← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రద్ధవాన్ śraddhavān

Original — తెలుగు
  1. “శ్రద్ధాళుః” (శ్రీశంకరః)

(శ్రద్ధావంతుడు - శ్రద్ధ కలవాడు)

  1. ‘గురు’ వేదాంత వాక్యేషు ఇదవిత్థమేవ ఇతి ప్రమా రూపాస్తిక్య బుద్ధిః శ్రద్ధా, తద్వాన్ పురుషః (మధుసూదనీవ్యాఖ్యా)

“ఇది ఇలాంటిది - యింతే” అని ప్రమాణము ద్వారా నిర్ణయమైనదని గురువునందు, వేదాంత వాక్యములందు ఆస్తిక్యబుద్ధి (దేవుడు కలడు అను నమ్మకము) కలిగియుండుట శ్రద్ధ - అటువంటి శ్రద్ధకల పురుషుడు శ్రద్ధావంతుడు)

  1. “శాస్త్రాచార్యోపదిష్టే అర్థే అననుభూతే అపి అయమేవ ఏతత్ ఇతి విశ్వాసః శ్రద్ధా, తద్వాన్” (మధుసూధనీవ్యాఖ్య)

(శాస్త్రము, గురువు ఉప్దేశించిన అర్థము తన అనుభవములోనికి రానప్పటికీ, ‘ఇది ఇంతే - ఇదే నిజము’ అను నమ్మకము శ్రద్ధ అనిపించుకొనును. అటువంటి శ్రద్ధగలవాడు శ్రద్ధావంతుడు)

  1. “శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సం యతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేణాధి గచ్ఛతి.” (శ్రీమద్భగవద్గీత - 4 - 39)

(శ్రద్ధ గలవాడు, తత్పరుడైనవాడు, ఇంద్రియ జయము గలవాడు అచిరకాలములోనే జ్ఞానమును పొందినవాడై పరమ శాంతిని పొందును).

Transliteration
  1. “śraddhāḷuḥ” (śrīśaṃkaraḥ)

(śraddhāvaṃtuḍu - śraddha kalavāḍu)

  1. ‘guru’ vēdāṃta vākyēṣu idavitthamēva iti pramā rūpāstikya buddhiḥ śraddhā, tadvān puruṣaḥ (madhusūdanīvyākhyā)

“idi ilāṃṭidi - yiṃtē” ani pramāṇamu dvārā nirṇayamainadani guruvunaṃdu, vēdāṃta vākyamulaṃdu āstikyabuddhi (dēvuḍu kalaḍu anu nammakamu) kaligiyuṃḍuṭa śraddha - aṭuvaṃṭi śraddhakala puruṣuḍu śraddhāvaṃtuḍu)

  1. “śāstrācāryōpadiṣṭē arthē ananubhūtē api ayamēva ētat iti viśvāsaḥ śraddhā, tadvān” (madhusūdhanīvyākhya)

(śāstramu, guruvu updēśiṃcina arthamu tana anubhavamulōniki rānappaṭikī, ‘idi iṃtē - idē nijamu’ anu nammakamu śraddha anipiṃcukonunu. aṭuvaṃṭi śraddhagalavāḍu śraddhāvaṃtuḍu)

  1. “śraddhavān labhatē jñānaṃ tatparaḥ saṃ yatēṃdriyaḥ. jñānaṃ labdhvā paraṃ śāṃti macirēṇādhi gacchati.” (śrīmadbhagavadgīta - 4 - 39)

(śraddha galavāḍu, tatparuḍainavāḍu, iṃdriya jayamu galavāḍu acirakālamulōnē jñānamunu poṃdinavāḍai parama śāṃtini poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.