← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రవణం śravaṇaṃ

Original — తెలుగు
  1. వినుట, వినికిడి.

  2. భగవత్కథాది శ్రవణం -

  3. విష్ణోః స్వరూపగుణ విభూతి శ్రవణం.

(విష్ణువు యొక్క స్వరూపము గుఱించి, గుణముల గుఱించి (అతని అనంతరూపముల గుఱించి) వినుట).

  1. గురు పాదోపనర్పణ పూర్వకం వేదాంతానాం తాత్పర్యావ ధారణం.

(గురువు పాదములనాశ్రయించి అతని వలన ఉపనిషత్తులలోని తాత్పర్యమును అవధారణము, వినుట,)

  1. శ్రవణం నామ వేదాంతానాం బ్రహ్మణి తాత్పర్యానుకూల మానస వ్యాపారః -

(ఉపనిషత్తులు పరబ్రహ్మయందే తాత్పర్యము గలవి; పరబ్రహ్మ తత్వమునే తెలియచేయునవి అను విషయమునకు అనుకూలమైన - వాటిలో నమ్మకము ఉండునట్లు కలుగు మనోవ్యాపారము)

  1. వేదాంత వ్యాపారములు వినుట.

  2. “శ్రుతి విచారంబువలన సుతాదులందు దృఢ బుద్ధియున్నట్లు ప్రత్యగాత్మ బ్రహ్మల కైంకర్యంబును ఉపనిషద్వాక్య తాత్పర్యంబున నవధరింపుటయే శ్రవణ మనంబడు -”. (వివేకచింతామణి)

  3. “శ్రవణం నామ వేదాంత వాక్యాని ఆత్మైకత్వ విద్యా ప్రతిపాదకాని ఇతి తత్వ దర్శినః ఆచార్యాత్ న్యాయ యుక్తార్థ గ్రహణం”.

(శ్రీమాన్ రామానుజః)

(వేదాంత వాక్యములు ఆత్మ ఒక్కటే యను బ్రహ్మ విద్యను ప్రతిపాదించునవి అను విషయము తత్వజ్ఞానియగు గురువు వలన న్యాయ శాస్త్రానుగుణముగా, యుక్తి యుక్తముగా వినుట).

  1. “గురూపదేశేన ప్రపంచ మిథ్యాత్వా త్మ సత్య త్వ యోః నిర్ణయ పూర్వకం సకల వేదాంతానాం ప్రత్యగ భిన్నే బ్రహ్మణి తాత్పర్య నిర్థారణం”. (విచారసాగరం)

(గురువు చేసిన ఉపదేశముచేత, ప్రపంచము మిధ్యయని, ఆత్మ సత్యమని నిర్ణయించుచు, సకల వేదాంతముల లోను ప్రత్యగాత్మకు బ్రహ్మకు భేదము లేనట్లు వాటి తాత్పర్యమని నిర్థారణ చేసుకొనుట)

  1. “యుక్త్యా షడ్వుధ తాత్పర్య లింగైః వేదాంత వాక్యానాం అద్వితీయే ప్రత్యగభిన్న బ్రహ్మణి తాత్పర్య నిర్ణయానుకూల చేతో వృత్తి విశేషః”.

(విచారసాగరం)

(వేదాంత వాక్యం కిం అద్వితీయం బ్రహ్మ బోధయతి, ఉత యత్కించిదిర్థాంతరమితి ప్రమాణగత సందేహః శ్రవణేన నివర్త్యూతే).

