(సృష్టి ఈ క్రింద చెప్పిన వరుసలో - క్రమములో - జరిగినది : -
ఆత్మవలన ఆకాశము పుట్టినది, ఆకాశము వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన నీరు, నీటివలన భూమి, భూమివలన ఓషధులు, ఓషధులవలన అన్నము, అన్నమువలన పురుషుడు - జీవుడు - కలిగినవి).
హవ్యవాహనమందు నంబువులుదకంబు లుదకంబువలన వసుంధర గలిగె, ధాత్రి
వలన బహు ప్రజావళి యుద్భవంబయ్యె, నింతకు మూలమై యెసగునట్టి
నారాయణుండు - - -“. (శ్రీమధాంధ్రమహాభాగవతము - 2 - 10 - 278)
వ. - - - ఈశ్వరాధిష్ఠి తంబైన ప్రకృతి యంశంబున మహత్తత్వంబగు; మహత్తత్త్వాంశంబున నహంకారంబగు; అహంకారాంశంబున శబ్ద తన్మాత్రంబగు; శబ్ద తన్మాత్రాంశంబున గగనంబగు; గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు; స్పర్శతన్మాత్రాంశంబునసమీరణంబగు; సమీరణాంశంబున తన్మాత్రంబగు; రూపతన్మాత్రాంశంబువలన దేజంబగు, తేజోంశంబున రసతన్మాత్రంబగు; రసతన్మాత్రాంశంబువలన జలంబగు, జలాంశంబున గంధతన్మాత్రంబగు; గంధతన్మాత్రాంశంబువలన బృధివియగు, వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూపంబగు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)
“సీ. ధృతి బొని కాలచోదితము, నవ్యక్తంబు, బ్రకృతియునను పేళ్ళ బరగు మాయ
వలన మహత్తత్త్వమెలమి పుట్టించె; మాయాంస కాలాది గుణాత్మకంబు
నైన - - -
- - - మహత్తత్త్వమందు నోలి
తే. గార్య కారణ కర్త్రాత్మకత్వమైన
మహిత భూతేంద్రియక మనో మయమనంగ
దగు నహంకార తత్వముముత్పన్నమయ్యె
గోరి సత్వరజస్తమో గుణమగుచు
వ. - - -రూపాంతరంబులబొందుచున్న సాత్వికాహారంబువలన మనంబును, వైకారిక కార్యభూతంబులైన అనేంద్రియదేవతా గణంబులును సంభవించె. ఇంద్రియాధిష్ఠాతలైన వాని వలన శబ్దంబు పూర్వంబున ప్రకాశంబగుటం జేసి జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుశ్రోత జిహ్వాఘ్రాణంబులును, గర్మేంద్రియంబులైన వాక్పాని పాదపాయూపస్థములును దైజసాహంకారంబుననిత్పన్నంబులయ్యె. తామసాహంకారంబువలన శబ్ద స్పర్శ రూప రస గంధంబులుదయించె. అందు నిజగుణంబయిన శబ్దంబువలన నాకాసంబు బుట్టించె. గగన్మబు గాలామాయాంశయోగంబునం స్పర్శ తన్మాత్రంబువలన వాయువు గలిగించె, బవనుండు నభోలంబున రూపతన్మాత్రంబువలన లోక లోచనంబైన తేజంబు నుత్పాదించె. తేజంబు గాల మాయాంశయోగంబున బవమానయుక్తంబగుచు రసతన్మాత్రంబువలన నంబువులం బుట్టించె. సలిలంబు గాల మాయాంశ యోగంబున తేజో యుక్తంబైన గంధగుణంబువలనం బృధివి గలిగించె - అందు గగనంబునకు శందంబును, వాయువునకు శబ్దస్పర్శంబులును, దేజంబునకు శబ్ద స్పర్శ రూపంబులును, సలిలంబునకు శబ్ద స్పర్శరూప రసంబులును, బృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధంబులును గుణంబులై యుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 198 to 202)
(ముండకోపనిషత్)
(ప్రజ్వలించిన అగ్నినుండి వేలకొలది విస్ఫులింగములు అగ్ని రూపములో పుట్టుచున్నవి. ఆ ప్రకరముగానే అక్షరుడగు పరబ్రహ్మనుండి అనేక విధములైన భావములు పుట్టుచున్నవి. అగ్నిలో లీనమైయుండు విస్ఫులింగములే పైకి వచ్చుచున్నట్లు భగవంతునిలో లీనమైయున్న జీవులే పుట్టుచున్నవి).
(బాగుగా ప్రజ్వలించిన అగ్నినుండి అగ్నియొక్క అవయవములే అయిన, అగ్ని లక్షణములే కలవిన్నీ అయిన, విస్ఫులింగములు ఎట్లు పుట్టుచున్నవో, ఆ ప్రకారముగానే పరబ్రహ్మనుండి పరబ్రహ్మనుండి అనేక దేహములను ఉపధిభేదములవలన అనేక విధములుగా జీవులు పుట్టుచున్నవి, మఱియు ఆ పరబ్రహ్మమందే లీనమగుచున్నవి).
(కాచిన ఇనుప ముక్కనుండి సమ్మెటచే కొట్టబడుచుండగా దానినుండి - దాని అగ్నినుండి ఆ అగ్ని రూపములే అయిన అనేకమైన విస్ఫులింగములు పుట్టినట్లుగనే సూక్ష్మ చిదచిత్ శరీరము గల అక్షరుడైన పరబ్రహ్మనుండి కార్య రూపములైన చిదాచిత్ సూక్ష్మ వస్తువులు అనేకములు పుట్టుచున్నవి. మఱియు ఆ పరబ్రహ్మమందే లీనమగుచున్నవి).
(లోకములో ఇతర కారణము - సహాయము - నపేక్షింపకయే సాలెపురుగు స్వయముగనే తన శరీరముకంటె వేరుగానటువంటి దారములను తన శరీరములో నుండియే పైకి ప్రసరించును, మరల వాటిని తనలోనికే తీసుకొనుచున్నది - తనలోనే కలుపుకొనుచున్నది. భూమియందు వ్రీహి, యవలు మొదలుకొని స్థావరములవరకు గల ఓషధులు తమకంటె వేరు కాని వాటిని పుట్టించుచున్నవి. ఇట్లే - ఈ దృష్టాంతముల ప్రకారమే అక్షరుడు (క్షీణింపనివాడు) అగు పరబ్రహ్మనుండి, మఱియొక కారణము లేకుండగనే తనవంటి లక్షణములుగల వస్తువు పుట్టుచున్నట్లుగా ఈ సంసార మండలమందు ఈ జగత్తు అంతయు ఉన్నది)
(సాలె పురుగు తన హృదయములో నుండి నోటిద్వారా పైకి వచ్చిన దారములతో క్రీడించి - గూడు కట్టుకొని - మరల దానిని తనలోనకు గ్రహించునట్లే భగవంతుడు తనలో నుండి యీ ప్రపంచమును - ప్రపంచములోని వస్తువులను - సృష్టినంచినట్లు పైకి వదలి, మరల వాటిని సణరించినట్లు తన లోనికి గ్రసించును - తీసుకొనును).
(సాలె పురుగు గూడు నిర్మించదలచినది కాన అది గూడునకు నిమిత్త కారణము - దానిలోనుండి వచ్చిన దారము జదలు దానితో గూడుకు కావలసిన దారము అల్లుకొనినది కనుక ఉపాదానకారనము కూడ అయి యున్నది. గూడు అల్లుకొనుటకు కావలసిన దారము ఉపాదానము - ఆ దారము సాలె పురుగులోనుండియే తనలోనుండియే - వచ్చినది కనుక సాలె పురుగు గూడుకు ఉపాదానకారణము కూడ అయినది. అట్లే భగవంతుడు చిచ్ఛక్తి గలవాడు. అతనిలోనుండి పుట్టిన ప్రకృతి జడము. ప్రపంచమును సృష్టి చేయుటకు ఉపదానముగా (Material) గా భగవంతుడు పయోగించుకొనెను - అది భగవంతునిలోనుండి పుట్టినదే కనుక భగవంతుడు సృష్టికి ఎఉపాదానకారణము కూడా అయి యున్నాడు. ఇట్లు భగవంతుడు సృష్టికి నిమిత్త కారణము, ఉపాదానకారణముకూడ అయి యున్నాడు - సాలె పురుగువలె - ఈ ప్రకృతి జదమగుటవలన - ఏమియు చేయలేనిదగుటవలన - దానిలో భగవంతుడు తన చైతన్య శక్తితో ప్రవేశించెను - అప్పుడు ప్రకృతికి చైతన్యము కలిగి తనలోనుండి మహత్తత్త్వమును పుట్టించెను - ఈ రెండును కలియుటవలన ప్రపంచములోని వస్తువులోని వస్తువులన్నియు, ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టినవి).
(చైతన్యము గల సాలెపురుగు తనలోపలనుండి జడపదార్థమగు గూడు అల్లుకొను దారము అనయాసముగా - అప్రయత్నముగా పుట్టించుచున్నదో, అగ్నినుండి విస్ఫులింగములు - ఎట్లు ఎగురుచున్నవో, అట్లే చేతనాచేతనములుగలదియు జడమైనదియు అగు జగత్తు ఆ భగవతి యైన దేవినుండి పుట్టుచున్నది).
