← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీః śrīḥ

Original — తెలుగు
  1. శోభా; ధనాది సంపత్; ధనధాన్యాది లక్షణం -

(శోభ, ధనము మొదలగు సంపద; ధనము, ధాన్యము మొదలగు లక్షణములు గలది)

  1. రాజ్యాది భోగ్యసమృద్ధి రూపా -

(రాజ్యము మొదలగు భోగములు సమృద్ధిగా గలిగియుండుట)

  1. కాంతిః; తేజః -

(కాంతి; తేజస్సు).

  1. ఐశ్వర్యము -

  2. “శ్రీః ధర్మార్థాది సంపదా” (గీతాభావప్రకాశము - 10 - 143)

(ధర్మము, అర్థము, కామము మోక్షము అను నాలుగు విధములగు పురుషార్థములను కలిగియుండుట).

  1. “లక్ష్మీః పద్మాలయా పద్మాకమలాశ్రీ ర్ హరిప్రియా” (అమరం)

(శ్రీమహాలక్ష్మి - “లక్ష్మి, పద్మాలయ, పద్మ, కమల, శీః, హరిప్రియా” - ఇవన్నియూ శ్రీమహాలక్ష్మి పేర్లు).

  1. సర్వ వైభవ హేతుభూతా దేవీ.

(సమస్తమైన వైభవములకు, సిరిసంపదలకు కారణమైన దేవి - శ్రీమహాలక్ష్మి).

  1. శ్రీః ఇతి శ్రీసూక్తప్రకరణాత్ లభ్యతే. ఇయం అస్య జగతః ఈశానా ఈశ్వరీ, విష్ణోః పత్నీచ. విష్ణుపత్నీత్వ కృతం శ్రియః, జగదీశ్వరత్వం ఇతి భావః -

(శ్రీసూక్తములలో శ్రీః అను పదము చెప్పబడినది. శ్రీదేవి జగత్తు అంతటికీ ఈశ్వరి - జగత్తును శాసించునది. శ్రీమహావిష్ణువుయొక్క భార్య. విష్ణుపత్ని యగుటచేతనే శ్రీదేవి జగదీశ్వరి యని చెప్పబడినది).

  1. “నిత్యైవ ఏషా జనన్మాతా విష్ణోః శ్రీః అనపాయినీ” జగత్పతిః విష్ణోః అనపాయినీ ఏషా జగన్మాతృత్వేన తద్విన్నిత్యా. తస్యాశ్చ విష్ణోరివ ఆవిర్భావతిరోభావౌస్తః సర్వగతో విష్ణుః యథా యత్స్వభావ ఇయమపి తథా, తత్స్వభావా ఇతి. విష్ణోః సర్వగతత్వ సత్యజ్ఞానాది స్వరూప కల్యాణ గుణాదీనాం అతిదేశః - అధవా, అణుత్వేపి తత్ర సన్నిధానాత్ సర్వగతత్వం ఉక్తం.

జగత్తుకు తండ్రి అయిన శ్రీమహావిష్ణువు యొక్క భార్య యగుటవలన శ్రీలక్ష్మీదేవి జగత్తునకు తల్లి. విష్ణువునకు నిత్యంపాయినీ - ఎప్పుడును అతనిని వదలక యుండునది. జగన్మాత యగుటచేత లక్ష్మికూడ నిత్యా - మూడుకాలము లందుండునది. శ్రీమహావిష్ణువునకు వలె శ్రీలక్ష్మికికూడా ఆవిర్భావ తిరోభామలున్నవి - ప్రత్యక్షమగుట, అంతర్థానమగుట. అన్నింటిలోను విష్ణువుండుట అతని స్వభావమగునట్లు శ్రీమహాలక్ష్మి కూడా, అట్టి స్వభావము కలదే. విష్ణువునకు సర్వగతత్వము - అన్నింటిలోను ఉండుట - సత్యము, జ్ఞానము మొదలగు స్వరూపము, కల్యాణగుణములు కలవాడు, లేక భగవంతుడైన విష్ణువు జగత్తు అంతటికీ విభుడు - సృష్టి, స్థిథి, లయములు చేయువాడు - కనుక సర్వగతుడు, - అన్నింటిలోనుండువాడు. శ్రీలక్ష్మిదేవి కూడా అణువులోనైనను శ్రీమహావిష్ణువు యొక్క సన్నిధానమనుదుండుటచేత, అతని దగ్గరనే యుండుటచేత, అతనిని వదలక యుండుటచేత - అతని వలెనే సర్వగతురాలు (అన్నింటిలోను ప్రవేశించియుండునది).

