← Back to స · Booklets 51–60 (digitized file 6)

సృష్టి వైషమ్యము sṛṣṭi vaiṣamyamu

Original — తెలుగు
  1. సృష్టిలోని విషమభావము - హెచ్చు తక్కువలుగా పుట్టించుట.

  2. “కాంశ్చి దత్యంత సుఖ భాజః కరోతి, దేవాదీన్;కాంశ్చి దత్యంత దుఃఖ భాజః కరోతి, పశ్వాదీన్; కాంశ్చి న్మధ్యమ భోగ భాజ మనుష్యాదీన్ - ఇత్యేవం విషమాం సృష్టిం నిర్మ మాణస్య ఈశ్వరస్య పృథగ్జనస్యేవ రాగద్వేషోపపత్తేః శ్రుతి స్మృత్యవధారి త స్వచ్చత్వాత్. ఈశ్వర స్వభావ విలోపః ప్రసజ్యేత”.

ఇదం బ్రూమః - - - సాపేక్షోహి ఈశ్వరోవిషమాం సృష్టిం నిర్మమతే - ఇకోమపేక్ష ఇతి చేత్ ధర్మా ధర్మావపేక్షతే ఇతి పదామః - అతః సృజ్యమాన ప్రాణి ధర్మా ధర్మాపేక్ష విషమా సృష్టిరితి న అయం ఈశ్వరస్య అపరాధః - ఈశ్వరస్తు పర్జన్యవద్ద్రష్టవ్యః - యథాథి పర్జన్యో వ్రీడాయవాది సృష్టౌ సాధారణం కారణం భవతి, వ్రీహి యవాది వైషమ్యే తు తత్తజ్జీవ గతాన్యేవా సాధారణాని కర్మాణి కారణాని భవంతి. ఏవమీశ్వరస్యాపేక్షత్వాన్న వైషమ్య నైర్గుణ్యాభ్యాం దుష్యతి. తథా చ దర్శయతిః - “పుణ్యో వైపుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన” ఇతి స్మృతిరపి ప్రాణికర్మ విశేశాపేక్షమీశ్వర స్యాను గ్రహీ తత్వం,. నిగ్రహత్వత్వం దర్శయతి - యే యథా మాం ప్రపద్యంతే తాం తధైవ భజామ్యహం“ఇత్యేవం జాతీయకా”. (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే)

(భగవంతుడు కొందఱిని దేవతలు మొదలగువారివలె మిక్కిలి సుఖము గలవారుగను, కొందఱిని పశువులు మొదలగువాటివలె మిక్కిలి దుఃఖముగలవాటిగను,మఱికొందఱిని మనుష్యులు మొదలగువారివలె మఘ్యమ భోగము గలవరినిగను - ఇట్లు విషమసృష్టిని భగవంతుడు చేయుచున్నాడు - కొందఱియందు పక్షపాతము, మఱికొందఱియందు ద్వేషము కలిగి, సృష్టిచేయుచున్నట్లు కనబడుచున్నది. ఈ విషమసృష్టిని ఒక అపేక్ష కలిగియే చేయుచున్నాడు - ఆ అపేక్ష ఏమిటనగా - ధర్మాధర్మములు (పాపపుణ్యములు) - ప్రాణుల పాపపుణ్యముల ననుసరించి చేయు ఈ విషమసృష్టి భగవంతుని అపరాధముకాదు. భగవంతుడు మేఘము వంటివాడు, వ్రీహి యవాదులు (ధాన్యములు) వేరు వేరుగా సృష్టింపబడుటకు వాటి వాటి బీజములు (విత్తనములు) అసాధారణ కారణములు. ఈ ప్రకారముగానే దేవతులను, మనుష్యులను మొదలగువారిని సృష్టించుటలో భగవంతుడు సాధారణ కారణము - కొందఱు దేవతులు గాను, మరికొందఱు మనుష్యులుగాను సృష్టించుటలో ఆయా జీవుల కర్మలే అసాధారణకారణము - ఇందువలన దేవతులు,మనుష్యులు అని హెచ్చు తగ్గుగా సృష్టించుటలో భగవంతునికి వైషమ్యముగాని నైర్ఘృణ్యముకాని లేదు - ఈ విషయమునే శ్రుతి ఇట్లు చెప్పుచున్నది - ” పుణ్యకర్మచేత పుణ్యాత్ముడుగాను, పాపకర్మచేత పాపాత్ముడుగాను పుటుచున్నాడు ” అని శ్రుతిలో ప్రాణుల కర్మ విశేషమువలన కలుగును - అనగా పుణ్య పాప కర్మలు భగవంతుని అనుగ్రహ నిగ్రహములచేత కలుగును - అని చెప్పబడినది - ” ఎవరు నన్ను ఏ ప్రకారముగా భజించెదరో వారిని నేను ఆ ప్రకారముగానే అనుగ్రహించెదను - (లేక నిగ్రహించెదను). ప్రాణుల కర్మలే సృష్టిలోని హెచ్చు తగ్గులకు కారణము).

