“శ్లో|| ఆత్మన్యగ్నిం సమారోప్య మమాత్మతాం |
కారణేషున్యసేత్, సమ్యక్ సంఘా తంతు యథార్హతః ||“.
(కారణేషు = అకాశాదిషు ; యథార్హతః = యథా యోగ్యం ; సంఘాతం = శరీరం).
“శ్లో||. ఖేఖాని వాయౌ నిశ్వాసాన్ తేజసి ఊష్మాణమాత్మవాన్ |
అప్సు సృక్షేష్మమాయాని క్షితౌ శేషం యధోద్భవం “.
(ఖే - ఆకాశే; ఖాని = దేహగత చిద్రాణి, శేషం అస్థి,మాంసాది కఠినాంశం -
(మమకారము వదలివేసి శరీరమును అగ్నిలో వేసి, శరీరమును కూడబెట్టిన పంచభూతముల అంశములను వాటి వాటి కారణములందు లయింప చేయవలెను).
“ఆకాశమందు శరీరములోని అకాశాంశములైన ఛిద్రములను వాయువునందు నిశ్వాసములను, తేజస్సులో శరీరములోని వేడిమిని, జలములో శ్లేషంఅము మొదలగు వాటిని, మిగిలిన వాటిని, అనగా, యముకలు, మాంసము మొదలగు కఠినమైన అంశలను అవి వేటినుండి పుట్టినవో వాటిలోను లయింప చేయవలయును).
విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యమనెడి యిష్టిగావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును, నిర్దళితా శేష బంధనుండునునై, సకలేంద్రియముల మానసంబున నడంచి, ప్రాణాధీన వృత్తియగు మానసంబుం బ్రాణమందును ప్రాణము నపానమందును, నుత్సర్గ సహితంబయిన యపానము మృత్యువును బంచభూతంబుల నైక్యంబయిన దేహంబునందును, దేహమును గుణత్రయంబునందును, గుణత్రయంబు నవిద్యయందును, సర్వారోప హేతువగు నవిద్యను జీవునియందును, జీవుండైన తను నవ్యయంబయిన బ్రహ్మమందును లయింప జేసి, బహిరంగ వ్యాపారంబులు విడిచి - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 348)
“ślō|| ātmanyagniṃ samārōpya mamātmatāṃ |
kāraṇēṣunyasēt, samyak saṃghā taṃtu yathārhataḥ ||“.
(kāraṇēṣu = akāśādiṣu ; yathārhataḥ = yathā yōgyaṃ ; saṃghātaṃ = śarīraṃ).
“ślō||. khēkhāni vāyau niśvāsān tējasi ūṣmāṇamātmavān |
apsu sṛkṣēṣmamāyāni kṣitau śēṣaṃ yadhōdbhavaṃ “.
(khē - ākāśē; khāni = dēhagata cidrāṇi, śēṣaṃ asthi,māṃsādi kaṭhināṃśaṃ -
(mamakāramu vadalivēsi śarīramunu agnilō vēsi, śarīramunu kūḍabeṭṭina paṃcabhūtamula aṃśamulanu vāṭi vāṭi kāraṇamulaṃdu layiṃpa cēyavalenu).
“ākāśamaṃdu śarīramulōni akāśāṃśamulaina chidramulanu vāyuvunaṃdu niśvāsamulanu, tējassulō śarīramulōni vēḍimini, jalamulō ślēṣaṃamu modalagu vāṭini, migilina vāṭini, anagā, yamukalu, māṃsamu modalagu kaṭhinamaina aṃśalanu avi vēṭinuṃḍi puṭṭinavō vāṭilōnu layiṃpa cēyavalayunu).
viraktuṃḍaina dharmanaṃdanuṃḍu prājāpatyamaneḍi yiṣṭigāviṃci yagnula nātmārōpaṇaṃbu sēsi, nirahaṃkāruṃḍunu, nirdaḷitā śēṣa baṃdhanuṃḍununai, sakalēṃdriyamula mānasaṃbuna naḍaṃci, prāṇādhīna vṛttiyagu mānasaṃbuṃ brāṇamaṃdunu prāṇamu napānamaṃdunu, nutsarga sahitaṃbayina yapānamu mṛtyuvunu baṃcabhūtaṃbula naikyaṃbayina dēhaṃbunaṃdunu, dēhamunu guṇatrayaṃbunaṃdunu, guṇatrayaṃbu navidyayaṃdunu, sarvārōpa hētuvagu navidyanu jīvuniyaṃdunu, jīvuṃḍaina tanu navyayaṃbayina brahmamaṃdunu layiṃpa jēsi, bahiraṃga vyāpāraṃbulu viḍici - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 348)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.