← Back to స · Booklets 51–60 (digitized file 6)

సృష్టి ప్రళయములు sṛṣṭi praḷayamulu

Original — తెలుగు

“వ. మత్ప్రేరితంబులై మహదాది గుణముబులు గూడి యండంబై యుద్భవించె; నా యడంబువలన నేనుద్భవించితి, నంత నా నాబి వివరంబున బ్రహ్మ యుదయించె, సాగరారణ్య నదీనద సంఘంబులు మొదలగుగా గల జగన్నిర్మాణంబు లతని వలనం గల్పించితి, నంత శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునం దడంగు, నా గంధంబు దకంబునం గలియు; నా యుదకంబు రసంబున లీనంబగు; నారసంబు తేజోరూపమంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శసంగ్రాహ్యంబైన నా స్పర్శ గుణంబాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్ద తన్మాత్రచే గ్రసియింపబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడ నీశ్వరునిం బొంది యీశ్వర రూపంబు దాల్చు. నేను రజస్సత్వతమోగుణ సమేతుండనై త్ర్మూర్తులు వహించి జగదుత్పత్తికిస్థితి లయ కారణుండనై వర్తిల్లుదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 113)

Transliteration

“va. matprēritaṃbulai mahadādi guṇamubulu gūḍi yaṃḍaṃbai yudbhaviṃce; nā yaḍaṃbuvalana nēnudbhaviṃciti, naṃta nā nābi vivaraṃbuna brahma yudayiṃce, sāgarāraṇya nadīnada saṃghaṃbulu modalagugā gala jagannirmāṇaṃbu latani valanaṃ galpiṃciti, naṃta śatānaṃdunaku śatābdaṃbulu paripūrṇaṃbaina dhātri gaṃdhaṃbunaṃ daḍaṃgu, nā gaṃdhaṃbu dakaṃbunaṃ galiyu; nā yudakaṃbu rasaṃbuna līnaṃbagu; nārasaṃbu tējōrūpamaṃbagu; nā tējaṃbu rūpaṃbuna saṃkramiṃcu; nā rūpaṃbu vāyuvaṃduṃ galayu; vāyuvu sparśasaṃgrāhyaṃbaina nā sparśa guṇaṃbākāśaṃbuna layaṃbagu; nā yākāśaṃbu śabda tanmātracē grasiyiṃpabaḍina niṃdriyaṃbulu manōvaikārika guṇaṃbulaṃ gūḍa nīśvaruniṃ boṃdi yīśvara rūpaṃbu dālcu. nēnu rajassatvatamōguṇa samētuṃḍanai trmūrtulu vahiṃci jagadutpattikisthiti laya kāraṇuṃḍanai vartilludu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 113)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.