  1. “సృష్టేః ప్రాక్ అవిభాగాన ధారణాత్ న తదానీం కర్మాస్తి; తతః. కర్మాపేక్షయా విషమాసృష్టిః ఇత్య సంగతమితి చేత్, న - అనాదిత్వాత్ సంసారస్య బీజాంకురవత్ హేతు హేతుమద్భావోపత్తేరిత్యర్థః.”

(సృష్టికి ముందు విభాగము లేదు - వేర్వేరు వస్తువులు - జీవులు - లేవు. ఎందుచేతననగా - “సదేవ, సోమ్యేధమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం బ్రహ్మ” (ఇప్పుడు నామరూపములతో వేరు వేరుగా కనబడుచున్న ఈ ప్రపంచమంతయు, ఇవి సృష్టింపబడకముందు ఒక్క ఆత్మగానే యుండెను. అది ఒక్కటే ఆత్మ; మఱియొకటి ఆత్మ వంటిది లేదు - అదేకాక ఇతర వస్తువేదియును లేదు - అని చెప్పబడినదికనుక ప్రాణుల కర్మలవలన విషమసృష్టి జరిగినది అని యెట్లు చెప్పనగును. అంతకుముందు ప్రాణులు లేరు, అందుచేత ఎవరూ కర్మచేయుట ఉండదు; వారి కర్మలే విషమ సృష్టికి కారణము - అని యెట్లు చెప్పనగును - అనిన అట్లుకాదు - సంసారము అనాది. సంసారమనగా సృష్టి స్థితిలయములు ఒకటి తర్వాత నొకటిగా, ఎడతెరిపిలేకుండ ప్రవాహరూపముగా వచ్చుచుండునది. దీనికి ఆదిలేదు. అనగా, ఇది ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు. అందుచేత కర్మలు మొదటిలో లేవుకనుక కర్మలవలన సృష్టి వైషమ్యము కలుగుచున్నది అనుటకు వీలులేదు అనుట సమంజసముకాదు. విత్తనము వలన మొలక పుట్టుచున్నది. మొల్క పెద్ద చెట్టుగా పెరిగి మరల విత్తనములు దానివలన కలుగుచున్నవి (పుట్టుచున్నవి). అనగా, చెట్తుకు విత్తనము కారణము - విత్తనమునకు చెట్టు కారణము - ఈ విధముగా ఒకదానికొకటి కారణమగుటను హేతు హేతుమద్భావమందురు. అయిన యడల మొట్టమొదట ఏది యుండెను, దేని నుండి ఏది పుట్టెను అను సందేహము కలుగును - అనాదిగా ఎప్పటినుండియే ఈ ప్రకారముగా జరుగుచున్నది. దీప్రకారముగానే సృష్టి కూడాజరుగుచున్నది - అందుచేత విత్తనమునుండి చెట్టు కలుగుచున్నది, కారణమునుండి కార్యము కలుగుచున్నది. కర్మల ఫలముగా జన్మలు - ఉచ్ఛ, నీచ జన్మలు, విషమ జన్మలు - కలుగుచున్నవి యనుటయే సమంజసము. హేతుహేతుమద్భావమనగా - ఒక వస్తువు పుట్టుటకు ఇంకొక వస్తువు కారణము, ఆ కారణవస్తువు పుట్టుటకు దానికి ముందు వస్తువు కారణము - దానికి దానిముందు వస్తువు కారణము - ఈ ప్రకారముగా ఎంత వెనుకకు వెళ్ళినను దానికి మఱియొక వస్తువు కారణముగా నుండవలెను - ఇట్లు అనంతముగా కారణ వస్తువునకు కార్యవస్తువునకు గల సంబంధము - ఇది భగవంతునివలె, సంసారమువలె అనాది. మొదటి కారణము తెలియదుకనుక దీనిలో అనవస్థాదోషమున్నది. (చూడుము - “బీజాంకుర న్యాయము” ; “అనవస్థా”). కాని ఈ న్యాయము జన్మకల వస్తువులకే సంబంధించినది, వాటికి యీ దోషము కూడ పట్టును. కాని భగవంతునకు జన్మలేదు - అజుడు - బ్రహ్మ కార్య వస్తువు కదు) “న కారణం కరణాధిపో, న చాస్య కస్య చిజ్జనితా, న బాధిపః”

