← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూల శరీరము sthūla śarīramu

Original — తెలుగు
  1. “అన్నరసే నైవ భూత్వా, అన్నరసే నైవ అభివృద్ధిం ప్రాప్య, అన్నరసమయ పృధివ్యాం యద్విలీయతే సో అన్నమయ కోశః, తదేవ స్థూల శరీరం”, (పైంగళోపనిషత్)

(అన్నరసముతో తయారైనదిన్నీ, అన్నరసముతోనే వృద్ధి పొందినదిన్నీ, అన్నరసమయమైన భూమిలో లీనమైపోవుచున్నది (కలిసిపోవుచున్నది) అన్నమయకోశము - అదియే స్థూల శరీరము).

  1. “లోమ, త్వక్, సిర, మాంసా స్థి మజ్జానాం షణ్ణాం సముదాయః, స్తంబాదివత్ ప్రత్యక్షేణ ఉపలభ్యమానత్వాత్ స్థూల దేహః ఇత్యుచ్యతే -”.

(లోమములు, చర్మము, సిరా, మాంసము, ఎముకలు, మజ్జా అను ఈ ఆరింటి సముదాయము స్తంబము మొదలగువాటివలె ప్రత్యక్షముగా నుండునది (కంటికి కనబడునది) కనుక స్థూలదేహమని చెప్పబడినది).

  1. “శ్లో||. త్వం ఙ్మాంస రుధిరస్నాయ మేధో మజ్జా స్థి సంకులం |

పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపుః |

పంచీకృతేభ్యో భూతేభ్యో స్థూలేభ్యః పూర్వ కర్మణా |

సముత్పన్నమిదం భోగాయతనమాత్మనః |

సర్వోపి బాహ్యా సంసారః పురుషస్య యదాశ్రయః |

విధి దేహ మిదం స్థూలం గృహన ద్గృహ మేధినః ||“. (శ్రీశంకరః - వివేకచూడామణి)

(చర్మము,మాంసము, రక్తము, స్నాయువు, మేదస్సు, మజ్జా యెముకలతో కూడియుండునదిన్నీ, మూత్రముతోటిన్నీ పురీషముతోటిన్నీ నిండియుండునదిన్నీ, పూర్వ జన్మములలో చేసిన కర్మానుసారముగా పంచీకృతమైన పంచ స్థూల భూతములవలన కలిగినదిన్నీ, ఆత్మకి (జీవాత్మకి) భోగాయతనమైనదిన్నీ (పాప పుణ్యముల ఫలమైన కష్ట సుఖముల ననుభవించుటకు నిలయమైనదిన్నీ) అయిన ఈ స్థూల శరీరము నింద్యమైనది - గృహస్థుని గృహమువలె నుండునది).

  1. “భోగాయతనం ఇదం వపుః”.

(అనేక విధములైన భోగములను సంతోషముతో అనుభవించుటకు ఆయతనమైనది యీ స్థూల శరీరము).

  1. ఏవం తమోగుణ యుక్తేభ్యః పంచీకృతభూతేభ్యః భూమ్యంతరిక్ష స్వర్మ హర్జన స్తపః సత్యాత్మకస్య ఊర్ధ్వలోక సప్తకస్య అతల, వితల, సుతల, తలాతల, రసాతల మహాతల పాతాళాభ్యాధో లోక సప్తకస్య బ్రహ్మాండస్య, జరాయుజాండ జస్వేద జోద్భిజ్యా ఖ్య చతుర్వుధ స్థూల శరీరాణాం ఉత్పత్తిః. (వేదాంతపరిభాషా)

(తమో గుణముతో కూడియుండి పంచీకృతమైన పంచభూతములవలన భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను ఏడు ఊర్ధ్వలోకములున్నూ, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళములను ఏడు అధోలోకములున్నూ గల బ్రహ్మాండము యొక్కయు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్జములు అను నాలుగు విధములగు స్థూల శరీరములున్నూ కలుగుచున్నవి - పుట్టుచున్నవి)

