“స్రష్టుకామో జగద్యోనిః - తమో గుణమధిష్ఠాయ సూక్ష్మ తన్మాత్రాణి భూతాని స్థూలీకర్తుం సో (అ)కామయత సృష్టేః పరిమితిని భూతాన్యేకమేకం ద్విధా విధాయ, పునశ్చతుర్ధా కృత్వా స్వేస్వేతర ద్వితీయాం శైః పంచ పంచధా సం యోజ్య పంచీకృత భూతైః అనంతకోటి బ్రహ్మాండాని తత్తదండోచిత చతుర్దశ భువనాని తత్తద్భవనోచిత గోళిక స్థూల శరీరాణి అసృజత్ -” (పైంగళోపనిషత్)
(జగత్తునకు కారణమైన భగవంతుడు సృష్టిచేయ కోరిక గలవాడై తమోగుణమునధిష్టించి సూక్ష్మరూపములోనున్న తన్మాత్రలను స్థూలభూతములుగా చేయుటకు కోరికగలవాడాయెను - సృష్టిలో సూక్ష్మభూతములను ఒక్కొక్క దానిని రెండుగా విభకించి, మరల ఒక్కొక్క భాగమును నాలుగుగా విభజించి, ఒక్కొక్క భూతములోని సగముభాగము ఉంచి, మిగిలిన సగము భాగములోని ఒక్కొక్కనాలుగవ వంతు ఇతర భూతములలో కలిపెను. ఇట్లు ఆ పంచభూతములను పంచీకృతము చేసెను. అనగా, ప్రతిభూతములోను అయిదు భూతముల అంశలు కలిసి యున్నట్లుగా చేసెను - అట్లు పంచీకృతము చేసిన పంచభూతములతో - స్థూలభూతమూలతో - అనంతకోటి బ్రహ్మాండములను ఆయా బ్రహ్మాండములకు తగిన పదునాలుగు భువనములను (లోకములను), ఆయా లోకములకు తగిన గోళికములను - స్థూలశరీరములను సృష్టించెను).
“sraṣṭukāmō jagadyōniḥ - tamō guṇamadhiṣṭhāya sūkṣma tanmātrāṇi bhūtāni sthūlīkartuṃ sō (a)kāmayata sṛṣṭēḥ parimitini bhūtānyēkamēkaṃ dvidhā vidhāya, punaścaturdhā kṛtvā svēsvētara dvitīyāṃ śaiḥ paṃca paṃcadhā saṃ yōjya paṃcīkṛta bhūtaiḥ anaṃtakōṭi brahmāṃḍāni tattadaṃḍōcita caturdaśa bhuvanāni tattadbhavanōcita gōḷika sthūla śarīrāṇi asṛjat -” (paiṃgaḷōpaniṣat)
(jagattunaku kāraṇamaina bhagavaṃtuḍu sṛṣṭicēya kōrika galavāḍai tamōguṇamunadhiṣṭiṃci sūkṣmarūpamulōnunna tanmātralanu sthūlabhūtamulugā cēyuṭaku kōrikagalavāḍāyenu - sṛṣṭilō sūkṣmabhūtamulanu okkokka dānini reṃḍugā vibhakiṃci, marala okkokka bhāgamunu nālugugā vibhajiṃci, okkokka bhūtamulōni sagamubhāgamu uṃci, migilina sagamu bhāgamulōni okkokkanālugava vaṃtu itara bhūtamulalō kalipenu. iṭlu ā paṃcabhūtamulanu paṃcīkṛtamu cēsenu. anagā, pratibhūtamulōnu ayidu bhūtamula aṃśalu kalisi yunnaṭlugā cēsenu - aṭlu paṃcīkṛtamu cēsina paṃcabhūtamulatō - sthūlabhūtamūlatō - anaṃtakōṭi brahmāṃḍamulanu āyā brahmāṃḍamulaku tagina padunālugu bhuvanamulanu (lōkamulanu), āyā lōkamulaku tagina gōḷikamulanu - sthūlaśarīramulanu sṛṣṭiṃcenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.