(శ్వేతాశ్వతరోపనిషత్)

(ఈ బ్రహ్మకు కారణము, కరణము, అధిపుడు, ఈతనిని పుట్టించినవాడుకాని లేడు) (అందుచే చ బ్రహ్మ్నని ‘అజుడు’ (సజాయతే ఇత్యజః - పుట్టుక కలవాడుకాడు) అని, “అస్య జన్మ న విద్యతే” (ఇత్ని జన్మ గుఱించి తెలియదు) అని చెప్పియుండడమైనది). అందుచేత అతనికి కారణవస్తువేదియని యడుగుట సమంజసము - అతని యదల - సృష్టికారణ విషయములో ఈ న్యాయము వర్తించినను - అనవస్థా దోషము పట్టదు).

  1. “సృష్ట్యుత్తర కాలం హి శరీరాది విభాగాపేక్షం కర్మ, కర్మాపేక్షశ్చ శరీరాది విభాగః ఇతి ఇతరేతరాశ్రయత్వం ప్రనజ్యేత - అతో విభాగా దూర్ధ్వం కర్మాపేక్ష ఈశ్వరః ప్రవర్తతాం నా మ ప్రాక్తు విభాగాత్ వైచిత్ర్య నిమిత్తస్య కర్మణో అభావాత్ తుల్యైవాద్యా సృష్టిః ప్రాప్నోతీతి చేత్ నైషదోషః, అనాదిత్వాత్ సంసారస్య; భవే దేషదోషో యద్యాదిమానయం సంసారస్యాత్. అనాదౌ తి సంసారే బీజాంకురవత్ హేతి హేతుమద్భావేన కర్మణ స్స్ర్గ వైషమ్యస్య చ ప్రబృత్తిర్న విద్యతే”.

