← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థితప్రజ్ఞః sthitaprajñaḥ

Original — తెలుగు
  1. స్థితా ప్రజ్ఞా జ్ఞానం యస్య సః స్థిత ప్రజ్ఞః - (శ్రీశంకరః)

(స్థిరమైననిలకడగల జ్ఞానము కలవాడు).

  1. “స్థితా నిశ్చలా అహం బ్రహ్మాస్మీతి ప్రజ్ఞా యస్య సః”. (మధుసూదనీవ్యాఖ్యా)

(నేను బ్రహ్మను అయితిని అను నిశ్చలమైన బుద్ధి కలవాడు)

  1. “స్థితా ప్రతిష్టితా” అహం అస్మి పరం బ్రహ్మ” ఇతి ప్రజ్ఞాయస్య సః స్థిత ప్రజ్ఞః” (శ్రీశంకరః)

(నేనే పరబ్రహ్మను అయితిని అని ప్రతిష్టింపబడిన జ్ఞానము కలవాడు)

  1. ప్రతిష్ఠాప్రాప్తా జ్ఞానం అపరోక్షం యస్య సః -

(అపరోక్షజ్ఞానము ప్రతిష్టించుకొని యున్నవాడు)

  1. “స్థితా ప్రత్యగాత్మని ప్రతిష్ఠితా ప్రజ్ఞా యస్య సః -”. (శ్రీనీలకంఠవ్యాఖ్య)

(ప్రత్యగాత్మయందు ప్రతిష్ఠింపబడిన - స్థిరముగా నుంచ బడిన - జ్ఞానము కలవాడు).

  1. “స్థితా ప్రతిష్టితా ఆత్మానాత్మ వివేకజా ప్రజ్ఞా యస్య సః” త్యక్త పుత్ర విత్త లోకేషణః, సన్యాసీ, ఆత్మారామః, ఆత్మ క్రీడః స్థితప్రజ్ఞః ఇత్యర్థః.

(ఆత్మ యేది, అనాత్మ యేది అను వివేకమువలన కలుగు జ్ఞానము ప్రతిష్ఠించుకొనినవాడు - స్థిరముగా నుంచుకొనినవాడు. పుత్రులందు, ధనమందు, లోకమందు, ఆశ, అభిమానము వదలుకొనినవాడు, సన్యాసి, ఆత్మయందే రమించువాడు, నిత్యము ధ్యానము కలిగియుండువాడు - ఆత్మయందే క్రీడించువాడు).

  1. “శ్లో||. స్థితప్రజ్ఞో యతిరియం యః సదానంద మశ్నుతే |

బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః ||“. (అధ్యాత్మోపనిషత్)

(పరబ్రహ్మమందే లీనమైన మనస్సు కలవాడు, వికారములు లేనివాడు, చలించనివాడు, ఏ విధమైన మార్పులు లేనివాడు, నిష్క్రియుడు అయిన స్థితప్రజ్ఞుడు పరమానందమును పొందును - పరమానందరూపమైన ముక్తిని పొందును).

  1. “బ్రహ్మైవాస్మీతి ధీర్యస్య నిశ్చలా స్థిత ధీర్హిసః”. (గీతాభావప్రకాశము - 2 - 540)

(బ్రహ్మను అయితిని అను నిశ్చలమైన బుద్ధి కలవాడు స్థితప్రజ్ఞుడు)

  1. శోధిత “తత్వం” పదార్థ స్వరూపమగు ప్రత్యగాత్మ పర్మాత్మైక జ్ఞానమే ఆకారముగా గలిగిన మనోవ్యాపారమగు ప్రజ్ఞ (జ్ఞానము) కలవాడు).

  2. “సరాగ విషయ నివృత్తిః స్థిత ప్రజ్ఞస్య లక్షణం”

(విషయములందు అనురాగము లేకుండుట స్థితప్రజ్ఞుని లక్షణము) (చూడుము - శ్రీమద్భగవద్గీత - 2 - 55 to 70).

