(కవర్గు మొదలుగాగల అయిదు వర్గులు - కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు - వీటిలోని అక్షరములు -) (వ్యాకరణము)
(క కారము మొదలు మ వరకు గల అక్షరములు స్పర్శములని వ్యాకరణ సిద్ధాంతము).
(గ్రహించుటకు వీలగునవి శబ్దము మొదలగు విషయములు - శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము)
(ఇంద్రియములచేత స్పృసింపబడునవి - గ్రహింపబడునవి - శబ్దము మొదలగునవి)
(విషయములకు ఇంద్రియములకు కలుగు సంబంధము - ఇంద్రియములద్వారా బయలు వెడలు అంతఃకరణ వృత్తులు -
(విషయములతో సంబంధము కలవి - ఆయా విషయముల ఆకారము అంతఃకరణమందు పరిణమించునవి)
భోగాః (భోగములు).
“త్వగింద్రియ గ్రాహ్యోగుణ స్స్పర్శః - స త్రివిధః - శీతోష్ణా శీత భేదాత్ పృధివ్యప్తేజో వాయు వృత్తిః. తత్ర శతంజలే, ఉష్ణస్తేజసి, అనుష్ణా శీతః, పృధివీ వాయ్వోః; రూపాది చతుష్టయం పృధివ్యాం పాక జ మనిత్యంచ, అన్యత్రాపాక జం, నిత్యమనిత్యంచ - నిత్యగతం నిత్యమనిత్యగత మనిత్యం” (తర్కసంగ్రహే)
(త్వగింద్రియముచేత గ్రహించబడునది స్పర్శము - ఇది మూడు విధములు - చల్లదనము, వేడిమి, వేడిమికానిది చల్లదనముకానిది. భూమి, జలము, అగ్ని, వాయువుల వృత్తి జలములోని చల్లదనము, అగ్నిలోని వేడిమి - భూమి వాయువులలోని వేడిమికానిది, చల్లదనము కానిది, రూపము మొదలగునవి నాలుగుభూమిలో పాకజము, ఇతరములలో అపాకజము, అనిత్యము).
ఆగమాపాయినో (అ)నిత్యాస్తాం స్థితిక్ష స్వభారత |
యం హి నవ్యధ యంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖ సుఖం ధీరం సో(అ)మృతత్వాయ కల్పతే||” (శ్రీమద్భగవద్గీత - 2 - 14,15)
(అర్జునా! మాత్రలు (తన్మాత్రలు) స్పర్శలు శీతోష్ణములను సుఖ దుఃఖములను మొదలగు ద్వందములను కలుగ చేయునవి, వచ్చుచుపోవునవి, నిత్యముగా ఉండనివి. సుఖదుఃఖములను సమముగా అనుభవించు ధీరుడైన వానిని ఇవి బాధ పెట్టవు - అట్టివాడు మోక్షమును (అమృతమును - మృతిలేని స్థితిని) పొందును).
స బ్రహ్మ యోగయుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే |
యోహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే |
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 21,22)
“బాహ్యః శబ్దాదయో భోగా జడధర్మాః వివశ్వరాః |
తేష్వనాసక్త చిత్తః సన్విరక్తః శుద్ధమానసే |
శాంతి రూపం సుఖం బాహ్యభోగా కాంక్షాం విహాయ యత్ |
లభతే సత్వ వృత్యాసౌ తదనం తం మహాత్సుఖం |
యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం |
తృష్ణా క్షయ సుఖస్యైతే నార్హతః షోడశీం కలాం ||“.
(శబ్దము మొదలగు బాహ్య విషయములు - భోగములు - జడములు, నశించు స్వభావము కలవి, వాటియందు ఆసక్తి లేనివాడై, విరక్తుడై శాంతి రూపమైన అనంత సుఖమును పొందును - ఈ లోకములో కోరికలవలన కలుగు సుఖము కాని, దేవలోకములో కలుగు గొప్ప సుఖము కాని పైన చెప్పిన మహత్ శాంతిసుఖములో పదియారవవంతుకు సరికావు).
శబ్ద తన్మాత్ర లక్షణంబగు నభంబు వలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును, వాయువుచే స్పర్శగ్రాహియై త్వగింద్రియంబును బుట్టె. మృదుత్వంబును, గఠినత్వంబును, శైత్యంబును, నుష్ణత్వంబును ననునవి స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పంబడు - మఱియు వాయువునకు జాలనంబును పరస్పర విభాగకరణంబును, దన్మేళనంబును ద్రవ్య శబ్ద నేతృత్వంబును నగు. అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు, దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యంబగు నిట్లొనరించుట శబ్ద నేతృత్వంబు; సర్వేంద్రియాత్మకత్వంబు ననునది లక్షణంబులై యుండు, దైవప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును దానివలన దేజంబునుం బుట్టె. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
స్పర్శతన్మాత్రం; స్పర్శస్య గ్రాహకః; త్వగింద్రియం -
(స్పర్శతన్మాత్రము - ఇతర సూక్ష్మ భూతములలో దేనితోనైనను కలియకనుండు స్థితిలోనున్న సూక్ష్మ భూతము స్పర్శను గ్రహించు శక్తి గలది. త్వగింద్రియము - చర్మము).
(kavargu modalugāgala ayidu vargulu - kavargu, cavargu, ṭavargu, tavargu, pavargu - vīṭilōni akṣaramulu -) (vyākaraṇamu)
(ka kāramu modalu ma varaku gala akṣaramulu sparśamulani vyākaraṇa siddhāṃtamu).
