ముక్తిమార్గము - శుకమనగా పక్షి. ఇది యొక వృక్షము యొక్క కొమ్మ చివరనున్నపండును చూచి, అప్పుడే దానిని అనుభవింపవలెనని కోరిక కలిగి దానిని తినును -ఇట్లే జ్ఞానయోగి తురీయస్వరూప బ్రహ్మతత్వమును తెలిసినపుడే తత్స్వరూపుడై అవిద్యవలన ముక్తుడగును - ఇట్టి జ్ఞానయోగము శుకమార్గమని చెప్పబడినది.
అతద్వ్యావృత్తి రూపేణ సాక్షా ద్విధిముఖేన వా |
మహా వాక్య విచారేణ సాంఖ్యయోగసమాధినా |
విదిత్వా స్వాత్మానో రూపం అసం ప్రజ్ఞా సమాధితాం |
శుకమార్గేణ విరజాః ప్రయాంతి పరమం పదం ||. (వరాహోపనిషత్)
(అతద్వ్యావృత్తివలన కాని, సాక్షాద్విధిముఖమునగాని, మహావాక్య విచారము వలనకాని, సాంఖ్యయోగము నభ్యసించిగాని స్వస్వరూపమును తెలుసుకొని, కల్మషములను పోగొట్టుకొని శుకమార్గమువలన పరమపదమును పొందుదురు -)
muktimārgamu - śukamanagā pakṣi. idi yoka vṛkṣamu yokka komma civaranunnapaṃḍunu cūci, appuḍē dānini anubhaviṃpavalenani kōrika kaligi dānini tinunu -iṭlē jñānayōgi turīyasvarūpa brahmatatvamunu telisinapuḍē tatsvarūpuḍai avidyavalana muktuḍagunu - iṭṭi jñānayōgamu śukamārgamani ceppabaḍinadi.
atadvyāvṛtti rūpēṇa sākṣā dvidhimukhēna vā |
mahā vākya vicārēṇa sāṃkhyayōgasamādhinā |
viditvā svātmānō rūpaṃ asaṃ prajñā samādhitāṃ |
śukamārgēṇa virajāḥ prayāṃti paramaṃ padaṃ ||. (varāhōpaniṣat)
(atadvyāvṛttivalana kāni, sākṣādvidhimukhamunagāni, mahāvākya vicāramu valanakāni, sāṃkhyayōgamu nabhyasiṃcigāni svasvarūpamunu telusukoni, kalmaṣamulanu pōgoṭṭukoni śukamārgamuvalana paramapadamunu poṃduduru -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.