(సృష్టి తర్వాతనే శరీరము మొదలగు విభాగము చేయుటకు కారణము కర్మ. కర్మకు కారణము శరీరాది విభాగము - ఇట్లు ఒకదానికొకటి ఆశ్రయించి యుండునవి. కర్మ చేయుటవలన శరీరము కలుగును, జన్మ కలుగును - జన్మ కలుగుటవలన కర్మ చేయును. దీనిని బట్టి శరీరాది విభాగము తర్వాతనే కర్మ ఉండవలెను. అనగా, మొదట శరీరాది విభాగమునకు ముందు విచిత్ర సృష్టికి కారణమైన కర్మ లేదు, కనుక మొదటి సృష్టి విషమము కాదు అనుటలో దోషము లేదు. సంసారము (సృష్టి) అనాది కనుక - ప్రారంభము తెలియదు కనుక - సంసారము ఆది కలది అయిన యడల దోషమే - సంసారము బీజాంకుర న్యాయమువలె (విత్తనమునుండి చెట్టు, చెట్టునుండి విత్తనము పుట్టుట). ఏది ముందు ఏది వెనుక - చెట్టుముందా? విత్తనము ముందా? అను న్యాయమువలె, హేతు, హేతుమద్భావము ననుసరించి కర్మ వలననే సృష్టి వైషమ్యము కలుగుచున్నది అనుటలో విరోధములేదు - ఒక సృష్టియందు చేయబడిన కర్మలు ఆ సృష్టియంతమందు మిగిలియుండిన కర్మలు తర్వాత సృష్టికి కారనమగుచున్నవి). ఈ సంసారము ఆది కలది అయిన యడల అనవస్థాదోషము పట్తును. భగవంతుడు - ఆదిలేనివాడు - అందుచేత యీ దోషము పట్టదు).

  1. “గుణనామపి వైషమ్యాత్ శరీరారంభకారిణాం |

న సర్వే తుల్య శీలాస్యురిత్యాహ ప్రలృతేః పతిః ||. (గీతాభావప్రకాసము - 4 - 84)

(శరీరములకు కారణమైన సత్వరజస్తమములను - త్రిగుణముల వైషమ్యమువలన అందఱూ సమానమైన గుణము కలవారు కారు - అని శ్రీకృష్ణభగవానుడు చెప్పెను).

  1. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |” (గీతాభావప్రకాశము - 4-11)

(బ్రాహ్మణ, క్షత్రియ, వయస్య శూద్రులు అను నాలుగు వర్ణములు త్రిగుణ ప్రభావమువలనను, వారి వారి కర్మల ననుసరించియు నేను సృష్టించితిని).

  1. “వ. సర్వ భూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యము లేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 -
  2. “ఏష హ్యేవ సాధు కర్మకారయతి తం యమెభ్యో లోకేభ్య ఉన్నినీషతే. ఏష ఉవా అసాధుకర్మకారయతి తం యమధో ని నీషతే”.

(కౌ - 3 - 8)

(ఎవనిని కర్మలననుసరించి ఊర్ధ్వలోకమును పొందింప చూచునో పరబ్రహ్మ వానిచే సాధుకర్మ చేయించును - ఎవని అధో లోకములను పొందింప దలచునో వానిచే అసాధు కర్మలు చేయించును). సత్కర్మ చేసిన వానికి ఊర్ధ్వలోకములు, దుష్కర్మ చేసినవానికి అధోలోకములు ప్రాప్తింపచేయును - “యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహం”. (శ్రీమద్భగవద్గీత - 4 - 11)

(నా విషయములో ఎవరెట్లు ప్రవర్తించెదరో వారిని దానికి తగినట్లే నేను చూచెదను).

  1. ఒకే భూమినుండి పుట్టిన ఱాళ్ళు కొన్ని రాళ్ళు గాను కొన్ని వజ్రములుగాను, కొన్ని వైడూర్యములు మొదలగు మణులుగా నుండును. అట్లే ఒకే భూమివలన పుట్టిన చెట్టుకు ఆకులు, పువ్వులు, పండ్లు. రసములు వేరు వేరుగా నున్నవి. పరబ్రహ్మవలె ఒకే మాదిరిగానుండనక్కరలేదు - దీనికి కారణము ప్రకృతి, దాని గుణములు, తత్వములు వాటిలో తేడాలు).

  2. ఒకటే యగు పృధివికి ఉత్తమ, మధ్యమాధమ భేదములుగల మణి సూర్యకాంత పాషాణాది వైచిత్ర్యము కలుగుచున్నది. ఏక పృధివ్యాశ్రయములగు బీజములకు చందన, కింపాక, చంపక గుల్మలతాది రూపము కలిగి బహు విధ పత్ర పుష్ప ఫల గంధ రసాది వచిత్ర్యము కలుగుచున్నది. మఱియు, నొక్కటగు నన్నరసమునకు నఖ కేశ దంత రక్త మాంసాది వైచిత్ర్యము కలుగుచున్నది. అటులనే ఏకమగు బ్రహ్మమునకు జీవ ప్రపంచ వైచిత్ర్యములు కలుగుచున్నవి).

