← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుదర్శనము sudarśanamu

Original — తెలుగు
  1. సూర్యః (సూర్యుడు).

  2. విష్ణుని చక్రాయుధము; లోకపావనము -

  3. శోభనం నిర్వాణ ఫలం దర్శనం జ్ఞాన మస్య ఇతి, శుభే దర్శనే ఈక్షతే పద్మ సత్రాయతే అస్య ఇతి, సుఖేన దృశ్తతే భక్తైః ఇతివా సుదర్శనః

(శోభనమైన మోక్షఫలము దర్శనముగా గలవాడు; లేక, పద్మ రేకులవలె వెడలుపైన చక్కని కన్నులు గలవాడు; లేక, భక్తులచేత సుఖముగా - కష్టము లేకుండ చూడబడువాడు).

  1. “సుదర్శనం ఇతి చక్ర విశేషణం, చక్రస్య సుదర్శనత్వవత్ దుర్దర్శనత్వమప్యస్తి ఉక్తంచ శ్రీ పౌష్కర సం హితాయాం చక్రాబ్జాయాధ్యాయే చక్రస్వరూపకథనే భగవతా ఏవ -”

బ్రహ్మ రుద్రేంద దేవానాం అస్య రస్మి చియశ్చయః |

అపహృల్లోచనానాం చ సుదూరాద్వై నిరీక్షణాత్ |

తేనేదం భువి విఖ్యాతం థామ్నా దుర్దర్శనం ద్విజ |

ప్రణతానాంచ భక్తానాం యస్మాచ్చ సులభం సదా |

దదాతి దర్శనం తేషాం స్మృతం తస్మాత్ సుదర్శనం || ఇతి.

(సుదర్శనమని చక్రమునకు విశేషణము, - అనగా విష్ణు చక్రము, కాంతివంతము, త్వరగా తిరుగునది కనుక సాధారణముగా అందఱికిని కనుపించుట కష్టము కనుక దుర్దర్శనము - కాని విష్ణుభక్తులకు సులభముగా కనుపించునది కనుక సుదర్శనము అని పేరు పొందినది. ఈ విషయము పౌష్కర సం హితలో చక్రాబ్జా ధ్యాయమందు చక్రము యొక్క స్వరూపము భగవంతుని చేతనే చెప్పబడినది - అది యెట్లంటే : - బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, దేవతలు ఈ చక్రమును దూరమునుండు చూచినను వారి నేత్రములను (దృష్టిని) దీని కిరణములు అపహరించును. అందుచేత దీనిని - ఈ చక్రమును - దుర్దర్శనము అని లోకములో చెప్పుచున్నారు - భక్తులకు మాత్రము దీనిని చూచుట సులభము, వారు దీనిని చూడ గలుగుదురు - అందుచేత నిది సుదర్శనమని చెప్పబడినది.)

  1. “సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభా |

అజ్ఞానాంధస్యమే నిత్యం విష్ణోర్మార్గం ప్రదర్శయ ||“.

(కోటి సూర్యులతో సమానమైన కాంతిగల సుదర్శనము నది, - సన్మార్గము చూపునది - యగు సుదర్శనమను పేరుగల చక్రమా | విష్ణువుని చేరు మార్గమును నాకు చూపుము).

  1. “సీ. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము

నీవ నేలయు, నింగి నీవ, సమీరంబు నీవ భూతేంద్రియ నికరమీవ

నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము

నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము

తే. నీవ బహు యజ్ఞ భోజివి, నీవనిత్య

మూల తేజంబు నీకు నే మ్రెఉక్కువాడ

నీరజాక్షుండు చాల మన్నించునట్టి

శస్త్ర ముఖ్యమ - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 5 - 129)

Transliteration
  1. sūryaḥ (sūryuḍu).

  2. viṣṇuni cakrāyudhamu; lōkapāvanamu -

  3. śōbhanaṃ nirvāṇa phalaṃ darśanaṃ jñāna masya iti, śubhē darśanē īkṣatē padma satrāyatē asya iti, sukhēna dṛśtatē bhaktaiḥ itivā sudarśanaḥ

(śōbhanamaina mōkṣaphalamu darśanamugā galavāḍu; lēka, padma rēkulavale veḍalupaina cakkani kannulu galavāḍu; lēka, bhaktulacēta sukhamugā - kaṣṭamu lēkuṃḍa cūḍabaḍuvāḍu).

  1. “sudarśanaṃ iti cakra viśēṣaṇaṃ, cakrasya sudarśanatvavat durdarśanatvamapyasti uktaṃca śrī pauṣkara saṃ hitāyāṃ cakrābjāyādhyāyē cakrasvarūpakathanē bhagavatā ēva -”

brahma rudrēṃda dēvānāṃ asya rasmi ciyaścayaḥ |

apahṛllōcanānāṃ ca sudūrādvai nirīkṣaṇāt |

tēnēdaṃ bhuvi vikhyātaṃ thāmnā durdarśanaṃ dvija |

praṇatānāṃca bhaktānāṃ yasmācca sulabhaṃ sadā |

dadāti darśanaṃ tēṣāṃ smṛtaṃ tasmāt sudarśanaṃ || iti.

(sudarśanamani cakramunaku viśēṣaṇamu, - anagā viṣṇu cakramu, kāṃtivaṃtamu, tvaragā tirugunadi kanuka sādhāraṇamugā aṃdaṟikini kanupiṃcuṭa kaṣṭamu kanuka durdarśanamu - kāni viṣṇubhaktulaku sulabhamugā kanupiṃcunadi kanuka sudarśanamu ani pēru poṃdinadi. ī viṣayamu pauṣkara saṃ hitalō cakrābjā dhyāyamaṃdu cakramu yokka svarūpamu bhagavaṃtuni cētanē ceppabaḍinadi - adi yeṭlaṃṭē : - brahma, rudruḍu, iṃdruḍu, dēvatalu ī cakramunu dūramunuṃḍu cūcinanu vāri nētramulanu (dṛṣṭini) dīni kiraṇamulu apahariṃcunu. aṃducēta dīnini - ī cakramunu - durdarśanamu ani lōkamulō ceppucunnāru - bhaktulaku mātramu dīnini cūcuṭa sulabhamu, vāru dīnini cūḍa galuguduru - aṃducēta nidi sudarśanamani ceppabaḍinadi.)

  1. “sudarśana mahājvāla kōṭi sūrya samaprabhā |

ajñānāṃdhasyamē nityaṃ viṣṇōrmārgaṃ pradarśaya ||“.

(kōṭi sūryulatō samānamaina kāṃtigala sudarśanamu nadi, - sanmārgamu cūpunadi - yagu sudarśanamanu pērugala cakramā | viṣṇuvuni cēru mārgamunu nāku cūpumu).

  1. “sī. nīva pāvakuḍavu, nīva sūryuṃḍavu, nīva caṃdruṃḍavu, nīva jalamu

nīva nēlayu, niṃgi nīva, samīraṃbu nīva bhūtēṃdriya nikaramīva

nīva brahmaṃbunu, nīva satyaṃbunu, nīva yajñaṃbunu, nīva phalamu

nīva lōkēśulu, nīva sarvātmayu, nīva kālaṃbunu, nīva jagamu

tē. nīva bahu yajña bhōjivi, nīvanitya

mūla tējaṃbu nīku nē mreukkuvāḍa

nīrajākṣuṃḍu cāla manniṃcunaṭṭi

śastra mukhyama - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 5 - 129)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.