← Back to స · Booklets 51–60 (digitized file 6)

సృష్టి కారణము sṛṣṭi kāraṇamu

Original — తెలుగు
  1. “ఆత్మనా ఇదమేక ఏవాగ్ర ఆసీత్”; “అద్వితీయం”; నాన్యత్ కించన మిషత్ (చూడుము - ‘ఆత్మ’ - 7).

(ఇప్పుడు సృష్టిలోనుండు వస్తువులన్నియు మొదత, అనగా సృష్టికి పూర్వము ఆత్మ మాత్రముగానే యుండెను - అటువంటి ఆత్మ (సృష్టి స్థితి లయములు చేయగల శక్తి గల ఆత్మ) ఇంకొకటిలేదు - ఇంకేవిధమైన వస్తువును లేదు_ “తదైక్షత బహుశ్యాం ప్రజాయే యేతి” (ఛాందోగ్యోపనిషత్) (నేను ఒక్కడిని అయినను అనేకముగా అగుస్దును). “స ఈక్షత లోకాన్ను సృజా” ఇతి - “స ఇమాన్ లోకా న సృజత” (ఐతరీయోపనిషత్). (ఆ ఆత్మ లోకములను సృష్టించెదనని లోకములను సృష్టించెను) అని ఈక్షణ మాత్రమున లోకములను సృష్టించెను).

  1. “సో అకామయత బహుస్యాం ప్రజాయేయ” (తైత్తిరీయోపనిషత్)

(“నేను అనేక విధములుగా జీవులను సృష్టించెదను” అని భగవంతుడు కోరుకొనెను - తన కోరికపైన సృష్టి చేసెను).

  1. “ఆత్మ త ఏవేదం సర్వం” (ఛాందోగ్యోపనిషత్ 7 - 25 - 1)

(ఈ సృష్టిలోనున్న వస్తువులన్నియు ఆత్మ వలనననే భగవంతుని వలననే - సృష్టింపబడినవి).

  1. “వ. - - - కల్పాదులయందు నీ ప్రకారంబున స్వయంభూతుండును నమోఘసంకల్పండును నగు నప్పుండరీకాక్షుండు రజో గుణ యుక్తుండై స్రష్ట యగుచు స్వస్వరూపంబయిన విశ్వంబున్నాత్నీయ సామర్థ్యంబునం గల్పించె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  1. “దేవ మనుష్యాది రూపేణ బహుస్యాం, తదర్థ ఆకాశాది రూపేణ ప్రజాయేయ ఇతి వ్యష్టి సమష్టి రూప చేతనా చేతన విషయ సంకల్ప మకరోత్ ఇత్యర్థః” (శ్రీరంగ రామానుజః)

(దేవతలు, మనుష్యులు మొదలగువాటి రూపములుగా అనేకములుగా అయ్యెదను. అనగా, అట్లగుటకు ఆకాశముందలగు వాటి రూపములతో అయ్యెదను - అని వ్యష్టి సమష్టిరూపమైన చేతనములు అచేతనములు అగుటకు సంకల్పించెను).

  1. సీ. “ఆద్యంత శూన్యంబు నవ్యయంబై తగు తత్వమింతకు నుపాదానమగుట

గుణ విషయములు గైకొని కాలమును, మహదాది భూతములు దన్నాశ్రయింప

గాలానురూపంబు గైకొని యీశుండు దన లీలకై తనుదా సృజించె

గరమొప్ప నఖిల లోకములందు దానుండు, దనలోన నఖిలంబు దనరుచుండు

తే. గాన విశ్వమ్మునకు కార్య కారణములు

దాన - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 342)

  1. “సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్” అని ఛాందోగ్యోపనిషత్తులోను; “అసద్వా ఇదమగ్ర ఆసీత్” అని తైత్తిరీయోపనిషత్తులోను వేర్వేరు వుధములుగా చెప్పబడినది. “ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్” అని ఐతరీయోపనిషత్తులో చెప్పబడినది.అనగ సత్పదార్థమే సృష్టికి ముందు ఉండెను అనియు, అదియే సృష్టికి కారణము అనియు, అసత్పదార్థమే సృష్టికి పూర్వముండెను, అదియే సృష్టికి కారణము అనియు అసత్పదార్థమే సృష్టికి పూర్వముండెను, అదియే సృష్టికి కారనమనియు, నామ రూపములతో కనబడునదంతయు సృష్టింప బడకముందు ఒక్కటే ఒక్కటే యగు ఆత్మగానే యుండెననియు అందుచేత అదియే సృష్టికి కారణమనియు వేరు వేరు విధములుగా చ్దెప్పబడినది. కాని అసత్తే ముందు ఉండెను అను వాదమును తిరస్కరించి “అస్తి బ్రహ్మ” అనిన్నీ, సో అకామయత అనిన్నీ సత్పదార్థమునుండి జగత్తు సృష్టించబడినదినిన్నీ, “తత్సత్యం” (అదే సత్యము) - శాశ్వతముగా నుండునది, ఆత్మ వస్తువులు, అనాత్మవస్తువులు అదే యగుటవలన సత్పదార్థమునుండియే సృష్టి అయినదని, అసత్తువలన కాదని సిద్ధాంతము చేయబడినది. “కథమసతః సదుత్పద్యతే” (అసత్తునుండి సత్ పదార్థమెట్లు పుట్టును? అని ఈ వాదము నిరాకరింపబడినది. (Nothing will come out of nothing)

  2. యతోవా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి యత్రయంత్యభినంవిశంతి - ఇతి శ్రుతేః

(ఎవని నుండి ఈ భూతములన్నియు పుట్టుచున్నవో, అట్లు పుట్టినవి జీవించుచున్నవో, చనిపోయి ఎవనిలో లయమగుచున్నవో అదియే బ్రహ్మ *ఆత్మ) అని శ్రుతి చెప్పుచున్నది. ఇందువలన సృష్టికి కారణము భగవంతుడనియే (పరబ్రహ్మ అనియే) తెలియుచున్నది).

  1. “జన్మాద్యన్య యతః” (బ్రహ్మ సూత్రములు 1 - 1- 2)

శ్రీ వ్యాసమహర్షి వ్రాసిన బ్రహ్మ సూత్రములలో (బ్రహ్మ అనగా ఎవరు అను విషయమును తెలియచేయుచూ వ్రాసిన సూత్రములలో) ఈ సృష్టికి జన్మ, పోషణము, లయము ఎవరివలన కలుగుచున్నదో అదియే బ్రహ్మ అని చెప్పబడెను. దీనివలన సృష్టికికారణము పరబ్రహ్మ అని తెలియుచున్నది.

  1. సృష్టి కారణము అనేకవిధములుగాచెప్పబడుచున్నది : -

    1. బ్రహ్మ స్వరూప పరిణామ వాదినఃసృష్టిం విభూతం జీవ జడాత్మనా వివిధతయా భవనం బ్రహ్మణః మన్యంతే - యథావత్ బ్రహ్మ స్వరూపానభిజ్ఞాః. (శ్రీకూరనారాయణః)

(ఈశ్వరస్య విభూతిః విస్తారః స్వకీయైశ్వర్య ఖ్యాపనంఫృష్టిరితి).

(జీవులుగాను, జడవస్తువులుగాను, ఆత్మవస్తువుగాను అనాత్మ వస్తువుగాను అనేక విధములుగాను ప్రబ్రహ్మయే పరిణమించుటయే - మారుటయే - సృష్టీని కొందఱి అభిప్రాయము - విభూతి అనగా అనేక విధములుగా, అనేక రూపములుగా బ్రహ్మ విస్తరించుట, వ్యాపించుట, పెరుగుట) (Energy manifests itself in several ways in several forms).

  1. బ్రహ్మ వివర్తః ప్రపంచ ఇతి - సృష్టిః వితథయా కల్పితా, వివిధ తయా కల్పిత, స్వప్న మాయా పరికల్పితా ఇతి. స్వప్న పదార్థసృష్టిః సుప్తాత్మావివర్తో యధా మాయా స్వరూపా, తహా తత్స్వరూపబ్రహ్మ వివర్తరూపా.జాగ్రత్సృష్టిరపి మాయా స్స్వరూపా, మాయా వనేన మాయా వినిర్మితా గంధర్వ నగరాది గ్రహః, తత్స్వరూపా, తత్తుల్యస్వరూపా మిథ్యాభూతా ఈత్యేవం వికల్పితా ఇత్యర్థః (శ్రీకూరనారాయణః)

(ప్రపంచము - సృష్టి - బ్రహ్మయొక్కవివర్తము - సృష్టి అనేక విధములుగా కల్పించబడినది. స్వప్నములోను, మాయవలన కల్పించబడినది. స్వప్నములో కనబడు పదార్థములు క్మాయా స్వరూపమువలె నిద్రించువాని వివర్త్మౌ - ఆ ప్రకారముగానే జగతు బ్రహ్మ వివర్తము -జాగ్రదవస్థలోని సృష్టి కూడా మాయా స్వరూపమే- మాయ అనగా, మాయచేత, (మాయావిచేత, గారడీవాని చేత) ఆకాశములోకనబడినట్లు చేయబడిన గంధర్వనగరము మొదలగునవి యని గ్రహించవలెను -దానివలె నుండునది.దానితో సమానమైన రూపము కలది, మిథ్య అయినది, కనుక, అట్లే సృష్టి కల్పితమైనది).

  1. “యథా లోకే కులాలాదేః సంకల్పనామాత్రం ఘటాది కార్యం, న తదతిరేణ ఘటాది కార్య సృష్టిః”. భగవతః సత్య సంకల్పత్వాత్ స సర్వ శక్తిః స్వసంకల్ప మాత్రాదేవ స్వశరీర భూత చేతనా చేతన ప్రపంచం అగ్రే సూక్ష్మం స్థూల రూపేణ పరిణామ్య, స్వయమ వికార ఏవ సర్వాత్మకః సర్వోపాదానం భవతీతి మన్యం తే.

