← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శోధనం śōdhanaṃ

Original — తెలుగు

“యథా హంసేన క్షీర నీర నివేచనం క్రియతే, యథానా దధ్నో నవనీతస్య వివేచనం క్రియతే, ఏవం చిజ్జడయోః ఉపలభ్యమాన కారణ కార్యత్వాధిష్ఠానా రోపితత్వ, దృగ్దృశ్యత్వ సాక్షి సాక్ష్యత్వాది స్వరూపస్య శాస్తానుసారి విచారణమేవ శోధినం”.

(పాలను, నీరును హంస యెట్లు విదదీయునో, పెరుగులోని వెన్నను ఎట్లు విడదీయడము వీలగుచున్నదో - ఏ జ్ఞానము కలిగియుండుటచేత ఇట్లు వీలగుచున్నదో - ఆ ప్రకారముగానే చైతన్యశక్తిని జడశక్తి అయిన ప్రకృతికి కారన కార్యత్వము - ఒకటి కారణము, రెండవది దాని కార్యము అనుట - అధిష్ఠానత్వము, ఆరోపితత్వము దృక్ దృశ్యత్వము, సాక్షి సాక్ష్యతము యొక్క స్వరూపమును - నిజస్థితిని - అనగా, యేది చైతన్యము (చిత్) ఏది జడము, ఏది కారణము, ఏది కార్యము, ఏది అధిష్ఠానము, ఏది ఆరోపితము, ఏది సాక్షి, ఏది సాక్ష్యము (సాక్షిచేత చూడబడునది) అను విషయమును శాస్త్రము ప్రకారము విచారణ చేయుటయే శోధనము).

Transliteration

“yathā haṃsēna kṣīra nīra nivēcanaṃ kriyatē, yathānā dadhnō navanītasya vivēcanaṃ kriyatē, ēvaṃ cijjaḍayōḥ upalabhyamāna kāraṇa kāryatvādhiṣṭhānā rōpitatva, dṛgdṛśyatva sākṣi sākṣyatvādi svarūpasya śāstānusāri vicāraṇamēva śōdhinaṃ”.

(pālanu, nīrunu haṃsa yeṭlu vidadīyunō, perugulōni vennanu eṭlu viḍadīyaḍamu vīlagucunnadō - ē jñānamu kaligiyuṃḍuṭacēta iṭlu vīlagucunnadō - ā prakāramugānē caitanyaśaktini jaḍaśakti ayina prakṛtiki kārana kāryatvamu - okaṭi kāraṇamu, reṃḍavadi dāni kāryamu anuṭa - adhiṣṭhānatvamu, ārōpitatvamu dṛk dṛśyatvamu, sākṣi sākṣyatamu yokka svarūpamunu - nijasthitini - anagā, yēdi caitanyamu (cit) ēdi jaḍamu, ēdi kāraṇamu, ēdi kāryamu, ēdi adhiṣṭhānamu, ēdi ārōpitamu, ēdi sākṣi, ēdi sākṣyamu (sākṣicēta cūḍabaḍunadi) anu viṣayamunu śāstramu prakāramu vicāraṇa cēyuṭayē śōdhanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.