← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్త్రీ ధర్మములు strī dharmamulu

Original — తెలుగు
  1. సీ. నిలయము వాటించి నిర్మల దేహయై శృంగారమేప్రొద్దు చేయవలయు

సత్యప్రియాలాపచతురయై ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింపవలయు

దాక్షిణ్య సంతోష ధర్మమేధాదుల దైవతమని ప్రియు దలపవలయు

నాధుడే పద్ధతి నడచు నా పద్దతి నడచి తద్భంధుల నడపవలయు

ఆ. మార్దవమున బతికి మజ్జన భోజన

శయన పాన రతులు జరుపవలయు

విభుడు పతితుడైన వెలది పాతివ్రత్య

మహిమ బుణ్యజేసి మనుప వలయు –

క. తరుణి దన ప్రాణవల్లభు

హరిభావముగా భజించి యతడును తానున్

సిరి కైవడి వర్తించును

హరి లోకమునందు సంతతానందమునన్.

క. ఉపవాసంబులు వ్రతములు

దపములు వేయేల భర్త దైవతమని ని

ష్కపటత గొల్చిన సాధ్వికి

నృపవర ! దుర్లభములేదు నిఖిల జగములన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 416 to 418)

Transliteration
  1. sī. nilayamu vāṭiṃci nirmala dēhayai śṛṃgāramēproddu cēyavalayu

satyapriyālāpacaturayai prāṇēśu cittaṃbu prēma raṃjiṃpavalayu

dākṣiṇya saṃtōṣa dharmamēdhādula daivatamani priyu dalapavalayu

nādhuḍē paddhati naḍacu nā paddati naḍaci tadbhaṃdhula naḍapavalayu

ā. mārdavamuna batiki majjana bhōjana

śayana pāna ratulu jarupavalayu

vibhuḍu patituḍaina veladi pātivratya

mahima buṇyajēsi manupa valayu –

ka. taruṇi dana prāṇavallabhu

haribhāvamugā bhajiṃci yataḍunu tānun

siri kaivaḍi vartiṃcunu

hari lōkamunaṃdu saṃtatānaṃdamunan.

ka. upavāsaṃbulu vratamulu

dapamulu vēyēla bharta daivatamani ni

ṣkapaṭata golcina sādhviki

nṛpavara ! durlabhamulēdu nikhila jagamulan. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 416 to 418)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.