  1. జీవునకు పరమాత్మతో తొమ్మిది విధములగు సంబంధమున్నది, ఈ

తొమ్మిది విధములైన సంబంధముతో పరమాత్మను భావించుట ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞావస్థయందు స్థిరముగానుండువాడు స్థితప్రజ్ఞుడు).

Transliteration
  1. sthitā prajñā jñānaṃ yasya saḥ sthita prajñaḥ - (śrīśaṃkaraḥ)

(sthiramainanilakaḍagala jñānamu kalavāḍu).

  1. “sthitā niścalā ahaṃ brahmāsmīti prajñā yasya saḥ”. (madhusūdanīvyākhyā)

(nēnu brahmanu ayitini anu niścalamaina buddhi kalavāḍu)

  1. “sthitā pratiṣṭitā” ahaṃ asmi paraṃ brahma” iti prajñāyasya saḥ sthita prajñaḥ” (śrīśaṃkaraḥ)

(nēnē parabrahmanu ayitini ani pratiṣṭiṃpabaḍina jñānamu kalavāḍu)

  1. pratiṣṭhāprāptā jñānaṃ aparōkṣaṃ yasya saḥ -

(aparōkṣajñānamu pratiṣṭiṃcukoni yunnavāḍu)

  1. “sthitā pratyagātmani pratiṣṭhitā prajñā yasya saḥ -”. (śrīnīlakaṃṭhavyākhya)

(pratyagātmayaṃdu pratiṣṭhiṃpabaḍina - sthiramugā nuṃca baḍina - jñānamu kalavāḍu).

  1. “sthitā pratiṣṭitā ātmānātma vivēkajā prajñā yasya saḥ” tyakta putra vitta lōkēṣaṇaḥ, sanyāsī, ātmārāmaḥ, ātma krīḍaḥ sthitaprajñaḥ ityarthaḥ.

(ātma yēdi, anātma yēdi anu vivēkamuvalana kalugu jñānamu pratiṣṭhiṃcukoninavāḍu - sthiramugā nuṃcukoninavāḍu. putrulaṃdu, dhanamaṃdu, lōkamaṃdu, āśa, abhimānamu vadalukoninavāḍu, sanyāsi, ātmayaṃdē ramiṃcuvāḍu, nityamu dhyānamu kaligiyuṃḍuvāḍu - ātmayaṃdē krīḍiṃcuvāḍu).

  1. “ślō||. sthitaprajñō yatiriyaṃ yaḥ sadānaṃda maśnutē |

brahmaṇyēva vilīnātmā nirvikārō viniṣkriyaḥ ||“. (adhyātmōpaniṣat)

(parabrahmamaṃdē līnamaina manassu kalavāḍu, vikāramulu lēnivāḍu, caliṃcanivāḍu, ē vidhamaina mārpulu lēnivāḍu, niṣkriyuḍu ayina sthitaprajñuḍu paramānaṃdamunu poṃdunu - paramānaṃdarūpamaina muktini poṃdunu).

  1. “brahmaivāsmīti dhīryasya niścalā sthita dhīrhisaḥ”. (gītābhāvaprakāśamu - 2 - 540)

(brahmanu ayitini anu niścalamaina buddhi kalavāḍu sthitaprajñuḍu)

  1. śōdhita “tatvaṃ” padārtha svarūpamagu pratyagātma parmātmaika jñānamē ākāramugā galigina manōvyāpāramagu prajña (jñānamu) kalavāḍu).

  2. “sarāga viṣaya nivṛttiḥ sthita prajñasya lakṣaṇaṃ”

(viṣayamulaṃdu anurāgamu lēkuṃḍuṭa sthitaprajñuni lakṣaṇamu) (cūḍumu - śrīmadbhagavadgīta - 2 - 55 to 70).

  1. jīvunaku paramātmatō tommidi vidhamulagu saṃbaṃdhamunnadi, ī

tommidi vidhamulaina saṃbaṃdhamutō paramātmanu bhāviṃcuṭa prajña. ī prajñāvasthayaṃdu sthiramugānuṃḍuvāḍu sthitaprajñuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.