(మర్రి చెట్టు యొక్క విత్తనమువలననే ఒక పెద్ద మర్రిచెట్టు ఎట్లు పుట్టుచున్నదో అట్లే నీటిలో శయనించి సమాధి చాలించిన నీ యొక్క (భగవంతుని యొక్క) బొడ్డునుండి నీలోనే గూఢముగానున్న ఒక పెద్ద పద్మము- లోకరూపములో నున్న పద్మము, లేక పద్మ రూపములో నున్న లోకములు పుట్టెను. కాలమను తన శక్తిచేత నిద్రమేల్కొనినట్లు చేయబడిన ప్రకృతి ధర్మములు అనగా సత్వరజస్తమోగుణములు అను ప్రకృతి ధర్మములు కలిగెను).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 4 - 202 లో చెప్పిన ప్రకారము - (చూడుము - సృష్టి కారణము-9 (7)). ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టునపుడు - శ్రీభగవంతుని “విలోకనంబున”, “బరమేశ్వరానుగ్రహ్మబు గలిగి”, అను వాక్యములు తప్పనిసరిగా కనబడుచున్నవి. దీనివలన తెలియవచ్చునదేమనగా ప్రపంచకమంతటిలోను ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టినపుడు భగవంతుని శక్తి కారణవస్తువులో నుండి దానిచేత ఆ పనిచేయించినది అని గ్రహించవలెను - కారణవస్తువులో భగవంతుడు తంబ చైతన్యశక్తిలో లేనియడల కార్యవస్తువు పుట్టదు - ఆత్మ అనగా “కారణాత్ కార్యముత్పాదయతి ఇతి ఆత్మా” అని చెప్పబడినది. (కారణవస్తువులోనుండి కార్యవస్తువును పుట్టించునది ఆత్మ). అందుచేత సృష్టి ప్రారంభమైనది లగాయితు ఇప్పటివరకు ఈ తర్వాత కూడా సృష్టి యిట్లే కరుగును. భగవంతుని ప్రమేయము లేనిదే సృష్టి జరుగదు).
(ఇప్పుడు నామ రూపములతో కనబడుచున్న ప్రపంచము అంతయు మొదట - సృష్టికి పూర్వము - ఒక ‘సత్’ పదార్థముగానే యుండెను - సత్ రూపముగానే యుండెను - అ సత్పదార్థము నిత్యముక్తము, అవిక్రియము, సత్యజ్ఞానానందము, పరిపూర్ణము, సనాతనము, ఏకము, అద్వితీయము అయిన పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమందు ఎండమావులు ముత్యపు చిప్ప, స్థాణువు, స్ఫటికము,వెండి, పురుషుడు, రేఖ వలెనే లోహిత శుక్లకృష్ణ గుణములుగలదిన్నీ, త్రిగుణములు సమానముగానున్నదిన్నీ, ఇట్టిది అని చెప్పుటకు అలవికానిదిన్నీ అయిన మూల ప్రకృతి యుండెను. దానిలో ప్రతిబింబించిన సాక్షి చైతన్యముండెను - అది వికారమును పొంది సత్యగుణముతో ఉద్రిక్తమై అవ్యక్తమను పేరుగల ఆవరణ శక్తి యుండెను - దానిలో ప్రతిబింబించినది ఈశ్వరుని శక్తి. అతనే మాయను స్వాధీనము చేసుకొనినవాడు - జగరల అత్తునకు అంకురముగా (మొలకగా) నుండువాడు. అతను తనలో లీనమైన సమస్త జగత్తును ఆవిర్భవింపచేయును, పుట్టినట్లు చేయును. ప్రాణుల కర్మవశమున (కర్మను బట్టి) ప్రసరింపచేసి (నడిపించి), వారి కర్మలు క్షీణించగనే వాటిని తనలో కలిసి పోయినట్లు చాఎయును - మడత పెట్టబడిన బట్టవలె అతని యందే ఈ ప్రపంచమంతయు ఉండును - (సూక్ష్మరూపములో అణగి యుండును). ఈశ్వరునిచేత అధిష్టించబడిన ఆవరణ శక్తివలన రజోగుణముచే ఉద్రేకము చెందినదై మహత్తత్త్వమను విక్షేప శక్తి ఆయెను - దానిలో ప్రతిబింబించిన చైతన్యము హిరణ్యగర్భ చైతన్యమాయెను - ఆ మహత్తత్త్వమును అధిష్టించియుండు చైతన్యము స్పష్టా స్పష్ట శరీరము (రూపము) కలదాయెను - హిరణ్య గర్భుని అధిష్టించియున్న నిక్షేప శక్తినుండి తమో గుణముచే ఉద్రిక్తమైన అహంకారమను పేరు గల స్థూల శక్తి కలిగెను - దానిలో ప్రతిబింబించిన చైతన్యము విరాట్ చైతన్యమాయెను - అది ఆ విరాట్ చైతన్యమును అభిమానించి స్పష్టమైన శరీరము (ఆకారము) గలవాడు, అన్ని స్థూలరూపములను పాలించువాడు, ప్రథానపురుషుడు అగు విష్ణువాయెను. ఆ ఆత్మనుండి ఆకాసము పుట్టినది - (కలిగినది). ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి పుట్టినవి. అవి తన్మాత్రములు - త్రిగుణములు కలవి. జగత్తునకు కారణమైన పరబ్రహ్మ సృష్టి చేయ సంకల్పించి తమో గుణము నధిష్టించి, సూక్ష్మములు తన్మాత్రములు అయిన భూతములను స్థూల భూతములుగా చేయుటకు సంకల్పించెను - భూతములను ఒక్కొక్కదానిని రెండుగా చేసి, మరల ఒక్కొక్కదానిని నాలుగు భాగములుగా చేసి, ఒక్కొక్క దానిలో ఇతర భూతముల అంశలను అయిదు విభాగములుగ చేసి వాట్లను కలిపి, ఇట్లు పంచీకృతము చేయబడిన భూతములతో అనంతకోటి బ్రహ్మాండములను, ఆయా అండములకు ఉచితమైన పదునాలుగు లోకములను, ఆ లోకములకు స్థూల సరీరములను సృజించెను. ఆ పంచభూతముల యొక్క రజో గుణాంశములను నాలుగగా చసి మూడు భాగములతో అయిదు వృత్తులుగల ప్రాణమును ప్రాన, అపాన, వ్యాన, య్దాన, సమానములను) సృష్టించెను. మిగిలిన నాలుగు అంసలతో కర్మేంద్రియములను, సృష్టించెను -ఆ పంచభూతముల సత్వగుణాంశమును నాలుగుగా చేసి మూడు భాగములతో అయిదు విధముల వృత్తులుగల అంతఃకరణమును సృష్టించెను - సత్వగుణము యొక్క నాలుగవ భాగముతో జ్ఞానేంద్రియములను సృష్టించెను- సత్వ సమష్టితో ఇంద్రియాధి దేవతలను సృష్టించెను. అట్లు సృష్టించిన వాటిని అండమందుంచెను - అట్లు అండమందున్నవి స్పందన కలిగి చేష్టించుటకు (చేతనత్వము కలిగియుండుటకు) శక్తి లేక యుండెను. వాటిని చేతనములుగా చేయుటకు బ్రహ్మ సంకల్పించెను - బ్రహాండమును బ్రహ్మరంధ్రములను వ్యష్టి వస్తువులను బద్దలు చేసి (భేదించి) వాటిలో ప్రవేశించెను. అప్పుడు జడములైన అవి చేగ్తంత్వము గలవి యై వాటి వాటి కర్మలను చేసెను).
(సృష్టిలోని వస్తువులన్నియు యెట్లు పుట్టినవో శ్రీమదాంధ్రమహాభాగవతము - స్క.3 - అధ్యా. 4 లో వివరముగా చెప్పబడినది).
తే. బుద్ధి దోచిన నమ్మహా పురుషవరుడు
గార్య కారణ రూపమై ఘనతకెక్తి
భూరి మాయాభిదాన విస్ఫురిత శక్తి
వినుతికెక్కిన యట్టి యవిద్యయందు
“క. పురుషాకృతి నాత్మాంశ
స్ఫురణముగల శక్తి నిలిపి పురుషోత్తము డీ
శ్వరడభవుండజుడు నిజో
దర సంస్థిత విశ్వమపుడు దగ పుట్టించెన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 199 - 200)
(భగవంతుడు తన శక్తియే (జడశక్తియే) అయిన మాయ యందు తనయొక్క శక్తియే అయిన, అంస అయిన చిచ్ఛక్తితో పురుష రూపముతో ప్రవేశించి, తనలో కారణరూపములో నున్న ప్రపంచమును పుట్టించెను - ఇందువలన జగత్తునకు అతను తండ్రి, ప్రకృతి తల్లి –
“మయాధ్యక్షేణ ప్రకృతిస్సూయతే స చరాచరం |”,
“అహం బీజ ప్రదః పితా” - ఇందువలననే అతను ఆది పురుషుడు - ప్రథమ సంసారీ - అని కూడ చెప్పబడుచున్నాడు - “(జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”). జగత్తు సృష్టికి ఇద్దరు కారణమగుటవలన తల్లి, తండ్రి అయిన పార్వతీ పరమేశ్వరుల గుఱించి నమస్కరించుచున్నాను).