Transliteration
  1. sṛṣṭilōni viṣamabhāvamu - heccu takkuvalugā puṭṭiṃcuṭa.

  2. “kāṃści datyaṃta sukha bhājaḥ karōti, dēvādīn;kāṃści datyaṃta duḥkha bhājaḥ karōti, paśvādīn; kāṃści nmadhyama bhōga bhāja manuṣyādīn - ityēvaṃ viṣamāṃ sṛṣṭiṃ nirma māṇasya īśvarasya pṛthagjanasyēva rāgadvēṣōpapattēḥ śruti smṛtyavadhāri ta svaccatvāt. īśvara svabhāva vilōpaḥ prasajyēta”.

idaṃ brūmaḥ - - - sāpēkṣōhi īśvarōviṣamāṃ sṛṣṭiṃ nirmamatē - ikōmapēkṣa iti cēt dharmā dharmāvapēkṣatē iti padāmaḥ - ataḥ sṛjyamāna prāṇi dharmā dharmāpēkṣa viṣamā sṛṣṭiriti na ayaṃ īśvarasya aparādhaḥ - īśvarastu parjanyavaddraṣṭavyaḥ - yathāthi parjanyō vrīḍāyavādi sṛṣṭau sādhāraṇaṃ kāraṇaṃ bhavati, vrīhi yavādi vaiṣamyē tu tattajjīva gatānyēvā sādhāraṇāni karmāṇi kāraṇāni bhavaṃti. ēvamīśvarasyāpēkṣatvānna vaiṣamya nairguṇyābhyāṃ duṣyati. tathā ca darśayatiḥ - “puṇyō vaipuṇyēna karmaṇā bhavati, pāpaḥ pāpēna” iti smṛtirapi prāṇikarma viśēśāpēkṣamīśvara syānu grahī tatvaṃ,. nigrahatvatvaṃ darśayati - yē yathā māṃ prapadyaṃtē tāṃ tadhaiva bhajāmyahaṃ”ityēvaṃ jātīyakā”. (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē)

(bhagavaṃtuḍu koṃdaṟini dēvatalu modalaguvārivale mikkili sukhamu galavāruganu, koṃdaṟini paśuvulu modalaguvāṭivale mikkili duḥkhamugalavāṭiganu,maṟikoṃdaṟini manuṣyulu modalaguvārivale maghyama bhōgamu galavariniganu - iṭlu viṣamasṛṣṭini bhagavaṃtuḍu cēyucunnāḍu - koṃdaṟiyaṃdu pakṣapātamu, maṟikoṃdaṟiyaṃdu dvēṣamu kaligi, sṛṣṭicēyucunnaṭlu kanabaḍucunnadi. ī viṣamasṛṣṭini oka apēkṣa kaligiyē cēyucunnāḍu - ā apēkṣa ēmiṭanagā - dharmādharmamulu (pāpapuṇyamulu) - prāṇula pāpapuṇyamula nanusariṃci cēyu ī viṣamasṛṣṭi bhagavaṃtuni aparādhamukādu. bhagavaṃtuḍu mēghamu vaṃṭivāḍu, vrīhi yavādulu (dhānyamulu) vēru vērugā sṛṣṭiṃpabaḍuṭaku vāṭi vāṭi bījamulu (vittanamulu) asādhāraṇa kāraṇamulu. ī prakāramugānē dēvatulanu, manuṣyulanu modalaguvārini sṛṣṭiṃcuṭalō bhagavaṃtuḍu sādhāraṇa kāraṇamu - koṃdaṟu dēvatulu gānu, marikoṃdaṟu manuṣyulugānu sṛṣṭiṃcuṭalō āyā jīvula karmalē asādhāraṇakāraṇamu - iṃduvalana dēvatulu,manuṣyulu ani heccu taggugā sṛṣṭiṃcuṭalō bhagavaṃtuniki vaiṣamyamugāni nairghṛṇyamukāni lēdu - ī viṣayamunē śruti iṭlu ceppucunnadi - ” puṇyakarmacēta puṇyātmuḍugānu, pāpakarmacēta pāpātmuḍugānu puṭucunnāḍu ” ani śrutilō prāṇula karma viśēṣamuvalana kalugunu - anagā puṇya pāpa karmalu bhagavaṃtuni anugraha nigrahamulacēta kalugunu - ani ceppabaḍinadi - ” evaru nannu ē prakāramugā bhajiṃcedarō vārini nēnu ā prakāramugānē anugrahiṃcedanu - (lēka nigrahiṃcedanu). prāṇula karmalē sṛṣṭilōni heccu taggulaku kāraṇamu).