(శ్రీమహాలక్ష్మి శ్రీమహా విష్ణువుయొక్క శక్తియే - శ్రీమహావిష్ణువునకు అతని శక్తికిని భేదములేనందున, ఈ రెండును వేరుకానందున శ్రీమహావిష్ణువు - ఎక్కడ ఉండిన శ్రీమహాకక్ష్మికూడ అక్కద ఉండును “తన వెంటన్ శిరి”. ఈ ప్రకారముగానే శివునకు కూడ శివశక్తియగు పార్వతికిని భేదము లేదు - శుఇవుడే పార్వతి, పాత్ర్వతియే శివుడు - శక్తిలేని శివుడుండడు, శివుడులేని శక్తియుండదు - అందుచేత శివిని సాంబశివుడు - అంబతో కూడియున్న శివుడు - అని చెప్పుదురు). “శ్రీకాళహస్తి పరమేశ్వర సాంబశివా మహాప్రభో”.

  1. శక్తిత్వాపాదాస్తు పత్నీత్వేన కార్యోపయుక్త విశేషణత్వా భిప్రాయః. ప్రయుజ్యతహి శాస్త్రేషు సర్వత్ర స్త్రీ పుంసాత్మ కేషు ద్వంద్వాంతరేష్వపి స్త్ర్యింశో శక్తి శబ్దః -

(శక్తిమతవాదము - భార్య యను చెప్పుట కార్యమునకు ఉపయోగించునట్లు విశేషణత్వాభిప్రాయము - అది యేలాగునంటే - శాస్త్రములలో అంతత స్త్రీపురుషులు అని ద్వంద్వభావము చెప్పినపుడెల్లను స్త్రీ అంశ శక్తి యను మాటే. విష్ణుశక్తి యగు శ్రీలక్ష్మి విష్ణుని భార్య యనియు, శివుని శక్తియగు పార్వతి శివుని భార్యయనియు ఇట్లు శాస్త్రములలో చెప్పుటవలన అభిప్రాయమేమనగా స్త్రీపురుషుల ద్వంద్వము చెప్పినపుడు దానిలోని స్త్రీ అంశయే శక్తి)

  1. “రాఘవత్వే అభవత్సీతా, రుక్మిణీ కృష్ణ జన్మని |

ఇతి విష్ణుపురాణే -”

(శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు శ్రీరామచంద్రుడయినపుడు సీతామహాదేవిగాను, శ్రీకృష్ణుడయినపుడు రుక్మిణీ దేవిగాని జన్మించెను)

  1. “యత్ర యోగేశ్వరః క్ర్ష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిర్ధృవా నీతిర్మతిర్మమ ||“. (శ్రీమద్భగవద్గీత - 1 8 - 78)

(యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనస్సును ధరించియున్న అర్జునుడు - నరనారాయణులు - ఎచ్చట నుండిన అచ్చటే శ్రీః (లక్ష్మీ దేవి), ఐశ్వర్యము, విజయము, భూతి (అభుదయము), స్థిరమైన నీతి అచ్చట నుండును అని నా అభిప్రాఊము - గజేంద్రుని రక్షించుటకు శ్రీమహావిష్ణువు ఆత్రుతతో ఒక్కడే వెళ్ళిపోవుచుండగా అతని వెంటనే శ్రీమహాలక్ష్మి పరుగెత్తినది - ఆమె వెంట దాస దాసీజనములు, వాహనము (గరుత్మంతుడు), అయుధములు మొదలగు సర్వైశ్వర్యములు వెళ్ళినవి - “తన వెంటన్ సిరి - -”.)