  1. “భుక్తస్య అన్నస్య స్థవిష్ఠో భాగః పురీషం భవతి, మధ్యమో భాగః మాంసం భవతి, సూక్ష్మభాగః మనః ఉపచినోతి. పీతస్య జలస్య స్థూలాంశో మూత్రం భవతి, మధ్యమాంశో రక్తం భవతి, సూక్ష్మాంశః ప్రాణోపచయం కరోతి భక్షితస్య తైల ఘృతాది స్నేహ ద్రవ్యస్య స్థూలాంశో అస్థి భవతి, మధ్యమాంశో మేదో భవతి, సూక్ష్మాంశో వాచ ముపచినోతి. మాతుః శోణితాత్ శిశోః రక్తమాంస చర్మాణి జాయంతే పితుః శుక్రాత్ అస్థినాడీ మజ్జాః జాయంతే

(తినిన అన్నము యొక్క స్థవిష్టభాగము పురీషముగా మారుచున్నది, మధ్యభాగము మాంసముగాను, సూక్ష్మభాగము మనస్సుగాను మారుచున్నది. త్రాగిన నీరు స్థూలభాగము మూత్రముగా మారుచున్నది,మధ్యభాగము రక్తమగుచున్నది, సూక్ష్మాంశము ప్రాణముగా మారును. తినిన నూనె నెయ్యి మొదలగు ద్రవ్యముల స్థూలభాగము యముకలుగా మారుచున్నది, మధ్యభాగము మేదస్సు అగుచున్నది, సూక్ష్మాంశము వాక్కును కలుగచేయును - తల్లి రక్తమువలన శిశువునకు రక్తము, మాంసము, చర్మము కలుగుచున్నవి. తండ్రి శుక్రమువలన అస్థి నాడి, మజ్జలు కలుగుచున్నవి. ఈ ప్రకారము స్థూల శరీరము కలుగుచున్నది).

  1. ఈశః పంచీకృత మహాభూత లేశనాదాయ వ్యష్టి సమష్ట్యాత్మక స్థూల శరీరాణి యథా క్రమం అకరోత్ - కపాల చర్మాంతాస్థిమాంస నఖాని పృధివ్యంశాః, రక్త మూత్ర లాలాస్వేదాదికాః అబంశాః; క్షత్ తృష్ణోష్ణ మోహ మైధునాద్యాః అగ్న్యంశాః ప్రచారణోత్తారణ శ్వాసాదికాః వాయ్వంశాః కామక్రోధాదయః వ్యోమాంశాః. ఏ తత్సం ఘాతం కర్మ సంచితం త్వగాది యుక్తం బాల్యాద్యవస్థాభి మానాస్పదం బహు దోషాశ్రయం స్తూల శరీరం భవతి ” (పైంగలోపనిషత్)

(ఈశ్వరుడు పంచీకృతమహాభూత భాగములను గ్రహించి వ్యష్టియు (ఒక్కొక్కటియు) సమష్టియు (వాటి మొత్తమును) అను స్వరూపము గల స్థూల శరీరములను యథా క్రమముగ సృష్టించెను. అందు తల, పుఱ్ఱె, చర్మము, తోలు, ప్రేగులు, మాంసము, గోళ్ళు మొదలగునవి భూమి యొక్క అంశలు. రక్తము, మూత్రము, చొంగ, చెమట, శుక్లము, కఫము మొదలగునవి జలాంశములు. ఆకలి, దాహము, ఉష్ణము, మోహము, మైధునము, ఆలస్యము మొదలగునవి అగ్ని యొక్క అంశ. నడచుట, దాటుట, ఊపిరి విడుచుట (వ్రాయుట) కనుమూచుట, మొదలగునవి వాయు భాగములు. కామము క్రోధము మొదలగునవి ఆకాశాంశములు - కర్మ సంచితమును, త్వక్కు (చర్మము) మొదలగు వాటితో కూడుకొన్నదియును, బాల్యము, కౌమారము, యౌవనము, జర మొదలగువాటిని అభిమానించు స్థానమును, అనేక దోషములకాశ్రయమును అగు కపాలాదులయొక్క మొత్తము స్థూల శరీరము - పైకి కనబడునది - అయి యున్నది).

