti vākyamulu ē avasthalō nunnavainanu cit acit vastuvulu paramātmayokka śarīramu, paramātma tādātmyamulu ani ceppi kārya vastuvulu vāṭiki kāraṇamaina bhagavaṃtuḍu okaṭē aniyu, “satpadārthamokkaṭē sṛṣṭiki muṃdunnadininnī” “ī kanabaḍu prapaṃcamaṃtayu ātmayē (ā paramātmayē) aninnī,” idaṃtayu - ī prapaṃcamaṃtayu brahmama ani kūḍa ceppucunnavi. cit acidvastulaniyu paramātma śarīramu, avanniyu paramātmayē anuṭavalana virōdhamu kanabaḍunu. ātmayokka viśēṣarūpamē ayina manuṣya śarīramunu cūci., ī ātma (śarīri) sukhamugā nunnāḍu aninaṭlu ātmayanagā śarīramu).
“yataḥ śruti ścinamātramāha ataśca viśēṣō mithyā iti sūtrārthamāha”.
(“parabrahma cinmātramu - caitanyamātramu, caitanyamē kaladi, iṃkoka rītidi kādu” aninnī, svayaṃprakāśamu (tanaṃtaṭa tānē prakāśiṃcunadi, prakāśiṃcuṭaku itara vastuvu yokka sahāyamu avasaramu lēnidē prakā śiṃcunadi) aninnī ceppuṭavalana parabraha viśēṣamu kaladi - saviśēṣamu - ani ceppuṭa midhya -).
(prapaṃcamulō nunna vastuvulanniyu ceppi, okkokka dānini idi kādu (idi brahma kādu) ani trōsivēsi migilinadi parabrahmayani śruti ceppucunnadi. smṛti kūḍā (śrīmadbhagavadgīta kūḍā) parabrahma ādi lēnidi (janma lēnidi) sadvastuvu kādu, asadvastuvu kādu (prapaṃcamulōni vastuvulanniyu sadvastuvulu, asadvastuvulu) ani prapaṃcamulōni vastuvulanniṃṭinī niṣēdhiṃci migilinadi parabrahma yani ceppabaḍinadi. aṃducēta parabrahma saviśēṣamukādu, nirviśēṣamē).
(brahma svabhāvamē prapaṃcamu, prapaṃcasvabhāvamu brahmakādu iṭlanuṭacēta nāmamulu rūpamulu tō niṃḍiyunna ī prapaṃcamunu trōsivēsina brahmatatvamu teliyanagunu. kāraṇavastuvē kārya vastuvu yokka svarūpamu. kārya vastuvaina kuṃḍa naśiṃcinanu migilinadi dāni kāraṇavastuvaina maṭṭiyē. ā prakāramugānē kāryavastuvaina prapaṃcamu naśiṃcinanu (layiṃcinanu) migilinadi prapaṃcamunaku kāraṇamaina parabrahmamē).
upāsakānāṃ kāryārthaṃ brahmaṇō rūpakalpanā ” (rāmatāpinyupaniṣat)
” cinmayasyē tyādi viśēṣaṇa viśiṣṭa brahmaṇaḥ nirviśēṣatva na vikalpā sahitvēpi bhakta paṭala svapadāptyupāyārthaṃ rūpādi viśēṣa kalpanā, na svataḥ ityarthaḥ - “.
(cinmayuḍu - caitanyamayuḍu -, advitīyuḍu (tanu kāka reṃḍava vastuvē lēnivāḍu), niṣkaluḍu (śarīramu lēnivāḍu, rūpamu lēnivāḍu)
parabrahma ani ceppuṭavalana atanu nirviśēṣuḍainappaṭikī upāsakula nimittamu - bhaktula koṟaku - bhaktulu tana pādamulu cēruṭaku upāyamu kaluguṭaku parabrahmaku rūpamu modalagu viśēṣamulu kalpiṃcabaḍinavi. aṃducēta brahmamu sākāramu - ākāramu kaladi, nirākāramu kādu ani ceppabaḍinadi. avayavakalpanacē brahma saviśēṣamagunu –
ka. aguṇaṃḍagu paramēśuḍu
jagamula sṛṣṭiṃpa talaci māyā naguṇuṃḍagu - - -
(saviśēṣa brahmōpāsanavalana - ākāramutōḍanunna parabrahmōpāsanavalana nirviśēṣa nirākāra parabrahmanu poṃdanagunu) (cūḍumu - ‘saguṇabrahma’, ‘sākārabahma’).
