ఐక్యం (ఏకకమగుట - భగవంతునితో ఏకమగుట - భగవంతునిలో కలిసి పోవుట).
యుజ్యతే ఇతి యుక్ గుణః - సమాన గుణత్వం -
(సమాన గుణము కలిగియుండుట).
- సమాన గుణత్వం, సమాన భోగత్వం, సహ భావత్వం.
(భగవంతునితో సమానగుణము కలిగియుండుట, సమాన భోగము కలిగియుండుట, తోటి భావము
కలిగియుండుట)
- సమాన దేహత్వం; క్రమేణ ముక్తిర్వా -
(భగవంతునితో సమానమైన దేహము కలిగియుండుట, లేక క్రమముక్తి).
భగవద్దివ్యమంగళ విగ్రహ సాంగత్యము -
స యుగ్మ భావం
(కలిసిపోయి యుండుట - పరబ్రహ్మలో లీనమగుట యను పదవి)
- సహ యుజ్యతే ఇతి స యుక్తః, తస్య భావం సాయుజ్యం.
(కూడియుండుట - భగవంతునితో కూడిపోయి యుండుట)
- సగుణ దేవతా రూప మహం గ్రహేణోపాసనానాం ఉపాస్య దేవతా తాదాత్మ్యం సాయుజ్యం
(సగుణ దేవతా రూపమును అహంగ్రహోపాసకులకు ఉపాసనా దేవతతో తాదాత్మ్యము పొందిట సాయుజ్యము).
- యాతు జ్ఞాన ఫలభూతా నిత్య నిరతిశయానందాభి వ్యక్తి లక్షణా సా నిర్గుణ సాయుజ్య రూపా పంచమీ ముక్తిః
-
(బ్రహ్మజ్ఞానమునకు ఫలమైనదిన్నీ, నిత్యమై నిరతిశయానందమును వ్యక్తము చేయుటయే లక్షణము గలది
నిర్గుణ బ్రహ్మతో సాయుజ్యముక్తి - ఇది అయిదవ విధమైన ముక్తి).
- “రాజ్ఞః ప్రజానాం రాజ్య ఇవ ఈశ్వర లోకే వాస మాత్రం సాలోక్య ముక్తిః. తతోపి శ్రేష్టా రాజసేవకవత్ ఈశ్వర
సమీపే వాసరూపా సామీప్య ముక్తిః. తతోప్యుత్కృష్టా రాజాను జవత్ ఈశ్వర సమాన రూప ప్రాప్తిః. తతోపి అతిశయితా
రాజ్ఞో జ్ఞేష్ట పుత్ర యువరాజవత్ ఈశ్వర సమాన సత్య సంకల్పాది ఐశ్వర్య ప్రాప్తిః సార్ష్య ముక్తిః ఇత్థం
ఉత్తరోత్తరం ఉత్కృష్టా చతుర్విధా ముక్తిః. శాస్త్రేషు కథితాః. తత్ర చతుర్థీ సార్ష్య ముక్తి శ్రేష్టా.
సార్ష్యముక్తి రేవ సాయుజ్య ముక్తిః ఇత్యుచ్యతే”. (విచారసాగరము)
(రాజు యొక్క రాజ్యమందు ప్రజలు ఉన్నట్లే ఈశ్వరుని లోకమందు నివసించుట సాలోక్యముక్తి. రాజుని
సేవకునివలె - అనగా, రాజు సమీపమందే సేవకుడుండునట్లు, ఈశ్వరుని సమీపమందుండుట సామీప్యముక్తి. ఇది
సాలోక్య ముక్తికంటె శ్రేష్టమైనది. రాజుగారి తమ్ముడువలె ఈశ్వరునితో సమానమైన రూపము కలిగియుండుట
సారూప్యముక్తి. ఇది సామీప్యముక్తి కంటె శ్రేష్టమైనది. రాజు యొక్క పెద్దకుమారుడు యువరాజు అయినవానివలె
ఈశ్వరునితో సమానమైన సత్య సంకల్పము మొదలగు ఐశ్వర్య లక్షణముల కలిగియుండుట సాష్యముక్తి.ఇది
సారూప్యముక్తి కంటె శ్రేష్టమైనది. ఈ ప్రకారంగా ఈ నాలుగు విధములైన ముక్తులలోను ఒకదానికంటె దాని తర్వాత
చెప్పబడినది శ్రేష్టము - అని శాస్త్రములో చెప్పబడినది. వాటి అన్నింటిలోను నాలుగవది అయిన సార్షీముక్తి
శ్రేష్టమైనది. సార్షీ ముక్తియే సాయుజ్యముక్తి యని చెప్పబడు చున్నది).