  1. “ఋచః సామాన్ యజూషి సాహి శ్రీరమృతాసతాం”

(సత్పురుషులకు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అమృతము వంటిది - అదియే వారి శ్రీః - ఐశ్వర్యము అని చెప్పబడినది)

Transliteration
  1. śōbhā; dhanādi saṃpat; dhanadhānyādi lakṣaṇaṃ -

(śōbha, dhanamu modalagu saṃpada; dhanamu, dhānyamu modalagu lakṣaṇamulu galadi)

  1. rājyādi bhōgyasamṛddhi rūpā -

(rājyamu modalagu bhōgamulu samṛddhigā galigiyuṃḍuṭa)

  1. kāṃtiḥ; tējaḥ -

(kāṃti; tējassu).

  1. aiśvaryamu -

  2. “śrīḥ dharmārthādi saṃpadā” (gītābhāvaprakāśamu - 10 - 143)

(dharmamu, arthamu, kāmamu mōkṣamu anu nālugu vidhamulagu puruṣārthamulanu kaligiyuṃḍuṭa).

  1. “lakṣmīḥ padmālayā padmākamalāśrī r haripriyā” (amaraṃ)

(śrīmahālakṣmi - “lakṣmi, padmālaya, padma, kamala, śīḥ, haripriyā” - ivanniyū śrīmahālakṣmi pērlu).

  1. sarva vaibhava hētubhūtā dēvī.

(samastamaina vaibhavamulaku, sirisaṃpadalaku kāraṇamaina dēvi - śrīmahālakṣmi).

  1. śrīḥ iti śrīsūktaprakaraṇāt labhyatē. iyaṃ asya jagataḥ īśānā īśvarī, viṣṇōḥ patnīca. viṣṇupatnītva kṛtaṃ śriyaḥ, jagadīśvaratvaṃ iti bhāvaḥ -

(śrīsūktamulalō śrīḥ anu padamu ceppabaḍinadi. śrīdēvi jagattu aṃtaṭikī īśvari - jagattunu śāsiṃcunadi. śrīmahāviṣṇuvuyokka bhārya. viṣṇupatni yaguṭacētanē śrīdēvi jagadīśvari yani ceppabaḍinadi).

  1. “nityaiva ēṣā jananmātā viṣṇōḥ śrīḥ anapāyinī” jagatpatiḥ viṣṇōḥ anapāyinī ēṣā jaganmātṛtvēna tadvinnityā. tasyāśca viṣṇōriva āvirbhāvatirōbhāvaustaḥ sarvagatō viṣṇuḥ yathā yatsvabhāva iyamapi tathā, tatsvabhāvā iti. viṣṇōḥ sarvagatatva satyajñānādi svarūpa kalyāṇa guṇādīnāṃ atidēśaḥ - adhavā, aṇutvēpi tatra sannidhānāt sarvagatatvaṃ uktaṃ.

jagattuku taṃḍri ayina śrīmahāviṣṇuvu yokka bhārya yaguṭavalana śrīlakṣmīdēvi jagattunaku talli. viṣṇuvunaku nityaṃpāyinī - eppuḍunu atanini vadalaka yuṃḍunadi. jaganmāta yaguṭacēta lakṣmikūḍa nityā - mūḍukālamu laṃduṃḍunadi. śrīmahāviṣṇuvunaku vale śrīlakṣmikikūḍā āvirbhāva tirōbhāmalunnavi - pratyakṣamaguṭa, aṃtarthānamaguṭa. anniṃṭilōnu viṣṇuvuṃḍuṭa atani svabhāvamagunaṭlu śrīmahālakṣmi kūḍā, aṭṭi svabhāvamu kaladē. viṣṇuvunaku sarvagatatvamu - anniṃṭilōnu uṃḍuṭa - satyamu, jñānamu modalagu svarūpamu, kalyāṇaguṇamulu kalavāḍu, lēka bhagavaṃtuḍaina viṣṇuvu jagattu aṃtaṭikī vibhuḍu - sṛṣṭi, sthithi, layamulu cēyuvāḍu - kanuka sarvagatuḍu, - anniṃṭilōnuṃḍuvāḍu. śrīlakṣmidēvi kūḍā aṇuvulōnainanu śrīmahāviṣṇuvu yokka sannidhānamanuduṃḍuṭacēta, atani daggaranē yuṃḍuṭacēta, atanini vadalaka yuṃḍuṭacēta - atani valenē sarvagaturālu (anniṃṭilōnu pravēśiṃciyuṃḍunadi).

