← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుద్ధ బుద్ధ ముక్తః śuddha buddha muktaḥ

Original — తెలుగు

అవిద్యాది దోష శూన్యత్వం శుద్ధత్వం, జాడ్యరాహిత్యం బుద్ధత్వం, బందకాలే అపి స్వతః బంధాబావో ముక్తత్వం

(శుద్ధమనగా అవిద్య మొదలగుదోషములు లేనిది, బుద్ధమనగా జాడ్యము లేకుండుట, బంధకారమందు కూడా బంధములేకుండుట ముక్తత్వము - ఈ మూడు కలవాడు శుద్ధ బుద్ధ ముక్తుడు)

శుద్ధ బ్రహ్మ ప్రాప్తి = జ్ఞాన దృష్ట్యా విదేహముక్తేః ప్రాగపి బ్ర్హహ్మాండాదికం జగత్ నకించిదపి విద్యతే, కింతు బ్రహ్మైవ కేవలం వర్తతే. తస్మాత్ విద్వద్దృష్ట్యా శుద్ధే న బ్రహ్మణా ఏవం అభేదో విదుషః. స ఏవ తస్య శుద్ధబ్రహ్మ ప్రాప్తిః. అజ్ఞ దృష్ట్యాత్ ప్రాగివ బ్రహ్మాండాదయః ప్రతీయంతే తస్మాత్ తత్ దృష్ట్యా జ్ఞాననినఃఈశ్వరేణ (ఈశ్వర దేహ భూత బ్రహ్మాండేన అభేదో జాయతే. సోపి ఈశ్వరః పరమార్థతః శుద్ధం బ్రహ్మైవ అనేన జ్ఞానినః శుద్ధ బ్రహ్మ ప్రాప్తిరేవ భవతి.

(జ్ఞాన దృష్టిలో విదేహ ముక్తికి ముందు బ్రహ్మాండము మొదలగు జగత్తు లేదు, బ్రహ్మ ఒకటే యుండెను - అందుచేత జ్ఞానుల దృష్టిలో శుద్ధ పరబ్రహ్మకు జ్ఞానికి భేదములేదు. ఆ జ్ఞానియగుటయే శుద్ధ బ్రహ్మప్రాప్తి. అజ్ఞాని దృష్టిలో మాత్రము బ్రహ్మాందము మొదలగునవి విదేహముక్తికి ముందుగనే ఉన్నవి. అందుచేత జ్ఞానికి ఈశ్వరునకు (ఈశ్వరుని రూపమైన బ్రహ్మాందము మొదలగువాటికి) భేదము లేదు - పరమార్థదృష్టిలో జ్ఞాని శుద్ధబ్రహ్మమే. ఇందువలన జ్ఞానికి శుద్ధ బ్రహ్మ ప్రాప్తియే కలుగును)

Transliteration

avidyādi dōṣa śūnyatvaṃ śuddhatvaṃ, jāḍyarāhityaṃ buddhatvaṃ, baṃdakālē api svataḥ baṃdhābāvō muktatvaṃ

(śuddhamanagā avidya modalagudōṣamulu lēnidi, buddhamanagā jāḍyamu lēkuṃḍuṭa, baṃdhakāramaṃdu kūḍā baṃdhamulēkuṃḍuṭa muktatvamu - ī mūḍu kalavāḍu śuddha buddha muktuḍu)

śuddha brahma prāpti = jñāna dṛṣṭyā vidēhamuktēḥ prāgapi brhahmāṃḍādikaṃ jagat nakiṃcidapi vidyatē, kiṃtu brahmaiva kēvalaṃ vartatē. tasmāt vidvaddṛṣṭyā śuddhē na brahmaṇā ēvaṃ abhēdō viduṣaḥ. sa ēva tasya śuddhabrahma prāptiḥ. ajña dṛṣṭyāt prāgiva brahmāṃḍādayaḥ pratīyaṃtē tasmāt tat dṛṣṭyā jñānaninaḥīśvarēṇa (īśvara dēha bhūta brahmāṃḍēna abhēdō jāyatē. sōpi īśvaraḥ paramārthataḥ śuddhaṃ brahmaiva anēna jñāninaḥ śuddha brahma prāptirēva bhavati.

(jñāna dṛṣṭilō vidēha muktiki muṃdu brahmāṃḍamu modalagu jagattu lēdu, brahma okaṭē yuṃḍenu - aṃducēta jñānula dṛṣṭilō śuddha parabrahmaku jñāniki bhēdamulēdu. ā jñāniyaguṭayē śuddha brahmaprāpti. ajñāni dṛṣṭilō mātramu brahmāṃdamu modalagunavi vidēhamuktiki muṃduganē unnavi. aṃducēta jñāniki īśvarunaku (īśvaruni rūpamaina brahmāṃdamu modalaguvāṭiki) bhēdamu lēdu - paramārthadṛṣṭilō jñāni śuddhabrahmamē. iṃduvalana jñāniki śuddha brahma prāptiyē kalugunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.