← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రవణాదులు śravaṇādulu

Original — తెలుగు
  1. శ్రవణ మనన నిధి ధ్యాసన సాధనాని.

(శ్రవణము, మననము, నిధి ధ్యాసము అను సాధనములు)

  1. వాక్యార్థ జ్ఞానోపయోగీని శ్రవన మనన నిధిధ్యాసనాని శ్రవణం నామ వేదాంత వాక్యాని ఆత్మైకత్వ విద్యా ప్రతిపాదకాని ఇతి తత్వ దర్శినః ఆచార్యాన్నాయ సూక్తార్థ గ్రహణం ఏవ మాచార్యోపదిష్టస్య అర్థస్య స్వాత్మన్యేవ మేవ యుక్తమితి హేతుతః ప్రతిష్ఠాపనం మననం. ఏతద్విరోధ్యనాది భేద వాసనా నిరసనాయ తస్యైవార్దస్య అనవరతభావానా నిధిధ్యాసనం. శ్రవణాదిభిర్నిరస్త సమస్త భేదవాసనస్య వాక్యార్థ జ్ఞానమ విద్యాం నివర్తయతీత్యేవం రూపస్య శ్రవణస్యా వస్యాపేక్షితమేవ పూర్వవృత్తం వక్తవ్యం తచ్చ నిత్యానిత్య వస్తు వివేకః శమదమాది సాధనసంపత్ ఇహాముత్రఫలభోగ విరాగః, ముముక్షుత్వం చేత్యే తత్సాధన చతుష్టయం అనేన వినా జిజ్ఞాసాపపత్తేః. అర్థ స్వభావాదేవ ఇదమేవ పూర్వ వృత్తమితి జ్ఞాయతే. (శ్రీమాన్ రామానుజః)

(“అహం బ్రహ్మస్మి” యను మొదలగు మహా వాక్యముల అర్థ జ్ఞానమునకు ఉపయోగించునవి శ్రవణము, మననము, నిధిధ్యాసనము అను సాధనములు. శ్రవణమనగా వేదాంత వాక్యములు ఆత్మ ఒక్కటే యను జ్ఞానమును (విషయమును) ప్రతిపాదించునవి అని తత్వజ్ఞుడు - పరబ్రహ్మ తత్వమును, ఆత్మ తత్వమును - తెలిసిన గురువు - వలన న్యాయసూక్తుల ననుసరించి గ్రహించుట - తెలుసుకొనుట. ఈ విధముగా గురూపదేశమువలన గ్రహించిన విషయమును తనలో - “ఈ విషయము ఇంతే, అరి అయినదే” అని మనస్సులో ప్రతిష్ఠాపన చేసుకొనుట మననము - ఇందుకు వ్యతిరేకమై - అనాది కాలమునుండి అంటిపెట్టుకొనియున్న వాసనలను వదలించుకొనుటకు వేదాంత వాక్యములలో బ్రహ్మగుఱించి చెప్పిన అర్థమును ఎల్లపుడు భావించుత (భావనలో నుంచుట) నిధిధ్యాసనము - ఇట్లు శ్రవణము మొదలగువాటివలన అన్ని వాసనలను వదలించుకొనినవానికి మహావాక్యముల అర్థజ్ఞానము అవిద్యను పోగొట్టును. ఇందుకు కావలసినవి నిత్యానిత్య వస్తు వివేకము - నిత్యమైనదేది నిత్యముకానిదేది అను విచక్షణ తెలుసుకొనుట - శమము, దమము మొదలగు సాధనములు. ఇహలోకము పరలోకములలో కలుగు ఫలముల అనుభవమందు అనురగము లేకుండుట. ముముక్షత్వము - మోక్షము కావలెనను కోరిక - అను నాల్గు సాధనములు. ఇవిలేక జిజ్ఞాస (పరబ్రహ్మగుఱించి తెలుసుకొనవలెనను కోరిక) జనించదు)

Transliteration
  1. śravaṇa manana nidhi dhyāsana sādhanāni.

(śravaṇamu, mananamu, nidhi dhyāsamu anu sādhanamulu)

  1. vākyārtha jñānōpayōgīni śravana manana nidhidhyāsanāni śravaṇaṃ nāma vēdāṃta vākyāni ātmaikatva vidyā pratipādakāni iti tatva darśinaḥ ācāryānnāya sūktārtha grahaṇaṃ ēva mācāryōpadiṣṭasya arthasya svātmanyēva mēva yuktamiti hētutaḥ pratiṣṭhāpanaṃ mananaṃ. ētadvirōdhyanādi bhēda vāsanā nirasanāya tasyaivārdasya anavaratabhāvānā nidhidhyāsanaṃ. śravaṇādibhirnirasta samasta bhēdavāsanasya vākyārtha jñānama vidyāṃ nivartayatītyēvaṃ rūpasya śravaṇasyā vasyāpēkṣitamēva pūrvavṛttaṃ vaktavyaṃ tacca nityānitya vastu vivēkaḥ śamadamādi sādhanasaṃpat ihāmutraphalabhōga virāgaḥ, mumukṣutvaṃ cētyē tatsādhana catuṣṭayaṃ anēna vinā jijñāsāpapattēḥ. artha svabhāvādēva idamēva pūrva vṛttamiti jñāyatē. (śrīmān rāmānujaḥ)

(“ahaṃ brahmasmi” yanu modalagu mahā vākyamula artha jñānamunaku upayōgiṃcunavi śravaṇamu, mananamu, nidhidhyāsanamu anu sādhanamulu. śravaṇamanagā vēdāṃta vākyamulu ātma okkaṭē yanu jñānamunu (viṣayamunu) pratipādiṃcunavi ani tatvajñuḍu - parabrahma tatvamunu, ātma tatvamunu - telisina guruvu - valana nyāyasūktula nanusariṃci grahiṃcuṭa - telusukonuṭa. ī vidhamugā gurūpadēśamuvalana grahiṃcina viṣayamunu tanalō - “ī viṣayamu iṃtē, ari ayinadē” ani manassulō pratiṣṭhāpana cēsukonuṭa mananamu - iṃduku vyatirēkamai - anādi kālamunuṃḍi aṃṭipeṭṭukoniyunna vāsanalanu vadaliṃcukonuṭaku vēdāṃta vākyamulalō brahmaguṟiṃci ceppina arthamunu ellapuḍu bhāviṃcuta (bhāvanalō nuṃcuṭa) nidhidhyāsanamu - iṭlu śravaṇamu modalaguvāṭivalana anni vāsanalanu vadaliṃcukoninavāniki mahāvākyamula arthajñānamu avidyanu pōgoṭṭunu. iṃduku kāvalasinavi nityānitya vastu vivēkamu - nityamainadēdi nityamukānidēdi anu vicakṣaṇa telusukonuṭa - śamamu, damamu modalagu sādhanamulu. ihalōkamu paralōkamulalō kalugu phalamula anubhavamaṃdu anuragamu lēkuṃḍuṭa. mumukṣatvamu - mōkṣamu kāvalenanu kōrika - anu nālgu sādhanamulu. ivilēka jijñāsa (parabrahmaguṟiṃci telusukonavalenanu kōrika) janiṃcadu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.