  1. స్థూలశరీరమును అన్నమయకోశమందురు.

  2. స్థూల శరీరము చతుర్విధములు - జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజ్జము-

  3. “ఇప్పుడు నీకెఱింగించిన వెల్లను బ్రహ్మాండకోశంబునం గలవని పురాణంబులు పలుకుచుండు - అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూల శరీరమగుటం జేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతు రెవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులుం గలుగును - - - భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళాది ఙ్నరక తారాగణలోక సంస్థితంబయి, సకల జీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూల శరీరంబు వినిపించితిని”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 26 -103)

  4. “దహ్యతే ఇతి దేహం” అనిన్నీ “శీర్యతే ఇతి శరీరం” అని చెప్పబడినది. దహించబడునది కనుక దేహమని, శిధిలమై నశించునది శరీరము అని (క్షీణించునది) చెప్పబడినది. అందుచేత –

“నాశస్యా పరిహర్తత్వాత్ స్థూలస్యా శోచ్చతీరితా ||”. (గీతాభావప్రకాశము - 2 - 379)

స్థూల శరీరము నశించుట తప్పదు కనుక దానిని గుఱించి విచారించవలసిన అవసరము లేదని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు - “అంతవంత మమే దేహాః” (ఈ దేహములు అంతము పొందవలసినవే) (శ్రీమద్భగవద్గీత - 2 - 17)

  1. స్థూల శరీరము దాని అవయవములతో పనిచేయుచున్నను యధార్థముగా పని చేయునది సూక్ష్మ శరీరమే - కాని, ఈ స్థూల శరీరము లేనిదే సూక్ష్మ శరీరము పనిచేయలేదు - అందుచేత ఏ పని చేయుటకైనను స్థూల శరీరము కావలెను -

  2. “వ. ఈ స్థూలరూపంబుకంటె నదృష్ట గుణంబయి యశ్రుతంబయిన వస్తువగుటం జేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై, కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 3 - )

  3. రోమము, చర్మము, నరము, మాంసము, అస్థి, కొవ్వు - ఈ యారు స్తంబమువలె ప్రత్యక్షముగా అగుపడుటవలన స్థూలదేహమని పేరు - ఈ స్థూలదేహము ఐదు తత్వములచేత ఏర్పడుచున్నది. ఆ తత్వములు ఈ క్రింద కోష్టకమునందు వివరింపబడినవి : -

ముఖ్య తత్వములు వీటి అంశములు ఏ ముఖ్యతత్వమందు మిశ్రమగుచున్నవో అవి తత్వములు
పృధ్వి జలము తేజస్సు వాయువు ఆకాశము
పృధ్వి ఆస్థి మాంసము నరము చర్మము రోమము
జలము రక్తము శుక్లము మూత్రము చెమట బొల్లు
తేజస్సు ఆలస్యము కాంతి ఆకలి తృష నిద్ర
వాయువు ఆకుంచనము చలనము వలనము పరుగిడుట విస్తరిల్లుట
ఆకాశము భయము లేక మోహము క్రోధము కామము శోకము
కటి ప్రదేశము ఉదరము హృదయము కంఠము శిరము

పై కోష్టమునందు పృధ్వి ముఖ్య తత్వము - అందు పృధ్వంశము ఎముక, జలాంశము మాంసము, వాయ్వాంశము చర్మము, ఆకాశాంశము రోమము. దీని వలెనే మిగిలిన భూతములందును తెలియవలసినది. ఈ ప్రకారము మొత్తము తత్వములు యిరువదు అయిదు. ఇవి పంచభూత లక్షణములు - ఈ యిరువది అయిదు తత్వముల సముదాయమునకు స్థూలదేహమని పేరు. కామము, జాతి, ఆశ్రమము, వర్ణము (రంగు), ఆకారము, జననము, మరణము మొదలైనవి స్థూల దేహముయొక్క ధర్మములు.

