(సూక్ష్మమైన - చిన్నదైన - అరుంధతీ నక్షత్రమును చూపించుటకు ప్రయత్నించువాడు మొదటనే సూక్ష్మమైన అరుంధతీ నక్షత్రమును చూపించుట కష్టమని తలచి దాని దగ్గరగానున్న పెద్ద నక్షత్రమును చూపించి ఇదియే అరుంధతీ నక్షత్రము అని చూపించును - అట్లు ఆ పెద్ద నక్షత్రమే అరుంధతి అను దృఢమైన నమ్మకము కలిగి తర్వాత ఆ పెద్ద నక్షత్రమునకు దగ్గరగనుండు సూక్ష్మ నక్షత్రమైన అరుంధతీ నక్షత్రమును చూపించి “ఇదియే అరుంధతీ నక్షత్రము” అని చూపించును. ఇదియే స్థూలారుంధతీ న్యాయము).
(అనాత్మ పదార్థమే సత్ పదార్థము అని అదే ఆత్మ అనిన్నీ, అదియే నీవు అనిన్నీ మొదటనే చెప్పినయడల (ఉపదేశించినయడల) ఆ ఉపదేశము వినుటవలన ఆత్మజ్ఞానము కలుగనందున అనాత్మయందు నిష్ట కలిగియుండకూడదు అని ముఖ్యముగా ఆత్మను ఉపదేశించు శాస్త్రము ఆ అనాత్మ హేయ వస్తువని భోధించవలెను - అది యెట్లనగా చిన్నది అయిన అరుంధతీ నక్షత్రమును చూపించదలచుకొనినవాడు, దాని దగ్గరగానున్న స్థూలనక్షత్రమును - పెద్దనక్షత్రమును - చూపించి తర్వాత అదికాదు అని అరిఉంధతీ నక్షత్రమును చూపించును).
(sūkṣmamaina - cinnadaina - aruṃdhatī nakṣatramunu cūpiṃcuṭaku prayatniṃcuvāḍu modaṭanē sūkṣmamaina aruṃdhatī nakṣatramunu cūpiṃcuṭa kaṣṭamani talaci dāni daggaragānunna pedda nakṣatramunu cūpiṃci idiyē aruṃdhatī nakṣatramu ani cūpiṃcunu - aṭlu ā pedda nakṣatramē aruṃdhati anu dṛḍhamaina nammakamu kaligi tarvāta ā pedda nakṣatramunaku daggaraganuṃḍu sūkṣma nakṣatramaina aruṃdhatī nakṣatramunu cūpiṃci “idiyē aruṃdhatī nakṣatramu” ani cūpiṃcunu. idiyē sthūlāruṃdhatī nyāyamu).
(anātma padārthamē sat padārthamu ani adē ātma aninnī, adiyē nīvu aninnī modaṭanē ceppinayaḍala (upadēśiṃcinayaḍala) ā upadēśamu vinuṭavalana ātmajñānamu kaluganaṃduna anātmayaṃdu niṣṭa kaligiyuṃḍakūḍadu ani mukhyamugā ātmanu upadēśiṃcu śāstramu ā anātma hēya vastuvani bhōdhiṃcavalenu - adi yeṭlanagā cinnadi ayina aruṃdhatī nakṣatramunu cūpiṃcadalacukoninavāḍu, dāni daggaragānunna sthūlanakṣatramunu - peddanakṣatramunu - cūpiṃci tarvāta adikādu ani ariuṃdhatī nakṣatramunu cūpiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.