← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీరామః śrīrāmaḥ

Original — తెలుగు
  1. కైవల్య శ్రీ స్వరూపేణ సర్వత్ర రాజతే, స్వే మహిమ్ని మహీయతే ఇతి శ్రీరామః, తస్య పరమాత్మ తయా పురుషోత్తమత్వాత్ -

(తన స్వరూపమను మోక్ష సంపదతో అంటటను రాజిల్లువాడు - ప్రకాశించువాడు - తన మహిమయందు గొప్పగా నుండువాడు కనుక శ్రీరాముడని చెప్పబడుచున్నాడు. అతనే పురుషోత్తముడు, లేక ఉత్తమ పురుషుడు అగుటచేతను, తనే పరమాత్మ యగుటచేతను, శ్రీరాముడను చెప్పబడుచున్నాడు)

  1. “యం శవాస్సముపాసతే శివ ఇతి, బ్రహ్మేతి వేదాంతినః |

బౌద్ధాః బుద్ధ ఇతి ప్రమాణ పటవః, కర్తేతి నైయాయికాః |

అర్హన్నిత్యధ జైన శాసనరతాః, కర్మేతి మీమాంసకాః |

సోయం నో విద దాతువాంచితఫలం శ్రీరామ చంద్రోహరిః ||“.

(ఎవరిని శైవులు - శివమతస్థులు - శివుడని ఉపాసించుచున్నారో, బ్రహ్మయని వేదాంతులు సన్యసించుచున్నారీ, బౌద్ధులు - బౌద్ధమతస్థులు - బుద్ధుడనియు, నైయాయికులు కర్తయని చెప్పుదురో, జైనులు - జైన మతస్థులు - అర్హన్ అనియు, కర్మ యని మీమాంసకులు ఉపాసించుదురో అటి ఇవన్నియు తానే అయిన - ఒకడే అయిన, సాక్షాత్తు శ్రీమహావిష్ణుని యొక్క అవతార మూర్తియే అయిన శ్రీరామచంద్రుడు మనకు కోరిన కోరికలనిచ్చుగాక)

  1. ఆ దశరధునకు సుర ప్రార్ధితుండై పరబ్రహ్మ మయుండైన హరి నాల్గు విధంబులై శ్రీరామ, లక్ష్మణ, భరత శతృఘ్నులను నామంబుల నిజాంస సంభూతుడై జన్మించె (శ్రీమదాంధ్రంహాభాగవతము - 9 - 10 - 258). (చూడుము = ‘రాముడు’ etc.)
Transliteration
  1. kaivalya śrī svarūpēṇa sarvatra rājatē, svē mahimni mahīyatē iti śrīrāmaḥ, tasya paramātma tayā puruṣōttamatvāt -

(tana svarūpamanu mōkṣa saṃpadatō aṃṭaṭanu rājilluvāḍu - prakāśiṃcuvāḍu - tana mahimayaṃdu goppagā nuṃḍuvāḍu kanuka śrīrāmuḍani ceppabaḍucunnāḍu. atanē puruṣōttamuḍu, lēka uttama puruṣuḍu aguṭacētanu, tanē paramātma yaguṭacētanu, śrīrāmuḍanu ceppabaḍucunnāḍu)

  1. “yaṃ śavāssamupāsatē śiva iti, brahmēti vēdāṃtinaḥ |

bauddhāḥ buddha iti pramāṇa paṭavaḥ, kartēti naiyāyikāḥ |

arhannityadha jaina śāsanaratāḥ, karmēti mīmāṃsakāḥ |

sōyaṃ nō vida dātuvāṃcitaphalaṃ śrīrāma caṃdrōhariḥ ||“.

(evarini śaivulu - śivamatasthulu - śivuḍani upāsiṃcucunnārō, brahmayani vēdāṃtulu sanyasiṃcucunnārī, bauddhulu - bauddhamatasthulu - buddhuḍaniyu, naiyāyikulu kartayani ceppudurō, jainulu - jaina matasthulu - arhan aniyu, karma yani mīmāṃsakulu upāsiṃcudurō aṭi ivanniyu tānē ayina - okaḍē ayina, sākṣāttu śrīmahāviṣṇuni yokka avatāra mūrtiyē ayina śrīrāmacaṃdruḍu manaku kōrina kōrikalaniccugāka)

  1. ā daśaradhunaku sura prārdhituṃḍai parabrahma mayuṃḍaina hari nālgu vidhaṃbulai śrīrāma, lakṣmaṇa, bharata śatṛghnulanu nāmaṃbula nijāṃsa saṃbhūtuḍai janmiṃce (śrīmadāṃdhraṃhābhāgavatamu - 9 - 10 - 258). (cūḍumu = ‘rāmuḍu’ etc.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.