(śrīmahālakṣmi śrīmahā viṣṇuvuyokka śaktiyē - śrīmahāviṣṇuvunaku atani śaktikini bhēdamulēnaṃduna, ī reṃḍunu vērukānaṃduna śrīmahāviṣṇuvu - ekkaḍa uṃḍina śrīmahākakṣmikūḍa akkada uṃḍunu “tana veṃṭan śiri”. ī prakāramugānē śivunaku kūḍa śivaśaktiyagu pārvatikini bhēdamu lēdu - śuivuḍē pārvati, pātrvatiyē śivuḍu - śaktilēni śivuḍuṃḍaḍu, śivuḍulēni śaktiyuṃḍadu - aṃducēta śivini sāṃbaśivuḍu - aṃbatō kūḍiyunna śivuḍu - ani ceppuduru). “śrīkāḷahasti paramēśvara sāṃbaśivā mahāprabhō”.

  1. śaktitvāpādāstu patnītvēna kāryōpayukta viśēṣaṇatvā bhiprāyaḥ. prayujyatahi śāstrēṣu sarvatra strī puṃsātma kēṣu dvaṃdvāṃtarēṣvapi stryiṃśō śakti śabdaḥ -

(śaktimatavādamu - bhārya yanu ceppuṭa kāryamunaku upayōgiṃcunaṭlu viśēṣaṇatvābhiprāyamu - adi yēlāgunaṃṭē - śāstramulalō aṃtata strīpuruṣulu ani dvaṃdvabhāvamu ceppinapuḍellanu strī aṃśa śakti yanu māṭē. viṣṇuśakti yagu śrīlakṣmi viṣṇuni bhārya yaniyu, śivuni śaktiyagu pārvati śivuni bhāryayaniyu iṭlu śāstramulalō ceppuṭavalana abhiprāyamēmanagā strīpuruṣula dvaṃdvamu ceppinapuḍu dānilōni strī aṃśayē śakti)

  1. “rāghavatvē abhavatsītā, rukmiṇī kṛṣṇa janmani |

iti viṣṇupurāṇē -”

(śrīmahālakṣmi śrīmahāviṣṇuvu śrīrāmacaṃdruḍayinapuḍu sītāmahādēvigānu, śrīkṛṣṇuḍayinapuḍu rukmiṇī dēvigāni janmiṃcenu)

  1. “yatra yōgēśvaraḥ krṣṇō, yatra pārthō dhanurdharaḥ |

tatra śrīrvijayō bhūtirdhṛvā nītirmatirmama ||“. (śrīmadbhagavadgīta - 1 8 - 78)

(yōgēśvaruḍaina śrīkṛṣṇuḍu, dhanassunu dhariṃciyunna arjunuḍu - naranārāyaṇulu - eccaṭa nuṃḍina accaṭē śrīḥ (lakṣmī dēvi), aiśvaryamu, vijayamu, bhūti (abhudayamu), sthiramaina nīti accaṭa nuṃḍunu ani nā abhiprāūmu - gajēṃdruni rakṣiṃcuṭaku śrīmahāviṣṇuvu ātrutatō okkaḍē veḷḷipōvucuṃḍagā atani veṃṭanē śrīmahālakṣmi parugettinadi - āme veṃṭa dāsa dāsījanamulu, vāhanamu (garutmaṃtuḍu), ayudhamulu modalagu sarvaiśvaryamulu veḷḷinavi - “tana veṃṭan siri - -”.)

  1. “ṛcaḥ sāmān yajūṣi sāhi śrīramṛtāsatāṃ”

(satpuruṣulaku ṛgvēdamu, sāmavēdamu, yajurvēdamu amṛtamu vaṃṭidi - adiyē vāri śrīḥ - aiśvaryamu ani ceppabaḍinadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.