  1. “sṛṣṭēḥ prāk avibhāgāna dhāraṇāt na tadānīṃ karmāsti; tataḥ. karmāpēkṣayā viṣamāsṛṣṭiḥ itya saṃgatamiti cēt, na - anāditvāt saṃsārasya bījāṃkuravat hētu hētumadbhāvōpattērityarthaḥ.”

(sṛṣṭiki muṃdu vibhāgamu lēdu - vērvēru vastuvulu - jīvulu - lēvu. eṃducētananagā - “sadēva, sōmyēdhamagra āsīdēkamēvā dvitīyaṃ brahma” (ippuḍu nāmarūpamulatō vēru vērugā kanabaḍucunna ī prapaṃcamaṃtayu, ivi sṛṣṭiṃpabaḍakamuṃdu okka ātmagānē yuṃḍenu. adi okkaṭē ātma; maṟiyokaṭi ātma vaṃṭidi lēdu - adēkāka itara vastuvēdiyunu lēdu - ani ceppabaḍinadikanuka prāṇula karmalavalana viṣamasṛṣṭi jariginadi ani yeṭlu ceppanagunu. aṃtakumuṃdu prāṇulu lēru, aṃducēta evarū karmacēyuṭa uṃḍadu; vāri karmalē viṣama sṛṣṭiki kāraṇamu - ani yeṭlu ceppanagunu - anina aṭlukādu - saṃsāramu anādi. saṃsāramanagā sṛṣṭi sthitilayamulu okaṭi tarvāta nokaṭigā, eḍateripilēkuṃḍa pravāharūpamugā vaccucuṃḍunadi. dīniki ādilēdu. anagā, idi eppuḍu prāraṃbhamainadō teliyadu. aṃducēta karmalu modaṭilō lēvukanuka karmalavalana sṛṣṭi vaiṣamyamu kalugucunnadi anuṭaku vīlulēdu anuṭa samaṃjasamukādu. vittanamu valana molaka puṭṭucunnadi. molka pedda ceṭṭugā perigi marala vittanamulu dānivalana kalugucunnavi (puṭṭucunnavi). anagā, ceṭtuku vittanamu kāraṇamu - vittanamunaku ceṭṭu kāraṇamu - ī vidhamugā okadānikokaṭi kāraṇamaguṭanu hētu hētumadbhāvamaṃduru. ayina yaḍala moṭṭamodaṭa ēdi yuṃḍenu, dēni nuṃḍi ēdi puṭṭenu anu saṃdēhamu kalugunu - anādigā eppaṭinuṃḍiyē ī prakāramugā jarugucunnadi. dīprakāramugānē sṛṣṭi kūḍājarugucunnadi - aṃducēta vittanamunuṃḍi ceṭṭu kalugucunnadi, kāraṇamunuṃḍi kāryamu kalugucunnadi. karmala phalamugā janmalu - uccha, nīca janmalu, viṣama janmalu - kalugucunnavi yanuṭayē samaṃjasamu. hētuhētumadbhāvamanagā - oka vastuvu puṭṭuṭaku iṃkoka vastuvu kāraṇamu, ā kāraṇavastuvu puṭṭuṭaku dāniki muṃdu vastuvu kāraṇamu - dāniki dānimuṃdu vastuvu kāraṇamu - ī prakāramugā eṃta venukaku veḷḷinanu dāniki maṟiyoka vastuvu kāraṇamugā nuṃḍavalenu - iṭlu anaṃtamugā kāraṇa vastuvunaku kāryavastuvunaku gala saṃbaṃdhamu - idi bhagavaṃtunivale, saṃsāramuvale anādi. modaṭi kāraṇamu teliyadukanuka dīnilō anavasthādōṣamunnadi. (cūḍumu - “bījāṃkura nyāyamu” ; “anavasthā”). kāni ī nyāyamu janmakala vastuvulakē saṃbaṃdhiṃcinadi, vāṭiki yī dōṣamu kūḍa paṭṭunu. kāni bhagavaṃtunaku janmalēdu - ajuḍu - brahma kārya vastuvu kadu) “na kāraṇaṃ karaṇādhipō, na cāsya kasya cijjanitā, na bādhipaḥ”

