శ్రీ బీజప్రధానమైన విద్యకనుక శ్రీవిద్యయని పేరు కలిగినది - శ్రీవుద్యా, లలితా, పంచదశీ షోడశాక్షరీ - ఇవి శ్రీవిద్యా రూపములు -
శ్రీవిద్య యనగా పార్వతీ పరమేశ్వరోభయ స్వరూప ప్రతిపాదకమైన పరావిద్య.
సమయాచారము, దక్షిణాచారము, కౌళాచారము, కాళాచారము, వామాచారము అని శ్రీవిద్యోపాసన నాలుగు విధములు - సమయాచారము. దక్షిణాచారము ను రెండును వేద సమ్మతములు, బ్రాహ్మణార్హములు - తక్కిన రెండును ఇతరులకు - వేదబ్రాహ్మములు
“దశప్రణవాంతర్గత ‘శ్రీం’ ఇత్యుక్త బీజ ప్రధానాత్మకం బ్రహ్మవిద్యా ఇత్యర్థః - కుతః ఇతి చేత్ - తదంతస్థ ‘శ’ వర్ణస్య బ్రహ్మజ్ఞానమితి, ‘ఇ’ వర్ణస్య బ్రహ్మశక్తిరితి, రేఫోనామ తత్కేవల ప్రకాసః ఇత్యేవార్థత్వాత్ - కింతు తత్ప్రకాశస్తు న స్త్రీ, పుం, నపుంసక నామ రూప మిత్యేవ. అంతతః తదుపాసనేన చిందోః కేవల మోక్ష ఇంత్యేవార్థః. తథాచ శ్రీవిద్యా ఇతి తన్నామ తస్మాత్ మాయాకల్పిత నామ రూపాత్మకం సర్వమపి మాయా శబళిత పరమాత్మ స్వరూప ఏవ -”
(యధార్థముగా శ్రీవిద్య యనగా దశ ప్రణవములందొకటి యగు ‘శ్రీం’ ప్రధానమగు బ్రహ్మ విద్య యని యర్థము. దానికి కారణమేమనగా - ‘శ్రీం’ అను బీజమందుగల ‘శ’ వర్ణమునకు బ్రహ్మజ్ఞానమనియు, ‘ఇ’ అను వర్ణమునకు పరబ్రహ్మశక్తియనియు, ‘ర’ వర్ణమునకు ప్రకాశమనియు బిందువునకు కేవలమోక్షమనియే యర్థము - కావున నట్టిది కేవల ప్రకాసాత్మకమైన పరబ్రహ్మమని తాత్పర్యము - అట్టి ప్రకాశమునకు స్త్రీ పుం, నపుంసకాది నామరూపములు లేవు. కావుననే శ్రీవిద్యయని దానికి పేరు - దీనిచే మాయాకల్పిత నామ రూపాత్మక ప్రపంచమంతయును మాయా శబళిత పరబ్రహ్మ స్వరూపమే యగును - కావున మాయ వలన నావిధమున నానాగా (అనేకముగా) కనపడుచున్నది.)
(శ్రీవిద్య యనినంతమాత్రమున అది శాక్తేయమని స్త్రీ విద్య కాజాలదు. కేవల పరమాత్మ తేజోరూప విజ్ఞానమునకే శ్రీవిద్య యని పేరు.)
(శక్తి యంగా కేవల పరబ్రహ్మయొక్క సామర్థ్యమే. ఆ పరమాత్మ శక్తిని స్త్రీరూపముగను, పురుషరూపముగను ధ్యానింపవచ్చును)
śrī bījapradhānamaina vidyakanuka śrīvidyayani pēru kaliginadi - śrīvudyā, lalitā, paṃcadaśī ṣōḍaśākṣarī - ivi śrīvidyā rūpamulu -
śrīvidya yanagā pārvatī paramēśvarōbhaya svarūpa pratipādakamaina parāvidya.
samayācāramu, dakṣiṇācāramu, kauḷācāramu, kāḷācāramu, vāmācāramu ani śrīvidyōpāsana nālugu vidhamulu - samayācāramu. dakṣiṇācāramu nu reṃḍunu vēda sammatamulu, brāhmaṇārhamulu - takkina reṃḍunu itarulaku - vēdabrāhmamulu
“daśapraṇavāṃtargata ‘śrīṃ’ ityukta bīja pradhānātmakaṃ brahmavidyā ityarthaḥ - kutaḥ iti cēt - tadaṃtastha ‘śa’ varṇasya brahmajñānamiti, ‘i’ varṇasya brahmaśaktiriti, rēphōnāma tatkēvala prakāsaḥ ityēvārthatvāt - kiṃtu tatprakāśastu na strī, puṃ, napuṃsaka nāma rūpa mityēva. aṃtataḥ tadupāsanēna ciṃdōḥ kēvala mōkṣa iṃtyēvārthaḥ. tathāca śrīvidyā iti tannāma tasmāt māyākalpita nāma rūpātmakaṃ sarvamapi māyā śabaḷita paramātma svarūpa ēva -”
(yadhārthamugā śrīvidya yanagā daśa praṇavamulaṃdokaṭi yagu ‘śrīṃ’ pradhānamagu brahma vidya yani yarthamu. dāniki kāraṇamēmanagā - ‘śrīṃ’ anu bījamaṃdugala ‘śa’ varṇamunaku brahmajñānamaniyu, ‘i’ anu varṇamunaku parabrahmaśaktiyaniyu, ‘ra’ varṇamunaku prakāśamaniyu biṃduvunaku kēvalamōkṣamaniyē yarthamu - kāvuna naṭṭidi kēvala prakāsātmakamaina parabrahmamani tātparyamu - aṭṭi prakāśamunaku strī puṃ, napuṃsakādi nāmarūpamulu lēvu. kāvunanē śrīvidyayani dāniki pēru - dīnicē māyākalpita nāma rūpātmaka prapaṃcamaṃtayunu māyā śabaḷita parabrahma svarūpamē yagunu - kāvuna māya valana nāvidhamuna nānāgā (anēkamugā) kanapaḍucunnadi.)
(śrīvidya yaninaṃtamātramuna adi śāktēyamani strī vidya kājāladu. kēvala paramātma tējōrūpa vijñānamunakē śrīvidya yani pēru.)
(śakti yaṃgā kēvala parabrahmayokka sāmarthyamē. ā paramātma śaktini strīrūpamuganu, puruṣarūpamuganu dhyāniṃpavaccunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.