అసీత్త దీక్షణా జ్జాతం జగత్సర్వం చరాచరం |
ఆప ఏవ సస్ర్జాదౌ తా స్వవాత్సీద్య యతః స్వయం |
తేన నారాయణ ప్రోక్తః పరం బ్రహ్మాఖ్య ఈశ్వరః |
సృష్ట్వేదంజగత్సర్వం చికీర్షుస్తస్య స్థితిం |
స సర్జ బ్రహ్మ రూపేణ మరీచ్యాది ప్రజాపతీన్ ||. (గీతాభావ ప్రకాశము - 1 - 1 to 9)
(నారాయణుడను పేరుగల పరబ్రహ్మ సృష్టికి పూర్వముండెడివాడు - ఈక్షణమాత్రమున అతను ఈ సృష్టినంతను సృష్టించెను. అతను మొట్తమొదట జలమును సృష్టించెను) –
“వ. అతండె పరమాత్మయను నమ్మహాత్ముండుల్ లీలార్ధంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖశయనంబు నపేక్షించి మొదల జలతత్వంబు సృజ్యించె. స్వతః పరిశుద్ధుండుగావునస్వసృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశుయందు శయనంబు జేయుటం జేసి - - - నారాయణ శబ్ద వాచ్యుండు - - - సర్వేశ్వరుండు దానే కమయ్యుననేకంబుగా దలంచి” (శ్రీమదాంధ్రమహాభావతము - 2 - 10 - 268)
(The first element created was Hydrogen - (water - or hydrogen gas) –
“ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై సరసూనవః |
తా యదస్యాయనం పూర్వే తేన నారాయణః స్మృతః ||“.
(జలములు నరుడు - (నశించనివాడు) - అయిన భగవంతునినుండి పుట్టినవి. అందుచేత అవి నారములు అని చెప్పబడినవి. అందులో - ఆ నారములలో - శయనించువాడు కనుక భగవంతుడు నారాయణుడని చెప్పబడినాడు - “సుఖ శయనంబు నపేక్షించి” అని చెప్పుటవలన Life thrives in water or Hydrogen gas - నీటిలో ప్రాణవాయువున్నది యని (Hydrogen plus Oxygen = water). “అప్సుమే సోమో అబ్రవీత్ అంతర్విశ్వాని భేషజం, అగ్నించ విశ్వశంబువం”.
“మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్టితం ||”. అని శ్రుతి - (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)
భాతి చిచ్ఛక్తి సమేతుడై కపట నిద్రాలోలుడగుచు నిమీలితాక్షు
డైన నారాయణుండు మధ్యమున - - -
తే. తల్పమున బవ్వళించి, య నల్ప తత్వ
దీప్తి జెన్నొందగా నద్వితీయుడగుచు
- - -
- - -
తే. యోగమాయా విదూరుడై యుగ సహస్ర
కాల పర్యంత మఖిల లోకములు మ్రింగి
పేర్చి మఱి కాల శక్త్యుప బృంహితమున
సమత సృష్టి క్రియా కలాపముల దగిలి
క. తన జఠరములోపల దా
చిన లోక నికాయముల సృజించుటకును సా
ధనమగు సూక్ష్మార్థము మన
సునగని కాలానుగత రజోగుణమంతన్
సీ. పుట్టించె, దద్గుణంబున బరమేశ్వరు నాభిదేశమునందు నళిన నాళ
ముదయించె; మఱియు నప్పయోరుహ ముకుళంబు గర్మ బోధితమైన కాలమందు
దన తేజమన బ్రవృద్ధంబైన జలముచే జలజాప్తుగతి బ్రకాశంబు నొంద
జేసి లోకాశ్రయ స్థితి సర్వగుణ విభాసిత గతినొప్పు రాజీవమందు
తే. నిజకళా కలితాంశంబు నిలిపి దాని
వలన నామ్నాయమయుడును వర గుణుండు
నాత్మ యోనియు నైన తోయజభవుండు
సరవిజతురాననుండు నా జనన మొందె.
తే. - - - కమల కోశ
లీనమైయున్న లోక వితానములను
నొయ్య బొడగని - - -
తే. - - - యవ్వన రుహంబు
లోపలికి బోయి మున్నందులోన నున్న
ముజ్జగంబుల జూచి, యిమ్ముల సృజించె
మఱి చతుర్దశభువనముల్ మహిమ జేసి
క. పరగ సుధాశన తిర్య
ఙ్నర వివిధ స్థావరాది నానా సృష్టి
స్ఫురణ నజుం డొనరించె - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 8 - 272 etc - ; 3 - 10 - 336 to 338)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)
(వివేకచింతామణి - 1)
మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)
(సృష్టి ప్రారంభములో సప్త మహర్షులు, మనువులు నా అంసలో, నా మనో సంకల్ప మాత్రమున పుట్టిరి. వారినుండి ఈ లోకములోని ప్రజలు పుట్టిరి - మనువుల సంతతి కనుక మానవులు).
“తస్య చ బిందోః కాలక్రమేణ చిదచిదంశవిభాగాత్ త్రైవిధ్యముక్తం_”
కాలేన బిధ్యమానస్తు స బిందుర్భవతి త్రిథా |
స్థూల సూక్ష్మ పరత్వేన త్గస్య త్త్రైవిధ్య మిష్యతే |
స బిందునాదబీజత్వభేదేన చ నిగప్యతే ఇతి.
అబిదంశః స్థూలో బీజం, చిదచిమిశ్రం సూక్ష్మో నాదః స ఏవ పురుషః చిదంశః పరో బిందుః. స ఏవ ఈశ్వరః. తయ్స చత్రిథా విభాగసమయే శబ్ద బ్రహ్మ పరనామధేయస్య రవస్య ఉత్పత్తిరుక్తా “బిందోస్తస్మాద్భిద్యమానాత్ రవో అవ్యక్తాత్మకో భవేత్. సరవః శ్రుతి సంపన్నైః శబ్ద బ్రహేతి గీయతే” ఇతి. స ఏవ శబ్ద బ్రహ్మత్మకో రవః జగదుపాదాన బిందుతాదాత్మ్యేన సర్వ గతోపి - ప్రాణినాం మూలాధారే అభివ్యజ్యతే.
స తు సర్వత్ర సం స్రూతో జాతే భూతాకారే పునః |
ఆవిర్భవతి దేహేషు ప్రాణినామర్థ విస్తృతః
“తత్రాపి మూలాధార ప్రదేశేతస్యానుస్యూతస్య రవస్య సంస్కృత వన బలన అభివ్యక్తిరావిర్భావః”.
(ఈ రవమే శరీరములోని వాయువుతో కలిసి పరావాక్కు, పశ్యంతీవాక్కు, మధ్యమావాక్కు, వైఖరీవాక్కుగా పరిణమించును).