(śvētāśvatarōpaniṣat)

(ī brahmaku kāraṇamu, karaṇamu, adhipuḍu, ītanini puṭṭiṃcinavāḍukāni lēḍu) (aṃducē ca brahmnani ‘ajuḍu’ (sajāyatē ityajaḥ - puṭṭuka kalavāḍukāḍu) ani, “asya janma na vidyatē” (itni janma guṟiṃci teliyadu) ani ceppiyuṃḍaḍamainadi). aṃducēta ataniki kāraṇavastuvēdiyani yaḍuguṭa samaṃjasamu - atani yadala - sṛṣṭikāraṇa viṣayamulō ī nyāyamu vartiṃcinanu - anavasthā dōṣamu paṭṭadu).

  1. “sṛṣṭyuttara kālaṃ hi śarīrādi vibhāgāpēkṣaṃ karma, karmāpēkṣaśca śarīrādi vibhāgaḥ iti itarētarāśrayatvaṃ pranajyēta - atō vibhāgā dūrdhvaṃ karmāpēkṣa īśvaraḥ pravartatāṃ nā ma prāktu vibhāgāt vaicitrya nimittasya karmaṇō abhāvāt tulyaivādyā sṛṣṭiḥ prāpnōtīti cēt naiṣadōṣaḥ, anāditvāt saṃsārasya; bhavē dēṣadōṣō yadyādimānayaṃ saṃsārasyāt. anādau ti saṃsārē bījāṃkuravat hēti hētumadbhāvēna karmaṇa ssrga vaiṣamyasya ca prabṛttirna vidyatē”.

(sṛṣṭi tarvātanē śarīramu modalagu vibhāgamu cēyuṭaku kāraṇamu karma. karmaku kāraṇamu śarīrādi vibhāgamu - iṭlu okadānikokaṭi āśrayiṃci yuṃḍunavi. karma cēyuṭavalana śarīramu kalugunu, janma kalugunu - janma kaluguṭavalana karma cēyunu. dīnini baṭṭi śarīrādi vibhāgamu tarvātanē karma uṃḍavalenu. anagā, modaṭa śarīrādi vibhāgamunaku muṃdu vicitra sṛṣṭiki kāraṇamaina karma lēdu, kanuka modaṭi sṛṣṭi viṣamamu kādu anuṭalō dōṣamu lēdu. saṃsāramu (sṛṣṭi) anādi kanuka - prāraṃbhamu teliyadu kanuka - saṃsāramu ādi kaladi ayina yaḍala dōṣamē - saṃsāramu bījāṃkura nyāyamuvale (vittanamunuṃḍi ceṭṭu, ceṭṭunuṃḍi vittanamu puṭṭuṭa). ēdi muṃdu ēdi venuka - ceṭṭumuṃdā? vittanamu muṃdā? anu nyāyamuvale, hētu, hētumadbhāvamu nanusariṃci karma valananē sṛṣṭi vaiṣamyamu kalugucunnadi anuṭalō virōdhamulēdu - oka sṛṣṭiyaṃdu cēyabaḍina karmalu ā sṛṣṭiyaṃtamaṃdu migiliyuṃḍina karmalu tarvāta sṛṣṭiki kāranamagucunnavi). ī saṃsāramu ādi kaladi ayina yaḍala anavasthādōṣamu paṭtunu. bhagavaṃtuḍu - ādilēnivāḍu - aṃducēta yī dōṣamu paṭṭadu).

