(శృతి అనగ వేదము, స్మృతి అనగా ధర్మశాస్రము).
(మహర్షులు, వారి దివ్యజ్ఞానమువలనవిని సాక్షాత్కరించుకొనినది శృతి; అట్లు తెలుసుకొనిన దానిని వారు పలికినది - చెప్పినది - స్మృతి).
(మన్వాది అష్టాదశ స్మృతులు - మనువు స్మృతి మొదలగునవి).
(వివకముతో కూడిన జ్ఞానము - జ్ఞప్తికి తెచ్చుకొనుట).
(ఆత్మ తత్వము విషయముగా గలది)
(యదార్థమైన భగవత్ జ్ఞానము)
“సంస్కార మాత్ర జన్యం జ్ఞానం స్మృతిః -”. (తర్క సంగ్రహే)
(పూర్వమనుభవించిన విషయము - సంస్కారము వలన కలిగిన జ్ఞానము).
(బాహ్యేంద్రియములవలన కలిగిన సంస్కారము వలన కలుగు జ్ఞానము లక్షణముగా గలది స్మృతి).
(నిర్వర్తించవలసిన పనిని అనుసంధానము చేసుకొనుట)
(స్మృతి అనగా భావనయను సంస్కారమువలన కలుగునది - జ్ఞానము కలుగచేయు లక్షణములు కలది)
స్మృతిర్మేథా ధ్వితిః క్షమా. (శ్రీమద్భగవద్గీత - 10 - 34)
(అన్నింటినీ సమ్హరించే మృత్యువును నేనే. స్మృతి,మేథా, ధృతి, క్షమా అనునవి కూడా నేనే).
(చాలాకాలము క్రిండట అంభవించిన విషయమును పదే పదే స్మరించుకొను అద్భుత శక్తి).
(అనుభవమైన విషయముల గుఱించి ప్రమోఘము స్మృతియని చెప్పబడినది. అభ్యాస వైరాగ్యముల వలన దానిని నిరోధించ వచ్చును - అట్టి స్థితిలోనుండుటకు ప్రయత్నము చేయుట అభ్యాసము).
(శ్రుతిలోని అర్థము ఇందులో స్మరింపబడును, కనుక ఇది స్మృతి).
(శ్రుతి, స్మృతులు - ఈ రెండును భగవంతుని ఆజ్ఞలే).
వేదార్థమును జ్ఞాపకము తెచ్చుకొనుట.
ఉపనిషత్తులవలన కలిగిన నేనే బ్రహ్మను - “అహం బ్రహ్మాస్మి” అను మహావాక్యార్థమును మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొని దాని అనుభవమువలన కలిగిన జ్ఞానము - బుద్ధి విశేషము.
“వేదాంత విషయములందు శ్రుతులు ప్రథమ ప్రమాణములు -శ్రుతులు పిమ్మట మనకు ప్రమాణభూతములు స్మృతులు - శ్రుతి వలన తెలియబడినది స్మృతియందు గలిగి వెలిబుచ్చబడినవగుటచేత వాటిని స్మృతులని యందురు. శిష్టులు స్మృతుల నిర్మాణ కర్తలు - వ్యక్తి సంఘ దేశాచార విధి నిషేధాది విషయ విజ్ఞానమును తెలుపునవి స్మృతులు. వీటినే ధర్మశాస్త్రములని కూడ అందురు. మనుస్మృతి, లేక, మానవ ధర్మశాస్త్రము, యాజ్ఞవల్క్య శంఖ లిఖిత, పరాశర, అత్రి, విష్ణుహరిత, అంగీరస ఆపస్తంబ, యమ, సంవర్తి, కాత్యాయనబృహస్పతి, వ్యాస, దక్ష, గౌతమ, శాతాతప, వసిష్ట స్మృతులు పెక్కు గలవు. ఇందు మనువు మానవులకు మూల పురుషుడు, మహాశాస్త్రవేత్త. ఇందు మను, గౌతమ, బాదరాయణ, ఆపస్తంబ, వసిష్ట, విష్ణు స్మృతులనునవి ముఖ్యతమములు”).
“మానవులు ఎట్లు సంచరించవలెనో అను విషయమును తెలియచేయునవి - వర్ణాశ్ర ధర్మములు మొదలగునవి. ఈ ధర్మములను పాటించుటవలన మానవునకు చిత్తశుద్ధి కలిగి బ్రహ్మ జిజ్ఞాస కలుగ చేయునవి - విధిగా చేయవలసిన కర్మలు, నిషేధించబడిన కర్మలు ఇందు తెలుపబడినవి. మనుశ్రుతి వేదబోధనే అనుసరించి చెప్పబడినది”.
