← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూల శరీర వివేకః sthūla śarīra vivēkaḥ

Original — తెలుగు

“న అహం స్థూలదేహః, న హి మదీయో అసౌ దేహః కింతు దేహః పంచభూత కార్యత్వాత్ భౌతికః. మమ స్థూలదేహ వ్యతిరిక్తత్వాత్ ఏవచ తదాశ్రిత నామరూప జాత్యాశ్రమ కర్మాదయః ధర్మాః మాం స్పృశంతి నాపి తే ధర్మాః మత్సంబంధినః ఇతి స్థూల శరీర వివేకః”.

(నేను స్థూల దేహముకాను, ఈ దేహము నాదికాదు. ఈ దేహము పంచభూతముల కార్యము - పంచభూతముల సమ్మేళనముచే కలిగినది, కనుక భౌతికము - నేను స్థూలదేహము కాదుకనుక ఆ దేహమునకు సంబంధించిన నామరూప జాతి ఆశ్రమ కర్మలు మొదగు ధర్మములు నన్ను అంటవు, అవి నాకు సంబంధించినవికావు - “స్థూల దేహము గుఱించి ఇట్లు తెలుసుకొనవలెను).

స్థూల వృష్టి = పంచీకృత భూతేభ్యః ఇంద్రియగోచరం స్థూల బ్రహ్మాండం ఉత్పద్యతే తస్మిన్ బ్రహ్మాండే భూర్భువస్వః మహః జనః తపః సత్య ఇత్యుపరి సప్తలోకాః, అతల సుతల పాతాళ, వితల రసాతల తలాతల మహా తలాః ఇత్యధిః సప్తలోకాః వర్తంతే - ఏషు చతుర్దశసు లోకేషు వసతాం జీవానాం పృథక్ పృథక్ ఉపభోగ యోగ్యాన్న పానాదికం దేవ మనుష్యపశ్వాది రూపాణి భోగాయ తనాని స్థూల శరీరాణి చ ఉత్పద్యం తే“.

(పంచీకరణము చేయుటవలన సూక్ష్మపంచభూతములు మహాస్థూలములై ఇంద్రియములకగోచోరమైనవి. ఈమహాభూతంబులవలన ఆయా లోకములకు తగిన నాల్గు విధములైన జంతు సంతానములు - మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షములు మొదలగునవి - ఆయా జంతువులకు తగిన ఆహారము, ఉదకము మొదలగునవియు, ఘటపటాది సమస్త వస్తువులును పుట్టెను - ఇది అంతయు కలిసి స్థూల ప్రపంచము - ఈ స్థూల ప్రపంచమునకు వ్యష్టి సమష్టి భేదములు గలవు. ఒక్కని శరీరము వ్యష్టి. ప్రపంచమంతయు కలిసి సమష్టి. దీనికి జాగ్రత అవస్థ. అదియు వ్యష్టి సమష్టి భేదములు కలదియే - అందు సమష్టి స్థూల జాగ్రదవస్థలతో కూడిన పరబ్రహ్మ (ఈశ్వరుడు) వైరాజసుడనియు, వైశ్యానరుడనియు, విరాట్పురుషుడనియు పిలువబడుచున్నాడు. వ్యష్టి స్థూల జాగ్రదవస్థలను అభిమానించి జీవుడు చిదాభాసుడనియు, వ్యవహారికుడనియు, విశ్వుడనియు పిలువబడుచు బ్రహ్మమును తనకంటె వేరుగా భావించుచున్నాడు).

Transliteration

“na ahaṃ sthūladēhaḥ, na hi madīyō asau dēhaḥ kiṃtu dēhaḥ paṃcabhūta kāryatvāt bhautikaḥ. mama sthūladēha vyatiriktatvāt ēvaca tadāśrita nāmarūpa jātyāśrama karmādayaḥ dharmāḥ māṃ spṛśaṃti nāpi tē dharmāḥ matsaṃbaṃdhinaḥ iti sthūla śarīra vivēkaḥ”.

(nēnu sthūla dēhamukānu, ī dēhamu nādikādu. ī dēhamu paṃcabhūtamula kāryamu - paṃcabhūtamula sammēḷanamucē kaliginadi, kanuka bhautikamu - nēnu sthūladēhamu kādukanuka ā dēhamunaku saṃbaṃdhiṃcina nāmarūpa jāti āśrama karmalu modagu dharmamulu nannu aṃṭavu, avi nāku saṃbaṃdhiṃcinavikāvu - “sthūla dēhamu guṟiṃci iṭlu telusukonavalenu).

sthūla vṛṣṭi = paṃcīkṛta bhūtēbhyaḥ iṃdriyagōcaraṃ sthūla brahmāṃḍaṃ utpadyatē tasmin brahmāṃḍē bhūrbhuvasvaḥ mahaḥ janaḥ tapaḥ satya ityupari saptalōkāḥ, atala sutala pātāḷa, vitala rasātala talātala mahā talāḥ ityadhiḥ saptalōkāḥ vartaṃtē - ēṣu caturdaśasu lōkēṣu vasatāṃ jīvānāṃ pṛthak pṛthak upabhōga yōgyānna pānādikaṃ dēva manuṣyapaśvādi rūpāṇi bhōgāya tanāni sthūla śarīrāṇi ca utpadyaṃ tē”.

(paṃcīkaraṇamu cēyuṭavalana sūkṣmapaṃcabhūtamulu mahāsthūlamulai iṃdriyamulakagōcōramainavi. īmahābhūtaṃbulavalana āyā lōkamulaku tagina nālgu vidhamulaina jaṃtu saṃtānamulu - manuṣyulu, paśuvulu, pakṣulu, vṛkṣamulu modalagunavi - āyā jaṃtuvulaku tagina āhāramu, udakamu modalagunaviyu, ghaṭapaṭādi samasta vastuvulunu puṭṭenu - idi aṃtayu kalisi sthūla prapaṃcamu - ī sthūla prapaṃcamunaku vyaṣṭi samaṣṭi bhēdamulu galavu. okkani śarīramu vyaṣṭi. prapaṃcamaṃtayu kalisi samaṣṭi. dīniki jāgrata avastha. adiyu vyaṣṭi samaṣṭi bhēdamulu kaladiyē - aṃdu samaṣṭi sthūla jāgradavasthalatō kūḍina parabrahma (īśvaruḍu) vairājasuḍaniyu, vaiśyānaruḍaniyu, virāṭpuruṣuḍaniyu piluvabaḍucunnāḍu. vyaṣṭi sthūla jāgradavasthalanu abhimāniṃci jīvuḍu cidābhāsuḍaniyu, vyavahārikuḍaniyu, viśvuḍaniyu piluvabaḍucu brahmamunu tanakaṃṭe vērugā bhāviṃcucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.