← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రోత్రియః śrōtriyaḥ

Original — తెలుగు
  1. వేదాంత వేది; శ్రుతవేదాంతః.

(ఉపనిషత్తులను తెలిసినవాడు; ఉపనిషత్తులలోని జ్ఞానము తెలుసుకొనినవాడు)

  1. అధీత వేదనే వేదార్థః; అధీత వేదవేదాంతార్థః -

(వేదములను వాటి అర్థమును తెలుసుకొనినవాడు; వేదములను, ఉపనిషత్తులను వాటి అర్థమును తెల్సినవాడు, - అధ్యయనము చేసినవాడు)

  1. అధీత వేద వేదాంగత్వాత్ - “ఏకా శాఖాం అధీత్య శ్రోత్రియో భవతి.” ఇతి బోధాయనోక్తిః -

(వేదములోని ఒక శాఖను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు అని భోధాయనశాస్త్రములో చెప్పబడినది. అందుచేత వేదములను వేదాంగములను అధ్యయనము చేయుటచేత శ్రోత్రియుడను చెప్పబడుచున్నాడు)

  1. “అధ్యయన శ్రుత సంపన్నః” (శ్రీశంకరః)

(శ్రుతుల అర్థమును అధ్యయనము చేసినవాడు)

  1. విధివదగ్నిహోత్రానుష్ఠాన యుక్తాః -

(శాస్త్రములో విధించిన ప్రకారము అగ్నిహోత్రమునకు సంబంధించిన అనుష్ఠానము కలవాడు)

  1. అగ్నిహోత్రీ - (అగ్నిహోత్రము కలవాడు)

  2. బ్రహ్మనిష్టః -

(పరబ్రహ్మమందే నిష్ట కలవాడు)

  1. “శ్లో ||. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః సంస్కారైర్ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం త్రిభిశ్శ్రోత్రియ ఉచ్యతే ||”. (బ్రహ్మవైవర్తే)

(పుట్టుకచేత - బ్రాహ్మణకులమున పుట్టుటచేత బ్రాహ్మణుడని తెలియబడుచున్నాడు. అతడే సంస్కారములు కలవాడైనచో - ఉపనయనము మొదలగునవి కలవాడైనచో ద్విజుడని చెప్పబడును - (రెండు జన్మలు కలవాడు - పుట్టుట మొదటి జన్మ, ఉపనయనము చేసుకొనుట రెండవజన్మ) విద్యకలవాడైన యడల - జ్ఞాని, బ్రహ్మజ్ఞానము కలవాడు అయిన యడల - విప్రుడని చెప్పబడును - ఈ మూడు గుణములు కలిగినవాడు - బ్రాహ్మణకులమున పుట్టి, ఉపనయనము మొదలగు సంస్కారములు కలిగి, వేదాధ్యయనము వలన బ్రహ్మజ్ఞానము కలవాడైన యడల శ్రోత్రియుడు అని చెప్పబడును)

  1. “నిత్య నైమిత్తిక క్రియా యుక్తః -” (శ్రీరంగరామానుజః)

(నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేయుచుండువాడు)

  1. వైదికుడు.
Transliteration
  1. vēdāṃta vēdi; śrutavēdāṃtaḥ.

(upaniṣattulanu telisinavāḍu; upaniṣattulalōni jñānamu telusukoninavāḍu)

  1. adhīta vēdanē vēdārthaḥ; adhīta vēdavēdāṃtārthaḥ -

(vēdamulanu vāṭi arthamunu telusukoninavāḍu; vēdamulanu, upaniṣattulanu vāṭi arthamunu telsinavāḍu, - adhyayanamu cēsinavāḍu)

  1. adhīta vēda vēdāṃgatvāt - “ēkā śākhāṃ adhītya śrōtriyō bhavati.” iti bōdhāyanōktiḥ -

(vēdamulōni oka śākhanu adhyayanamu cēsinavāḍu śrōtriyuḍu ani bhōdhāyanaśāstramulō ceppabaḍinadi. aṃducēta vēdamulanu vēdāṃgamulanu adhyayanamu cēyuṭacēta śrōtriyuḍanu ceppabaḍucunnāḍu)

  1. “adhyayana śruta saṃpannaḥ” (śrīśaṃkaraḥ)

(śrutula arthamunu adhyayanamu cēsinavāḍu)

  1. vidhivadagnihōtrānuṣṭhāna yuktāḥ -

(śāstramulō vidhiṃcina prakāramu agnihōtramunaku saṃbaṃdhiṃcina anuṣṭhānamu kalavāḍu)

  1. agnihōtrī - (agnihōtramu kalavāḍu)

  2. brahmaniṣṭaḥ -

(parabrahmamaṃdē niṣṭa kalavāḍu)

  1. “ślō ||. janmanā brāhmaṇō jñēyaḥ saṃskārairdvija ucyatē vidyayā yāti vipratvaṃ tribhiśśrōtriya ucyatē ||”. (brahmavaivartē)

(puṭṭukacēta - brāhmaṇakulamuna puṭṭuṭacēta brāhmaṇuḍani teliyabaḍucunnāḍu. ataḍē saṃskāramulu kalavāḍainacō - upanayanamu modalagunavi kalavāḍainacō dvijuḍani ceppabaḍunu - (reṃḍu janmalu kalavāḍu - puṭṭuṭa modaṭi janma, upanayanamu cēsukonuṭa reṃḍavajanma) vidyakalavāḍaina yaḍala - jñāni, brahmajñānamu kalavāḍu ayina yaḍala - vipruḍani ceppabaḍunu - ī mūḍu guṇamulu kaliginavāḍu - brāhmaṇakulamuna puṭṭi, upanayanamu modalagu saṃskāramulu kaligi, vēdādhyayanamu valana brahmajñānamu kalavāḍaina yaḍala śrōtriyuḍu ani ceppabaḍunu)

  1. “nitya naimittika kriyā yuktaḥ -” (śrīraṃgarāmānujaḥ)

(nitya karmalu, naimittika karmalu cēyucuṃḍuvāḍu)

  1. vaidikuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.