Transliteration
  1. “annarasē naiva bhūtvā, annarasē naiva abhivṛddhiṃ prāpya, annarasamaya pṛdhivyāṃ yadvilīyatē sō annamaya kōśaḥ, tadēva sthūla śarīraṃ”, (paiṃgaḷōpaniṣat)

(annarasamutō tayārainadinnī, annarasamutōnē vṛddhi poṃdinadinnī, annarasamayamaina bhūmilō līnamaipōvucunnadi (kalisipōvucunnadi) annamayakōśamu - adiyē sthūla śarīramu).

  1. “lōma, tvak, sira, māṃsā sthi majjānāṃ ṣaṇṇāṃ samudāyaḥ, staṃbādivat pratyakṣēṇa upalabhyamānatvāt sthūla dēhaḥ ityucyatē -”.

(lōmamulu, carmamu, sirā, māṃsamu, emukalu, majjā anu ī āriṃṭi samudāyamu staṃbamu modalaguvāṭivale pratyakṣamugā nuṃḍunadi (kaṃṭiki kanabaḍunadi) kanuka sthūladēhamani ceppabaḍinadi).

  1. “ślō||. tvaṃ ṅmāṃsa rudhirasnāya mēdhō majjā sthi saṃkulaṃ |

pūrṇaṃ mūtra purīṣābhyāṃ sthūlaṃ niṃdyamidaṃ vapuḥ |

paṃcīkṛtēbhyō bhūtēbhyō sthūlēbhyaḥ pūrva karmaṇā |

samutpannamidaṃ bhōgāyatanamātmanaḥ |

sarvōpi bāhyā saṃsāraḥ puruṣasya yadāśrayaḥ |

vidhi dēha midaṃ sthūlaṃ gṛhana dgṛha mēdhinaḥ ||“. (śrīśaṃkaraḥ - vivēkacūḍāmaṇi)

(carmamu,māṃsamu, raktamu, snāyuvu, mēdassu, majjā yemukalatō kūḍiyuṃḍunadinnī, mūtramutōṭinnī purīṣamutōṭinnī niṃḍiyuṃḍunadinnī, pūrva janmamulalō cēsina karmānusāramugā paṃcīkṛtamaina paṃca sthūla bhūtamulavalana kaliginadinnī, ātmaki (jīvātmaki) bhōgāyatanamainadinnī (pāpa puṇyamula phalamaina kaṣṭa sukhamula nanubhaviṃcuṭaku nilayamainadinnī) ayina ī sthūla śarīramu niṃdyamainadi - gṛhasthuni gṛhamuvale nuṃḍunadi).

  1. “bhōgāyatanaṃ idaṃ vapuḥ”.

(anēka vidhamulaina bhōgamulanu saṃtōṣamutō anubhaviṃcuṭaku āyatanamainadi yī sthūla śarīramu).

  1. ēvaṃ tamōguṇa yuktēbhyaḥ paṃcīkṛtabhūtēbhyaḥ bhūmyaṃtarikṣa svarma harjana stapaḥ satyātmakasya ūrdhvalōka saptakasya atala, vitala, sutala, talātala, rasātala mahātala pātāḷābhyādhō lōka saptakasya brahmāṃḍasya, jarāyujāṃḍa jasvēda jōdbhijyā khya caturvudha sthūla śarīrāṇāṃ utpattiḥ. (vēdāṃtaparibhāṣā)

(tamō guṇamutō kūḍiyuṃḍi paṃcīkṛtamaina paṃcabhūtamulavalana bhūlōkamu, bhuvarlōkamu, svargalōkamu, maharlōkamu, janalōkamu, tapōlōkamu, satyalōkamu anu ēḍu ūrdhvalōkamulunnū, atala, vitala, sutala, talātala, rasātala, mahātala, pātāḷamulanu ēḍu adhōlōkamulunnū gala brahmāṃḍamu yokkayu, jarāyujamulu, aṃḍajamulu, svēdajamulu, udbhijjamulu anu nālugu vidhamulagu sthūla śarīramulunnū kalugucunnavi - puṭṭucunnavi)