(ఆరు విధములుగానున్న లింగముల ద్వారా అద్వితీయము ప్రత్యగాత్మకంటె వేఱుకాని బ్రహ్మము గుఱించి వేదాంతములు ఏమి చెప్పినవో వాటిని యుక్తి యుక్తముగా నాలోచించి నిర్ధారణ చేసుకొనుట. వేదాంతములు (ఉపనిషత్తులు) బ్రహ్మ అద్వితీయమని బోధించుచున్నవా, లేక ఇంకొక విధముగా బోధించుచున్నవా అను ప్రమాణములవలన కలిగిన సందేహము శ్రవణమువలన నివర్తించును -)

(షడ్లింగములచేత వేదాంతవాక్యములను విచారించి పరబ్రహ్మ గుఱించి చెప్పిన విషయమును నిశ్చయముగా తెలుసుకొనుట. దీనికి వేదాంత శాస్త్రాభ్యాసము సాధనము కనుక అదికూడ శ్రవణమనియే చెప్పబడినది. యుక్తితో వేదాంత వక్యముల తాత్పర్యము నిశ్చయించుకొనుట శ్రవణమను మాటకు కుఖ్యార్థము - వేదాంత శాస్త్రములను కేవలము చదువుట, లేక వినుట శ్రవణశబ్దమునకు గౌణార్థము)

  1. “తత్వమసీ, ‘అహం బ్రహ్మాస్మీ’ తి వాక్యార్థ విచారః శ్రవణం భవతి”. (పైంగళోపనిషత్)

(“ఆ పరబ్రహ్మ నీవే అయి యున్నావు”; ” నేనే ఆ పరబ్రహ్మను అయి యున్నాను” అను మహావాక్యముల అర్థమును విచారించుట శ్రవణము).

  1. “ఇత్థవాక్యైః తదర్థాను సంథానం శ్రవణం భవేత్” (ఆధ్యాత్మోపనిషత్)

(మహావాక్యముల అర్థమును అనుసంధానముచేయుట శ్రవణము)

  1. “శృణ్వతః శ్రద్ధయానిత్యం గుణతశ్చ స్వచేష్టితం |

కాలేనాతి దీర్ఘేన భగవాన్ దిశతే హృది |

ప్రవిష్టః కర్ణ రంధ్రేణస్వానాం భావ సరోరుహం |

ధునోతి శబలం కృష్ణః సలీల్స్య యథా సరత్ |

ధౌతాత్మా పురుషః కృష్ణపాదమూలం సముంచతి |

ముక్త్స్సర్వ పరిక్లేశః పాంధాః స్వసరణం యథా ||“. (శ్రీమద్భాగవతం - 2 - 8 - 4 to 6)

పైన వ్రాసిన సంస్కృత శ్లోకములకు ఆంధ్రీకరణము ఈ క్రింద విధముగా నున్నది.

వ. ఎవ్వండేని శ్రద్ధా భక్తి యుక్తుండై కృష్ణ గుణ కీర్తనంబులు వినుచుం బలుకుచుండు నట్టివాని హృదయ పద్మంబునందుగర్ణ రంధ్ర మార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి, సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించుచందంబున, అత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించు - గావున,

“మ. భరితోదగ్ర నిదాఘ తప్తుడగు నప్పాంధుండరణ్యాది సం

చరణ క్లేశ సముద్భవంబగు పిపాసం జెంది యాత్మీయ మం

దిరమున్ జేరి గతశ్రముండగుచు నెందేని జనన్ చోని భం

గి రమా ధీశు పదార విందయుగ సంఘీభూతుడై మానునే ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 8 - 218; 219)

  1. “పారోక్ష్య శబళస్సర్వజ్ఞత్వాది లక్షణో మాయోపధి సచ్చిదానందలక్షణో జగద్యోనిః ‘తత్ప’దవాచ్యో భవతి స ఏవాంతఃకరణ సం భిన్నలోధో అస్మత్ప్రత్యయాలంబనః ’త్వం’ పదవచ్యో భవతి. పరజీవోపాధి మాయా విద్యే విహాయ ‘తత్వం’ పద లక్ష్యం ప్రత్యగభిన్నం బ్రహ్మ.”తత్వమసీ” త్యహం బ్రహ్మాస్మీతి వాక్యార్థ విచార శ్రవణం భవతి“. (పైంగలోపనిషత్)