(లోకములో కుమ్మరివాని సంకల్పమాత్రముననే కుండ మొదలగు కార్యవస్తువులు కలుగుచున్నవి - ఇంకొక విధముగా కుండ మొదలగునవి కలుగుట లేదు. ఆ ప్రరముగానే సర్వశక్తిమంతుడైన భగవంతుని యొక్క సంకల్పమాత్రముననే తన శరీరమే అయిన చేతనా చేతన ప్రపంచము సృష్టికి పూర్వము సూక్ష్మరూపములో నున్నది స్థూల రూపముగా మారి, స్వయముగా వికారములు లేనివాడైనను (మార్పులు లేనివాడైనను) సమస్తమునకు ఆత్మ యగుటచేత, సమస్త శరీరములు తానే యగుటచేత, వాటికి ఉపాదానము కూడా భగవంతుడే యగుచున్నాడు అని తలంచుచున్నారు).

  1. “కాలాదేవ సృష్టిరితి కేచిత్” -

“కాలమేవ ఈశ్వరం మన్వానాం భూతానాం ప్రసూతిం (ఉత్పత్తిం) కాలాన్మన్యంతే” (శ్రీకూరనారాయణః)

(కాలమువలననే సృష్టి జరుగుచున్నదని కొందఱి అభిప్రాయము - కాలమే భగవంతుడు, భగవంతుడు కాలస్వరూపుడు అని తలచువారు కాలమువలననే సృష్టి జరుగుచున్నదని తలచుచున్నారు - శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో తానే కాలమని చెప్పెను - “కాలోస్మి, లోకక్షయకృత్” (కాలము అనునది నేనే, లోకములను క్షీణింపచేసి, నశింప చేయువాడను) అని చెప్పెను - అందుచేత కాలము భగవంతుని రూపము - లేక శక్తియే - లోకములో పుట్టిన ప్రతి వస్తువు కాలము గడిచినకొలది మార్పులు చెందుచునే యుండును - ఆఖరి మార్పు మరణము). (కాలస్వభావములను శక్తులను పుట్టించెను (శ్రీమదాంధ్ర మహాభాగవతము -)

  1. .హరేః అతృప్తస్య భోగార్థం - క్రీడార్థం - సృష్టిః ఇత్యన్యే మన్యంతి - మహారాజస్య కందుకాది విహార ఇవ క్రీడారూప ప్రయోజన సిద్ధ్యర్థం విశ్వ సృష్టిః ఈశ్వరస్య ఇతి మన్య్నతే ఇత్యర్థః

(మహారాజుకు కందుకములు మొదలగు వాటితో చేయు క్రీడ (ఆట) వలె భగవంతునికి క్రీడయే ప్రయోజనముగా గలది సృష్టియని కొందఱి అభిప్రాయము)

  1. దేవస్య క్రీడా శీలస్య అయం లీలా రూపః ఏషః సృష్ట్యాది విషయః స్వభావ ఏవ నాన్యత్ ప్రయోజనమితి భావః -

(క్రీడా స్వభావముగా గల దేవునికి ఈ సృష్టి మొదలగునవి లీలయే - ఇది అతని స్వభావమే - భగవంతునికి మఱియొక ప్రయోజనము లేదు).

  1. ఈశ్వరస్యే శ్వర త్వఖ్యాపన సం సృష్టిః ఇత్యేకః. పక్షః స్వప్న స్వరూపా మాయా స్వరూపాదా సృష్టిరితి పక్ష ద్వయం

. ఈశ్వరస్య సత్య సంకల్పస్య సృష్టిరితి పక్షాంతరం. కాలాదేవ జగతః సృష్టిః, న ఈశ్వరాత్, ఈస్వరస్తు ఉదాసీనః; తత్ర వికల్పాంతరం భోగార్థం క్రీడార్థం వా సృష్టిః -

(పైన 9.1 లగాయితు 9.6 వరకు గల వాటిలో చెప్పబడినవాటి సారాంశము ఇక్కడ చెప్పబడినది - భగవంతుని ఈశ్వరత్వము తెలియ చేయుటే సృష్టి అని ఒక పక్షమువారున్నూ. స్వప్నము వలె నుండునది, లేక, మాయా స్వరూపము సృష్టియని రెండవ పక్షమువారున్నూ, సత్య సంకల్పముగల భగవంతుని సృష్టియని ఇంకొక పక్షమువారున్నూ; కాలము వలననే సృష్టి కలుగుచున్నది, భగవంతుని వలన కాదు అని మఱికొందఱుని భగవంతుడు ఉదాసీనుడని మఱికొందఱును, భగవంతుని భోగము నిమిత్తము, లేక, క్రీడ కొఱకు ఈ సృష్టియని మఱికొందఱుకు అభిప్రాయపడుచున్నారు).

(ఎవరు ఏ విధముగా అభిప్రాయపడినను మనము ప్రతిరోజు చూచుచున్నదే నిజము - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది. అందుచేత ఒక వస్తువు పుట్టుటకు ఇంకొక వస్తువు కారణము - ఆ కారణవస్తువు పుట్టుటకు దాని ముందుండు కారణవస్తువు కారణము - ఈ ప్రకారముగా వెనుకకు వెనుకకు వెళ్ళిన అన్నింటికి మొదటి కరణము - ఆదికారణము, మూలకారణము భగవంతుడే - భగవంతునిలోనుండియే మొదట ఒక వస్తువుపుట్టినది - ప్రధమముగా పుట్టినదికనుక దానిని ప్రకృతి (ప్రధమం కృతం) అని చెప్పిరి. తర్వాత ప్రకృతిలోనుండి పుట్టినవాటన్నింటిలోను - ఒకదానిలోనుండి ఒకటిగ పుట్టినవాటన్నింటిలోను - భగవంతుడు తన చిచ్ఛక్తితో (చైతన్యశక్తితో) నుండుటవలననే అవి అలు పుట్టుచున్నవి.అందుచేత సృష్టిలో ఏ వస్తువు పుట్టినను, ఇప్పుడు, ఇప్పటికి ముందు, ఇకముందు దానికి మొదటిలో వలె - మొదటి వస్తువు పుట్టునపుడు వలె - దానికి కారణము భగవంతుడె. ప్రకృతితోగాని, దాని వికారములతోగాని భగవంతుడు తన చిచ్ఛక్తితో కలియుటవలననే ఆ ప్రకృతి వికారములలోనుండి మఱియొక వస్తువు పుట్టుచున్నక్ష్ది. ఈ సృష్టి అంతటిలోను ఏ ఒక వస్తువునుండి ఇంకొక వస్తువు పుట్టినను అందులో భగవంతుని శక్తి యున్నదని చెప్పవలెను - తత్వములన్నియు ఒకదానిలోనుండి ఒకటి పుట్టినవే).

(చూడుము శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 4 - 202)

- - - గగనంబు కాలమాయాంస యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శ తన్మాత్రంబు వలన వాయువుం గలిగించె - పవనుండు నభోబిలంబున రూప తన్మాత్రంబువలన లోక లోచనంబైన తేజంబు నుత్పదించె. తేజంబు కాలమాయాంశ యోగంబున నుత్తమశ్లోకును విలోకనంబున బవమానయుక్తంబగుచు రసతన్మాత్రంబువలన నంబువుల గలిగించె. సలిలంబు కాలమాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తంబై గంధగుణంబువలన బృధివిగలిగించె !).

  1. “తదాత్మానం స్వయమకురుత” ఇత్యాత్మనః కర్మత్వం కర్తృత్వం చ దర్శయతి ‘ఆతానమితి’ కర్మత్వం; స్వయమకురుత ఇతి కర్తృత్వం - పూర్వ సిద్ధోపిహి సన్నత్మాది శేషేణ వికారాత్మనాచ పరిణమ య మాసాత్మానమితివికారాత్మనా చ పరిణామో మృదాద్యాసు ప్రకృతీ షూపలబ్దః. “స్వయమితి” విశేషణాన్నిమిత్తాంతరా నపేక్షత్వమపి ప్రతీయతే - పరిణామాదితివా పృధక్ సూత్రం - తస్యైషో అర్థః - ఇతశ్చ ఇతశ్చబ్రహ్మయత్కారణం బ్రహ్మ ఏవ వికారాత్మనా (అ)యం పరిణామ స్సామానాధి కరణ్యే నామ్నాయతే - “సచ్చ త్యచ్చా బహవత్” - ని రుక్తం చా నిరుక్తం చేత్యాదినా ఇతి (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 4 - 27)

(ఆ బ్రహ్మ తన ఆత్మను (శరీరమును) తానే స్వయముగా చేసుకొనెను. ఇట్లు చెప్పుటవలన ఆత్మకు కర్తృత్వము కూడ చెప్పబడినది – ‘ఆత్మానం’ అనుటవలన కర్మత్వము చెప్పబడినది. ‘స్వయమకురుత’ అని చెప్పుటవలన కర్తృత్వము చెప్పబడినది. తాను అంతకు ముందునుండి యున్నప్పటికి తనను వికారాత్మగా మారినట్లు చేసెను - పరిణమించునట్లు చేసెను - అనగా, మట్టి కుండ మొదలగువాటిగా మారినట్లు ఆయెను - ఇట్లు మారుటయే వికారాత్మ, ‘స్వయం’ అని చెప్పుటవలన స్వయముగానే తానే ఇతర కారణము లేకనే యని స్పష్టము - కారణమైన బ్రహ్మయే ఈ విధముగా (సృష్టిలోని వస్తువులుగా) పరిణమించెను అనుట సమానాధికరణ్యన్యాయము ననుసరించి “ఆ పరబ్రహ్మయే జగత్తును సృష్టించి, దానిలో తాను ప్రవేశించి, ఆత్మ వస్తువులుగాను, అనాత్మ వస్తువులుగాను ఆయెను” అని శ్రుతి చెప్పుచున్నది). “సృజస్యాత్మానమాత్మనా” (కుమారసంభవము - కాళిదాసు)

  1. “ఆత్మనః ఆకాశః సంభూతః” (తైత్తిరీయోపనిషత్- 2 - 1)

“తత్తేజో అసృజత్” (ఛాందోగ్యోపన్షత్ - 1- 2 - 3)

