← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శింశుమారచక్రము śiṃśumāracakramu

Original — తెలుగు
  1. “క. ముని సప్తమమున కెగువం

దనరచు నామీద ద్రియుత దశ లక్షల బెం

పున శింశుమారచక్రం

బనగా నన్నిటికి నుపరియగుచుండు, నృపా.

సీ. ఆ శింశు మారాఖ్యమగు చక్రమున భగవంతుడైన ధ్రువుడింద్ర వరుణ కశ్య

ప ప్రజాపతి యమ ప్రముఖులతోగూడి బహుమానముగ విష్ణుపదము జేరి

కణక నిచ్చలు బ్రదక్షిణముగా దిరుగుచు జెలగియుడును గల్ప జీవి యగుచు

- - -.

వ. మఱియు నా ధ్రువుండు నిమిషమాత్రంబెడలేక సంచరించి జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యా క్రమణంబున బశువులకై యేర్పరచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగా కల్పింపబడి ప్రకాశించు చుండు - - -“.

(శ్రీమహాభాగవతము - 5 - 2 - 16 - 91, 92, 95)

- - - గగనంబునందు మేఘంబులున్, శ్యేనాది పక్షులును, వాయు వశంబునం కర్మసారధులై చఱించు తెఱంగున జ్యోతిర్గణంబులును ప్రకృతి పురుష యోగ గృహీతాశులై కర్మ నిమిత్తగతి గలిగి వసుంధరం బడుదురు –

“క. తలక్రిందై వట్రువయై

సలలితమగు శింశుమార చక్రమునందున్

నెలకొని పుచ్ఛాగ్రంబున

నిలిచి ధ్రువుం డుండునెపుడు, నిర్మల చరితా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 95)

Transliteration
  1. “ka. muni saptamamuna keguvaṃ

danaracu nāmīda driyuta daśa lakṣala beṃ

puna śiṃśumāracakraṃ

banagā nanniṭiki nupariyagucuṃḍu, nṛpā.

sī. ā śiṃśu mārākhyamagu cakramuna bhagavaṃtuḍaina dhruvuḍiṃdra varuṇa kaśya

pa prajāpati yama pramukhulatōgūḍi bahumānamuga viṣṇupadamu jēri

kaṇaka niccalu bradakṣiṇamugā dirugucu jelagiyuḍunu galpa jīvi yagucu

- - -.

va. maṟiyu nā dhruvuṃḍu nimiṣamātraṃbeḍalēka saṃcariṃci jyōtirgraha nakṣatraṃbulaku nīśvarunicēta dhānyā kramaṇaṃbuna baśuvulakai yērparacina mēdhistaṃbhaṃbu teṟaṃguna mēṭigā kalpiṃpabaḍi prakāśiṃcu cuṃḍu - - -“.

(śrīmahābhāgavatamu - 5 - 2 - 16 - 91, 92, 95)

- - - gaganaṃbunaṃdu mēghaṃbulun, śyēnādi pakṣulunu, vāyu vaśaṃbunaṃ karmasāradhulai caṟiṃcu teṟaṃguna jyōtirgaṇaṃbulunu prakṛti puruṣa yōga gṛhītāśulai karma nimittagati galigi vasuṃdharaṃ baḍuduru –

“ka. talakriṃdai vaṭruvayai

salalitamagu śiṃśumāra cakramunaṃdun

nelakoni pucchāgraṃbuna

nilici dhruvuṃ ḍuṃḍunepuḍu, nirmala caritā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 95)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.