← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీరామ తత్వము śrīrāma tatvamu

Original — తెలుగు
  1. “ఏతేషు చైవ సర్వేషు తత్వంచ బ్రహ్మ తారకం |

రామ ఏవపరంబ్రహ్మ రామ ఏవ పరం తపః |

రామ ఏవ పరంతత్వంశ్రీరామా బ్రహ్మతారకం ||“. (రామరహస్యోపనిషత్)

(వీటి అన్నింటిలోనుండు తత్వము తరింపచేయునట్టి బ్రహ్మ. శ్రీరాముడే పరబ్రహ్మ, శ్రీరాముడే పరమ తపస్సు, శ్రీరాముడే పరతత్వము - శ్రీరాముడే తరింపచేయు పరబ్రహ్మ)

  1. శ్రీరామరూపము నిర్గుణాత్మకమయ్యును మాయావశమున సగుణాత్మకమగుచున్నది –

“అఖండ సచ్చిచ్ఛివ రూపమద్వయం నిరంజనం నిర్మల జ్యోతి భావం |

కృతరూపమవ్యయం శ్రీరామ మాత్మానమహం భజామి ||“. (ముక్తికోపనిషత్)

(అఖందమైనదియు - ఒక్కటే అయినదియు, ఛేదింపలేనిదియు, సద్రూపము, చిద్రూపము (నిత్యమైనది, చైతన్యరూపము) అయిన శివ రూపము (మంగలకరరూపము) అయినదియు, అద్వయమైనదియు, (తనకంటె ఇతర వస్తువులు లేనిదియు), నిర్మలమైనదియు, (శుద్ధము, ఏ విధమైన దోషములు లేనిదియు) (ప్రకృతితో కలియనిదియు) అయిన జ్యోతిరూపము అయినదియు, నమరూపములు లేనిదియు, తరుగు లేనిద్యు అయినను కల్పితనామరూపములు కలదియు, ఆత్మయు అయిన శ్రీరామ రూపమును - ఈ లక్షణములుగల తత్వము తానే అయిన శ్రీరాముని భజించుచున్నాను)

  1. సాక్షాచ్ఛంకర భగవత్పాదా చార్యోపి శ్రీరామ తత్వం నామ రూపాత్మక సగుణ నిర్గుణాత్మకమితి నిర్ణీతమేవమచ్యుతాష్టకే అనుగృహీతవాన్ సగుణ నిర్గుణాత్మకమితి అపహ్నవ విధయా నిరూపితః; తదేవ వేదాంత నిర్ణయః –

“అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం |

శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే ||“.

(పైన చెప్పిన అచ్యుతాష్టకమందు శ్రీమచ్ఛంకర భగవత్పాదులు కూడ వారు వ్రాసిన అచ్యుతాష్టకములో శ్రీరామతత్వము నామ రూపములతో కూడిన సగుణ నిర్గుణాత్మకమని చెప్పియుండిరి. శ్రీరామ తత్వము సగున నిర్గుణాత్మకమని అపహ్నవ విధముచేత కూడ నిరూపించబడినది. వేదాంత నిర్ణయము,ఉపనిషత్తుల నిర్ణయము కూడ నిదియే).

  1. “జానాతి రామ, తవ తత్వగతిం హనుమాన్” (శ్రీరామకర్ణామృతం - 4 - 17)

(శ్రీ శంకర భగవత్పాదులవారు వ్రాసిన ‘శ్రీరామకర్ణామృతము’ లో అనేకచోట్ల శ్రీరాముడు పరతత్వమే యని సగుణ నిర్గుణరూపముతో వర్ణించియున్నారు) (చూడుము - ‘రాముడు’ -3; 9, 18 etc).

Transliteration
  1. “ētēṣu caiva sarvēṣu tatvaṃca brahma tārakaṃ |

rāma ēvaparaṃbrahma rāma ēva paraṃ tapaḥ |

rāma ēva paraṃtatvaṃśrīrāmā brahmatārakaṃ ||“. (rāmarahasyōpaniṣat)

(vīṭi anniṃṭilōnuṃḍu tatvamu tariṃpacēyunaṭṭi brahma. śrīrāmuḍē parabrahma, śrīrāmuḍē parama tapassu, śrīrāmuḍē paratatvamu - śrīrāmuḍē tariṃpacēyu parabrahma)

  1. śrīrāmarūpamu nirguṇātmakamayyunu māyāvaśamuna saguṇātmakamagucunnadi –

“akhaṃḍa saccicchiva rūpamadvayaṃ niraṃjanaṃ nirmala jyōti bhāvaṃ |

kṛtarūpamavyayaṃ śrīrāma mātmānamahaṃ bhajāmi ||“. (muktikōpaniṣat)

(akhaṃdamainadiyu - okkaṭē ayinadiyu, chēdiṃpalēnidiyu, sadrūpamu, cidrūpamu (nityamainadi, caitanyarūpamu) ayina śiva rūpamu (maṃgalakararūpamu) ayinadiyu, advayamainadiyu, (tanakaṃṭe itara vastuvulu lēnidiyu), nirmalamainadiyu, (śuddhamu, ē vidhamaina dōṣamulu lēnidiyu) (prakṛtitō kaliyanidiyu) ayina jyōtirūpamu ayinadiyu, namarūpamulu lēnidiyu, tarugu lēnidyu ayinanu kalpitanāmarūpamulu kaladiyu, ātmayu ayina śrīrāma rūpamunu - ī lakṣaṇamulugala tatvamu tānē ayina śrīrāmuni bhajiṃcucunnānu)

  1. sākṣācchaṃkara bhagavatpādā cāryōpi śrīrāma tatvaṃ nāma rūpātmaka saguṇa nirguṇātmakamiti nirṇītamēvamacyutāṣṭakē anugṛhītavān saguṇa nirguṇātmakamiti apahnava vidhayā nirūpitaḥ; tadēva vēdāṃta nirṇayaḥ –

“acyutaṃ kēśavaṃ rāma nārāyaṇaṃ kṛṣṇa dāmōdaraṃ vāsudēvaṃ hariṃ |

śrīdharaṃ mādhavaṃ gōpikā vallabhaṃ, jānakī nāyakaṃ rāmacaṃdraṃ bhajē ||“.

(paina ceppina acyutāṣṭakamaṃdu śrīmacchaṃkara bhagavatpādulu kūḍa vāru vrāsina acyutāṣṭakamulō śrīrāmatatvamu nāma rūpamulatō kūḍina saguṇa nirguṇātmakamani ceppiyuṃḍiri. śrīrāma tatvamu saguna nirguṇātmakamani apahnava vidhamucēta kūḍa nirūpiṃcabaḍinadi. vēdāṃta nirṇayamu,upaniṣattula nirṇayamu kūḍa nidiyē).

  1. “jānāti rāma, tava tatvagatiṃ hanumān” (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 17)

(śrī śaṃkara bhagavatpādulavāru vrāsina ‘śrīrāmakarṇāmṛtamu’ lō anēkacōṭla śrīrāmuḍu paratatvamē yani saguṇa nirguṇarūpamutō varṇiṃciyunnāru) (cūḍumu - ‘rāmuḍu’ -3; 9, 18 etc).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.