“స ఇమాన్ లోకా న శ్ర్జత” (ఐతరేయోపనిషత్ - 4 - 1 - 2)

“ఏతస్మాత్ జాయతే ప్రాణః” (ముందకోపనిషత్ - 2 - 1 -3)

(ఆత్మనుండి ఆకశము పుట్టినది అని తైత్తిరీయోపనిషత్తులోను, “ఆ పరమాత్మ తేజస్సు సృష్టించెను” అని ఛాందోగ్యోపనిషత్తులోను, “ఆ ఆత్మ లోకములను సృష్టించెను” అని ఐతరేయోపనిషత్తులోను, “ఆ ఆత్మనుండి ప్రాణము పుట్టుచున్నది” అని ముండకోపనిషత్తులోను చెప్పబడియున్నది. ఈ విధముగా ఉపనిషత్తులలో ఒకదానికొకటిగా విరుద్ధముగా, పొందకుండా, వేఱు వేఱు విధములుగా సృష్టి చేయబడినట్లు చెప్పబడినది. కాని భగవంతునిలోనుండి ప్రకృతి, దానిలోనుండి మహత్తత్వము, దానిలోనుండి అహంకారము మొదలగునవి క్రమముగా పుట్టినట్లు చెప్పబడలేదు - కాని ఇదంతయు క్రమ సృష్టియే - క్రమముగా, ఒకదానిలోనుండి ఇంకొకటియే సృష్టింపబడినది. ఇట్లు సృష్టింపబడిన వాటి అన్నింటిలోను ప్రవేశించి అన్నింటిలోను భగవంతుడుండుటవలన భగవంతుడే కారణము).

  1. “యథా అగ్నేః అర్చిషః సవితుః గభస్తయః నిర్యాంతి, (ఉద్గచ్చంతి). సం యాంతి (లీయంతే) తథా గుణసంప్రవాహః (బుద్ధిః, మనః, ఖాని, కరణాని, శరీర సర్గాః. కార్యదేహ ప్రవాహశ్చ) భగవతః ప్రభవంతి”.

(అగ్నినుండి నిప్పుకణములు ఎట్లు పైకి వచ్చుచున్నవో (మీదికి ఎగురుచున్నవో) మఱియు ఎట్లు లీనమైపోవుచున్నవో, ఆ ప్రకారముగానే గుణసంప్రవాహము (అనగా, మనస్సు, బుద్ధి, ఆకాశము, ఇంద్రియములు మొదలుగా గల దేహమునకు సంబంధించిన సృష్టి, కార్య దేహము భగవంతునినుండే కలుగుచున్నవి).

  1. యథాహి పర్జన్యో వ్రీహి యదాది సృష్టౌ సాధారణం కారనం భవతి. ఏవం ఈశ్వరో దేవ మనుష్యాది సృష్టౌ సాధారణం కారణం భవతి.

“యతస్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |

యస్మింశ్చ ప్రళయం యాంతి ప్రనరేవ యుగక్షయే ||“. (విష్ణు సహస్రనామములు)

(వ్రీహియవలు మొదలగు ధాన్యములకు మేఘము సాధారణమైన కారణమగుచున్నది. అత్లే దేవతులు,మనుష్యులు మొదలగువాటికి ఈశ్వరుడు సాధారణకారణము - “మొదటి యుగము ప్రారంభములో ఎవనినుండి సమస్త భూతములు పుట్టుచున్నవో యుగాంతమందు ఎవనియందు లయమగుచున్నవో అతడే భగవతుడు అని చెప్పియుండుటవలన భగవంతుడే సృష్టికి కారణము”).

  1. “ఋషియః పితరఓ దేవాః మహాభూతాని ధాతవః |

జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవః ||“. (మహాభారతము -)

(ఋషులు,పితరులు, దేవతులు, మహాభూతములు, ధాతువులు, జంగమములు, స్థావరములు కలిగిన ఈ ప్రపంచము నారాయణుని వలన కలిగినది).

  1. “ద్యౌః చంద్రార్క నక్షత్రాఖిల దిశో భూర్మహెఓద్ధిః |

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ||“. (మహాభారతము)

(ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, దిక్కులు, భూమి, సముద్రము ఇవన్నియు మహాత్ముడైన వాసుదేవునియొక్క వీర్యమువలన (శక్తివలన) పుట్తినవే).

  1. “త్రిభిర్గుణమయై ర్భావైరేబిః సర్వమిదం జగత్”

(సత్వరజస్తమోగుణములవల్లనే ఈ జగత్తు అంతయు కలిగినది - అది యెట్లంటే - “భూతాహంకారంవల్ల కగత్కారణ శరీరి అయి తమోగుణయుక్తుండై జ్ఞాన వికృతితో గూడి ఆది శక్తియుక్తుండై రుద్రుండనిపించుకొనును”- “ఏక ఏవ రుద్రో న ద్వితీయో యదస్తి” అని శ్రుతి కలదు కనుక. “మధ్యమోహం” అనెడి తైజసాహంకారమువల్ల జగత్సూక్ష్మశరీరుండై రజో గుణమువల్ల వర్తిలిన వికృతిభావంతో గూడి ఇచ్ఛా శక్తియుల్క్తుండై హిరణ్యగర్భుండనిపించుకొనును - “హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్” అని శ్రుతి పలుకుచున్నది. “ఉత్తమోహం” అనెడు వైకారికాహంకారంవల్లనున్నూ బ్రహ్మాండమనెడి స్థూల దేహుండై మోహనవికృతి భావంతో గూడి జ్ఞానశక్తుండై విరాట్పురుషుండై విష్ణుండనిపించుకొనును - “సర్వం విష్ణు మయం జగత్” అని కలదు కనుక - (ఈ సమస్త జగత్తు విష్ణువుతో నిండియున్నది).

  1. “చ. అతని నియుక్తిజెంది సచరాచర భూతసమేత సృష్టినే

వితతముగా సృజింతు, బ్రభవిష్ణుడు విష్ణుడు ప్రోచు, బార్వతీ

పతి లయమొందజేయు; హరి పంకరుఘోదరుడాది నూర్తి య

చ్యుతుడు త్రిశక్తి యుక్తుడగుచుండును నింతకు దానమూలమై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 101)

  1. “మ. ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబు సు

స్థిరతం జేసి హరిస్వరూపిఉడయి రక్షించున్, సమస్త ప్రజో

త్కర సంహారము జేయునప్పుడు హారాంతర్యామియై యింతయున్

హరియించున్, బవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 276)

  1. “కాలస్వభావో నియతిర్యదృచ్ఛయా భూతాని యోనిః పురుషః” -

(కాలము, స్వభావము, కర్మ, ప్రకృతి, పురుషుడు అనునవి సృష్టికారణములు)

(“కాలః సర్వభూతానాం విపరుణామ హేతుః; స్వభావో నామ పదార్థానాం ప్రతినియతా శక్తిః; అగ్నేరౌష్ణ్యమివ నియతిః పుణ్యపాప లక్షణకర్మ; యదృచ్ఛా ఆకస్మికీ ప్రాప్తిః; భూతాని ఆకాశాదీని, యోనిః ప్రకృతిః; పురుషః విజ్ఞానాత్మా”).

(సమస్త భూతములు మార్పుచెందుటకు కారనమైనది కాలము; ఒక చిన్నబాలుడు పెద్ద మనిషిగా మారుటకుకాలక్రమమువలననే. స్వభావమనగా అగ్నియొక్క వేడిమివలె పదార్థముల నైసర్గికగుణము; నియతి యనగా పుణ్యకర్మ, పాపకర్మ; యదృచ్ఛా అనగా ఆకస్మికముగా ప్రాప్తించునది, భూతములు అనగా ఆకాశము మొదలగునవి, యోని అనగా ప్రకృతి; పురుషుడు అనగా జీవుడు. ఇవన్నియు చిత్ర విచిత్రమైన అనేక పదార్థములుగల ఈ సృష్టికి కారణమగుచున్నది).

  1. “ఆత్మనః ఆకాశస్సంభూతః; ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః; అగ్నేరాపః; అపీభ్యః పృధివీ; పృధివ్యాః ఓషధియః, ఓషధీభ్యః, అన్నం, అన్నాత్ పురుషః”.

(ఆత్మవలన - భగవంతునివలన ఆకాసము పుట్టినది; ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీటినుండి పృధివి, పృధివినుండి ఓషధులు (సస్యములు), ఓషధులనుండి అన్నము, అన్నమునుండి పురుషుడు - జీవి - పుట్టుచున్నారు).

  1. “అన్నం వైప్రజాపతిస్తతో తద్రేతస్తస్మాత్ ఇమాః ప్రజాః ప్రజాయంతే” ఇతి ప్రశ్నోపనిషత్-

(అన్నము ప్రజాపతి - దానినుండి రేతస్సు కలుగుచున్నది; ఆ రేతస్సునుండి ప్రజలు పుట్టుచున్నారు).

  1. “ప్రజాకామోవై ప్రజాపతిః; స తపో (అ)తప్యత; స తపస్తప్త్వా స మిధున ముత్పాదయతే, రయించ ప్రానం చేత్యేతేమే బహుధా ప్రజాః కరిష్యతి ఇతి. ఆదిత్యోహ వైప్రాణః, రయిరేవ చంద్రమాః, రయిర్వా ఏతతత్సర్వం యన్మూర్తం చా మూర్తిం చ; తస్మాన్ మూర్తిరేవరయిః”

(ప్రశ్నోపనిషత్ - 4, 5)

(ప్రజలను సృష్టించు కోరికగల ప్రజాపతి తపస్సు చేసెను - తపస్సు చేసి రయి ప్రాణము ఈ రెండును నా ప్రజ్ఞను అనేకవిధములుగా సృష్టి చేయగలవు. ఆదిత్యుడు ప్రాణము; రయి అనగా చంద్రుడు రయియే ఈ మూర్తామూర్తములు - అందుచేత రయి అనగా మూర్తి. ఇందులో చెప్పినదానిలో ప్రాణమనగా ఆదిత్యుడు - అనగా ఆదిత్యునివలె ప్రకాశించు శరీరములుగలవన్నియు అని అర్థము. రయి అనగా చంద్రుడు - ప్రకృతి వికారములన్నియు).

