స్థిరమైనది.
స్థిరత్వాత్ స్థాణః - (శ్రీశంకరః)
(స్థిరముగా నుండునది కనుక స్థాణువు)
“స్థాణురివ స్థిరః” (శ్రీశంకరః)
(స్థాణువు వలె స్థిరమైనవాడు)
(స్థిరమైన స్వభావముగలవాడు - ఇంకొక రూపము గలవాడుగా మారనివాడు).
(మొదటి రూపమును విడిచిపెట్టకుండటచేత స్థిరమైన స్వభావము కలవాడు - అందుచేతనే పాలు మొదలగువాటివలె మార్పు చెందనివాడు).
(కొమ్మలు లేని చెట్టు యొక్క మొరడు, మొద్దు, తెలివి తక్కువవాడు, చైతన్యము లేనివాడు - స్తబ్దుడు అని లోకములో వాడుకగా అర్థము గలవాడు).
(ఎందుకు పనికిరాని చెట్టు - ఎండిపోయిన చెట్టు - శుష్కించిన చెట్టు - ప్రకృతి యొక్క వికారములన్నియు లయమును పొందినపుడు ఉండువాడు - అనగా ప్రళయము తర్వాత మిగిలియుండువాడు - “సర్వ వైకారిక లయే స్థాణు స్తిష్టతి ఏవ సః” - ఇతి నిరుక్తేః - అని నిరుక్తి చెప్పుచున్నది.
(స్థావరములు అయిన భూమి మొదలగునవి ఇతని యందుండును కనుక స్థాణువు - అనగా, అవి ఉండుటకు స్థానమైన వాడు - పృధివి చాలాకాలమువరకు ఉండునది. అట్టిది తనయందుండుటచేత దానికంటె చాలాకాలము తాను ఉండువాడు).
ఆత్మ అన్నింటిలోను వ్యాపించియుండునది, ఇది కాక మరొక చోటికి - వెళ్ళదు - వెళ్ళుటకు మరొక చోటు లేదు - అందుచేత స్థిరముగా అన్నింటిలోనుండువాడు).
“శ్లో||. నిత్యత్వాత్ సర్వగోవ్యాపి, వ్యాపిత్వాత్ స్థాణువత్ స్థిరః |
స్థిరత్వాత్ క్రియా శూన్యః తస్మా దాత్మా చిరంతనః ||
- - - స్థాణుత్వా దని కార్యోయం - - - “. (గీతాభావప్రకాశము - 2 - 297 to 299)
(ఆత్మ నిత్యుడగుటవలన అన్నింటిలోను వ్యాపించియుండువాడు - అట్లు వ్యాపించియుండునది కనుక స్థాణువు వలె స్థిరముగా నుండువాడు - స్థిరముగా నుండువాడు కనుక వికారములు - మార్పులు - లేనివాడు - అందుచేత చిరంతనుడు - చాకాలమునుండి యున్నవాడు).
sthiramainadi.
sthiratvāt sthāṇaḥ - (śrīśaṃkaraḥ)
(sthiramugā nuṃḍunadi kanuka sthāṇuvu)
“sthāṇuriva sthiraḥ” (śrīśaṃkaraḥ)
(sthāṇuvu vale sthiramainavāḍu)
(sthiramaina svabhāvamugalavāḍu - iṃkoka rūpamu galavāḍugā māranivāḍu).
(modaṭi rūpamunu viḍicipeṭṭakuṃḍaṭacēta sthiramaina svabhāvamu kalavāḍu - aṃducētanē pālu modalaguvāṭivale mārpu ceṃdanivāḍu).
(kommalu lēni ceṭṭu yokka moraḍu, moddu, telivi takkuvavāḍu, caitanyamu lēnivāḍu - stabduḍu ani lōkamulō vāḍukagā arthamu galavāḍu).
(eṃduku panikirāni ceṭṭu - eṃḍipōyina ceṭṭu - śuṣkiṃcina ceṭṭu - prakṛti yokka vikāramulanniyu layamunu poṃdinapuḍu uṃḍuvāḍu - anagā praḷayamu tarvāta migiliyuṃḍuvāḍu - “sarva vaikārika layē sthāṇu stiṣṭati ēva saḥ” - iti niruktēḥ - ani nirukti ceppucunnadi.
(sthāvaramulu ayina bhūmi modalagunavi itani yaṃduṃḍunu kanuka sthāṇuvu - anagā, avi uṃḍuṭaku sthānamaina vāḍu - pṛdhivi cālākālamuvaraku uṃḍunadi. aṭṭidi tanayaṃduṃḍuṭacēta dānikaṃṭe cālākālamu tānu uṃḍuvāḍu).
ātma anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi, idi kāka maroka cōṭiki - veḷḷadu - veḷḷuṭaku maroka cōṭu lēdu - aṃducēta sthiramugā anniṃṭilōnuṃḍuvāḍu).
“ślō||. nityatvāt sarvagōvyāpi, vyāpitvāt sthāṇuvat sthiraḥ |
sthiratvāt kriyā śūnyaḥ tasmā dātmā ciraṃtanaḥ ||
- - - sthāṇutvā dani kāryōyaṃ - - - “. (gītābhāvaprakāśamu - 2 - 297 to 299)
(ātma nityuḍaguṭavalana anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - aṭlu vyāpiṃciyuṃḍunadi kanuka sthāṇuvu vale sthiramugā nuṃḍuvāḍu - sthiramugā nuṃḍuvāḍu kanuka vikāramulu - mārpulu - lēnivāḍu - aṃducēta ciraṃtanuḍu - cākālamunuṃḍi yunnavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.