karmī karmaja lōka bhōga rasikasta sminnupāyē rataḥ |
asmākaṃtu navīna vārida rucirmaṃḍa smitē nāṃcitō |
gōgōpī janavatsalaḥ sukhanidhiḥ kṛṣṇaḥ śaraṇyō gatiḥ || (gītābhāvaprakāśamu - 6 - 254)
(yōgābhyāsamu cēyu yōgi yaguvāḍu tānu cēyu yōgabalamu cēta nī saṃsāramunu vadali ātmasaukhya maṃduṃḍunu - karmayōgamu navalaṃbhiṃcinavāḍu - karmalavalana kalugu bhōgamula nanubhaviṃcuvāḍu - ā upāyamaṃdē, karmayōgamaṃdē rati kaligi yuṃḍunu. māku maṭṭuku krotta mēghamu vaṃṭi kāṃti (raṃgu) galavāḍunnū, cirunavvugalavāḍunnū, gīvula yaḍala, gōpikalayaḍala vātsalyamu galavāḍunnū, sukhamunaku nidhi yainavāḍunnū ayina śrīkṛṣṇabhagavānuḍē śaraṇu poṃdataginavāḍunnū, paramagatiyunaina vāḍunnū, nirguṇa parabrahmōpāsana kaṃṭe sākārabrahmōpāsanayē nāku iṣṭamani sūcana - idi śrīmadbhagavadgītaku saṃsṛta ślōka rūpamulō vyākhyānamu vrāsina śrīsadānaṃda vyāsulavāri abhiprāyamu)
(nirviśēṣa, nirākāra, nirguṇa parabrahmōpāsana kanna saguṇa brahmōpāsana sulabhamu. nīti niyamamulu avasaramu lanidi. evaḍainanu, eṭṭi saṃdarbhamulōnainanu cēya vaccunu - aṃducēta saguṇa brahmōpāsanayē mēlu –
“yētvakṣaramanirdēśya mavyaktaṃ paryupāsatē |
- - - klēśō adhika tarastē ṣāma vyaktā sa cētasāṃ |
avaktāhi gatirduḥkhaṃ dahavadbhiravāpyatē ||“, (śrīmadbhagavadgīta - 12- 3,4,5)
(vyaktamu kānaṭuvaṃṭi nirākāra, nirguṇa, nirviśēṣa parabrahmōpāsana valana klēśamu adhikamagunu - kāya klēśamu phaliṃcunu gāni kāmita phalamu labhiṃcuṭa kaṣṭamu ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu - saviśēṣa brahmōpāsana yanina - “rāmānnāsti jagatrayaika sulabhō” (rāmunu kaṃṭe dhyānamu cēyuṭalō sulabhamaina daivamu lēḍu aninnī,
“rāma mūrti kin | reṃḍavasāṭi daivamikalēḍani - - - matta vēdaṃḍamunekki sāṭidanu” (bhakta rāmadāsu - gōpanna) aninnī,
“rāmānnāsti paraṃ padaṃ : (rāmuni kaṃṭe vēṟugā paramapadamanunadi lēdani - rāmuḍē paramapadamaninnī”
(śrīrāma karṇāmṛtaṃ - 3 - 77)
“raghunaṃdana ēva daivataṃ nō, raghuvaṃśōdbhava ēva daivataṃ naḥ |
bharatāgraja ēva daivataṃ nō bhagavān rāghava ēva daivataṃ naḥ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 71)
aninnī ceppabaḍinadi. advaita matācāryulagu śrīmacchaṃkarabhagavatpādulu “śrīrāmakarṇāmṛtaṃ” lō saviśēṣa, sākāra saguṇa brahma ani śrīrāmuni stōtramu cēsi nālugu adhyāyamulu raciṃcināru - aṃdulō śrīrāmacaṃdruḍu nirguṇa parabrahma, saguṇa parabraha gānu (nirviśēṣaparabrahmagānu, saviśēṣa parabrahmagānu kūḍa) nirūpiṃcināru - saviśēṣa brahamōpāsanalō tanaku gala nammakamu sūciṃcināru – “śivasāmyuṃḍagu nādi śaṃkarulu mun śrīrāmakarṇāmṛtaṃbavanin saṃskṛtamērpariṃce” (1-103) ani ā saṃskṛta graṃdhamunu tenigiṃcina cēkūru siddha kavi pērkonenu. śrīrāmuḍu mā iṣṭa daivamu, mā yilavēlupu - enniyō saṃdarbhamulalō enniyō vidhamula tānunnaṭlunū, sahakariṃcinaṭlunū ādhāramulu kalugacēsi pāyani nammakamu kalugacēsina prabhuvu). ē kōvelalō ē dēvuni rūpamu cūcinanu, ē paṭhamulō aṭṭi rūpamunu cūcinanu avanniyu śrīrāmacaṃdra parabrahmarūpamulē yani - saviśēṣa parabrahma aniyē spuraṇaku vaccucuṃḍunu. śrīrāmacaṃdruḍanigāni, śivuḍanigāni maṟiyē itara nāmamu galavāḍugā ceppabaḍu dēvatā vigrahamulanniyu śrī nirviśēṣa parabrahma yokka saviśēṣarūpamulē - parabrahma yokka saviśēṣa rūpamu dhyāniṃcuṭaku upayōga paḍucunnadi. aṃducēta avidhyēya brahma aniyu, nirākāra nirviśēṣa parabrahma jñēya brahma aniyu ceppabaḍinadi) (telusukonataginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.