  1. సృష్టికి కారణము భగవంతుడను నొకడున్నాడా యని సంశయము కలుగవచ్చు. “కర్తారం వినా కార్యం నాస్తి” (కర్త లేనిదే కార్యముండదు) కునుక ఈ సృష్టికి కర్తయనువాడు ఉండితీరవలెను - “యత్ కార్యం తత్ సకర్తృకం”) ఏది కార్యమో - చేయబడిన వస్తువో - ఆకార్యమునకు ఆ కార్యమును చేసినవాడు - (అనగా దాని కర్త) ఒకడు ఉండవలెను - నహి మృద్వ్యతిరేకేణ ఘతోనామ కశ్చి దుపలభ్యతే, తః కారణ వ్యతిరేకేణ కార్యం నాస్తి: (మట్టి లేనిచో మట్టికుండ పుట్టదు) - అందుచేత కారణము లని కార్యముండదు - ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది. ఇది మనము చూచుచునే యున్నాము - పుట్టిన వస్తువు కార్యము - ఎందులోనుండి కార్యవస్తువు పుట్టుచున్నదో అది దానికి కారణము - భగవంతునిలోనుండి ప్రపంచము పుట్టుచున్నది కనుక ప్రపంచము కార్యము. అది పుట్టుటకు కారనము భగవంతుడు).

“యది చా భావాత్ భావోత్పతిరభ్యుపగమ్యతే ఏవం సత్యుదాసీనాం అనీహమానానామపి జనానాం అభిమత సిద్ధిస్యాత్ - అభావస్య సులభత్వాత్ కృషీవలస్య క్షేత్రకర్మణి అప్రయతిమా నస్యాపి తస్య నిష్పత్తిస్యాత్ ; కులాలస్య చ మృత్సం స్క్రియా యాం సి ప్రియమానస్యాపి తన్వానస్త్వేచ వస్తర్ లాభః స్వర్గాప వర్గయోశ్చ న కశ్చిత్ కథం చిత్ స మీహతి, న చై తదుజ్యతే, అభ్యుపగమ్యతే వా కేన చిత్, తస్మాత్ అనుపపన్నో అయం అభావాత్ భావోత్సత్య భ్యుపగమం” (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే -)

(అభావమునుండి భావము కలిగే మాటుంటే - అనగా - భగవంతునినుండికాక శూన్యంలోనుండి - ఏదియు లేని స్థితిలోనుండి - ఈ ప్రపంచము పుట్టినట్లయితే తటస్థంగానున్న వాళ్ళకైనా - అనగా, ప్రయత్నము చేయని వాళ్ళకైనా - కోరికలు వాటంతట అవే సిద్ధించవలెను - వ్యవసాయదారుడు దున్నకపోయినా భూమి పండవలెను - కుమ్మరివాడు తన సామగ్రితో పనిచేయకపోయినా కుండ తయారుకావల్సియుండును. ఆ మాదిరిగానే దారములు నేయకుండగనే బట్త తయారుకావలసియుండవలెను - ఈలాగుననే ఎవరునూ కోరకుండగనే స్వర్గాపవర్గములు పొందవచ్చును. ఈ పరిస్థితి కుదరదు - సబబు కాదు - ప్రకృతికి విరుద్ధము - అందుచేత అభావమునుండి భావము ఉత్పత్తికాదు - అనగా శూన్యమునుండి ప్రపంచము (సృష్టి) ఉద్భవముకాదు. వ్యాసమహర్షి బ్రహ్మసూత్రాలు వ్రాసేరు. అందులో మొట్టమొదటి సూత్రము “జనాద్యస్య యతః” (చూడుము - 8), అస్య = ఈ కనబడుచున్న ప్రపంచమునకు, జన్మాది - జన్మ మొదలగునవి - అనగా, పుట్టుట, పెరుగుట, నశించుట, యతః = ఎవనివల్ల జరుగుచున్నవో అది బ్రహ్మ. దీనివల్ల ఈ ప్రపంచము (సృష్టి) బ్రహ్మవలన పుట్టినది, సృష్టికి కారణము - ప్రపంచము కార్యము - అందుచేత బ్రహ్మ అనువాడున్నాడు అనుట స్పష్టము).

  1. “ఉ. ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై

ఎవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవ్వడు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 73)

  1. “విశ్వోద్భవస్థితి లయాదిషు హేతుమేకం” (శ్రీశంకరః -) (శ్రీరామకర్ణామృతం - 3 - 74)

(విశ్వమునకు - ప్రపంచమునకు -సృష్టి స్గ్థితి లయములకు ఒకే కారణమైనవాడు)

“యేన ఇత్యేకత్వం వివిక్షితం నానాత్వ బ్రహ్మ విధానా యోగాత్ యజ్జగత్కారణం తదేకం ఇతివాం తరవాక్యం యదేకం కారణం, తద్బ్రహ్మ ఇతివా, యత్కారణం తదేకం బ్రహ్మవా”.

(పైన శ్రీ వ్యాసమహర్షి బ్రహ్మసూత్రములోని, ఉపనిషత్తులోను సృష్టికి కారణము బ్రహ్మ యని చెప్పినపుడు - “ఎవనివల్ల” “ఎవనిచేత” అని ఏక వచనము ప్రయోగింపబడుటచేత బ్రహ్మత్వ విధానములో - అనగా - సృష్టి స్థితి లయములు చేయుటలో అనేక బ్రహ్మలుండుట పొసగదు - (no dual Govt or no parallel Govt or plurality of Govt). అందుచేత జగత్తునకు కారణము ఒకడే, అదియే బ్రహ్మ - ఒకడే బ్రహ్మ - అతనే కారనము) - అని సూచించును).

  1. “యతః సర్వాణి భూతాని జాయంతే - - -” (చూడుము - 7)

(పైన చెప్పిన 7, 8, 24, 25, 26 లో సృష్టి కారణము బ్రహ్మ అని చెప్పినపుడు ‘ఎవనివలన’ అని ఏకవచనము చెప్పబడినది - అనగా, సృష్టికి కారణమైనవాడు ఒక్కడే - అతనే బ్రహ్మ - అనేక బ్రహ్మలు లేరు - మతములెన్నియున్నను - ఆయా మతములలో సృష్టికి కారణమైనవాడు ఎవడో వానికి ఆయా మతములలో ఏ పేరు పెట్టినను సృష్టి కర్త ఒక్కడే. అతనిని బ్రహ్మ అని చెప్పుటకు కారణము అతను వృద్ధిపొందించు వాడు, వృద్ధి పొందువాడు కనుక (చూడుము - బ్రహ్మ) (వామనావతారము)

యం శైవాస్సముపాద్సతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః |

బౌద్ధాః బుద్ధ ఇతి ప్రమాణపటవం, కర్తేతి నైయాయికాః |

అర్హన్నిత్యధజైనశాసన రతాః కర్మేతిమీమాంసకాః |

సోయమ్నః విదధాతు వాంఛితఫలం శ్రీరామచంద్రో హరిః ||.

(ఎవనిని శైవ మతస్థులు శివుడని ఉపాసించుచున్నారో, వేదాంతులు బ్రహ్మ యని, బౌద్ధ మతస్థులు బుద్ధుడని, న్యాయ మతస్థులు కర్త యని, జైన మతస్థులు అర్హన్ అని, మీమాంసకులు కర్మయని (సృష్టికి కారణమని) ఉపాసించెదరో, అట్లు అనద్ఱికి ఏదో ఒక పేరుతో సృష్టికర్త అయిన వాదైన నా అభీష్టదైవము అయిన శ్రీరామచంద్రుడు మనకు కోరిన ఫలము నిచ్చుగాక) -

అర్హన్ = సర్వజ్ఞో జితరాగాది దోష స్త్రైలోక్యుపూజితః |

యథా స్థితార్థవాదీ చ దేహోర్హన్ పరమేశ్వరః |

(A superior divinity with the jains)

(జైన మతములో ముఖ్య దేవత యైన పరమేశ్వరుడు).

(1) సృష్టికారణము 1వ విభాగము లో చెప్పబడిన ప్రకారము ‘ఆత్మ’ అనునది ఒక్కటే సృష్టికి పూర్వముండెను - అటువంటి ఆత్మ మఱియొకటి లేదని కూడా చెప్పబడెను. దీనిని బట్టి ఆత్మ అనునది ఒకటే యనుట నిశ్చయము

(2) “తత్ సృహ్స్టన్ తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్” ఆ ఆత్మ సృష్టించిన లోకములన్నింటిలోను - ఆయా లోకములలోని వస్తువులన్నింటిలోను - ప్రతిదానిలోను ప్రవేశించి - దానిలో పూర్తిగా వ్యాపించి, అందులోను ఆత్మ వస్తువులు, అనాత్మ వస్తువులుగా తానే ఆయెను - ఇంకొక ఆత్మ యుండి యిట్లు చేయుటకు అవకాశము లేదు - ఇద్దరు ఆత్మలు ఒకే పని చేయుట జరగదు - అందుచేత ఆత్మ - పరమాత్మ - పరబ్రహ్మ అనువాడు ఒక్కడే). ఒక ఒరలో రెండు కత్తులు ఇముడవు - (Two swords cannot go into ona and the same scabbard)

(3). “ఏకో దేవః సర్వభూతాంతరాత్మా”

(సమస్త భూతముల లోపల అంతరాత్మగానున్నవాడు ఒకే దేవుడు) అని చెప్పుటవలన కూడా యింకొక (సృష్టి కర్త అయిన) దేవుడు - (పరబ్రహ్మ) లేడు అనుట్స్పష్టమే).(Only one Energy pervades all things in the entire creation)

(4). (“హరిమయము విశ్వమంతయు” అని చెప్పుటవలన ప్రపంచమంతా - ప్రపంచములోనున్నదంతా – శ్రీహరియే, పరబ్రహ్మమే అని చెప్పుటవలన ప్రపంచమంతను - ఏ మూల చూచినను - మఱియొక బ్రహ్మ ఉండుటకు అవకాశము లేదు. అందుచేత పరబ్రహ్మ అనువాడు - సృష్టి అంతటికి కారణమైనవాడు ఒక్కడే అనుటకు సందేహము లేదు).

