← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుధాసముద్రము sudhāsamudramu

Original — తెలుగు
  1. పాలసముద్రము - (పాలవలె తెల్లగా సముద్రమువలె విస్తారముగా కనబడు - తెజోవంతమైన నక్షత్ర సముదాయము - (Milky way ?).

  2. “బహు యోజన విస్తీర్ణో గంభీరస్తావదేవహి |

మణిద్వీపస్య పరితో వర్తితే తు సుధోధిః ||“. (దేవీ భాగవతము)

(మణిద్వీపము చుట్టు అనేక యోజనముల విస్తీర్ణము గలిగి లోతు అయిన పాల సముద్రము కలదు)..

  1. “బ్రహ్మాండోపరిభాగమందు సుధాసముద్రము కలదు - దాని మధ్య రత్నద్వీపము, దాని మధ్య చింతామణి గృహము - అది శ్రీదేవి నిలయము”.

  2. “శ్లో||. సుధాసముద్రాంత విరాజమాన ద్వీపేసితే చందన పారిజాతే |

మాహాసనే పన్నగతల్ప మధ్యే నిషణ్ణమీళే రఘువంశరత్నం ||” (శ్రీరామకర్ణామృతం - 2 - 21)

(సుధాసముద్రమధ్యమున స్వేతద్వీపమందు చందన వృక్షము పారిజతము అనెడి దేవవృక్షములవద్ద గొప్ప పీఠమందు శేషతల్పమందు శయనించియుండు రఘువంశమునకు రత్నమువంటివాడైన శ్రీరామచంద్రుని నుతించుచున్నాను).

  1. ఆకాశమునందు కోట్లకొలది నక్షత్రములు దగ్గరదగ్గరగానున్నట్లు కనబడుటచేత, వాటి కాంతి కలిసిపోయినట్లుండి అంతయు ఒకే ఒక కాంతిసమూహముగా, చక్రాకారముగా, ఒక తెల్లని మార్గముగా కనుపించునది. ఇందులోని నక్షత్రములలో మనకు కనబడు సూర్యుడొకడు. అమృతమువలె, పాలవలె ఒక బాటవలె కనబడుటచేత సుధాసముద్రము - పాల సముద్రము - పాలవెల్లియను పోలిక గలదని చెప్పబడుచున్నది). (Milky Way).
Transliteration
  1. pālasamudramu - (pālavale tellagā samudramuvale vistāramugā kanabaḍu - tejōvaṃtamaina nakṣatra samudāyamu - (Milky way ?).

  2. “bahu yōjana vistīrṇō gaṃbhīrastāvadēvahi |

maṇidvīpasya paritō vartitē tu sudhōdhiḥ ||“. (dēvī bhāgavatamu)

(maṇidvīpamu cuṭṭu anēka yōjanamula vistīrṇamu galigi lōtu ayina pāla samudramu kaladu)..

  1. “brahmāṃḍōparibhāgamaṃdu sudhāsamudramu kaladu - dāni madhya ratnadvīpamu, dāni madhya ciṃtāmaṇi gṛhamu - adi śrīdēvi nilayamu”.

  2. “ślō||. sudhāsamudrāṃta virājamāna dvīpēsitē caṃdana pārijātē |

māhāsanē pannagatalpa madhyē niṣaṇṇamīḷē raghuvaṃśaratnaṃ ||” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 21)

(sudhāsamudramadhyamuna svētadvīpamaṃdu caṃdana vṛkṣamu pārijatamu aneḍi dēvavṛkṣamulavadda goppa pīṭhamaṃdu śēṣatalpamaṃdu śayaniṃciyuṃḍu raghuvaṃśamunaku ratnamuvaṃṭivāḍaina śrīrāmacaṃdruni nutiṃcucunnānu).

  1. ākāśamunaṃdu kōṭlakoladi nakṣatramulu daggaradaggaragānunnaṭlu kanabaḍuṭacēta, vāṭi kāṃti kalisipōyinaṭluṃḍi aṃtayu okē oka kāṃtisamūhamugā, cakrākāramugā, oka tellani mārgamugā kanupiṃcunadi. iṃdulōni nakṣatramulalō manaku kanabaḍu sūryuḍokaḍu. amṛtamuvale, pālavale oka bāṭavale kanabaḍuṭacēta sudhāsamudramu - pāla samudramu - pālavelliyanu pōlika galadani ceppabaḍucunnadi). (Milky Way).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.