(నియతకాలములో ఫలము నిచ్చుటకు పరిపర్వమునకు వచ్చిన ప్రాణుల కర్మలలో అనుభవము వలన క్షీణించిపోయిన కర్మలు గలదిన్నీ, పరిపాకమును పొందినప్పటికీ అనుభవము కానందున (సమయము రానందున) సమయము వచ్చువరకు ప్రాకృత ప్రలయమందు మాయతో - ప్రకృతితో - కూడ సమస్త ప్రపంచము భగవంతునిలో లీనమై యుండును - అవ్యక్తమనగా మాయ, అవ్యక్తము యొక్క సమ్యక్ ప్రళయము అనగా మోక్షమువలె పూర్తిగా నశించుటకాదు. కర్మ పరిపాకము పొందనివి కాలక్రమమున సమయము వచ్చినపుడు, వాటి ఫలముల నిచ్చుటకు సమయము వచ్చినపుడు, భగవంతునికి సృష్టి చేయుటకు ఉద్దేశము కలుగును - అదియే మాయ యొక్క (ప్రకృతి యొక్క) వృత్తి - గుణము, సృష్టిచేయు గుణము. ఈ స్థితిలోనున్న మాయ (ప్రకృతి అవస్థయే “ఈక్షిత” (చూచెను), “కామయత” (కోరెను - కోరిక కలిగెను); తపః (తపింప చేయుట) - అనగా భగవచ్ఛక్తి ప్రకృతితో కలిసి ప్రకృతికి క్షోభ కలిగింపచేయుట - పెరుగు మధించగా వెన్న వచ్చినట్లు, పాల సముద్రములో తఱచినట్లు - అను మొదలగు శబ్దములతో (మాటలతో) ఉపనిషత్తులలో చెప్పబడెను. అది యెట్లనగా - తదైక్షత “బహుస్యాం ప్రజాయేయ” (అనేకముగా నేనే పుట్టినట్లు చూచెదను) అని ఛాందోగ్యమునందునూ; “తదైక్షత లోకాన్ను సృజా” (లోకములను సృజించెదను) అని ఐతరేయోపనిషత్తులోను, “సో అకామయత బహుస్యాం ప్రజాయేయ” (నేను అనేకముగా పుట్టెదను) అని పరమాత్మ కోరెను - అని తైత్తిరీయోపషత్తులోను; “తపసా చీయతే బ్రహ్మ” అని ముండకోపనిషత్తులోను చెప్పబడినది. పరబ్రహ్మ ప్రకృతిలో ప్రవేశించియుండి దానితో సంబంధము కలిగియుండుటవలన, తనలోనే యున్న ప్రపంచమును సృష్టించుటకు (తనలోనుండి పైకి వదలుటకు) ఉన్ముఖుడగును - సిద్ధమగును - ఈ అవస్థ ప్రపంచసారము అను గ్రంధమందు “విచికీర్ష” అని చెప్పబడినది - “విచికీర్షుర్ఘనీ భూతోక్వ చిదభ్యేతి బిందితాం” (అట్లు చేయ దలచినదానినుండి కొంత ఘనీభూతమై (కరడుగట్టి) బిందువుగా నగును అని దీని భావము. పరిపక్వముగాని కర్మ భాగమగుటవలన కరడుకట్టుట - బిందువుగా మారుట. ఇట్లు చేయూకోరుటే విచికీర్షా అని చెప్పబడెని. పరిపక్వమైన కర్మల పరిణామమును పొందిన మాయాభాగము బిందువు - అవిభాగమైన అవస్థయే అవ్యక్తమని చెప్పబడినది - “తస్మా దవ్యక్తముత్పన్నం త్రిగుణం” (దానినుండి సత్వరజస్తమోగుణములుగల అవ్యక్తము పుట్టినది అని చెప్పబడినది. అదియే ప్రపంచమునకు అంకురము - (మొలక, విత్తనము); దానినుండియే ప్రపంచము పుట్టినది - ప్రపంచము పుట్టుటకు అది కారణము - అదియే అధ్యాత్మమని, అదారాధేయములు మొదలగు వాటిని ప్రకటింపచేయునది; కారణ కార్య వస్తువులను పుట్టించునదియు, కుండలి మొదలగునవియుగా చెప్పబడుచున్నది. “తస్య చ బిందోః కాలక్రమేణ చిదచిదంశవిభాగాత్ త్త్రైవిధ్యముక్తం”. ఆ బిందువు కాలక్రమువలన చిద్వస్తువులు, అచిద్వస్తువులూను విభాగముతో మూడు విధములాయెను అవి బిందువు (బీజము), స్థూలము. సూక్ష్మము అని మూడు విధములుగా చెప్పబడుచున్నవి. దాని అచిత్ అంశ బీజము, చిద చిత్తులు కలిసినది సూక్ష్మము, నాదము. బిందువు యొక్క చిదంశయే పురుషుడు, పరమ పురుషుడు. అతనే ఈశ్వరుడు. ఆ బిందువు పేలి మూడుగా విభజించబడిన సమయమందు శబ్ద బ్రహ్మము అను పేరు గల రవము (శబ్దము) పుట్టినదని చెప్పబడినది. ఎట్లంటే –
“బిందోస్తస్మాత్ భిధ్యమానాత్ రవో అవ్యక్తాత్మకో భవేత్ |
సరవః శ్రుతి సంపన్నై శబ్ద బ్రహ్మేతి గీయతే”
(ఆ బిందువు పేలిపోయినప్పుడు అవ్యక్తాత్మకమైన (అవ్యక్తమునకు సంబంధించినదైన) రవము (శబ్దము) అగును - ఆ రవము శ్రుతిసంపన్నులచేత - వేదాంతులచేత - శబ్ద బ్రహ్మమని చెప్పబడుచున్నది. అట్లు పుట్టిన ఆ రవమే - శబ్దమే - జగత్తునకు జగత్తునకుపాదాన కారణమైన బిందువు యొక్క తాదాత్మ్యమే యగుటవలన అన్నింటిలోను ప్రవేశించియిన్నవాడైనను ప్రాణులలో జీవులలో మూలాధారమందు దాని వృత్తి తెలియబడుచున్నది. ఈ రవమే మానవ శరీరములో ప్రవేశించి వాయువుతో కలిసి ఆయా స్థానములలో పరావాక్కు అనియు, పశ్యంతివాక్కు అనియు, మధ్యమావాక్కు అనియు, వైఖరీవాక్కు అనియు పరిణామము చెంది - మార్పు చెంది - చెప్పబడుచున్నది).
(పైన చెప్పబడిన బిందువే బ్రహ్మాండము - అండాకారముగా, కోడి గ్రుడ్డు ఆకారముగా) నున్న బ్రహ్మ - (చతుర్ముఖబ్రహ్మ). దీనిని ఆధునిక శాస్త్రజ్ఞులు “COSMIC EGG” అని చెప్పుదురు. బ్రహ్మాండము బ్రద్దలగుటయే బ్రహ్మాండ భేదనము. దాని వలన కలిగిన రవమే - శబ్దమే - “BIG BANG” అని చెప్పబడినది - (చూడుము - “బ్రహ్మాండము”). బ్రహ్మాండము పగిలి దాని ముక్కలు వేర్వేఱు ప్రపంచములుగా ఆకాశములో విరజిల్లుకు పోయినందున దానినుండి లోకములు, లోకములోని చరాచర వస్తువులు పుట్టినవి).
డఖిల ధృతి జగన్నియంతయైన
చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా
పతుల ఋషుల మనుల బితృవరులను
సీ. సుర సిద్ధ సాధ్య కిన్నర, నర, చారణ, గరుడ, గంధర్వ, రాక్షస, పిశాచ,
భూత, భేతాళ, కింపురుష, కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాశుధాన
విద్యాధరో ప్సరో, విషధర, గ్రహ, మాతృగణవృక, హరి, ఘృష్టి, ఖగ, మృగాళి
భలూక రోహిత పశు వృక్ష యోనుల వివిధ కర్మంబులు వెలయ బుట్టి
తే. జల నభో భూతలంబుల సంచరించు
జంతురాసుల సత్వ రజస్తమోగు
ణముల దిర్య క్సురాసుర నరధరాది
భావముల భిన్నులగుదురు, పౌరవేంద్ర. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 273,275)
స్థిరతం జేసి హరి స్వరూపుడయి రక్షించున్ సమస్త ప్రజో
త్కిర సంహారము సేయునప్పుడు హరాంతర్యామియై యింతయున్
హరియించున్, బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 276)
గోరి సృజించె గొన్నిట నకుంఠిత వీర్యము చేత కొన్నిటిన్
బోరన ఖేచరంబులను భూచరముఖ్యవనే చరంబులన్
నీర చర వ్రజంబు రజనీ చర జాల దివాచర్మబులన్
క. నరసుర గరుడోరగ కి
న్నర దానవ యక్ష పక్షి, నగ వృక్షములం
దరమిడి సృష్టి యొనర్చెను
దిరముగ దక్ష ప్రజాపరి వితత కీర్తిన్“.
క. బహు విధముల బహు ముఖముల
బహు రూపములైన ప్రజల బహు లోకములన్
బహుళముగ జేసి - - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 4 - 206 to 209)
యదూరుభ్యాం వైశ్యకులం, పాదాభ్యాంసేవకో(అ)భవత్ ||“. (శ్రీ వేంకటేశమహాత్మ్యము - 42)
(పరబ్రహ్మవైన నీ ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టిరి, బాహువులవలన క్షత్రియులు, తొడలవలన వైశ్యులు, పాదములవలన సేవకులు శూద్రులు పుట్టిరి).
(పై విషయములు పురుషు సూక్తములో ఈ క్రింద విధముగ చెప్పబడీనది : -బ్రాహ్మణో అస్య ముఖమాసీత్, బాహూ రాజన్యః కృతః, ఊరూ తదస్య యద్వైశ్యః, పద్భ్యాం శూద్రో అజాయత. (ఆ పరమాత్మ యొక్క ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, తొడలునుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు జనించిరి).ఏవాః
“శిరసో ద్యౌరభూత్ యస్య సహస్రాంశుశ్చ నేత్రజః |
ముఖాత్ పురబందరో (అ)గ్నిశ్చ దిగ్దేవాః శ్రోత్రతో అభవత్ “. (పురుషసూక్తం)
(భగవతుని శిరస్సునుండి స్వర్గలోకము, నేత్రములనుండి సూర్యుడు, ముఖమునుండి ఇంద్రుడు, అగ్ని, చెవినుండి దిగ్దేవతలు పుట్టిరి).
“శీతాంశుర్మనసో జాతః, ప్రాణాద్వాయు రజాయత, అంతరిక్షం నాభితో (అ) భూత్, పద్భ్యాం భూమి రజాయత యత్కోమలాంగైరభవన్ భువనాని చతుర్దశ, కోమలే నాభి కమలే బ్రహ్మాండం బ్రహ్మాధిష్ఠితం ||”. (శ్రీవేంకటేశమాహాత్మ్యం - 4 - 2 to 5)
“చంద్రమా మనసో జాతః; చక్షో స్సూర్యో అజాయత; ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణా ద్వాయురజాయత; నాభ్యా మాసీదంతరిక్షం. శీర్షో ద్యౌస్సమ వర్తత; పద్భ్యాం భూమర్దిశశ్రోతాత్, తథా లోకా అకల్పయత్”. (పురుషసూక్తము -)
భగవతుని మనస్సునుండి చంద్రుడు పుట్టెను, కళ్లనుండి సూర్యుడు, ముఖమునుండి ఇంద్రుడు, అగ్నియు, ప్రాణమునుండి వాయువు, నాభినుండి అంతరిక్షము; శిరస్సునుండి స్వర్గలోకము, పాదములనుండి భూమి, చెవులనుండి దిక్కులు - ఈ ప్రకారముగా సృష్టించెను).