(grahiṃcuṭaku vīlagunavi śabdamu modalagu viṣayamulu - śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu)
(iṃdriyamulacēta spṛsiṃpabaḍunavi - grahiṃpabaḍunavi - śabdamu modalagunavi)
(viṣayamulaku iṃdriyamulaku kalugu saṃbaṃdhamu - iṃdriyamuladvārā bayalu veḍalu aṃtaḥkaraṇa vṛttulu -
(viṣayamulatō saṃbaṃdhamu kalavi - āyā viṣayamula ākāramu aṃtaḥkaraṇamaṃdu pariṇamiṃcunavi)
bhōgāḥ (bhōgamulu).
“tvagiṃdriya grāhyōguṇa ssparśaḥ - sa trividhaḥ - śītōṣṇā śīta bhēdāt pṛdhivyaptējō vāyu vṛttiḥ. tatra śataṃjalē, uṣṇastējasi, anuṣṇā śītaḥ, pṛdhivī vāyvōḥ; rūpādi catuṣṭayaṃ pṛdhivyāṃ pāka ja manityaṃca, anyatrāpāka jaṃ, nityamanityaṃca - nityagataṃ nityamanityagata manityaṃ” (tarkasaṃgrahē)
(tvagiṃdriyamucēta grahiṃcabaḍunadi sparśamu - idi mūḍu vidhamulu - calladanamu, vēḍimi, vēḍimikānidi calladanamukānidi. bhūmi, jalamu, agni, vāyuvula vṛtti jalamulōni calladanamu, agnilōni vēḍimi - bhūmi vāyuvulalōni vēḍimikānidi, calladanamu kānidi, rūpamu modalagunavi nālugubhūmilō pākajamu, itaramulalō apākajamu, anityamu).
āgamāpāyinō (a)nityāstāṃ sthitikṣa svabhārata |
yaṃ hi navyadha yaṃtyētē puruṣaṃ puruṣarṣabha |
samaduḥkha sukhaṃ dhīraṃ sō(a)mṛtatvāya kalpatē||” (śrīmadbhagavadgīta - 2 - 14,15)
(arjunā! mātralu (tanmātralu) sparśalu śītōṣṇamulanu sukha duḥkhamulanu modalagu dvaṃdamulanu kaluga cēyunavi, vaccucupōvunavi, nityamugā uṃḍanivi. sukhaduḥkhamulanu samamugā anubhaviṃcu dhīruḍaina vānini ivi bādha peṭṭavu - aṭṭivāḍu mōkṣamunu (amṛtamunu - mṛtilēni sthitini) poṃdunu).
sa brahma yōgayuktātmā sukhamakṣaya maśnutē |
yōhi saṃsparśajā bhōgā duḥkhayōnaya ēvatē |
ādyaṃtavaṃtaḥ kauṃtēya na tēṣu ramatē budhaḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 21,22)
“bāhyaḥ śabdādayō bhōgā jaḍadharmāḥ vivaśvarāḥ |
tēṣvanāsakta cittaḥ sanviraktaḥ śuddhamānasē |
śāṃti rūpaṃ sukhaṃ bāhyabhōgā kāṃkṣāṃ vihāya yat |
labhatē satva vṛtyāsau tadanaṃ taṃ mahātsukhaṃ |
yacca kāmasukhaṃ lōkē yacca divyaṃ mahatsukhaṃ |
tṛṣṇā kṣaya sukhasyaitē nārhataḥ ṣōḍaśīṃ kalāṃ ||“.
(śabdamu modalagu bāhya viṣayamulu - bhōgamulu - jaḍamulu, naśiṃcu svabhāvamu kalavi, vāṭiyaṃdu āsakti lēnivāḍai, viraktuḍai śāṃti rūpamaina anaṃta sukhamunu poṃdunu - ī lōkamulō kōrikalavalana kalugu sukhamu kāni, dēvalōkamulō kalugu goppa sukhamu kāni paina ceppina mahat śāṃtisukhamulō padiyāravavaṃtuku sarikāvu).
śabda tanmātra lakṣaṇaṃbagu nabhaṃbu valana sparśaṃbunu, sparśaṃbuvalana vāyuvunu, vāyuvucē sparśagrāhiyai tvagiṃdriyaṃbunu buṭṭe. mṛdutvaṃbunu, gaṭhinatvaṃbunu, śaityaṃbunu, nuṣṇatvaṃbunu nanunavi sparśaṃbunaku sparśatvaṃbani ceppaṃbaḍu - maṟiyu vāyuvunaku jālanaṃbunu paraspara vibhāgakaraṇaṃbunu, danmēḷanaṃbunu dravya śabda nētṛtvaṃbunu nagu. aṃdu gaṃdhavaṃtaṃbagu dravyaṃbunu ghrāṇēṃdriyaṃbu noṃdiṃcuṭa dravyanētṛtvaṃbu, dūrasthaṃbagu śabdaṃbunu śrōtrēṃdriya grāhyaṃbagu niṭlonariṃcuṭa śabda nētṛtvaṃbu; sarvēṃdriyātmakatvaṃbu nanunadi lakṣaṇaṃbulai yuṃḍu, daivaprēritaṃbai sparśa tanmātra guṇakaṃbagu vāyuvu valana rūpaṃbunu dānivalana dējaṃbunuṃ buṭṭe. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
sparśatanmātraṃ; sparśasya grāhakaḥ; tvagiṃdriyaṃ -
(sparśatanmātramu - itara sūkṣma bhūtamulalō dēnitōnainanu kaliyakanuṃḍu sthitilōnunna sūkṣma bhūtamu sparśanu grahiṃcu śakti galadi. tvagiṃdriyamu - carmamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.