(పారోక్షము, శబలబ్రహ్మము, సర్వజ్ఞత్వము, మొదలగు లక్షణములు, మాయ ఉపాధిగాగల సచ్చిదానందములు లక్షణముగా గలిగినటువంటిన్నీ, జగత్తునకు కారనమైనటువంటిన్నీ పరబ్రహ్మ “తత్వమసి” అను మహావాక్యములోని ‘తత్’ అను పదముచే చెప్పబడుచున్నాడు - అట్టి పరమాత్మయే అంతఃకరణముచే జ్ఞానము కోలుపోయినవాడై అస్మతీ ప్రత్యయమును ఆలంబనము చేయువాడై ‘త్వం’ అను పదముచే చెప్పబడుచున్నాడు - ప్రత్యగాత్మ కంటె వేఱుగాని బ్రహ్మము ఈ ప్రకరముగ “తత్వమసి” (ఆ పరబ్రహ్మ నీవే), “అహం బ్రహ్మస్మి” (నేనే ఆ పరబ్రహ్మనైతిని) అను మహావాక్యముల విచరణే శ్రవణము).

  1. “శ్రవణం త్రివిధం ప్రోక్తం సాత్వికం రాజసం తథ |

తామసంచ మహాభాగః సుజ్ఞోక్తం నిశ్చయాన్వితం |

సాత్వికం వేద శాస్త్రాది, సాహిత్యం చైవ రాజసం |

తామసం యుద్ధవార్తాచ పరదోష ప్రకాశనం |

సాత్వికం త్రివిధం ప్రోక్తం ప్రజ్ఞావిద్ఛిశ్చ పండితైః |

ఉత్తమం మధ్యమం చైవ తధైనాధమ మిత్యుత |

ఉత్తమం ంఫ్క్షఫలదం స్వర్గదం మధ్యమంతదా |

అధమం భోగదం ప్రోక్తం నిర్ణీయ విదితం బుదైః“. (శ్రీదేవీ భాగవతము)

(శ్రవణము మూడు విధములు - సాత్విక శ్రవణము, రాజసైక శ్రవణము, తమసిక శ్రవణము. వేదము, శాస్త్రములు మొదలగునవి సాత్విక శ్రవణము - సాహిత్యము రాజస శ్రవణము, యుద్ధవార్త - శత్రువుల దోషమును సూచించునది - తామస శ్రవణము - అందులో సాత్విక శ్రవణము మూడు విధములు - ఉత్తమమని, మధ్యమమని, అధమమని మూడు విధములు - మోక్షఫలము నిచ్చునది ఉత్తమము, స్వర్గఫలము నిచ్చునది మధ్యమము, భోగముల నిచ్చునది అధమము -).

  1. “శ్రవణం సర్వ ధర్మేభ్యః పరం మన్యే తపోధనాః |

వైకుంఠస్థో యతః కృష్ణః శ్రవణార్యస్య లభ్యతే ||“. (పద్మపురాణము - 6 - 77)

(సమస్త ధర్మములకంటె శ్రవణము శ్రేష్టమైనది.)

  1. “క. విష్ణు కథారతుడగు నరు

విష్ణు కథల్ సెప్పు నరుని వినుచుండు నరున్

విష్ణుకథా సంప్రశ్నము

విష్ణు పదీ జలము భంగి విమలుల జేయున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ,భా. - 13)

  1. “చ. - - - శ్రుతి శాస్త్ర పాఠ కలితాత్మకుడైన నరుండు పద్మలో

చన చరణారవింద యుగ సంగము గల్గిన సజ్జనుండు వొం

దిన ఫలమొందు భాగవత దివ్యకధా శ్రవానురక్తిచేన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 393)

  1. “ఉ. - - - ఎప్పుడు సజ్జన్ సంఘముల్ జగ

త్పావనమైన నీ గుణ కధామృతమాత్మల గ్రోలి సర్వ తీ

ర్థావళి గ్రుంకినట్తి ఫలమందుదురంబు సమస్త వేదముల్

వావిరిబల్కు; గావునను వరలు ధన్యులు, మాన్యులుత్తముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 33 - 1035)

Transliteration
  1. vinuṭa, vinikiḍi.