- “వ. - - - నిరంతర హరిధ్యాన పరుండై భూగగనానిల జల కృపీట భవ (అగ్ని) సోమ సూర్య కపోత
తలిప్స (కొండచిలువ), శలభ మధు, మక్షికా జగర ద్విరేష హరిణ పాలీన (వేయికోరల చేప) పింగళా, కురుర,
డింభక, కుమారికా శరకృత్సర్పలూతా (సాలెపురుగు) సపేశ కృత్స ముదయంబులు మొదలుగా గల వాని
గుణంబులనెఱింగి - - - మఱియు గామక్రోధ లోభమోహ మద మత్సరములను నరిషడ్వర్గంబుల జరామరణ
విరహితంబుగా - - - పవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయు”.
(శ్రీమధాంధ్రమహాభాగవతము - 11 - 97 - 99)
- “వ. నేను సర్వ వర్ణంబులకు సమంబైన పూజా ప్రకారంబెఱింగించెద - ఆచారంబునం జేసి యొకటి బాషాణ
మృణ్మయ దారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య ఇత్రపు రజత కాంచన
ప్రతిమా విశేషంబులుత్తమంబులిట్లు నా ప్రతిమా రూపంబులందు మద్భావంబుంచి కొల్చినవారికి నే
బ్రసన్నుండనగుదు - నీలోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు. కావునం బ్రతిమా విశేషంబు
లనేకంబులు గలవు. వానియందు సౌందర్య సారంబులు, మనోహరంబులు నైన రూపంబుల మనః ప్రసన్నుండనై
యేనుండుదు; గావున దుగ్ధార్ణవశాయిగా భావించి ధౌతాంబరా భరణ మూల్యాను లేపనంబులను, దివ్యాన్నపానంబులను
షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబుల బాహ్య పూజా విధానంబుల నాచరించి మనస్సంకల్పితంబులైన పదార్థంబులు
సమర్పించిన, నిత్యంబును నాభ్యంతర పూజా విధానంబులం పరితుష్టునిం జేసి
దివ్యాంబరాభరణమాల్యశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్య మంగళ విగ్రహుండుగా
దలచి ధ్యాన పరవశుండైన యతండు నాయందు గలయు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 115)
- నారాయణ చరణ కమల భక్తిపరాయణత్వంబునం జనిన వారు నిజేచ్చావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు
భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు - - -మహా వ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ
పదారోహణంబు సేయువాడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబున పృధి వ్యాత్మకత్మము నొంది, యట్టి
పృధివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజో
రూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శంబును,
గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును నతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన
అణంకారావరణంబున సంప్రాప్తుండై యందు మనోమయంబును దేవ మనంబునైన సాత్వికాహార గమనంబున
మహత్తత్త్వంబుసొచ్చి గుణత్రయంబున కయించి ప్రథానంబునొంది ప్రథానాత్మకత్వంబున దేహంబును నుపాధి
పరంపరావస్థానంబున బ్రకృతింబాసి యానందమయుండై యానందంబునంపరమాత్మ రూపంబైన వాసుదేవుని
రూపంబునందు గలియు -
“ఆ. పరమ భాగవతులు పాటించు పథమిది
యీ పథమున యోగి యేగెనేని
మగిడిరాడు వాడు మఱి సంశయము లేదు
కల్ప శతములైన గౌరవేంద్ర ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32,33)
“సీ. అంబ నారాయణుండఖిల శాస్త్రములను సమధికానుష్ఠితసదని తీర్థ
దర్శన జప తపో(అ)ధ్యయన యోగక్రియాదాన కర్మంబుల గనబడక
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి, సకల కర్మ త్యాగ సరణి నొప్పి
తలకొని యాత్మ తత్వజ్ఞానమున మంచి యుడుగక వైరాగ్యయుక్తి దనరి
తే. మహిత ఫలసంగరహిత ధర్మమున దనరు
నట్టి పురుషుండు దలపోయ నఖిల హేయ
గుణములను బాసి కల్యాణగుణ విశిష్టు
డైన హరినొందు బరమాత్మ ననఘ డగుచు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1023)
Transliteration
aikyaṃ (ēkakamaguṭa - bhagavaṃtunitō ēkamaguṭa - bhagavaṃtunilō
kalisi pōvuṭa).
yujyatē iti yuk guṇaḥ - samāna guṇatvaṃ -
(samāna guṇamu kaligiyuṃḍuṭa).
- samāna guṇatvaṃ, samāna bhōgatvaṃ, saha bhāvatvaṃ.