(5). “తందనాన - - - తందనాన |

బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే |

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే |

కందువగు హీనాధికము లిందులేవు |

అందఱికి శ్రీహరే అంతరాత్మ ||“. (అన్నమాచార్యులు)

Transliteration
  1. “ātmanā idamēka ēvāgra āsīt”; “advitīyaṃ”; nānyat kiṃcana miṣat (cūḍumu - ‘ātma’ - 7).

(ippuḍu sṛṣṭilōnuṃḍu vastuvulanniyu modata, anagā sṛṣṭiki pūrvamu ātma mātramugānē yuṃḍenu - aṭuvaṃṭi ātma (sṛṣṭi sthiti layamulu cēyagala śakti gala ātma) iṃkokaṭilēdu - iṃkēvidhamaina vastuvunu lēdu_ “tadaikṣata bahuśyāṃ prajāyē yēti” (chāṃdōgyōpaniṣat) (nēnu okkaḍini ayinanu anēkamugā agusdunu). “sa īkṣata lōkānnu sṛjā” iti - “sa imān lōkā na sṛjata” (aitarīyōpaniṣat). (ā ātma lōkamulanu sṛṣṭiṃcedanani lōkamulanu sṛṣṭiṃcenu) ani īkṣaṇa mātramuna lōkamulanu sṛṣṭiṃcenu).

  1. “sō akāmayata bahusyāṃ prajāyēya” (taittirīyōpaniṣat)

(“nēnu anēka vidhamulugā jīvulanu sṛṣṭiṃcedanu” ani bhagavaṃtuḍu kōrukonenu - tana kōrikapaina sṛṣṭi cēsenu).

  1. “ātma ta ēvēdaṃ sarvaṃ” (chāṃdōgyōpaniṣat 7 - 25 - 1)

(ī sṛṣṭilōnunna vastuvulanniyu ātma valanananē bhagavaṃtuni valananē - sṛṣṭiṃpabaḍinavi).

  1. “va. - - - kalpādulayaṃdu nī prakāraṃbuna svayaṃbhūtuṃḍunu namōghasaṃkalpaṃḍunu nagu nappuṃḍarīkākṣuṃḍu rajō guṇa yuktuṃḍai sraṣṭa yagucu svasvarūpaṃbayina viśvaṃbunnātnīya sāmarthyaṃbunaṃ galpiṃce”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  1. “dēva manuṣyādi rūpēṇa bahusyāṃ, tadartha ākāśādi rūpēṇa prajāyēya iti vyaṣṭi samaṣṭi rūpa cētanā cētana viṣaya saṃkalpa makarōt ityarthaḥ” (śrīraṃga rāmānujaḥ)

(dēvatalu, manuṣyulu modalaguvāṭi rūpamulugā anēkamulugā ayyedanu. anagā, aṭlaguṭaku ākāśamuṃdalagu vāṭi rūpamulatō ayyedanu - ani vyaṣṭi samaṣṭirūpamaina cētanamulu acētanamulu aguṭaku saṃkalpiṃcenu).

  1. sī. “ādyaṃta śūnyaṃbu navyayaṃbai tagu tatvamiṃtaku nupādānamaguṭa

guṇa viṣayamulu gaikoni kālamunu, mahadādi bhūtamulu dannāśrayiṃpa

gālānurūpaṃbu gaikoni yīśuṃḍu dana līlakai tanudā sṛjiṃce

garamoppa nakhila lōkamulaṃdu dānuṃḍu, danalōna nakhilaṃbu danarucuṃḍu

tē. gāna viśvammunaku kārya kāraṇamulu

dāna - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 342)

  1. “sadēva sōmya idamagra āsīt” ani chāṃdōgyōpaniṣattulōnu; “asadvā idamagra āsīt” ani taittirīyōpaniṣattulōnu vērvēru vudhamulugā ceppabaḍinadi. “ātmā vā idamēka ēvāgra āsīt” ani aitarīyōpaniṣattulō ceppabaḍinadi.anaga satpadārthamē sṛṣṭiki muṃdu uṃḍenu aniyu, adiyē sṛṣṭiki kāraṇamu aniyu, asatpadārthamē sṛṣṭiki pūrvamuṃḍenu, adiyē sṛṣṭiki kāraṇamu aniyu asatpadārthamē sṛṣṭiki pūrvamuṃḍenu, adiyē sṛṣṭiki kāranamaniyu, nāma rūpamulatō kanabaḍunadaṃtayu sṛṣṭiṃpa baḍakamuṃdu okkaṭē okkaṭē yagu ātmagānē yuṃḍenaniyu aṃducēta adiyē sṛṣṭiki kāraṇamaniyu vēru vēru vidhamulugā cdeppabaḍinadi. kāni asattē muṃdu uṃḍenu anu vādamunu tiraskariṃci “asti brahma” aninnī, sō akāmayata aninnī satpadārthamunuṃḍi jagattu sṛṣṭiṃcabaḍinadininnī, “tatsatyaṃ” (adē satyamu) - śāśvatamugā nuṃḍunadi, ātma vastuvulu, anātmavastuvulu adē yaguṭavalana satpadārthamunuṃḍiyē sṛṣṭi ayinadani, asattuvalana kādani siddhāṃtamu cēyabaḍinadi. “kathamasataḥ sadutpadyatē” (asattunuṃḍi sat padārthameṭlu puṭṭunu? ani ī vādamu nirākariṃpabaḍinadi. (Nothing will come out of nothing)

  2. yatōvā imāni bhūtāni jāyaṃtē, yēna jātāni jīvaṃti yatrayaṃtyabhinaṃviśaṃti - iti śrutēḥ

(evani nuṃḍi ī bhūtamulanniyu puṭṭucunnavō, aṭlu puṭṭinavi jīviṃcucunnavō, canipōyi evanilō layamagucunnavō adiyē brahma *ātma) ani śruti ceppucunnadi. iṃduvalana sṛṣṭiki kāraṇamu bhagavaṃtuḍaniyē (parabrahma aniyē) teliyucunnadi).

  1. “janmādyanya yataḥ” (brahma sūtramulu 1 - 1- 2)

śrī vyāsamaharṣi vrāsina brahma sūtramulalō (brahma anagā evaru anu viṣayamunu teliyacēyucū vrāsina sūtramulalō) ī sṛṣṭiki janma, pōṣaṇamu, layamu evarivalana kalugucunnadō adiyē brahma ani ceppabaḍenu. dīnivalana sṛṣṭikikāraṇamu parabrahma ani teliyucunnadi.

  1. sṛṣṭi kāraṇamu anēkavidhamulugāceppabaḍucunnadi : -

    1. brahma svarūpa pariṇāma vādinaḥsṛṣṭiṃ vibhūtaṃ jīva jaḍātmanā vividhatayā bhavanaṃ brahmaṇaḥ manyaṃtē - yathāvat brahma svarūpānabhijñāḥ. (śrīkūranārāyaṇaḥ)

(īśvarasya vibhūtiḥ vistāraḥ svakīyaiśvarya khyāpanaṃphṛṣṭiriti).

(jīvulugānu, jaḍavastuvulugānu, ātmavastuvugānu anātma vastuvugānu anēka vidhamulugānu prabrahmayē pariṇamiṃcuṭayē - māruṭayē - sṛṣṭīni koṃdaṟi abhiprāyamu - vibhūti anagā anēka vidhamulugā, anēka rūpamulugā brahma vistariṃcuṭa, vyāpiṃcuṭa, peruguṭa) (Energy manifests itself in several ways in several forms).

  1. brahma vivartaḥ prapaṃca iti - sṛṣṭiḥ vitathayā kalpitā, vividha tayā kalpita, svapna māyā parikalpitā iti. svapna padārthasṛṣṭiḥ suptātmāvivartō yadhā māyā svarūpā, tahā tatsvarūpabrahma vivartarūpā.jāgratsṛṣṭirapi māyā ssvarūpā, māyā vanēna māyā vinirmitā gaṃdharva nagarādi grahaḥ, tatsvarūpā, tattulyasvarūpā mithyābhūtā ītyēvaṃ vikalpitā ityarthaḥ (śrīkūranārāyaṇaḥ)

(prapaṃcamu - sṛṣṭi - brahmayokkavivartamu - sṛṣṭi anēka vidhamulugā kalpiṃcabaḍinadi. svapnamulōnu, māyavalana kalpiṃcabaḍinadi. svapnamulō kanabaḍu padārthamulu kmāyā svarūpamuvale nidriṃcuvāni vivartmau - ā prakāramugānē jagatu brahma vivartamu -jāgradavasthalōni sṛṣṭi kūḍā māyā svarūpamē- māya anagā, māyacēta, (māyāvicēta, gāraḍīvāni cēta) ākāśamulōkanabaḍinaṭlu cēyabaḍina gaṃdharvanagaramu modalagunavi yani grahiṃcavalenu -dānivale nuṃḍunadi.dānitō samānamaina rūpamu kaladi, mithya ayinadi, kanuka, aṭlē sṛṣṭi kalpitamainadi).

  1. “yathā lōkē kulālādēḥ saṃkalpanāmātraṃ ghaṭādi kāryaṃ, na tadatirēṇa ghaṭādi kārya sṛṣṭiḥ”. bhagavataḥ satya saṃkalpatvāt sa sarva śaktiḥ svasaṃkalpa mātrādēva svaśarīra bhūta cētanā cētana prapaṃcaṃ agrē sūkṣmaṃ sthūla rūpēṇa pariṇāmya, svayama vikāra ēva sarvātmakaḥ sarvōpādānaṃ bhavatīti manyaṃ tē.

