← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుహృత్ suhṛt

Original — తెలుగు
  1. “సుహృత్ ఇతి ప్రత్యుపకారం అనపేక్ష్య ఉపకర్తా -” (శ్రీశంకరః)

(తిరిగి ఉపకారము కోరకుండా ఉపకారము చేయువాడు).

  1. “ప్రత్యుపకార నిరపేక్షయా ఉపకారకృత్” (ఆనందతీర్థః)

(తిరిగి ఉపకారము నపేక్షింపకయే ఉపకారము చేయువాడు).

“వినా ప్రత్యుపకారేప్సా ముపకర్తా” (గీతాభావప్రకాశము)

“సుహృత్ ప్రత్యుపకారా నపేక్షస్స న్నుపకారకః” -

  1. సర్వావస్థాయాం హితకరం -

(అన్ని అవస్థలందును హితమునే చేయువాడు).

  1. స్వభావము వలననే ఉపకారము చేయువాడు.

  2. శుద్ధ మనస్కః; శోభన హృదయం యస్య సః -

(నిర్మలమైన మనస్సు కలవాడు) (మంగళకరమైన - శుభము కలుగచేయు హృదయము కలవాడు).

  1. ‘శోభన హృదయ యుక్తో సుహృత్ - శోభనత్వంచ హృదయస్య హిత గోచరత్వం ఇతి భావః’. (శ్రీవేదాంత దేశికః)

(శోభన హృదయము - శుభమును కలుగచేయు - హృదయము కలవాడు) (హృదయములోని ఇష్టమును తెలుపుడు చేయుటయే శోభనత్వము).

  1. సుష్టు హృదయం ఊఎషాంతే సుహృదః, మిత్రాః -

(మంచి హృదయము; మిత్రులు, స్నేహితులు).

  1. “వయో విశేషా నంగీ కారేణ స్నేహితైషిణః” (శ్రీమాన్ రామానుజః)

(వయస్సుతో సంబంధము లేకుండ స్నేహము కోరువారు)

  1. స్వాను వృత్తుపక్రమ మాత్రేణ ఆవిర్భూత పరమకారుణ్య యుక్తః; హితకారీ -

(తనయందే భక్తి కలిగి యుండుటచేత గొప్ప దయ కలిగియుండువాడు).

  1. సర్వ భూతానాం దేవాదీనాం అసురాదీనాం చ సుహృత్, హితైషీ - ఆత్మత్వాత్ ఇతి భావః. నహి ఆత్మనః కించిత్ శరీరం హితం, అన్యత్ అహితం, ఆత్మత్వా దేవ చ నిరతిశయ ప్రియః.

(సమస్త భూతములకు - దేవతులు, అసురులు మొదలగు వారికి కూడా హితమునే కోరువాడు - అనగా, వీరందఱికి ఆత్మ యగుటవలన ఆత్మకు ఒక శరీరము ఇష్టమైనది, ఇంకొకటి ఇష్టముకానిది అని లేదు - అన్నింటికి ఆత్మ యగుట వలననే అన్నింటికి ప్రియమైనవాడు - భగవంతుడు).

Transliteration
  1. “suhṛt iti pratyupakāraṃ anapēkṣya upakartā -” (śrīśaṃkaraḥ)

(tirigi upakāramu kōrakuṃḍā upakāramu cēyuvāḍu).

  1. “pratyupakāra nirapēkṣayā upakārakṛt” (ānaṃdatīrthaḥ)

(tirigi upakāramu napēkṣiṃpakayē upakāramu cēyuvāḍu).

“vinā pratyupakārēpsā mupakartā” (gītābhāvaprakāśamu)

“suhṛt pratyupakārā napēkṣassa nnupakārakaḥ” -

  1. sarvāvasthāyāṃ hitakaraṃ -

(anni avasthalaṃdunu hitamunē cēyuvāḍu).

  1. svabhāvamu valananē upakāramu cēyuvāḍu.

  2. śuddha manaskaḥ; śōbhana hṛdayaṃ yasya saḥ -

(nirmalamaina manassu kalavāḍu) (maṃgaḷakaramaina - śubhamu kalugacēyu hṛdayamu kalavāḍu).

  1. ‘śōbhana hṛdaya yuktō suhṛt - śōbhanatvaṃca hṛdayasya hita gōcaratvaṃ iti bhāvaḥ’. (śrīvēdāṃta dēśikaḥ)

(śōbhana hṛdayamu - śubhamunu kalugacēyu - hṛdayamu kalavāḍu) (hṛdayamulōni iṣṭamunu telupuḍu cēyuṭayē śōbhanatvamu).

  1. suṣṭu hṛdayaṃ ūeṣāṃtē suhṛdaḥ, mitrāḥ -

(maṃci hṛdayamu; mitrulu, snēhitulu).

  1. “vayō viśēṣā naṃgī kārēṇa snēhitaiṣiṇaḥ” (śrīmān rāmānujaḥ)

(vayassutō saṃbaṃdhamu lēkuṃḍa snēhamu kōruvāru)

  1. svānu vṛttupakrama mātrēṇa āvirbhūta paramakāruṇya yuktaḥ; hitakārī -

(tanayaṃdē bhakti kaligi yuṃḍuṭacēta goppa daya kaligiyuṃḍuvāḍu).

  1. sarva bhūtānāṃ dēvādīnāṃ asurādīnāṃ ca suhṛt, hitaiṣī - ātmatvāt iti bhāvaḥ. nahi ātmanaḥ kiṃcit śarīraṃ hitaṃ, anyat ahitaṃ, ātmatvā dēva ca niratiśaya priyaḥ.

(samasta bhūtamulaku - dēvatulu, asurulu modalagu vāriki kūḍā hitamunē kōruvāḍu - anagā, vīraṃdaṟiki ātma yaguṭavalana ātmaku oka śarīramu iṣṭamainadi, iṃkokaṭi iṣṭamukānidi ani lēdu - anniṃṭiki ātma yaguṭa valananē anniṃṭiki priyamainavāḍu - bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.