(sṛṣṭi ī kriṃda ceppina varusalō - kramamulō - jariginadi : -
ātmavalana ākāśamu puṭṭinadi, ākāśamu valana vāyuvu, vāyuvu valana agni, agni valana nīru, nīṭivalana bhūmi, bhūmivalana ōṣadhulu, ōṣadhulavalana annamu, annamuvalana puruṣuḍu - jīvuḍu - kaliginavi).
havyavāhanamaṃdu naṃbuvuludakaṃbu ludakaṃbuvalana vasuṃdhara galige, dhātri
valana bahu prajāvaḷi yudbhavaṃbayye, niṃtaku mūlamai yesagunaṭṭi
nārāyaṇuṃḍu - - -“. (śrīmadhāṃdhramahābhāgavatamu - 2 - 10 - 278)
va. - - - īśvarādhiṣṭhi taṃbaina prakṛti yaṃśaṃbuna mahattatvaṃbagu; mahattattvāṃśaṃbuna nahaṃkāraṃbagu; ahaṃkārāṃśaṃbuna śabda tanmātraṃbagu; śabda tanmātrāṃśaṃbuna gaganaṃbagu; gaganāṃśaṃbuna sparśatanmātraṃbagu; sparśatanmātrāṃśaṃbunasamīraṇaṃbagu; samīraṇāṃśaṃbuna tanmātraṃbagu; rūpatanmātrāṃśaṃbuvalana dējaṃbagu, tējōṃśaṃbuna rasatanmātraṃbagu; rasatanmātrāṃśaṃbuvalana jalaṃbagu, jalāṃśaṃbuna gaṃdhatanmātraṃbagu; gaṃdhatanmātrāṃśaṃbuvalana bṛdhiviyagu, vāni mēḷanaṃbunaṃ jaturdaśa bhuvanātmakaṃbaina virāḍrūpaṃbagu. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)
“sī. dhṛti boni kālacōditamu, navyaktaṃbu, brakṛtiyunanu pēḷḷa baragu māya
valana mahattattvamelami puṭṭiṃce; māyāṃsa kālādi guṇātmakaṃbu
naina - - -
- - - mahattattvamaṃdu nōli
tē. gārya kāraṇa kartrātmakatvamaina
mahita bhūtēṃdriyaka manō mayamanaṃga
dagu nahaṃkāra tatvamumutpannamayye
gōri satvarajastamō guṇamagucu
va. - - -rūpāṃtaraṃbulaboṃducunna sātvikāhāraṃbuvalana manaṃbunu, vaikārika kāryabhūtaṃbulaina anēṃdriyadēvatā gaṇaṃbulunu saṃbhaviṃce. iṃdriyādhiṣṭhātalaina vāni valana śabdaṃbu pūrvaṃbuna prakāśaṃbaguṭaṃ jēsi jñānēṃdriyaṃbulaina tvakcakṣuśrōta jihvāghrāṇaṃbulunu, garmēṃdriyaṃbulaina vākpāni pādapāyūpasthamulunu daijasāhaṃkāraṃbunanitpannaṃbulayye. tāmasāhaṃkāraṃbuvalana śabda sparśa rūpa rasa gaṃdhaṃbuludayiṃce. aṃdu nijaguṇaṃbayina śabdaṃbuvalana nākāsaṃbu buṭṭiṃce. gaganmabu gālāmāyāṃśayōgaṃbunaṃ sparśa tanmātraṃbuvalana vāyuvu galigiṃce, bavanuṃḍu nabhōlaṃbuna rūpatanmātraṃbuvalana lōka lōcanaṃbaina tējaṃbu nutpādiṃce. tējaṃbu gāla māyāṃśayōgaṃbuna bavamānayuktaṃbagucu rasatanmātraṃbuvalana naṃbuvulaṃ buṭṭiṃce. salilaṃbu gāla māyāṃśa yōgaṃbuna tējō yuktaṃbaina gaṃdhaguṇaṃbuvalanaṃ bṛdhivi galigiṃce - aṃdu gaganaṃbunaku śaṃdaṃbunu, vāyuvunaku śabdasparśaṃbulunu, dējaṃbunaku śabda sparśa rūpaṃbulunu, salilaṃbunaku śabda sparśarūpa rasaṃbulunu, bṛdhiviki śabda sparśa rūpa rasa gaṃdhaṃbulunu guṇaṃbulai yuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 198 to 202)
(muṃḍakōpaniṣat)
(prajvaliṃcina agninuṃḍi vēlakoladi visphuliṃgamulu agni rūpamulō puṭṭucunnavi. ā prakaramugānē akṣaruḍagu parabrahmanuṃḍi anēka vidhamulaina bhāvamulu puṭṭucunnavi. agnilō līnamaiyuṃḍu visphuliṃgamulē paiki vaccucunnaṭlu bhagavaṃtunilō līnamaiyunna jīvulē puṭṭucunnavi).
(bāgugā prajvaliṃcina agninuṃḍi agniyokka avayavamulē ayina, agni lakṣaṇamulē kalavinnī ayina, visphuliṃgamulu eṭlu puṭṭucunnavō, ā prakāramugānē parabrahmanuṃḍi parabrahmanuṃḍi anēka dēhamulanu upadhibhēdamulavalana anēka vidhamulugā jīvulu puṭṭucunnavi, maṟiyu ā parabrahmamaṃdē līnamagucunnavi).
(kācina inupa mukkanuṃḍi sammeṭacē koṭṭabaḍucuṃḍagā dāninuṃḍi - dāni agninuṃḍi ā agni rūpamulē ayina anēkamaina visphuliṃgamulu puṭṭinaṭluganē sūkṣma cidacit śarīramu gala akṣaruḍaina parabrahmanuṃḍi kārya rūpamulaina cidācit sūkṣma vastuvulu anēkamulu puṭṭucunnavi. maṟiyu ā parabrahmamaṃdē līnamagucunnavi).
(lōkamulō itara kāraṇamu - sahāyamu - napēkṣiṃpakayē sālepurugu svayamuganē tana śarīramukaṃṭe vērugānaṭuvaṃṭi dāramulanu tana śarīramulō nuṃḍiyē paiki prasariṃcunu, marala vāṭini tanalōnikē tīsukonucunnadi - tanalōnē kalupukonucunnadi. bhūmiyaṃdu vrīhi, yavalu modalukoni sthāvaramulavaraku gala ōṣadhulu tamakaṃṭe vēru kāni vāṭini puṭṭiṃcucunnavi. iṭlē - ī dṛṣṭāṃtamula prakāramē akṣaruḍu (kṣīṇiṃpanivāḍu) agu parabrahmanuṃḍi, maṟiyoka kāraṇamu lēkuṃḍaganē tanavaṃṭi lakṣaṇamulugala vastuvu puṭṭucunnaṭlugā ī saṃsāra maṃḍalamaṃdu ī jagattu aṃtayu unnadi)
(sāle purugu tana hṛdayamulō nuṃḍi nōṭidvārā paiki vaccina dāramulatō krīḍiṃci - gūḍu kaṭṭukoni - marala dānini tanalōnaku grahiṃcunaṭlē bhagavaṃtuḍu tanalō nuṃḍi yī prapaṃcamunu - prapaṃcamulōni vastuvulanu - sṛṣṭinaṃcinaṭlu paiki vadali, marala vāṭini saṇariṃcinaṭlu tana lōniki grasiṃcunu - tīsukonunu).
(sāle purugu gūḍu nirmiṃcadalacinadi kāna adi gūḍunaku nimitta kāraṇamu - dānilōnuṃḍi vaccina dāramu jadalu dānitō gūḍuku kāvalasina dāramu allukoninadi kanuka upādānakāranamu kūḍa ayi yunnadi. gūḍu allukonuṭaku kāvalasina dāramu upādānamu - ā dāramu sāle purugulōnuṃḍiyē tanalōnuṃḍiyē - vaccinadi kanuka sāle purugu gūḍuku upādānakāraṇamu kūḍa ayinadi. aṭlē bhagavaṃtuḍu cicchakti galavāḍu. atanilōnuṃḍi puṭṭina prakṛti jaḍamu. prapaṃcamunu sṛṣṭi cēyuṭaku upadānamugā (Material) gā bhagavaṃtuḍu payōgiṃcukonenu - adi bhagavaṃtunilōnuṃḍi puṭṭinadē kanuka bhagavaṃtuḍu sṛṣṭiki eupādānakāraṇamu kūḍā ayi yunnāḍu. iṭlu bhagavaṃtuḍu sṛṣṭiki nimitta kāraṇamu, upādānakāraṇamukūḍa ayi yunnāḍu - sāle puruguvale - ī prakṛti jadamaguṭavalana - ēmiyu cēyalēnidaguṭavalana - dānilō bhagavaṃtuḍu tana caitanya śaktitō pravēśiṃcenu - appuḍu prakṛtiki caitanyamu kaligi tanalōnuṃḍi mahattattvamunu puṭṭiṃcenu - ī reṃḍunu kaliyuṭavalana prapaṃcamulōni vastuvulōni vastuvulanniyu, okadānilō nuṃḍi okaṭigā puṭṭinavi).