(lōkamulō kummarivāni saṃkalpamātramunanē kuṃḍa modalagu kāryavastuvulu kalugucunnavi - iṃkoka vidhamugā kuṃḍa modalagunavi kaluguṭa lēdu. ā praramugānē sarvaśaktimaṃtuḍaina bhagavaṃtuni yokka saṃkalpamātramunanē tana śarīramē ayina cētanā cētana prapaṃcamu sṛṣṭiki pūrvamu sūkṣmarūpamulō nunnadi sthūla rūpamugā māri, svayamugā vikāramulu lēnivāḍainanu (mārpulu lēnivāḍainanu) samastamunaku ātma yaguṭacēta, samasta śarīramulu tānē yaguṭacēta, vāṭiki upādānamu kūḍā bhagavaṃtuḍē yagucunnāḍu ani talaṃcucunnāru).

  1. “kālādēva sṛṣṭiriti kēcit” -

“kālamēva īśvaraṃ manvānāṃ bhūtānāṃ prasūtiṃ (utpattiṃ) kālānmanyaṃtē” (śrīkūranārāyaṇaḥ)

(kālamuvalananē sṛṣṭi jarugucunnadani koṃdaṟi abhiprāyamu - kālamē bhagavaṃtuḍu, bhagavaṃtuḍu kālasvarūpuḍu ani talacuvāru kālamuvalananē sṛṣṭi jarugucunnadani talacucunnāru - śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu arjununitō tānē kālamani ceppenu - “kālōsmi, lōkakṣayakṛt” (kālamu anunadi nēnē, lōkamulanu kṣīṇiṃpacēsi, naśiṃpa cēyuvāḍanu) ani ceppenu - aṃducēta kālamu bhagavaṃtuni rūpamu - lēka śaktiyē - lōkamulō puṭṭina prati vastuvu kālamu gaḍicinakoladi mārpulu ceṃducunē yuṃḍunu - ākhari mārpu maraṇamu). (kālasvabhāvamulanu śaktulanu puṭṭiṃcenu (śrīmadāṃdhra mahābhāgavatamu -)

  1. .harēḥ atṛptasya bhōgārthaṃ - krīḍārthaṃ - sṛṣṭiḥ ityanyē manyaṃti - mahārājasya kaṃdukādi vihāra iva krīḍārūpa prayōjana siddhyarthaṃ viśva sṛṣṭiḥ īśvarasya iti manynatē ityarthaḥ

(mahārājuku kaṃdukamulu modalagu vāṭitō cēyu krīḍa (āṭa) vale bhagavaṃtuniki krīḍayē prayōjanamugā galadi sṛṣṭiyani koṃdaṟi abhiprāyamu)

  1. dēvasya krīḍā śīlasya ayaṃ līlā rūpaḥ ēṣaḥ sṛṣṭyādi viṣayaḥ svabhāva ēva nānyat prayōjanamiti bhāvaḥ -

(krīḍā svabhāvamugā gala dēvuniki ī sṛṣṭi modalagunavi līlayē - idi atani svabhāvamē - bhagavaṃtuniki maṟiyoka prayōjanamu lēdu).

  1. īśvarasyē śvara tvakhyāpana saṃ sṛṣṭiḥ ityēkaḥ. pakṣaḥ svapna svarūpā māyā svarūpādā sṛṣṭiriti pakṣa dvayaṃ

. īśvarasya satya saṃkalpasya sṛṣṭiriti pakṣāṃtaraṃ. kālādēva jagataḥ sṛṣṭiḥ, na īśvarāt, īsvarastu udāsīnaḥ; tatra vikalpāṃtaraṃ bhōgārthaṃ krīḍārthaṃ vā sṛṣṭiḥ -

(paina 9.1 lagāyitu 9.6 varaku gala vāṭilō ceppabaḍinavāṭi sārāṃśamu ikkaḍa ceppabaḍinadi - bhagavaṃtuni īśvaratvamu teliya cēyuṭē sṛṣṭi ani oka pakṣamuvārunnū. svapnamu vale nuṃḍunadi, lēka, māyā svarūpamu sṛṣṭiyani reṃḍava pakṣamuvārunnū, satya saṃkalpamugala bhagavaṃtuni sṛṣṭiyani iṃkoka pakṣamuvārunnū; kālamu valananē sṛṣṭi kalugucunnadi, bhagavaṃtuni valana kādu ani maṟikoṃdaṟuni bhagavaṃtuḍu udāsīnuḍani maṟikoṃdaṟunu, bhagavaṃtuni bhōgamu nimittamu, lēka, krīḍa koṟaku ī sṛṣṭiyani maṟikoṃdaṟuku abhiprāyapaḍucunnāru).

(evaru ē vidhamugā abhiprāyapaḍinanu manamu pratirōju cūcucunnadē nijamu - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi. aṃducēta oka vastuvu puṭṭuṭaku iṃkoka vastuvu kāraṇamu - ā kāraṇavastuvu puṭṭuṭaku dāni muṃduṃḍu kāraṇavastuvu kāraṇamu - ī prakāramugā venukaku venukaku veḷḷina anniṃṭiki modaṭi karaṇamu - ādikāraṇamu, mūlakāraṇamu bhagavaṃtuḍē - bhagavaṃtunilōnuṃḍiyē modaṭa oka vastuvupuṭṭinadi - pradhamamugā puṭṭinadikanuka dānini prakṛti (pradhamaṃ kṛtaṃ) ani ceppiri. tarvāta prakṛtilōnuṃḍi puṭṭinavāṭanniṃṭilōnu - okadānilōnuṃḍi okaṭiga puṭṭinavāṭanniṃṭilōnu - bhagavaṃtuḍu tana cicchaktitō (caitanyaśaktitō) nuṃḍuṭavalananē avi alu puṭṭucunnavi.aṃducēta sṛṣṭilō ē vastuvu puṭṭinanu, ippuḍu, ippaṭiki muṃdu, ikamuṃdu dāniki modaṭilō vale - modaṭi vastuvu puṭṭunapuḍu vale - dāniki kāraṇamu bhagavaṃtuḍe. prakṛtitōgāni, dāni vikāramulatōgāni bhagavaṃtuḍu tana cicchaktitō kaliyuṭavalananē ā prakṛti vikāramulalōnuṃḍi maṟiyoka vastuvu puṭṭucunnakṣdi. ī sṛṣṭi aṃtaṭilōnu ē oka vastuvunuṃḍi iṃkoka vastuvu puṭṭinanu aṃdulō bhagavaṃtuni śakti yunnadani ceppavalenu - tatvamulanniyu okadānilōnuṃḍi okaṭi puṭṭinavē).

(cūḍumu śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 4 - 202)

- - - gaganaṃbu kālamāyāṃsa yōgaṃbunaṃ buṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna sparśa tanmātraṃbu valana vāyuvuṃ galigiṃce - pavanuṃḍu nabhōbilaṃbuna rūpa tanmātraṃbuvalana lōka lōcanaṃbaina tējaṃbu nutpadiṃce. tējaṃbu kālamāyāṃśa yōgaṃbuna nuttamaślōkunu vilōkanaṃbuna bavamānayuktaṃbagucu rasatanmātraṃbuvalana naṃbuvula galigiṃce. salilaṃbu kālamāyāṃśa yōgaṃbunaṃ baramēśvarānugrahaṃbu galigi tējōyuktaṃbai gaṃdhaguṇaṃbuvalana bṛdhivigaligiṃce !).

  1. “tadātmānaṃ svayamakuruta” ityātmanaḥ karmatvaṃ kartṛtvaṃ ca darśayati ‘ātānamiti’ karmatvaṃ; svayamakuruta iti kartṛtvaṃ - pūrva siddhōpihi sannatmādi śēṣēṇa vikārātmanāca pariṇama ya māsātmānamitivikārātmanā ca pariṇāmō mṛdādyāsu prakṛtī ṣūpalabdaḥ. “svayamiti” viśēṣaṇānnimittāṃtarā napēkṣatvamapi pratīyatē - pariṇāmāditivā pṛdhak sūtraṃ - tasyaiṣō arthaḥ - itaśca itaścabrahmayatkāraṇaṃ brahma ēva vikārātmanā (a)yaṃ pariṇāma ssāmānādhi karaṇyē nāmnāyatē - “sacca tyaccā bahavat” - ni ruktaṃ cā niruktaṃ cētyādinā iti (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 4 - 27)

(ā brahma tana ātmanu (śarīramunu) tānē svayamugā cēsukonenu. iṭlu ceppuṭavalana ātmaku kartṛtvamu kūḍa ceppabaḍinadi – ‘ātmānaṃ’ anuṭavalana karmatvamu ceppabaḍinadi. ‘svayamakuruta’ ani ceppuṭavalana kartṛtvamu ceppabaḍinadi. tānu aṃtaku muṃdunuṃḍi yunnappaṭiki tananu vikārātmagā mārinaṭlu cēsenu - pariṇamiṃcunaṭlu cēsenu - anagā, maṭṭi kuṃḍa modalaguvāṭigā mārinaṭlu āyenu - iṭlu māruṭayē vikārātma, ‘svayaṃ’ ani ceppuṭavalana svayamugānē tānē itara kāraṇamu lēkanē yani spaṣṭamu - kāraṇamaina brahmayē ī vidhamugā (sṛṣṭilōni vastuvulugā) pariṇamiṃcenu anuṭa samānādhikaraṇyanyāyamu nanusariṃci “ā parabrahmayē jagattunu sṛṣṭiṃci, dānilō tānu pravēśiṃci, ātma vastuvulugānu, anātma vastuvulugānu āyenu” ani śruti ceppucunnadi). “sṛjasyātmānamātmanā” (kumārasaṃbhavamu - kāḷidāsu)

  1. “ātmanaḥ ākāśaḥ saṃbhūtaḥ” (taittirīyōpaniṣat- 2 - 1)

“tattējō asṛjat” (chāṃdōgyōpanṣat - 1- 2 - 3)

“sa imān lōkā na śrjata” (aitarēyōpaniṣat - 4 - 1 - 2)

“ētasmāt jāyatē prāṇaḥ” (muṃdakōpaniṣat - 2 - 1 -3)

(ātmanuṃḍi ākaśamu puṭṭinadi ani taittirīyōpaniṣattulōnu, “ā paramātma tējassu sṛṣṭiṃcenu” ani chāṃdōgyōpaniṣattulōnu, “ā ātma lōkamulanu sṛṣṭiṃcenu” ani aitarēyōpaniṣattulōnu, “ā ātmanuṃḍi prāṇamu puṭṭucunnadi” ani muṃḍakōpaniṣattulōnu ceppabaḍiyunnadi. ī vidhamugā upaniṣattulalō okadānikokaṭigā viruddhamugā, poṃdakuṃḍā, vēṟu vēṟu vidhamulugā sṛṣṭi cēyabaḍinaṭlu ceppabaḍinadi. kāni bhagavaṃtunilōnuṃḍi prakṛti, dānilōnuṃḍi mahattatvamu, dānilōnuṃḍi ahaṃkāramu modalagunavi kramamugā puṭṭinaṭlu ceppabaḍalēdu - kāni idaṃtayu krama sṛṣṭiyē - kramamugā, okadānilōnuṃḍi iṃkokaṭiyē sṛṣṭiṃpabaḍinadi. iṭlu sṛṣṭiṃpabaḍina vāṭi anniṃṭilōnu pravēśiṃci anniṃṭilōnu bhagavaṃtuḍuṃḍuṭavalana bhagavaṃtuḍē kāraṇamu).