(bhagavaṃtunitō samānaguṇamu kaligiyuṃḍuṭa, samāna bhōgamu
kaligiyuṃḍuṭa, tōṭi bhāvamu kaligiyuṃḍuṭa)
- samāna dēhatvaṃ; kramēṇa muktirvā -
(bhagavaṃtunitō samānamaina dēhamu kaligiyuṃḍuṭa, lēka
kramamukti).
bhagavaddivyamaṃgaḷa vigraha sāṃgatyamu -
sa yugma bhāvaṃ
(kalisipōyi yuṃḍuṭa - parabrahmalō līnamaguṭa yanu padavi)
- saha yujyatē iti sa yuktaḥ, tasya bhāvaṃ sāyujyaṃ.
(kūḍiyuṃḍuṭa - bhagavaṃtunitō kūḍipōyi yuṃḍuṭa)
- saguṇa dēvatā rūpa mahaṃ grahēṇōpāsanānāṃ upāsya dēvatā tādātmyaṃ
sāyujyaṃ
(saguṇa dēvatā rūpamunu ahaṃgrahōpāsakulaku upāsanā dēvatatō
tādātmyamu poṃdiṭa sāyujyamu).
- yātu jñāna phalabhūtā nitya niratiśayānaṃdābhi vyakti lakṣaṇā sā
nirguṇa sāyujya rūpā paṃcamī muktiḥ -
(brahmajñānamunaku phalamainadinnī, nityamai niratiśayānaṃdamunu
vyaktamu cēyuṭayē lakṣaṇamu galadi nirguṇa brahmatō sāyujyamukti - idi
ayidava vidhamaina mukti).
- “rājñaḥ prajānāṃ rājya iva īśvara lōkē vāsa mātraṃ sālōkya muktiḥ.
tatōpi śrēṣṭā rājasēvakavat īśvara samīpē vāsarūpā sāmīpya muktiḥ.
tatōpyutkṛṣṭā rājānu javat īśvara samāna rūpa prāptiḥ. tatōpi atiśayitā
rājñō jñēṣṭa putra yuvarājavat īśvara samāna satya saṃkalpādi aiśvarya
prāptiḥ sārṣya muktiḥ itthaṃ uttarōttaraṃ utkṛṣṭā caturvidhā muktiḥ.
śāstrēṣu kathitāḥ. tatra caturthī sārṣya mukti śrēṣṭā. sārṣyamukti rēva
sāyujya muktiḥ ityucyatē”. (vicārasāgaramu)
(rāju yokka rājyamaṃdu prajalu unnaṭlē īśvaruni lōkamaṃdu nivasiṃcuṭa
sālōkyamukti. rājuni sēvakunivale - anagā, rāju samīpamaṃdē
sēvakuḍuṃḍunaṭlu, īśvaruni samīpamaṃduṃḍuṭa sāmīpyamukti. idi sālōkya
muktikaṃṭe śrēṣṭamainadi. rājugāri tammuḍuvale īśvarunitō samānamaina
rūpamu kaligiyuṃḍuṭa sārūpyamukti. idi sāmīpyamukti kaṃṭe śrēṣṭamainadi.
rāju yokka peddakumāruḍu yuvarāju ayinavānivale īśvarunitō samānamaina
satya saṃkalpamu modalagu aiśvarya lakṣaṇamula kaligiyuṃḍuṭa
sāṣyamukti.idi sārūpyamukti kaṃṭe śrēṣṭamainadi. ī prakāraṃgā ī nālugu
vidhamulaina muktulalōnu okadānikaṃṭe dāni tarvāta ceppabaḍinadi
śrēṣṭamu - ani śāstramulō ceppabaḍinadi. vāṭi anniṃṭilōnu nālugavadi
ayina sārṣīmukti śrēṣṭamainadi. sārṣī muktiyē sāyujyamukti yani
ceppabaḍu cunnadi).
- “va. - - - niraṃtara haridhyāna paruṃḍai bhūgaganānila jala kṛpīṭa
bhava (agni) sōma sūrya kapōta talipsa (koṃḍaciluva), śalabha madhu,
makṣikā jagara dvirēṣa hariṇa pālīna (vēyikōrala cēpa) piṃgaḷā, kurura,
ḍiṃbhaka, kumārikā śarakṛtsarpalūtā (sālepurugu) sapēśa kṛtsa
mudayaṃbulu modalugā gala vāni guṇaṃbulaneṟiṃgi - - - maṟiyu gāmakrōdha
lōbhamōha mada matsaramulanu nariṣaḍvargaṃbula jarāmaraṇa virahitaṃbugā
- - - pavitrāṃtaḥkaraṇuṃḍaina yōgi nāyaṃdu galayu”.