  2. bhagavatkathādi śravaṇaṃ -

  3. viṣṇōḥ svarūpaguṇa vibhūti śravaṇaṃ.

(viṣṇuvu yokka svarūpamu guṟiṃci, guṇamula guṟiṃci (atani anaṃtarūpamula guṟiṃci) vinuṭa).

  1. guru pādōpanarpaṇa pūrvakaṃ vēdāṃtānāṃ tātparyāva dhāraṇaṃ.

(guruvu pādamulanāśrayiṃci atani valana upaniṣattulalōni tātparyamunu avadhāraṇamu, vinuṭa,)

  1. śravaṇaṃ nāma vēdāṃtānāṃ brahmaṇi tātparyānukūla mānasa vyāpāraḥ -

(upaniṣattulu parabrahmayaṃdē tātparyamu galavi; parabrahma tatvamunē teliyacēyunavi anu viṣayamunaku anukūlamaina - vāṭilō nammakamu uṃḍunaṭlu kalugu manōvyāpāramu)

  1. vēdāṃta vyāpāramulu vinuṭa.

  2. “śruti vicāraṃbuvalana sutādulaṃdu dṛḍha buddhiyunnaṭlu pratyagātma brahmala kaiṃkaryaṃbunu upaniṣadvākya tātparyaṃbuna navadhariṃpuṭayē śravaṇa manaṃbaḍu -”. (vivēkaciṃtāmaṇi)

  3. “śravaṇaṃ nāma vēdāṃta vākyāni ātmaikatva vidyā pratipādakāni iti tatva darśinaḥ ācāryāt nyāya yuktārtha grahaṇaṃ”.

(śrīmān rāmānujaḥ)

(vēdāṃta vākyamulu ātma okkaṭē yanu brahma vidyanu pratipādiṃcunavi anu viṣayamu tatvajñāniyagu guruvu valana nyāya śāstrānuguṇamugā, yukti yuktamugā vinuṭa).

  1. “gurūpadēśēna prapaṃca mithyātvā tma satya tva yōḥ nirṇaya pūrvakaṃ sakala vēdāṃtānāṃ pratyaga bhinnē brahmaṇi tātparya nirthāraṇaṃ”. (vicārasāgaraṃ)

(guruvu cēsina upadēśamucēta, prapaṃcamu midhyayani, ātma satyamani nirṇayiṃcucu, sakala vēdāṃtamula lōnu pratyagātmaku brahmaku bhēdamu lēnaṭlu vāṭi tātparyamani nirthāraṇa cēsukonuṭa)

  1. “yuktyā ṣaḍvudha tātparya liṃgaiḥ vēdāṃta vākyānāṃ advitīyē pratyagabhinna brahmaṇi tātparya nirṇayānukūla cētō vṛtti viśēṣaḥ”.

(vicārasāgaraṃ)

(vēdāṃta vākyaṃ kiṃ advitīyaṃ brahma bōdhayati, uta yatkiṃcidirthāṃtaramiti pramāṇagata saṃdēhaḥ śravaṇēna nivartyūtē).

