← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీపాదతీర్థము śrīpādatīrthamu

Original — తెలుగు
  1. “మ. తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుడుం దన్నాభి పంకేరుహం

బు నిరీక్షించి నటించి యున్నతపదంబుం జూచి తత్పాద సే

చనముంజేసె గమండలూదకములం జల్లించి, తత్తోయముల్

వినువీధిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ము కీర్తిప్రభన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 21 - 630.)

(వామనావతారములో భగవంతుడు ఒక పాదముతో ఊర్థ్వలోకముల నాక్రమించగా స్త్యలోకములో నుండు చతుర్ముఖ బ్రహ్మ ఆ మహావిహ్ణువు పాదమును తన కమండలములో ఉదకముల తో కడిగెను - ఆ జలమే పవిత్రమైన గంగానదిగా ప్రవహించి శివుని జటాజూటములోనుండి, అక్కడనుండి భూలోకమునకు వచ్చెను - శ్రీమహావిష్ణువు యొక్క పాదము బ్రహ్మకడిగిన నీరు. కనుక పవిత్రమైనదిగా కొనియాడబడి శ్రీపాదతీర్థమని అపేరు పొందెను)

“శ్లో ||. యత్పాదాంబుజ సంభవా త్రిపథగా భాగీరధీ ముక్తిదా |

లోకానాం హత కిల్బిషా భగవతీ మందాకినీ శాంభవీ |

లోకేభాతి సరస్వతి సుత్రనదీ పుణ్యేందు కాంతి ప్రభా |

తం విష్ణుం భరితాగ్రజం రఘువరం సీతాసమేతం భజే ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 34)

  1. “మ. భవదీయోజ్వల కీర్తి దిగ్వితతులన్ భాసిల్ల యుష్మద్పదో

ద్భవ నైర్మల్య జలంబులు త్కలిక చాతాళంబునం చారు భో

గవతీ నామమునం దనర్చి, ధరణి గంగానదీరూపమై

దివి మందాకినియై జగత్రయమునం దీపించు గాదే హరీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 664)

  1. “పిబంతి యే పాద తీర్థం జిఘ్నంతి తులసీదళం |

తే యాంతి పాపనిర్ముక్త్యాః శాశ్వతం పర్మం పదం ||“. (ప్రశ్న సంహిత)

(శ్రీపాద తీర్థమును త్రాగి తులసీదళమును వాసన చూచినవారు పాపమును పోగొట్టుకొనినవారై శాశ్వతమైన పరమపదమును చేరుదురు)

  1. “భగవత్పాద తీర్థంబు నిత్యం యః పిబతే నరః |

ఆరోగ్యవాన్ సదా భూత్వా సాయుజ్యం లభతే మమ ||“.

(భగవంతుని శ్రీపాదతీర్థమును నిత్యము త్రాగు నరుడు ఎల్లపుడు ఆరోగ్యము కలవాడై నా (భగవంతుని) సాయుజ్యమును పొందును).

  1. “అకాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం |

సర్వపాప క్షయకరం విష్ణూపాదోదకం పావనం శుభం ||“.

(శ్రీమహావిష్ణువు యొక్క శుభమైన పాదోదకము అకాలమృత్యువు లేకుండ చేయును, వ్యాధులన్నింటిని నివారించును, పాపములన్నింటిని పోగుట్టును)

  1. ప్రపన్న జన పాదోదకం -

(భగవద్భక్తుల కాళ్ళు కడిగిన నీరు - భగవంతుని పాదోదకమువలె పావనము)

Transliteration
  1. “ma. tana puṭṭillide pommaṭaṃcu najuḍuṃ dannābhi paṃkēruhaṃ

bu nirīkṣiṃci naṭiṃci yunnatapadaṃbuṃ jūci tatpāda sē

canamuṃjēse gamaṃḍalūdakamulaṃ jalliṃci, tattōyamul

vinuvīdhiṃ bravahiṃce dēvanadinā viśvātmu kīrtiprabhan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 21 - 630.)

(vāmanāvatāramulō bhagavaṃtuḍu oka pādamutō ūrthvalōkamula nākramiṃcagā styalōkamulō nuṃḍu caturmukha brahma ā mahāvihṇuvu pādamunu tana kamaṃḍalamulō udakamula tō kaḍigenu - ā jalamē pavitramaina gaṃgānadigā pravahiṃci śivuni jaṭājūṭamulōnuṃḍi, akkaḍanuṃḍi bhūlōkamunaku vaccenu - śrīmahāviṣṇuvu yokka pādamu brahmakaḍigina nīru. kanuka pavitramainadigā koniyāḍabaḍi śrīpādatīrthamani apēru poṃdenu)

“ślō ||. yatpādāṃbuja saṃbhavā tripathagā bhāgīradhī muktidā |

lōkānāṃ hata kilbiṣā bhagavatī maṃdākinī śāṃbhavī |

lōkēbhāti sarasvati sutranadī puṇyēṃdu kāṃti prabhā |

taṃ viṣṇuṃ bharitāgrajaṃ raghuvaraṃ sītāsamētaṃ bhajē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 34)

  1. “ma. bhavadīyōjvala kīrti digvitatulan bhāsilla yuṣmadpadō

dbhava nairmalya jalaṃbulu tkalika cātāḷaṃbunaṃ cāru bhō

gavatī nāmamunaṃ danarci, dharaṇi gaṃgānadīrūpamai

divi maṃdākiniyai jagatrayamunaṃ dīpiṃcu gādē harī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 664)

  1. “pibaṃti yē pāda tīrthaṃ jighnaṃti tulasīdaḷaṃ |

tē yāṃti pāpanirmuktyāḥ śāśvataṃ parmaṃ padaṃ ||“. (praśna saṃhita)

(śrīpāda tīrthamunu trāgi tulasīdaḷamunu vāsana cūcinavāru pāpamunu pōgoṭṭukoninavārai śāśvatamaina paramapadamunu cēruduru)

  1. “bhagavatpāda tīrthaṃbu nityaṃ yaḥ pibatē naraḥ |

ārōgyavān sadā bhūtvā sāyujyaṃ labhatē mama ||“.

(bhagavaṃtuni śrīpādatīrthamunu nityamu trāgu naruḍu ellapuḍu ārōgyamu kalavāḍai nā (bhagavaṃtuni) sāyujyamunu poṃdunu).

  1. “akālamṛtyu haraṇaṃ sarvavyādhi nivāraṇaṃ |

sarvapāpa kṣayakaraṃ viṣṇūpādōdakaṃ pāvanaṃ śubhaṃ ||“.

(śrīmahāviṣṇuvu yokka śubhamaina pādōdakamu akālamṛtyuvu lēkuṃḍa cēyunu, vyādhulanniṃṭini nivāriṃcunu, pāpamulanniṃṭini pōguṭṭunu)

  1. prapanna jana pādōdakaṃ -

(bhagavadbhaktula kāḷḷu kaḍigina nīru - bhagavaṃtuni pādōdakamuvale pāvanamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.