(caitanyamu gala sālepurugu tanalōpalanuṃḍi jaḍapadārthamagu gūḍu allukonu dāramu anayāsamugā - aprayatnamugā puṭṭiṃcucunnadō, agninuṃḍi visphuliṃgamulu - eṭlu egurucunnavō, aṭlē cētanācētanamulugaladiyu jaḍamainadiyu agu jagattu ā bhagavati yaina dēvinuṃḍi puṭṭucunnadi).
(marri ceṭṭu yokka vittanamuvalananē oka pedda marriceṭṭu eṭlu puṭṭucunnadō aṭlē nīṭilō śayaniṃci samādhi cāliṃcina nī yokka (bhagavaṃtuni yokka) boḍḍunuṃḍi nīlōnē gūḍhamugānunna oka pedda padmamu- lōkarūpamulō nunna padmamu, lēka padma rūpamulō nunna lōkamulu puṭṭenu. kālamanu tana śakticēta nidramēlkoninaṭlu cēyabaḍina prakṛti dharmamulu anagā satvarajastamōguṇamulu anu prakṛti dharmamulu kaligenu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 4 - 202 lō ceppina prakāramu - (cūḍumu - sṛṣṭi kāraṇamu-9 (7)). oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭunapuḍu - śrībhagavaṃtuni “vilōkanaṃbuna”, “baramēśvarānugrahmabu galigi”, anu vākyamulu tappanisarigā kanabaḍucunnavi. dīnivalana teliyavaccunadēmanagā prapaṃcakamaṃtaṭilōnu oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭinapuḍu bhagavaṃtuni śakti kāraṇavastuvulō nuṃḍi dānicēta ā panicēyiṃcinadi ani grahiṃcavalenu - kāraṇavastuvulō bhagavaṃtuḍu taṃba caitanyaśaktilō lēniyaḍala kāryavastuvu puṭṭadu - ātma anagā “kāraṇāt kāryamutpādayati iti ātmā” ani ceppabaḍinadi. (kāraṇavastuvulōnuṃḍi kāryavastuvunu puṭṭiṃcunadi ātma). aṃducēta sṛṣṭi prāraṃbhamainadi lagāyitu ippaṭivaraku ī tarvāta kūḍā sṛṣṭi yiṭlē karugunu. bhagavaṃtuni pramēyamu lēnidē sṛṣṭi jarugadu).
(ippuḍu nāma rūpamulatō kanabaḍucunna prapaṃcamu aṃtayu modaṭa - sṛṣṭiki pūrvamu - oka ‘sat’ padārthamugānē yuṃḍenu - sat rūpamugānē yuṃḍenu - a satpadārthamu nityamuktamu, avikriyamu, satyajñānānaṃdamu, paripūrṇamu, sanātanamu, ēkamu, advitīyamu ayina parabrahma. ā parabrahmamaṃdu eṃḍamāvulu mutyapu cippa, sthāṇuvu, sphaṭikamu,veṃḍi, puruṣuḍu, rēkha valenē lōhita śuklakṛṣṇa guṇamulugaladinnī, triguṇamulu samānamugānunnadinnī, iṭṭidi ani ceppuṭaku alavikānidinnī ayina mūla prakṛti yuṃḍenu. dānilō pratibiṃbiṃcina sākṣi caitanyamuṃḍenu - adi vikāramunu poṃdi satyaguṇamutō udriktamai avyaktamanu pērugala āvaraṇa śakti yuṃḍenu - dānilō pratibiṃbiṃcinadi īśvaruni śakti. atanē māyanu svādhīnamu cēsukoninavāḍu - jagarala attunaku aṃkuramugā (molakagā) nuṃḍuvāḍu. atanu tanalō līnamaina samasta jagattunu āvirbhaviṃpacēyunu, puṭṭinaṭlu cēyunu. prāṇula karmavaśamuna (karmanu baṭṭi) prasariṃpacēsi (naḍipiṃci), vāri karmalu kṣīṇiṃcaganē vāṭini tanalō kalisi pōyinaṭlu cāeyunu - maḍata peṭṭabaḍina baṭṭavale atani yaṃdē ī prapaṃcamaṃtayu uṃḍunu - (sūkṣmarūpamulō aṇagi yuṃḍunu). īśvarunicēta adhiṣṭiṃcabaḍina āvaraṇa śaktivalana rajōguṇamucē udrēkamu ceṃdinadai mahattattvamanu vikṣēpa śakti āyenu - dānilō pratibiṃbiṃcina caitanyamu hiraṇyagarbha caitanyamāyenu - ā mahattattvamunu adhiṣṭiṃciyuṃḍu caitanyamu spaṣṭā spaṣṭa śarīramu (rūpamu) kaladāyenu - hiraṇya garbhuni adhiṣṭiṃciyunna nikṣēpa śaktinuṃḍi tamō guṇamucē udriktamaina ahaṃkāramanu pēru gala sthūla śakti kaligenu - dānilō pratibiṃbiṃcina caitanyamu virāṭ caitanyamāyenu - adi ā virāṭ caitanyamunu abhimāniṃci spaṣṭamaina śarīramu (ākāramu) galavāḍu, anni sthūlarūpamulanu pāliṃcuvāḍu, prathānapuruṣuḍu agu viṣṇuvāyenu. ā ātmanuṃḍi ākāsamu puṭṭinadi - (kaliginadi). ākāśamunuṃḍi vāyuvu, vāyuvunuṃḍi agni, agninuṃḍi jalamu, jalamunuṃḍi bhūmi puṭṭinavi. avi tanmātramulu - triguṇamulu kalavi. jagattunaku kāraṇamaina parabrahma sṛṣṭi cēya saṃkalpiṃci tamō guṇamu nadhiṣṭiṃci, sūkṣmamulu tanmātramulu ayina bhūtamulanu sthūla bhūtamulugā cēyuṭaku saṃkalpiṃcenu - bhūtamulanu okkokkadānini reṃḍugā cēsi, marala okkokkadānini nālugu bhāgamulugā cēsi, okkokka dānilō itara bhūtamula aṃśalanu ayidu vibhāgamuluga cēsi vāṭlanu kalipi, iṭlu paṃcīkṛtamu cēyabaḍina bhūtamulatō anaṃtakōṭi brahmāṃḍamulanu, āyā aṃḍamulaku ucitamaina padunālugu lōkamulanu, ā lōkamulaku sthūla sarīramulanu sṛjiṃcenu. ā paṃcabhūtamula yokka rajō guṇāṃśamulanu nālugagā casi mūḍu bhāgamulatō ayidu vṛttulugala prāṇamunu prāna, apāna, vyāna, ydāna, samānamulanu) sṛṣṭiṃcenu. migilina nālugu aṃsalatō karmēṃdriyamulanu, sṛṣṭiṃcenu -ā paṃcabhūtamula satvaguṇāṃśamunu nālugugā cēsi mūḍu bhāgamulatō ayidu vidhamula vṛttulugala aṃtaḥkaraṇamunu sṛṣṭiṃcenu - satvaguṇamu yokka nālugava bhāgamutō jñānēṃdriyamulanu sṛṣṭiṃcenu- satva samaṣṭitō iṃdriyādhi dēvatalanu sṛṣṭiṃcenu. aṭlu sṛṣṭiṃcina vāṭini aṃḍamaṃduṃcenu - aṭlu aṃḍamaṃdunnavi spaṃdana kaligi cēṣṭiṃcuṭaku (cētanatvamu kaligiyuṃḍuṭaku) śakti lēka yuṃḍenu. vāṭini cētanamulugā cēyuṭaku brahma saṃkalpiṃcenu - brahāṃḍamunu brahmaraṃdhramulanu vyaṣṭi vastuvulanu baddalu cēsi (bhēdiṃci) vāṭilō pravēśiṃcenu. appuḍu jaḍamulaina avi cēgtaṃtvamu galavi yai vāṭi vāṭi karmalanu cēsenu).