(āru vidhamulugānunna liṃgamula dvārā advitīyamu pratyagātmakaṃṭe vēṟukāni brahmamu guṟiṃci vēdāṃtamulu ēmi ceppinavō vāṭini yukti yuktamugā nālōciṃci nirdhāraṇa cēsukonuṭa. vēdāṃtamulu (upaniṣattulu) brahma advitīyamani bōdhiṃcucunnavā, lēka iṃkoka vidhamugā bōdhiṃcucunnavā anu pramāṇamulavalana kaligina saṃdēhamu śravaṇamuvalana nivartiṃcunu -)

(ṣaḍliṃgamulacēta vēdāṃtavākyamulanu vicāriṃci parabrahma guṟiṃci ceppina viṣayamunu niścayamugā telusukonuṭa. dīniki vēdāṃta śāstrābhyāsamu sādhanamu kanuka adikūḍa śravaṇamaniyē ceppabaḍinadi. yuktitō vēdāṃta vakyamula tātparyamu niścayiṃcukonuṭa śravaṇamanu māṭaku kukhyārthamu - vēdāṃta śāstramulanu kēvalamu caduvuṭa, lēka vinuṭa śravaṇaśabdamunaku gauṇārthamu)

  1. “tatvamasī, ‘ahaṃ brahmāsmī’ ti vākyārtha vicāraḥ śravaṇaṃ bhavati”. (paiṃgaḷōpaniṣat)

(“ā parabrahma nīvē ayi yunnāvu”; ” nēnē ā parabrahmanu ayi yunnānu” anu mahāvākyamula arthamunu vicāriṃcuṭa śravaṇamu).

  1. “itthavākyaiḥ tadarthānu saṃthānaṃ śravaṇaṃ bhavēt” (ādhyātmōpaniṣat)

(mahāvākyamula arthamunu anusaṃdhānamucēyuṭa śravaṇamu)

  1. “śṛṇvataḥ śraddhayānityaṃ guṇataśca svacēṣṭitaṃ |

kālēnāti dīrghēna bhagavān diśatē hṛdi |

praviṣṭaḥ karṇa raṃdhrēṇasvānāṃ bhāva sarōruhaṃ |

dhunōti śabalaṃ kṛṣṇaḥ salīlsya yathā sarat |

dhautātmā puruṣaḥ kṛṣṇapādamūlaṃ samuṃcati |

muktssarva pariklēśaḥ pāṃdhāḥ svasaraṇaṃ yathā ||“. (śrīmadbhāgavataṃ - 2 - 8 - 4 to 6)

paina vrāsina saṃskṛta ślōkamulaku āṃdhrīkaraṇamu ī kriṃda vidhamugā nunnadi.

va. evvaṃḍēni śraddhā bhakti yuktuṃḍai kṛṣṇa guṇa kīrtanaṃbulu vinucuṃ balukucuṃḍu naṭṭivāni hṛdaya padmaṃbunaṃdugarṇa raṃdhra mārgaṃbulaṃ bravēśiṃci kṛṣṇuṃḍu viśramiṃci, salilagataṃbaina kaluṣaṃbunu śaratkālaṃbu nivāriṃcucaṃdaṃbuna, atmagataṃbaina mālinyaṃbu napakarṣiṃcu - gāvuna,

“ma. bharitōdagra nidāgha taptuḍagu nappāṃdhuṃḍaraṇyādi saṃ

caraṇa klēśa samudbhavaṃbagu pipāsaṃ jeṃdi yātmīya maṃ

diramun jēri gataśramuṃḍagucu neṃdēni janan cōni bhaṃ

gi ramā dhīśu padāra viṃdayuga saṃghībhūtuḍai mānunē ” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 8 - 218; 219)

  1. “pārōkṣya śabaḷassarvajñatvādi lakṣaṇō māyōpadhi saccidānaṃdalakṣaṇō jagadyōniḥ ‘tatpa’davācyō bhavati sa ēvāṃtaḥkaraṇa saṃ bhinnalōdhō asmatpratyayālaṃbanaḥ ’tvaṃ’ padavacyō bhavati. parajīvōpādhi māyā vidyē vihāya ‘tatvaṃ’ pada lakṣyaṃ pratyagabhinnaṃ brahma.”tatvamasī” tyahaṃ brahmāsmīti vākyārtha vicāra śravaṇaṃ bhavati”. (paiṃgalōpaniṣat)