  1. “guṇanāmapi vaiṣamyāt śarīrāraṃbhakāriṇāṃ |

na sarvē tulya śīlāsyurityāha pralṛtēḥ patiḥ ||. (gītābhāvaprakāsamu - 4 - 84)

(śarīramulaku kāraṇamaina satvarajastamamulanu - triguṇamula vaiṣamyamuvalana aṃdaṟū samānamaina guṇamu kalavāru kāru - ani śrīkṛṣṇabhagavānuḍu ceppenu).

  1. cāturvarṇyaṃ mayā sṛṣṭaṃ guṇakarma vibhāgaśaḥ |” (gītābhāvaprakāśamu - 4-11)

(brāhmaṇa, kṣatriya, vayasya śūdrulu anu nālugu varṇamulu triguṇa prabhāvamuvalananu, vāri vāri karmala nanusariṃciyu nēnu sṛṣṭiṃcitini).

  1. “va. sarva bhūtātmakuṃḍaina īśvaruniki vaiṣamyamu lēdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 -
  2. “ēṣa hyēva sādhu karmakārayati taṃ yamebhyō lōkēbhya unninīṣatē. ēṣa uvā asādhukarmakārayati taṃ yamadhō ni nīṣatē”.

(kau - 3 - 8)

(evanini karmalananusariṃci ūrdhvalōkamunu poṃdiṃpa cūcunō parabrahma vānicē sādhukarma cēyiṃcunu - evani adhō lōkamulanu poṃdiṃpa dalacunō vānicē asādhu karmalu cēyiṃcunu). satkarma cēsina vāniki ūrdhvalōkamulu, duṣkarma cēsinavāniki adhōlōkamulu prāptiṃpacēyunu - “yē yathā māṃ prapadyaṃtē tāṃ stadhaiva bhajāmyahaṃ”. (śrīmadbhagavadgīta - 4 - 11)

(nā viṣayamulō evareṭlu pravartiṃcedarō vārini dāniki taginaṭlē nēnu cūcedanu).

  1. okē bhūminuṃḍi puṭṭina ṟāḷḷu konni rāḷḷu gānu konni vajramulugānu, konni vaiḍūryamulu modalagu maṇulugā nuṃḍunu. aṭlē okē bhūmivalana puṭṭina ceṭṭuku ākulu, puvvulu, paṃḍlu. rasamulu vēru vērugā nunnavi. parabrahmavale okē mādirigānuṃḍanakkaralēdu - dīniki kāraṇamu prakṛti, dāni guṇamulu, tatvamulu vāṭilō tēḍālu).

  2. okaṭē yagu pṛdhiviki uttama, madhyamādhama bhēdamulugala maṇi sūryakāṃta pāṣāṇādi vaicitryamu kalugucunnadi. ēka pṛdhivyāśrayamulagu bījamulaku caṃdana, kiṃpāka, caṃpaka gulmalatādi rūpamu kaligi bahu vidha patra puṣpa phala gaṃdha rasādi vacitryamu kalugucunnadi. maṟiyu, nokkaṭagu nannarasamunaku nakha kēśa daṃta rakta māṃsādi vaicitryamu kalugucunnadi. aṭulanē ēkamagu brahmamunaku jīva prapaṃca vaicitryamulu kalugucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.