(śrīmadhāṃdhramahābhāgavatamu - 11 - 97 - 99)
- “va. nēnu sarva varṇaṃbulaku samaṃbaina pūjā prakāraṃbeṟiṃgiṃceda -
ācāraṃbunaṃ jēsi yokaṭi bāṣāṇa mṛṇmaya dāruvulaṃ galpiṃci, nā rūpaṃbugā
nilpikoni koṃdaṟu pūjiṃturu; kāṃsya itrapu rajata kāṃcana pratimā
viśēṣaṃbuluttamaṃbuliṭlu nā pratimā rūpaṃbulaṃdu madbhāvaṃbuṃci
kolcinavāriki nē brasannuṃḍanagudu - nīlōkaṃbuna manuṣyulaku dhyānaṃbu
niluvanēradu. kāvunaṃ bratimā viśēṣaṃbu lanēkaṃbulu galavu. vāniyaṃdu
sauṃdarya sāraṃbulu, manōharaṃbulu naina rūpaṃbula manaḥ prasannuṃḍanai
yēnuṃḍudu; gāvuna dugdhārṇavaśāyigā bhāviṃci dhautāṃbarā bharaṇa mūlyānu
lēpanaṃbulanu, divyānnapānaṃbulanu ṣōḍaśōkta prakāraṃbula
rājōpacāraṃbula bāhya pūjā vidhānaṃbula nācariṃci
manassaṃkalpitaṃbulaina padārthaṃbulu samarpiṃcina, nityaṃbunu
nābhyaṃtara pūjā vidhānaṃbulaṃ parituṣṭuniṃ jēsi
divyāṃbarābharaṇamālyaśōbhituṃḍunu, śaṃkha cakra kirīṭādyalaṃkāra
bhūṣituṃḍunu, divya maṃgaḷa vigrahuṃḍugā dalaci dhyāna paravaśuṃḍaina
yataṃḍu nāyaṃdu galayu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 115)
- nārāyaṇa caraṇa kamala bhaktiparāyaṇatvaṃbunaṃ janina vāru
nijēccāvaśaṃbuna nirargaḷagamanulai brahmāṃḍaṃbu bhēdiṃci mahōnnata
vaiṣṇavapadārūḍhulai tējarilluduru - - -mahā vyāpakaṃbagu brahmāṃḍaṃbu
bhēdiṃci vaiṣṇava padārōhaṇaṃbu sēyuvāḍu nirbhayuṃḍai mellana liṃga
dēhaṃbuna pṛdhi vyātmakatmamu noṃdi, yaṭṭi pṛdhivyātmakatvaṃbuna
ghrāṇaṃbuna gaṃdhaṃbunu jalātmakatvaṃbuna rasanēṃdriyaṃbuna rasaṃbunu,
dējō rūpakatvaṃbuna darśanaṃbuna rūpaṃbunu, samīraṇātmakatvaṃbuna
dēhaṃbuna sparśaṃbunu, gaganātmakatvaṃbuna śravaṇaṃbuna śabdaṃbunu
natikramiṃci bhūta sūkṣmēṃdriya layasthānaṃbaina aṇaṃkārāvaraṇaṃbuna
saṃprāptuṃḍai yaṃdu manōmayaṃbunu dēva manaṃbunaina sātvikāhāra
gamanaṃbuna mahattattvaṃbusocci guṇatrayaṃbuna kayiṃci prathānaṃbunoṃdi
prathānātmakatvaṃbuna dēhaṃbunu nupādhi paraṃparāvasthānaṃbuna
brakṛtiṃbāsi yānaṃdamayuṃḍai yānaṃdaṃbunaṃparamātma rūpaṃbaina
vāsudēvuni rūpaṃbunaṃdu galiyu -
“ā. parama bhāgavatulu pāṭiṃcu pathamidi
yī pathamuna yōgi yēgenēni
magiḍirāḍu vāḍu maṟi saṃśayamu lēdu
kalpa śatamulaina gauravēṃdra ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -
2 - 32,33)
“sī. aṃba nārāyaṇuṃḍakhila śāstramulanu samadhikānuṣṭhitasadani
tīrtha
darśana japa tapō(a)dhyayana yōgakriyādāna karmaṃbula ganabaḍaka
yēcina manamu bāhyēṃdriyaṃbula gelci, sakala karma tyāga saraṇi
noppi
talakoni yātma tatvajñānamuna maṃci yuḍugaka vairāgyayukti danari
tē. mahita phalasaṃgarahita dharmamuna danaru
naṭṭi puruṣuṃḍu dalapōya nakhila hēya
guṇamulanu bāsi kalyāṇaguṇa viśiṣṭu
ḍaina harinoṃdu baramātma nanagha ḍagucu “.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1023)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.