(pārōkṣamu, śabalabrahmamu, sarvajñatvamu, modalagu lakṣaṇamulu, māya upādhigāgala saccidānaṃdamulu lakṣaṇamugā galiginaṭuvaṃṭinnī, jagattunaku kāranamainaṭuvaṃṭinnī parabrahma “tatvamasi” anu mahāvākyamulōni ‘tat’ anu padamucē ceppabaḍucunnāḍu - aṭṭi paramātmayē aṃtaḥkaraṇamucē jñānamu kōlupōyinavāḍai asmatī pratyayamunu ālaṃbanamu cēyuvāḍai ‘tvaṃ’ anu padamucē ceppabaḍucunnāḍu - pratyagātma kaṃṭe vēṟugāni brahmamu ī prakaramuga “tatvamasi” (ā parabrahma nīvē), “ahaṃ brahmasmi” (nēnē ā parabrahmanaitini) anu mahāvākyamula vicaraṇē śravaṇamu).

  1. “śravaṇaṃ trividhaṃ prōktaṃ sātvikaṃ rājasaṃ tatha |

tāmasaṃca mahābhāgaḥ sujñōktaṃ niścayānvitaṃ |

sātvikaṃ vēda śāstrādi, sāhityaṃ caiva rājasaṃ |

tāmasaṃ yuddhavārtāca paradōṣa prakāśanaṃ |

sātvikaṃ trividhaṃ prōktaṃ prajñāvidchiśca paṃḍitaiḥ |

uttamaṃ madhyamaṃ caiva tadhainādhama mityuta |

uttamaṃ ṃphkṣaphaladaṃ svargadaṃ madhyamaṃtadā |

adhamaṃ bhōgadaṃ prōktaṃ nirṇīya viditaṃ budaiḥ”. (śrīdēvī bhāgavatamu)

(śravaṇamu mūḍu vidhamulu - sātvika śravaṇamu, rājasaika śravaṇamu, tamasika śravaṇamu. vēdamu, śāstramulu modalagunavi sātvika śravaṇamu - sāhityamu rājasa śravaṇamu, yuddhavārta - śatruvula dōṣamunu sūciṃcunadi - tāmasa śravaṇamu - aṃdulō sātvika śravaṇamu mūḍu vidhamulu - uttamamani, madhyamamani, adhamamani mūḍu vidhamulu - mōkṣaphalamu niccunadi uttamamu, svargaphalamu niccunadi madhyamamu, bhōgamula niccunadi adhamamu -).

  1. “śravaṇaṃ sarva dharmēbhyaḥ paraṃ manyē tapōdhanāḥ |

vaikuṃṭhasthō yataḥ kṛṣṇaḥ śravaṇāryasya labhyatē ||“. (padmapurāṇamu - 6 - 77)

(samasta dharmamulakaṃṭe śravaṇamu śrēṣṭamainadi.)

  1. “ka. viṣṇu kathāratuḍagu naru

viṣṇu kathal seppu naruni vinucuṃḍu narun

viṣṇukathā saṃpraśnamu

viṣṇu padī jalamu bhaṃgi vimalula jēyun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū,bhā. - 13)

  1. “ca. - - - śruti śāstra pāṭha kalitātmakuḍaina naruṃḍu padmalō

cana caraṇāraviṃda yuga saṃgamu galgina sajjanuṃḍu voṃ

dina phalamoṃdu bhāgavata divyakadhā śravānurakticēn “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 393)

  1. “u. - - - eppuḍu sajjan saṃghamul jaga

tpāvanamaina nī guṇa kadhāmṛtamātmala grōli sarva tī

rthāvaḷi gruṃkinaṭti phalamaṃduduraṃbu samasta vēdamul

vāviribalku; gāvunanu varalu dhanyulu, mānyuluttamul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 33 - 1035)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.