(sṛṣṭilōni vastuvulanniyu yeṭlu puṭṭinavō śrīmadāṃdhramahābhāgavatamu - ska.3 - adhyā. 4 lō vivaramugā ceppabaḍinadi).
tē. buddhi dōcina nammahā puruṣavaruḍu
gārya kāraṇa rūpamai ghanatakekti
bhūri māyābhidāna visphurita śakti
vinutikekkina yaṭṭi yavidyayaṃdu
“ka. puruṣākṛti nātmāṃśa
sphuraṇamugala śakti nilipi puruṣōttamu ḍī
śvaraḍabhavuṃḍajuḍu nijō
dara saṃsthita viśvamapuḍu daga puṭṭiṃcen”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 199 - 200)
(bhagavaṃtuḍu tana śaktiyē (jaḍaśaktiyē) ayina māya yaṃdu tanayokka śaktiyē ayina, aṃsa ayina cicchaktitō puruṣa rūpamutō pravēśiṃci, tanalō kāraṇarūpamulō nunna prapaṃcamunu puṭṭiṃcenu - iṃduvalana jagattunaku atanu taṃḍri, prakṛti talli –
“mayādhyakṣēṇa prakṛtissūyatē sa carācaraṃ |”,
“ahaṃ bīja pradaḥ pitā” - iṃduvalananē atanu ādi puruṣuḍu - prathama saṃsārī - ani kūḍa ceppabaḍucunnāḍu - “(jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau”). jagattu sṛṣṭiki iddaru kāraṇamaguṭavalana talli, taṃḍri ayina pārvatī paramēśvarula guṟiṃci namaskariṃcucunnānu).
asītta dīkṣaṇā jjātaṃ jagatsarvaṃ carācaraṃ |
āpa ēva sasrjādau tā svavātsīdya yataḥ svayaṃ |
tēna nārāyaṇa prōktaḥ paraṃ brahmākhya īśvaraḥ |
sṛṣṭvēdaṃjagatsarvaṃ cikīrṣustasya sthitiṃ |
sa sarja brahma rūpēṇa marīcyādi prajāpatīn ||. (gītābhāva prakāśamu - 1 - 1 to 9)
(nārāyaṇuḍanu pērugala parabrahma sṛṣṭiki pūrvamuṃḍeḍivāḍu - īkṣaṇamātramuna atanu ī sṛṣṭinaṃtanu sṛṣṭiṃcenu. atanu moṭtamodaṭa jalamunu sṛṣṭiṃcenu) –
“va. ataṃḍe paramātmayanu nammahātmuṃḍul līlārdhaṃbai jagatsarjanaṃbu sēyu talaṃpuna brahmāṃḍaṃbu nirbhēdiṃci tanaku sukhaśayanaṃbu napēkṣiṃci modala jalatatvaṃbu sṛjyiṃce. svataḥ pariśuddhuṃḍugāvunasvasṛṣṭaṃbai yēkārṇavākāraṃbaina jalarāśuyaṃdu śayanaṃbu jēyuṭaṃ jēsi - - - nārāyaṇa śabda vācyuṃḍu - - - sarvēśvaruṃḍu dānē kamayyunanēkaṃbugā dalaṃci” (śrīmadāṃdhramahābhāvatamu - 2 - 10 - 268)
(The first element created was Hydrogen - (water - or hydrogen gas) –
“āpō nārā iti prōktā āpō vai sarasūnavaḥ |
tā yadasyāyanaṃ pūrvē tēna nārāyaṇaḥ smṛtaḥ ||“.
(jalamulu naruḍu - (naśiṃcanivāḍu) - ayina bhagavaṃtuninuṃḍi puṭṭinavi. aṃducēta avi nāramulu ani ceppabaḍinavi. aṃdulō - ā nāramulalō - śayaniṃcuvāḍu kanuka bhagavaṃtuḍu nārāyaṇuḍani ceppabaḍināḍu - “sukha śayanaṃbu napēkṣiṃci” ani ceppuṭavalana Life thrives in water or Hydrogen gas - nīṭilō prāṇavāyuvunnadi yani (Hydrogen plus Oxygen = water). “apsumē sōmō abravīt aṃtarviśvāni bhēṣajaṃ, agniṃca viśvaśaṃbuvaṃ”.
“mayyēva sakalaṃ jātaṃ mayi sarvaṃ pratiṣṭitaṃ ||”. ani śruti - (brahmavidyāsudhārṇavamu - 1)
bhāti cicchakti samētuḍai kapaṭa nidrālōluḍagucu nimīlitākṣu
ḍaina nārāyaṇuṃḍu madhyamuna - - -
tē. talpamuna bavvaḷiṃci, ya nalpa tatva
dīpti jennoṃdagā nadvitīyuḍagucu
- - -
- - -
tē. yōgamāyā vidūruḍai yuga sahasra
kāla paryaṃta makhila lōkamulu mriṃgi
pērci maṟi kāla śaktyupa bṛṃhitamuna
samata sṛṣṭi kriyā kalāpamula dagili
ka. tana jaṭharamulōpala dā
cina lōka nikāyamula sṛjiṃcuṭakunu sā
dhanamagu sūkṣmārthamu mana
sunagani kālānugata rajōguṇamaṃtan
sī. puṭṭiṃce, dadguṇaṃbuna baramēśvaru nābhidēśamunaṃdu naḷina nāḷa
mudayiṃce; maṟiyu nappayōruha mukuḷaṃbu garma bōdhitamaina kālamaṃdu
dana tējamana bravṛddhaṃbaina jalamucē jalajāptugati brakāśaṃbu noṃda
jēsi lōkāśraya sthiti sarvaguṇa vibhāsita gatinoppu rājīvamaṃdu
tē. nijakaḷā kalitāṃśaṃbu nilipi dāni
valana nāmnāyamayuḍunu vara guṇuṃḍu
nātma yōniyu naina tōyajabhavuṃḍu
saravijaturānanuṃḍu nā janana moṃde.
tē. - - - kamala kōśa
līnamaiyunna lōka vitānamulanu
noyya boḍagani - - -
tē. - - - yavvana ruhaṃbu
lōpaliki bōyi munnaṃdulōna nunna
mujjagaṃbula jūci, yimmula sṛjiṃce
maṟi caturdaśabhuvanamul mahima jēsi
ka. paraga sudhāśana tirya
ṅnara vividha sthāvarādi nānā sṛṣṭi
sphuraṇa najuṃ ḍonariṃce - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 8 - 272 etc - ; 3 - 10 - 336 to 338)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)
(vivēkaciṃtāmaṇi - 1)
madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||. (śrīmadbhagavadgīta - 10 - 6)
(sṛṣṭi prāraṃbhamulō sapta maharṣulu, manuvulu nā aṃsalō, nā manō saṃkalpa mātramuna puṭṭiri. vārinuṃḍi ī lōkamulōni prajalu puṭṭiri - manuvula saṃtati kanuka mānavulu).
“tasya ca biṃdōḥ kālakramēṇa cidacidaṃśavibhāgāt traividhyamuktaṃ_”
kālēna bidhyamānastu sa biṃdurbhavati trithā |
sthūla sūkṣma paratvēna tgasya ttraividhya miṣyatē |
sa biṃdunādabījatvabhēdēna ca nigapyatē iti.
abidaṃśaḥ sthūlō bījaṃ, cidacimiśraṃ sūkṣmō nādaḥ sa ēva puruṣaḥ cidaṃśaḥ parō biṃduḥ. sa ēva īśvaraḥ. taysa catrithā vibhāgasamayē śabda brahma paranāmadhēyasya ravasya utpattiruktā “biṃdōstasmādbhidyamānāt ravō avyaktātmakō bhavēt. saravaḥ śruti saṃpannaiḥ śabda brahēti gīyatē” iti. sa ēva śabda brahmatmakō ravaḥ jagadupādāna biṃdutādātmyēna sarva gatōpi - prāṇināṃ mūlādhārē abhivyajyatē.
sa tu sarvatra saṃ srūtō jātē bhūtākārē punaḥ |
āvirbhavati dēhēṣu prāṇināmartha vistṛtaḥ
“tatrāpi mūlādhāra pradēśētasyānusyūtasya ravasya saṃskṛta vana balana abhivyaktirāvirbhāvaḥ”.
(ī ravamē śarīramulōni vāyuvutō kalisi parāvākku, paśyaṃtīvākku, madhyamāvākku, vaikharīvākkugā pariṇamiṃcunu).
