← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రోతవ్యాదులు śrōtavyādulu

Original — తెలుగు

శ్రోతవ్య కీర్తనీయ స్మరణీ యాదిషు, సాస్త్రముఖా ద్వా, ఆచార్యముఖాద్వా శ్రోతవ్యః; తత్కల్యాణగుణ గన ప్రకాసక నామోచ్చారణాదినా కీర్తితవ్యః; స్వస్య దేహ ప్రథాన ప్రభృతి సర్వ విధ ఉపకార కర్తృతయా చ స్మర్తవ్యః -.

(భగవంతుడు శ్రోతవ్యుడు, కీర్తనీయుడు, స్మరణీయుడు. అది ఎట్లనగా - శాస్త్రముద్వారా కాని, గురువుద్వారాకాని భగవంతుడు వినతగినవాడు. అట్లు వినుటవలన అతనిని గుఱించి బాగుగా తెలియనగును - భగవంతుని కల్యాణగుణములను తెలియచేయు నామముల నుచ్చరించుటద్వారా కీర్తింపతగినవాడు, అన్ని విధముల ఉపకారము చేయువాడగుటచేత ఎల్లపుడు స్మరింప తగినవాడు - అనగా, భగవంతుని గుఱించి శాస్త్రముద్వారాగాని, గురువుద్వారాగాని వినవలెను - అతని నామోచ్చారణవలన కల్యాణగుణములను కీర్తించవలెను. దయాహృదయుదగుటచేత చేసిన ఉపకారములను జ్ఞాపకము తెచ్చుకొనుచుందవలెను - ఇట్లు చేసిన అతనే ఎల్లపుడు జ్ఞాపకములో నుండును).

Transliteration

śrōtavya kīrtanīya smaraṇī yādiṣu, sāstramukhā dvā, ācāryamukhādvā śrōtavyaḥ; tatkalyāṇaguṇa gana prakāsaka nāmōccāraṇādinā kīrtitavyaḥ; svasya dēha prathāna prabhṛti sarva vidha upakāra kartṛtayā ca smartavyaḥ -.

(bhagavaṃtuḍu śrōtavyuḍu, kīrtanīyuḍu, smaraṇīyuḍu. adi eṭlanagā - śāstramudvārā kāni, guruvudvārākāni bhagavaṃtuḍu vinataginavāḍu. aṭlu vinuṭavalana atanini guṟiṃci bāgugā teliyanagunu - bhagavaṃtuni kalyāṇaguṇamulanu teliyacēyu nāmamula nuccariṃcuṭadvārā kīrtiṃpataginavāḍu, anni vidhamula upakāramu cēyuvāḍaguṭacēta ellapuḍu smariṃpa taginavāḍu - anagā, bhagavaṃtuni guṟiṃci śāstramudvārāgāni, guruvudvārāgāni vinavalenu - atani nāmōccāraṇavalana kalyāṇaguṇamulanu kīrtiṃcavalenu. dayāhṛdayudaguṭacēta cēsina upakāramulanu jñāpakamu teccukonucuṃdavalenu - iṭlu cēsina atanē ellapuḍu jñāpakamulō nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.