  1. “yathā agnēḥ arciṣaḥ savituḥ gabhastayaḥ niryāṃti, (udgaccaṃti). saṃ yāṃti (līyaṃtē) tathā guṇasaṃpravāhaḥ (buddhiḥ, manaḥ, khāni, karaṇāni, śarīra sargāḥ. kāryadēha pravāhaśca) bhagavataḥ prabhavaṃti”.

(agninuṃḍi nippukaṇamulu eṭlu paiki vaccucunnavō (mīdiki egurucunnavō) maṟiyu eṭlu līnamaipōvucunnavō, ā prakāramugānē guṇasaṃpravāhamu (anagā, manassu, buddhi, ākāśamu, iṃdriyamulu modalugā gala dēhamunaku saṃbaṃdhiṃcina sṛṣṭi, kārya dēhamu bhagavaṃtuninuṃḍē kalugucunnavi).

  1. yathāhi parjanyō vrīhi yadādi sṛṣṭau sādhāraṇaṃ kāranaṃ bhavati. ēvaṃ īśvarō dēva manuṣyādi sṛṣṭau sādhāraṇaṃ kāraṇaṃ bhavati.

“yatassarvāṇi bhūtāni bhavaṃtyādi yugāgamē |

yasmiṃśca praḷayaṃ yāṃti pranarēva yugakṣayē ||“. (viṣṇu sahasranāmamulu)

(vrīhiyavalu modalagu dhānyamulaku mēghamu sādhāraṇamaina kāraṇamagucunnadi. atlē dēvatulu,manuṣyulu modalaguvāṭiki īśvaruḍu sādhāraṇakāraṇamu - “modaṭi yugamu prāraṃbhamulō evaninuṃḍi samasta bhūtamulu puṭṭucunnavō yugāṃtamaṃdu evaniyaṃdu layamagucunnavō ataḍē bhagavatuḍu ani ceppiyuṃḍuṭavalana bhagavaṃtuḍē sṛṣṭiki kāraṇamu”).

  1. “ṛṣiyaḥ pitaraō dēvāḥ mahābhūtāni dhātavaḥ |

jaṃgamā jaṃgamaṃ cēdaṃ jagannārāyaṇōdbhavaḥ ||“. (mahābhāratamu -)

(ṛṣulu,pitarulu, dēvatulu, mahābhūtamulu, dhātuvulu, jaṃgamamulu, sthāvaramulu kaligina ī prapaṃcamu nārāyaṇuni valana kaliginadi).

  1. “dyauḥ caṃdrārka nakṣatrākhila diśō bhūrmaheōddhiḥ |

vāsudēvasya vīryēṇa vidhṛtāni mahātmanaḥ ||“. (mahābhāratamu)

(ākāśamu, caṃdruḍu, sūryuḍu, nakṣatramulu, dikkulu, bhūmi, samudramu ivanniyu mahātmuḍaina vāsudēvuniyokka vīryamuvalana (śaktivalana) puṭtinavē).

  1. “tribhirguṇamayai rbhāvairēbiḥ sarvamidaṃ jagat”

(satvarajastamōguṇamulavallanē ī jagattu aṃtayu kaliginadi - adi yeṭlaṃṭē - “bhūtāhaṃkāraṃvalla kagatkāraṇa śarīri ayi tamōguṇayuktuṃḍai jñāna vikṛtitō gūḍi ādi śaktiyuktuṃḍai rudruṃḍanipiṃcukonunu”- “ēka ēva rudrō na dvitīyō yadasti” ani śruti kaladu kanuka. “madhyamōhaṃ” aneḍi taijasāhaṃkāramuvalla jagatsūkṣmaśarīruṃḍai rajō guṇamuvalla vartilina vikṛtibhāvaṃtō gūḍi icchā śaktiyulktuṃḍai hiraṇyagarbhuṃḍanipiṃcukonunu - “hiraṇyagarbhassamavartatāgrē bhūtasya jātaḥ patirēka āsīt” ani śruti palukucunnadi. “uttamōhaṃ” aneḍu vaikārikāhaṃkāraṃvallanunnū brahmāṃḍamaneḍi sthūla dēhuṃḍai mōhanavikṛti bhāvaṃtō gūḍi jñānaśaktuṃḍai virāṭpuruṣuṃḍai viṣṇuṃḍanipiṃcukonunu - “sarvaṃ viṣṇu mayaṃ jagat” ani kaladu kanuka - (ī samasta jagattu viṣṇuvutō niṃḍiyunnadi).

  1. “ca. atani niyuktijeṃdi sacarācara bhūtasamēta sṛṣṭinē

vitatamugā sṛjiṃtu, brabhaviṣṇuḍu viṣṇuḍu prōcu, bārvatī

pati layamoṃdajēyu; hari paṃkarughōdaruḍādi nūrti ya

cyutuḍu triśakti yuktuḍagucuṃḍunu niṃtaku dānamūlamai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 101)

  1. “ma. iravoṃdan druhiṇātmakuṃḍayi ramādhīśuṃḍu viśvaṃbu su

sthirataṃ jēsi harisvarūpiuḍayi rakṣiṃcun, samasta prajō

tkara saṃhāramu jēyunappuḍu hārāṃtaryāmiyai yiṃtayun

hariyiṃcun, bavanuṃḍu mēghamula māyaṃjēyu caṃdaṃbunan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 276)

  1. “kālasvabhāvō niyatiryadṛcchayā bhūtāni yōniḥ puruṣaḥ” -

(kālamu, svabhāvamu, karma, prakṛti, puruṣuḍu anunavi sṛṣṭikāraṇamulu)

(“kālaḥ sarvabhūtānāṃ viparuṇāma hētuḥ; svabhāvō nāma padārthānāṃ pratiniyatā śaktiḥ; agnērauṣṇyamiva niyatiḥ puṇyapāpa lakṣaṇakarma; yadṛcchā ākasmikī prāptiḥ; bhūtāni ākāśādīni, yōniḥ prakṛtiḥ; puruṣaḥ vijñānātmā”).

(samasta bhūtamulu mārpuceṃduṭaku kāranamainadi kālamu; oka cinnabāluḍu pedda maniṣigā māruṭakukālakramamuvalananē. svabhāvamanagā agniyokka vēḍimivale padārthamula naisargikaguṇamu; niyati yanagā puṇyakarma, pāpakarma; yadṛcchā anagā ākasmikamugā prāptiṃcunadi, bhūtamulu anagā ākāśamu modalagunavi, yōni anagā prakṛti; puruṣuḍu anagā jīvuḍu. ivanniyu citra vicitramaina anēka padārthamulugala ī sṛṣṭiki kāraṇamagucunnadi).

  1. “ātmanaḥ ākāśassaṃbhūtaḥ; ākāśādvāyuḥ, vāyōragniḥ; agnērāpaḥ; apībhyaḥ pṛdhivī; pṛdhivyāḥ ōṣadhiyaḥ, ōṣadhībhyaḥ, annaṃ, annāt puruṣaḥ”.

(ātmavalana - bhagavaṃtunivalana ākāsamu puṭṭinadi; ākāśamunuṃḍi vāyuvu, vāyuvunuṃḍi agni, agninuṃḍi nīru, nīṭinuṃḍi pṛdhivi, pṛdhivinuṃḍi ōṣadhulu (sasyamulu), ōṣadhulanuṃḍi annamu, annamunuṃḍi puruṣuḍu - jīvi - puṭṭucunnāru).

  1. “annaṃ vaiprajāpatistatō tadrētastasmāt imāḥ prajāḥ prajāyaṃtē” iti praśnōpaniṣat-

(annamu prajāpati - dāninuṃḍi rētassu kalugucunnadi; ā rētassunuṃḍi prajalu puṭṭucunnāru).

  1. “prajākāmōvai prajāpatiḥ; sa tapō (a)tapyata; sa tapastaptvā sa midhuna mutpādayatē, rayiṃca prānaṃ cētyētēmē bahudhā prajāḥ kariṣyati iti. ādityōha vaiprāṇaḥ, rayirēva caṃdramāḥ, rayirvā ētatatsarvaṃ yanmūrtaṃ cā mūrtiṃ ca; tasmān mūrtirēvarayiḥ”

(praśnōpaniṣat - 4, 5)

(prajalanu sṛṣṭiṃcu kōrikagala prajāpati tapassu cēsenu - tapassu cēsi rayi prāṇamu ī reṃḍunu nā prajñanu anēkavidhamulugā sṛṣṭi cēyagalavu. ādityuḍu prāṇamu; rayi anagā caṃdruḍu rayiyē ī mūrtāmūrtamulu - aṃducēta rayi anagā mūrti. iṃdulō ceppinadānilō prāṇamanagā ādityuḍu - anagā ādityunivale prakāśiṃcu śarīramulugalavanniyu ani arthamu. rayi anagā caṃdruḍu - prakṛti vikāramulanniyu).