  1. “bhuktasya annasya sthaviṣṭhō bhāgaḥ purīṣaṃ bhavati, madhyamō bhāgaḥ māṃsaṃ bhavati, sūkṣmabhāgaḥ manaḥ upacinōti. pītasya jalasya sthūlāṃśō mūtraṃ bhavati, madhyamāṃśō raktaṃ bhavati, sūkṣmāṃśaḥ prāṇōpacayaṃ karōti bhakṣitasya taila ghṛtādi snēha dravyasya sthūlāṃśō asthi bhavati, madhyamāṃśō mēdō bhavati, sūkṣmāṃśō vāca mupacinōti. mātuḥ śōṇitāt śiśōḥ raktamāṃsa carmāṇi jāyaṃtē pituḥ śukrāt asthināḍī majjāḥ jāyaṃtē

(tinina annamu yokka sthaviṣṭabhāgamu purīṣamugā mārucunnadi, madhyabhāgamu māṃsamugānu, sūkṣmabhāgamu manassugānu mārucunnadi. trāgina nīru sthūlabhāgamu mūtramugā mārucunnadi,madhyabhāgamu raktamagucunnadi, sūkṣmāṃśamu prāṇamugā mārunu. tinina nūne neyyi modalagu dravyamula sthūlabhāgamu yamukalugā mārucunnadi, madhyabhāgamu mēdassu agucunnadi, sūkṣmāṃśamu vākkunu kalugacēyunu - talli raktamuvalana śiśuvunaku raktamu, māṃsamu, carmamu kalugucunnavi. taṃḍri śukramuvalana asthi nāḍi, majjalu kalugucunnavi. ī prakāramu sthūla śarīramu kalugucunnadi).

  1. īśaḥ paṃcīkṛta mahābhūta lēśanādāya vyaṣṭi samaṣṭyātmaka sthūla śarīrāṇi yathā kramaṃ akarōt - kapāla carmāṃtāsthimāṃsa nakhāni pṛdhivyaṃśāḥ, rakta mūtra lālāsvēdādikāḥ abaṃśāḥ; kṣat tṛṣṇōṣṇa mōha maidhunādyāḥ agnyaṃśāḥ pracāraṇōttāraṇa śvāsādikāḥ vāyvaṃśāḥ kāmakrōdhādayaḥ vyōmāṃśāḥ. ē tatsaṃ ghātaṃ karma saṃcitaṃ tvagādi yuktaṃ bālyādyavasthābhi mānāspadaṃ bahu dōṣāśrayaṃ stūla śarīraṃ bhavati ” (paiṃgalōpaniṣat)

(īśvaruḍu paṃcīkṛtamahābhūta bhāgamulanu grahiṃci vyaṣṭiyu (okkokkaṭiyu) samaṣṭiyu (vāṭi mottamunu) anu svarūpamu gala sthūla śarīramulanu yathā kramamuga sṛṣṭiṃcenu. aṃdu tala, puṟṟe, carmamu, tōlu, prēgulu, māṃsamu, gōḷḷu modalagunavi bhūmi yokka aṃśalu. raktamu, mūtramu, coṃga, cemaṭa, śuklamu, kaphamu modalagunavi jalāṃśamulu. ākali, dāhamu, uṣṇamu, mōhamu, maidhunamu, ālasyamu modalagunavi agni yokka aṃśa. naḍacuṭa, dāṭuṭa, ūpiri viḍucuṭa (vrāyuṭa) kanumūcuṭa, modalagunavi vāyu bhāgamulu. kāmamu krōdhamu modalagunavi ākāśāṃśamulu - karma saṃcitamunu, tvakku (carmamu) modalagu vāṭitō kūḍukonnadiyunu, bālyamu, kaumāramu, yauvanamu, jara modalaguvāṭini abhimāniṃcu sthānamunu, anēka dōṣamulakāśrayamunu agu kapālādulayokka mottamu sthūla śarīramu - paiki kanabaḍunadi - ayi yunnadi).

  1. sthūlaśarīramunu annamayakōśamaṃduru.

