← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్తబ్దః stabdaḥ

Original — తెలుగు
  1. స్తంభం గతిః; కృత్యా కృత్య వివేక శూన్యాః -

(ఇది చేయవలసినది, ఇది చేయకూడనినిది అను వివేకము లేనివారు).

  1. “అప్రణతాత్మా” (శ్రీశంకరః).

(వినయము, పెద్దలయెడ మర్యాద లేనివాడు).

  1. నివాత ప్రదేశస్థ వృక్ష ఇవ స్తబ్దః; స్థాణు రవికారీ -

(గాలి లేని ప్రదేశమందున్న చెట్టువలె కదలక మెదలక వికారములు లేక నుండువాడు).

  1. యథా లోకే వృక్షః గమనా గమన రహితః ఏక త్రైవ అవతిష్టతే, తద్వత్ అయం అద్వితీయః ఏకః పరమేశ్వరః స్తబ్దః నిర్వికారః -

(లోకమందు చెట్టు గమనాగమనములు - నడచుట లేక ఒక్క చోటనే ఉండునట్లు - ఆ ప్రకారముగానే ఒక్కడే అయిన పరమేశ్వరుడు (సృష్టి అంతటిలోను తనకంటె రెండవ వస్తువు లేనివాడు) వికారములు (మార్పులు) లేనివాడుగా - స్తబ్దుడుగా - నున్నాడు).

  1. “దండవత్”న నమతి కస్మై చిత్. (శ్రీశంకరః)

(కొయ్యవలె ఎవరికిని నమస్కరించనివాడు)

  1. “అనారంభ శీలః” (శ్రీమాన్ రామానుజః)

(చేయవలసిన పనులన్నియు పూర్తిచేసినవాడు వలె ఏ పనియును చేయనారంభించనివాడు).

“పరిపూర్ణం మన్యమానః న కించిత్ కుర్వాణః” (శ్రీమాన్ రామానుజః)

(తనకున్న పనులన్నింటినీ నిర్వహించినట్లే అనుకొని ఏ పనియును చేయనివాడు).

Transliteration
  1. staṃbhaṃ gatiḥ; kṛtyā kṛtya vivēka śūnyāḥ -

(idi cēyavalasinadi, idi cēyakūḍaninidi anu vivēkamu lēnivāru).

  1. “apraṇatātmā” (śrīśaṃkaraḥ).

(vinayamu, peddalayeḍa maryāda lēnivāḍu).

  1. nivāta pradēśastha vṛkṣa iva stabdaḥ; sthāṇu ravikārī -

(gāli lēni pradēśamaṃdunna ceṭṭuvale kadalaka medalaka vikāramulu lēka nuṃḍuvāḍu).

  1. yathā lōkē vṛkṣaḥ gamanā gamana rahitaḥ ēka traiva avatiṣṭatē, tadvat ayaṃ advitīyaḥ ēkaḥ paramēśvaraḥ stabdaḥ nirvikāraḥ -

(lōkamaṃdu ceṭṭu gamanāgamanamulu - naḍacuṭa lēka okka cōṭanē uṃḍunaṭlu - ā prakāramugānē okkaḍē ayina paramēśvaruḍu (sṛṣṭi aṃtaṭilōnu tanakaṃṭe reṃḍava vastuvu lēnivāḍu) vikāramulu (mārpulu) lēnivāḍugā - stabduḍugā - nunnāḍu).

  1. “daṃḍavat”na namati kasmai cit. (śrīśaṃkaraḥ)

(koyyavale evarikini namaskariṃcanivāḍu)

  1. “anāraṃbha śīlaḥ” (śrīmān rāmānujaḥ)

(cēyavalasina panulanniyu pūrticēsinavāḍu vale ē paniyunu cēyanāraṃbhiṃcanivāḍu).

“paripūrṇaṃ manyamānaḥ na kiṃcit kurvāṇaḥ” (śrīmān rāmānujaḥ)

(tanakunna panulanniṃṭinī nirvahiṃcinaṭlē anukoni ē paniyunu cēyanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.