(niyatakālamulō phalamu niccuṭaku pariparvamunaku vaccina prāṇula karmalalō anubhavamu valana kṣīṇiṃcipōyina karmalu galadinnī, paripākamunu poṃdinappaṭikī anubhavamu kānaṃduna (samayamu rānaṃduna) samayamu vaccuvaraku prākṛta pralayamaṃdu māyatō - prakṛtitō - kūḍa samasta prapaṃcamu bhagavaṃtunilō līnamai yuṃḍunu - avyaktamanagā māya, avyaktamu yokka samyak praḷayamu anagā mōkṣamuvale pūrtigā naśiṃcuṭakādu. karma paripākamu poṃdanivi kālakramamuna samayamu vaccinapuḍu, vāṭi phalamula niccuṭaku samayamu vaccinapuḍu, bhagavaṃtuniki sṛṣṭi cēyuṭaku uddēśamu kalugunu - adiyē māya yokka (prakṛti yokka) vṛtti - guṇamu, sṛṣṭicēyu guṇamu. ī sthitilōnunna māya (prakṛti avasthayē “īkṣita” (cūcenu), “kāmayata” (kōrenu - kōrika kaligenu); tapaḥ (tapiṃpa cēyuṭa) - anagā bhagavacchakti prakṛtitō kalisi prakṛtiki kṣōbha kaligiṃpacēyuṭa - perugu madhiṃcagā venna vaccinaṭlu, pāla samudramulō taṟacinaṭlu - anu modalagu śabdamulatō (māṭalatō) upaniṣattulalō ceppabaḍenu. adi yeṭlanagā - tadaikṣata “bahusyāṃ prajāyēya” (anēkamugā nēnē puṭṭinaṭlu cūcedanu) ani chāṃdōgyamunaṃdunū; “tadaikṣata lōkānnu sṛjā” (lōkamulanu sṛjiṃcedanu) ani aitarēyōpaniṣattulōnu, “sō akāmayata bahusyāṃ prajāyēya” (nēnu anēkamugā puṭṭedanu) ani paramātma kōrenu - ani taittirīyōpaṣattulōnu; “tapasā cīyatē brahma” ani muṃḍakōpaniṣattulōnu ceppabaḍinadi. parabrahma prakṛtilō pravēśiṃciyuṃḍi dānitō saṃbaṃdhamu kaligiyuṃḍuṭavalana, tanalōnē yunna prapaṃcamunu sṛṣṭiṃcuṭaku (tanalōnuṃḍi paiki vadaluṭaku) unmukhuḍagunu - siddhamagunu - ī avastha prapaṃcasāramu anu graṃdhamaṃdu “vicikīrṣa” ani ceppabaḍinadi - “vicikīrṣurghanī bhūtōkva cidabhyēti biṃditāṃ” (aṭlu cēya dalacinadāninuṃḍi koṃta ghanībhūtamai (karaḍugaṭṭi) biṃduvugā nagunu ani dīni bhāvamu. paripakvamugāni karma bhāgamaguṭavalana karaḍukaṭṭuṭa - biṃduvugā māruṭa. iṭlu cēyūkōruṭē vicikīrṣā ani ceppabaḍeni. paripakvamaina karmala pariṇāmamunu poṃdina māyābhāgamu biṃduvu - avibhāgamaina avasthayē avyaktamani ceppabaḍinadi - “tasmā davyaktamutpannaṃ triguṇaṃ” (dāninuṃḍi satvarajastamōguṇamulugala avyaktamu puṭṭinadi ani ceppabaḍinadi. adiyē prapaṃcamunaku aṃkuramu - (molaka, vittanamu); dāninuṃḍiyē prapaṃcamu puṭṭinadi - prapaṃcamu puṭṭuṭaku adi kāraṇamu - adiyē adhyātmamani, adārādhēyamulu modalagu vāṭini prakaṭiṃpacēyunadi; kāraṇa kārya vastuvulanu puṭṭiṃcunadiyu, kuṃḍali modalagunaviyugā ceppabaḍucunnadi. “tasya ca biṃdōḥ kālakramēṇa cidacidaṃśavibhāgāt ttraividhyamuktaṃ”. ā biṃduvu kālakramuvalana cidvastuvulu, acidvastuvulūnu vibhāgamutō mūḍu vidhamulāyenu avi biṃduvu (bījamu), sthūlamu. sūkṣmamu ani mūḍu vidhamulugā ceppabaḍucunnavi. dāni acit aṃśa bījamu, cida cittulu kalisinadi sūkṣmamu, nādamu. biṃduvu yokka cidaṃśayē puruṣuḍu, parama puruṣuḍu. atanē īśvaruḍu. ā biṃduvu pēli mūḍugā vibhajiṃcabaḍina samayamaṃdu śabda brahmamu anu pēru gala ravamu (śabdamu) puṭṭinadani ceppabaḍinadi. eṭlaṃṭē –
“biṃdōstasmāt bhidhyamānāt ravō avyaktātmakō bhavēt |
saravaḥ śruti saṃpannai śabda brahmēti gīyatē”
(ā biṃduvu pēlipōyinappuḍu avyaktātmakamaina (avyaktamunaku saṃbaṃdhiṃcinadaina) ravamu (śabdamu) agunu - ā ravamu śrutisaṃpannulacēta - vēdāṃtulacēta - śabda brahmamani ceppabaḍucunnadi. aṭlu puṭṭina ā ravamē - śabdamē - jagattunaku jagattunakupādāna kāraṇamaina biṃduvu yokka tādātmyamē yaguṭavalana anniṃṭilōnu pravēśiṃciyinnavāḍainanu prāṇulalō jīvulalō mūlādhāramaṃdu dāni vṛtti teliyabaḍucunnadi. ī ravamē mānava śarīramulō pravēśiṃci vāyuvutō kalisi āyā sthānamulalō parāvākku aniyu, paśyaṃtivākku aniyu, madhyamāvākku aniyu, vaikharīvākku aniyu pariṇāmamu ceṃdi - mārpu ceṃdi - ceppabaḍucunnadi).
(paina ceppabaḍina biṃduvē brahmāṃḍamu - aṃḍākāramugā, kōḍi gruḍḍu ākāramugā) nunna brahma - (caturmukhabrahma). dīnini ādhunika śāstrajñulu “COSMIC EGG” ani ceppuduru. brahmāṃḍamu braddalaguṭayē brahmāṃḍa bhēdanamu. dāni valana kaligina ravamē - śabdamē - “BIG BANG” ani ceppabaḍinadi - (cūḍumu - “brahmāṃḍamu”). brahmāṃḍamu pagili dāni mukkalu vērvēṟu prapaṃcamulugā ākāśamulō virajilluku pōyinaṃduna dāninuṃḍi lōkamulu, lōkamulōni carācara vastuvulu puṭṭinavi).
ḍakhila dhṛti jaganniyaṃtayaina
cinmayātmakuṃḍu sṛjiyiṃcu nī prajā
patula ṛṣula manula bitṛvarulanu
sī. sura siddha sādhya kinnara, nara, cāraṇa, garuḍa, gaṃdharva, rākṣasa, piśāca,
bhūta, bhētāḷa, kiṃpuruṣa, kūśmāṃḍa guhyaka ḍākinī yakṣa yāśudhāna
vidyādharō psarō, viṣadhara, graha, mātṛgaṇavṛka, hari, ghṛṣṭi, khaga, mṛgāḷi
bhalūka rōhita paśu vṛkṣa yōnula vividha karmaṃbulu velaya buṭṭi
tē. jala nabhō bhūtalaṃbula saṃcariṃcu
jaṃturāsula satva rajastamōgu
ṇamula dirya ksurāsura naradharādi
bhāvamula bhinnulaguduru, pauravēṃdra. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 273,275)
sthirataṃ jēsi hari svarūpuḍayi rakṣiṃcun samasta prajō
tkira saṃhāramu sēyunappuḍu harāṃtaryāmiyai yiṃtayun
hariyiṃcun, bavanuṃḍu mēghamula māyaṃ jēyu caṃdaṃbunan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 276)
gōri sṛjiṃce gonniṭa nakuṃṭhita vīryamu cēta konniṭin
bōrana khēcaraṃbulanu bhūcaramukhyavanē caraṃbulan
nīra cara vrajaṃbu rajanī cara jāla divācarmabulan
ka. narasura garuḍōraga ki
nnara dānava yakṣa pakṣi, naga vṛkṣamulaṃ
daramiḍi sṛṣṭi yonarcenu
diramuga dakṣa prajāpari vitata kīrtin”.
ka. bahu vidhamula bahu mukhamula
bahu rūpamulaina prajala bahu lōkamulan
bahuḷamuga jēsi - - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 4 - 206 to 209)
yadūrubhyāṃ vaiśyakulaṃ, pādābhyāṃsēvakō(a)bhavat ||“. (śrī vēṃkaṭēśamahātmyamu - 42)
(parabrahmavaina nī mukhamunuṃḍi brāhmaṇulu puṭṭiri, bāhuvulavalana kṣatriyulu, toḍalavalana vaiśyulu, pādamulavalana sēvakulu śūdrulu puṭṭiri).
(pai viṣayamulu puruṣu sūktamulō ī kriṃda vidhamuga ceppabaḍīnadi : -brāhmaṇō asya mukhamāsīt, bāhū rājanyaḥ kṛtaḥ, ūrū tadasya yadvaiśyaḥ, padbhyāṃ śūdrō ajāyata. (ā paramātma yokka mukhamunuṃḍi brāhmaṇulu, bāhuvulanuṃḍi kṣatriyulu, toḍalunuṃḍi vaiśyulu, pādamulanuṃḍi śūdrulu janiṃciri).ēvāḥ
“śirasō dyaurabhūt yasya sahasrāṃśuśca nētrajaḥ |
mukhāt purabaṃdarō (a)gniśca digdēvāḥ śrōtratō abhavat “. (puruṣasūktaṃ)
(bhagavatuni śirassunuṃḍi svargalōkamu, nētramulanuṃḍi sūryuḍu, mukhamunuṃḍi iṃdruḍu, agni, cevinuṃḍi digdēvatalu puṭṭiri).
“śītāṃśurmanasō jātaḥ, prāṇādvāyu rajāyata, aṃtarikṣaṃ nābhitō (a) bhūt, padbhyāṃ bhūmi rajāyata yatkōmalāṃgairabhavan bhuvanāni caturdaśa, kōmalē nābhi kamalē brahmāṃḍaṃ brahmādhiṣṭhitaṃ ||”. (śrīvēṃkaṭēśamāhātmyaṃ - 4 - 2 to 5)
“caṃdramā manasō jātaḥ; cakṣō ssūryō ajāyata; mukhādiṃdraścāgniśca, prāṇā dvāyurajāyata; nābhyā māsīdaṃtarikṣaṃ. śīrṣō dyaussama vartata; padbhyāṃ bhūmardiśaśrōtāt, tathā lōkā akalpayat”. (puruṣasūktamu -)
bhagavatuni manassunuṃḍi caṃdruḍu puṭṭenu, kaḷlanuṃḍi sūryuḍu, mukhamunuṃḍi iṃdruḍu, agniyu, prāṇamunuṃḍi vāyuvu, nābhinuṃḍi aṃtarikṣamu; śirassunuṃḍi svargalōkamu, pādamulanuṃḍi bhūmi, cevulanuṃḍi dikkulu - ī prakāramugā sṛṣṭiṃcenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.