  1. sṛṣṭiki kāraṇamu bhagavaṃtuḍanu nokaḍunnāḍā yani saṃśayamu kalugavaccu. “kartāraṃ vinā kāryaṃ nāsti” (karta lēnidē kāryamuṃḍadu) kunuka ī sṛṣṭiki kartayanuvāḍu uṃḍitīravalenu - “yat kāryaṃ tat sakartṛkaṃ”) ēdi kāryamō - cēyabaḍina vastuvō - ākāryamunaku ā kāryamunu cēsinavāḍu - (anagā dāni karta) okaḍu uṃḍavalenu - nahi mṛdvyatirēkēṇa ghatōnāma kaści dupalabhyatē, taḥ kāraṇa vyatirēkēṇa kāryaṃ nāsti: (maṭṭi lēnicō maṭṭikuṃḍa puṭṭadu) - aṃducēta kāraṇamu lani kāryamuṃḍadu - okavastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi. idi manamu cūcucunē yunnāmu - puṭṭina vastuvu kāryamu - eṃdulōnuṃḍi kāryavastuvu puṭṭucunnadō adi dāniki kāraṇamu - bhagavaṃtunilōnuṃḍi prapaṃcamu puṭṭucunnadi kanuka prapaṃcamu kāryamu. adi puṭṭuṭaku kāranamu bhagavaṃtuḍu).

“yadi cā bhāvāt bhāvōtpatirabhyupagamyatē ēvaṃ satyudāsīnāṃ anīhamānānāmapi janānāṃ abhimata siddhisyāt - abhāvasya sulabhatvāt kṛṣīvalasya kṣētrakarmaṇi aprayatimā nasyāpi tasya niṣpattisyāt ; kulālasya ca mṛtsaṃ skriyā yāṃ si priyamānasyāpi tanvānastvēca vastar lābhaḥ svargāpa vargayōśca na kaścit kathaṃ cit sa mīhati, na cai tadujyatē, abhyupagamyatē vā kēna cit, tasmāt anupapannō ayaṃ abhāvāt bhāvōtsatya bhyupagamaṃ” (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē -)

(abhāvamunuṃḍi bhāvamu kaligē māṭuṃṭē - anagā - bhagavaṃtuninuṃḍikāka śūnyaṃlōnuṃḍi - ēdiyu lēni sthitilōnuṃḍi - ī prapaṃcamu puṭṭinaṭlayitē taṭasthaṃgānunna vāḷḷakainā - anagā, prayatnamu cēyani vāḷḷakainā - kōrikalu vāṭaṃtaṭa avē siddhiṃcavalenu - vyavasāyadāruḍu dunnakapōyinā bhūmi paṃḍavalenu - kummarivāḍu tana sāmagritō panicēyakapōyinā kuṃḍa tayārukāvalsiyuṃḍunu. ā mādirigānē dāramulu nēyakuṃḍaganē baṭta tayārukāvalasiyuṃḍavalenu - īlāgunanē evarunū kōrakuṃḍaganē svargāpavargamulu poṃdavaccunu. ī paristhiti kudaradu - sababu kādu - prakṛtiki viruddhamu - aṃducēta abhāvamunuṃḍi bhāvamu utpattikādu - anagā śūnyamunuṃḍi prapaṃcamu (sṛṣṭi) udbhavamukādu. vyāsamaharṣi brahmasūtrālu vrāsēru. aṃdulō moṭṭamodaṭi sūtramu “janādyasya yataḥ” (cūḍumu - 8), asya = ī kanabaḍucunna prapaṃcamunaku, janmādi - janma modalagunavi - anagā, puṭṭuṭa, peruguṭa, naśiṃcuṭa, yataḥ = evanivalla jarugucunnavō adi brahma. dīnivalla ī prapaṃcamu (sṛṣṭi) brahmavalana puṭṭinadi, sṛṣṭiki kāraṇamu - prapaṃcamu kāryamu - aṃducēta brahma anuvāḍunnāḍu anuṭa spaṣṭamu).

  1. “u. evvanicē janiṃcu jagamevvanilōpalanuṃḍu līnamai

evvaniyaṃdu ḍiṃdu, paramēśvaruḍevvaḍu, mūlakāraṇaṃbevvaḍu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 73)

  1. “viśvōdbhavasthiti layādiṣu hētumēkaṃ” (śrīśaṃkaraḥ -) (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 74)

(viśvamunaku - prapaṃcamunaku -sṛṣṭi sgthiti layamulaku okē kāraṇamainavāḍu)

“yēna ityēkatvaṃ vivikṣitaṃ nānātva brahma vidhānā yōgāt yajjagatkāraṇaṃ tadēkaṃ itivāṃ taravākyaṃ yadēkaṃ kāraṇaṃ, tadbrahma itivā, yatkāraṇaṃ tadēkaṃ brahmavā”.

(paina śrī vyāsamaharṣi brahmasūtramulōni, upaniṣattulōnu sṛṣṭiki kāraṇamu brahma yani ceppinapuḍu - “evanivalla” “evanicēta” ani ēka vacanamu prayōgiṃpabaḍuṭacēta brahmatva vidhānamulō - anagā - sṛṣṭi sthiti layamulu cēyuṭalō anēka brahmaluṃḍuṭa posagadu - (no dual Govt or no parallel Govt or plurality of Govt). aṃducēta jagattunaku kāraṇamu okaḍē, adiyē brahma - okaḍē brahma - atanē kāranamu) - ani sūciṃcunu).

  1. “yataḥ sarvāṇi bhūtāni jāyaṃtē - - -” (cūḍumu - 7)

(paina ceppina 7, 8, 24, 25, 26 lō sṛṣṭi kāraṇamu brahma ani ceppinapuḍu ‘evanivalana’ ani ēkavacanamu ceppabaḍinadi - anagā, sṛṣṭiki kāraṇamainavāḍu okkaḍē - atanē brahma - anēka brahmalu lēru - matamulenniyunnanu - āyā matamulalō sṛṣṭiki kāraṇamainavāḍu evaḍō vāniki āyā matamulalō ē pēru peṭṭinanu sṛṣṭi karta okkaḍē. atanini brahma ani ceppuṭaku kāraṇamu atanu vṛddhipoṃdiṃcu vāḍu, vṛddhi poṃduvāḍu kanuka (cūḍumu - brahma) (vāmanāvatāramu)

yaṃ śaivāssamupādsatē śiva iti brahmēti vēdāṃtinaḥ |

bauddhāḥ buddha iti pramāṇapaṭavaṃ, kartēti naiyāyikāḥ |

arhannityadhajainaśāsana ratāḥ karmētimīmāṃsakāḥ |

sōyamnaḥ vidadhātu vāṃchitaphalaṃ śrīrāmacaṃdrō hariḥ ||.

(evanini śaiva matasthulu śivuḍani upāsiṃcucunnārō, vēdāṃtulu brahma yani, bauddha matasthulu buddhuḍani, nyāya matasthulu karta yani, jaina matasthulu arhan ani, mīmāṃsakulu karmayani (sṛṣṭiki kāraṇamani) upāsiṃcedarō, aṭlu anadṟiki ēdō oka pērutō sṛṣṭikarta ayina vādaina nā abhīṣṭadaivamu ayina śrīrāmacaṃdruḍu manaku kōrina phalamu niccugāka) -

arhan = sarvajñō jitarāgādi dōṣa strailōkyupūjitaḥ |

yathā sthitārthavādī ca dēhōrhan paramēśvaraḥ |

(A superior divinity with the jains)

(jaina matamulō mukhya dēvata yaina paramēśvaruḍu).

(1) sṛṣṭikāraṇamu 1va vibhāgamu lō ceppabaḍina prakāramu ‘ātma’ anunadi okkaṭē sṛṣṭiki pūrvamuṃḍenu - aṭuvaṃṭi ātma maṟiyokaṭi lēdani kūḍā ceppabaḍenu. dīnini baṭṭi ātma anunadi okaṭē yanuṭa niścayamu

(2) “tat sṛhsṭan tadēvānu prāviśat, tadanu praviśya sacca tyacca abhavat” ā ātma sṛṣṭiṃcina lōkamulanniṃṭilōnu - āyā lōkamulalōni vastuvulanniṃṭilōnu - pratidānilōnu pravēśiṃci - dānilō pūrtigā vyāpiṃci, aṃdulōnu ātma vastuvulu, anātma vastuvulugā tānē āyenu - iṃkoka ātma yuṃḍi yiṭlu cēyuṭaku avakāśamu lēdu - iddaru ātmalu okē pani cēyuṭa jaragadu - aṃducēta ātma - paramātma - parabrahma anuvāḍu okkaḍē). oka oralō reṃḍu kattulu imuḍavu - (Two swords cannot go into ona and the same scabbard)

(3). “ēkō dēvaḥ sarvabhūtāṃtarātmā”

(samasta bhūtamula lōpala aṃtarātmagānunnavāḍu okē dēvuḍu) ani ceppuṭavalana kūḍā yiṃkoka (sṛṣṭi karta ayina) dēvuḍu - (parabrahma) lēḍu anuṭspaṣṭamē).(Only one Energy pervades all things in the entire creation)

(4). (“harimayamu viśvamaṃtayu” ani ceppuṭavalana prapaṃcamaṃtā - prapaṃcamulōnunnadaṃtā – śrīhariyē, parabrahmamē ani ceppuṭavalana prapaṃcamaṃtanu - ē mūla cūcinanu - maṟiyoka brahma uṃḍuṭaku avakāśamu lēdu. aṃducēta parabrahma anuvāḍu - sṛṣṭi aṃtaṭiki kāraṇamainavāḍu okkaḍē anuṭaku saṃdēhamu lēdu).

(5). “taṃdanāna - - - taṃdanāna |

brahma mokkaṭē parabrahma mokkaṭē |

brahmamokkaṭē parabrahma mokkaṭē |

kaṃduvagu hīnādhikamu liṃdulēvu |

aṃdaṟiki śrīharē aṃtarātma ||“. (annamācāryulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.