  2. sthūla śarīramu caturvidhamulu - jarāyujamu, aṃḍajamu, svēdajamu, udbhijjamu-

  3. “ippuḍu nīkeṟiṃgiṃcina vellanu brahmāṃḍakōśaṃbunaṃ galavani purāṇaṃbulu palukucuṃḍu - aṭṭi brahmāṃḍaṃbu śrīmannārāyaṇuni sthūla śarīramaguṭaṃ jēsi brahmāṃḍaṃ bevvaru varṇiṃtu revvaru viṃduru vāralaku sakala śrēyassuluṃ galugunu - - - bhū dvīpa varṣa saridadri nabhassamudra pātāḷādi ṅnaraka tārāgaṇalōka saṃsthitaṃbayi, sakala jīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūla śarīraṃbu vinipiṃcitini”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 26 -103)

  4. “dahyatē iti dēhaṃ” aninnī “śīryatē iti śarīraṃ” ani ceppabaḍinadi. dahiṃcabaḍunadi kanuka dēhamani, śidhilamai naśiṃcunadi śarīramu ani (kṣīṇiṃcunadi) ceppabaḍinadi. aṃducēta –

“nāśasyā parihartatvāt sthūlasyā śōccatīritā ||”. (gītābhāvaprakāśamu - 2 - 379)

sthūla śarīramu naśiṃcuṭa tappadu kanuka dānini guṟiṃci vicāriṃcavalasina avasaramu lēdani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu - “aṃtavaṃta mamē dēhāḥ” (ī dēhamulu aṃtamu poṃdavalasinavē) (śrīmadbhagavadgīta - 2 - 17)

  1. sthūla śarīramu dāni avayavamulatō panicēyucunnanu yadhārthamugā pani cēyunadi sūkṣma śarīramē - kāni, ī sthūla śarīramu lēnidē sūkṣma śarīramu panicēyalēdu - aṃducēta ē pani cēyuṭakainanu sthūla śarīramu kāvalenu -

  2. “va. ī sthūlarūpaṃbukaṃṭe nadṛṣṭa guṇaṃbayi yaśrutaṃbayina vastuvaguṭaṃ jēsi vyaktaṃbugāka sūkṣmaṃbai, karacaraṇādulu lēka jīvuniki noṃḍoka rūpaṃbu viracitaṃbai yuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 3 - )

  3. rōmamu, carmamu, naramu, māṃsamu, asthi, kovvu - ī yāru staṃbamuvale pratyakṣamugā agupaḍuṭavalana sthūladēhamani pēru - ī sthūladēhamu aidu tatvamulacēta ērpaḍucunnadi. ā tatvamulu ī kriṃda kōṣṭakamunaṃdu vivariṃpabaḍinavi : -

mukhya tatvamulu vīṭi aṃśamul mukhyatatvam miśramagucunna avi tatvamulu u ē aṃdu vō
pṛdhvi jalamu tējassu vāyuvu ākāśamu
pṛdhvi āsthi māṃsamu naramu carm amu rōmamu
jalamu raktamu śuklamu mūtramu cemaṭa bollu
tējassu ālasyamu kāṃti ākali tṛṣa nidra
vāyuvu ākuṃcanamu calanamu valana mu par ugiḍuṭa vistarilluṭa
ākāśamu bhayamu lēka mōham u krō dhamu kāmamu śōkamu
kaṭi pradēśamu udaramu hṛday amu kaṃ ṭhamu śiramu

pai kōṣṭamunaṃdu pṛdhvi mukhya tatvamu - aṃdu pṛdhvaṃśamu emuka, jalāṃśamu māṃsamu, vāyvāṃśamu carmamu, ākāśāṃśamu rōmamu. dīni valenē migilina bhūtamulaṃdunu teliyavalasinadi. ī prakāramu mottamu tatvamulu yiruvadu ayidu. ivi paṃcabhūta lakṣaṇamulu - ī yiruvadi ayidu tatvamula samudāyamunaku sthūladēhamani pēru. kāmamu, jāti, āśramamu, varṇamu (raṃgu), ākāramu, jananamu, maraṇamu modalainavi sthūla dēhamuyokka dharmamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.