(śṛti anaga vēdamu, smṛti anagā dharmaśāsramu).
(maharṣulu, vāri divyajñānamuvalanavini sākṣātkariṃcukoninadi śṛti; aṭlu telusukonina dānini vāru palikinadi - ceppinadi - smṛti).
(manvādi aṣṭādaśa smṛtulu - manuvu smṛti modalagunavi).
(vivakamutō kūḍina jñānamu - jñaptiki teccukonuṭa).
(ātma tatvamu viṣayamugā galadi)
(yadārthamaina bhagavat jñānamu)
“saṃskāra mātra janyaṃ jñānaṃ smṛtiḥ -”. (tarka saṃgrahē)
(pūrvamanubhaviṃcina viṣayamu - saṃskāramu valana kaligina jñānamu).
(bāhyēṃdriyamulavalana kaligina saṃskāramu valana kalugu jñānamu lakṣaṇamugā galadi smṛti).
(nirvartiṃcavalasina panini anusaṃdhānamu cēsukonuṭa)
(smṛti anagā bhāvanayanu saṃskāramuvalana kalugunadi - jñānamu kalugacēyu lakṣaṇamulu kaladi)
smṛtirmēthā dhvitiḥ kṣamā. (śrīmadbhagavadgīta - 10 - 34)
(anniṃṭinī samhariṃcē mṛtyuvunu nēnē. smṛti,mēthā, dhṛti, kṣamā anunavi kūḍā nēnē).
(cālākālamu kriṃḍaṭa aṃbhaviṃcina viṣayamunu padē padē smariṃcukonu adbhuta śakti).
(anubhavamaina viṣayamula guṟiṃci pramōghamu smṛtiyani ceppabaḍinadi. abhyāsa vairāgyamula valana dānini nirōdhiṃca vaccunu - aṭṭi sthitilōnuṃḍuṭaku prayatnamu cēyuṭa abhyāsamu).
(śrutilōni arthamu iṃdulō smariṃpabaḍunu, kanuka idi smṛti).
(śruti, smṛtulu - ī reṃḍunu bhagavaṃtuni ājñalē).
vēdārthamunu jñāpakamu teccukonuṭa.
upaniṣattulavalana kaligina nēnē brahmanu - “ahaṃ brahmāsmi” anu mahāvākyārthamunu marala marala jñaptiki teccukoni dāni anubhavamuvalana kaligina jñānamu - buddhi viśēṣamu.
“vēdāṃta viṣayamulaṃdu śrutulu prathama pramāṇamulu -śrutulu pimmaṭa manaku pramāṇabhūtamulu smṛtulu - śruti valana teliyabaḍinadi smṛtiyaṃdu galigi velibuccabaḍinavaguṭacēta vāṭini smṛtulani yaṃduru. śiṣṭulu smṛtula nirmāṇa kartalu - vyakti saṃgha dēśācāra vidhi niṣēdhādi viṣaya vijñānamunu telupunavi smṛtulu. vīṭinē dharmaśāstramulani kūḍa aṃduru. manusmṛti, lēka, mānava dharmaśāstramu, yājñavalkya śaṃkha likhita, parāśara, atri, viṣṇuharita, aṃgīrasa āpastaṃba, yama, saṃvarti, kātyāyanabṛhaspati, vyāsa, dakṣa, gautama, śātātapa, vasiṣṭa smṛtulu pekku galavu. iṃdu manuvu mānavulaku mūla puruṣuḍu, mahāśāstravētta. iṃdu manu, gautama, bādarāyaṇa, āpastaṃba, vasiṣṭa, viṣṇu smṛtulanunavi mukhyatamamulu”).
“mānavulu eṭlu saṃcariṃcavalenō anu viṣayamunu teliyacēyunavi - varṇāśra dharmamulu modalagunavi. ī dharmamulanu pāṭiṃcuṭavalana mānavunaku cittaśuddhi kaligi brahma jijñāsa kaluga cēyunavi - vidhigā cēyavalasina karmalu, niṣēdhiṃcabaḍina karmalu iṃdu telupabaḍinavi. manuśruti vēdabōdhanē anusariṃci ceppabaḍinadi”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.