← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుఖం sukhaṃ

Original — తెలుగు
  1. తనకు అనుకూలమైన అనుభవము.

  2. చిత్తస్యా హ్లాదనం సుఖం: (గీతాభావప్రకాశము - 10 - 4,5)

(చిత్తమునకు సంతోషము కలుగుటయే సుఖము)

  1. అనుకూల ద్రవ్యాది లాభేన బుద్ధిస్వా స్థ్యం సుఖం.

(అనుకూలమైనట్లు ద్రవ్యము మొదలగునవి లభించుటచేత బుద్ధి స్వస్థత కలిగియుండుట సుఖము).

  1. విషయ సంగజా ప్రీతిః -

(విషయములతోడి సంబంధమువలన కలుగు ప్రీతి).

  1. శమశ్చ పరమం సుఖం -

(శమము పరమ సుఖము - గొప్ప సుఖము - ఉత్కృష్టమైన సుఖము).

  1. “వైరాశ్యం పరమం సుఖం”.

(దేనియందును ఆశలేకుండుటయే పరమ సుఖము).

  1. ఇంద్రియాణాం హి విషయ సేవాతృష్ణాతః నివృత్తిః సుఖం.

(విషయముల అనుభవమునుండి ఇంద్రియములను నివృత్తి చేయుట సుఖము).

  1. పరమ ప్రేమాస్పదీ భూత నిరతిశయానందః. (విచారసాగరము)

(పరమ ప్రేమకు ఆస్పదమైన నిరతిశయానందము).

  1. మోక్షానందం

(మోక్షము కలుగుటవలన కలుగు ఆనందము - మోక్షమునందు కలుగు ఆనందము - మోక్షమే ఆనందము).

  1. “ఆత్మానుకూలాను భవః” (శ్రీమాన్ రామానుజః)

(ఆత్మకు అనుకూలమైన అనుభవము).

  1. “సంతోషః పరమో లాభః సత్సంగం పరమం ధనం |

విచారః పరమం జ్ఞానం శమశ్చ పరమం సుఖం“. (యోగవాశిష్టము)

(సంతోషము పరమలాభము, సత్పురుషుల సంగము, గొప్ప ధనము, భగవంతుని గుఱించి విచారించుట (ఆలోచన చేయుట), గొప్ప జ్ఞానము, శమము పరమ సుఖము).

  1. “నచేంద్రస్య సుఖం కించిత్ న సుఖం చక్రవర్తినః |

సుఖమస్తి విరక్తిస్య మునే రేకాంత జీవినః ||“. (పద్మ పురాణము - ఉత్తరఖండము - 4 - 76)

(దేవేంద్రునకు సుఖము లేదు - చక్రవర్తికి సుఖము లేదు - అడవులలో ఏకాంత స్థలమున విరక్తి పొంది జీవించువానిదే సుఖము).

  1. “నాస్తి సత్య సమం సుఖం, నాస్తి రాగసమం దుఃఖం |

నాస్తి త్యాగసమం సుఖం “.

(అనురాగము కలిగియుండుటవలన కలుగు దుఃఖముతోసమానమైన దుఃఖము లేదు; త్యాగముతోను, సత్యము తోను సమానమైన సుఖము లేదు).

  1. “వ. నియమాది గుణ సహితత్వంబును, మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

  2. వ. - - - మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జపతపంబులును, న తిధిసత్కారంబును.బరహితంబును, చౌర్యాది రహితత్వంబును ననునవి మొదలైనవి నియమంబులనంబడు - - - “నియమాది గుణ సహితత్వంబును, మద్భక్తియుక్తియు యనునవియె సుఖంబు” -

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

  1. “యస్మిన్ సుఖే శిక్రలక్షేరపి జలరాశౌ తృణమివ తుచ్ఛిత్వేన ఊహ్యతే ఉత్ప్రేక్ష్యతే తదావ్యం సుఖం”.

(దేవేంద్ర భోగము కూడా సముద్రములో గడ్డిపోచవలె తుచ్చమైనదని ఊహించుటవలన కలిగిన సుఖమే మొదటి సుఖము).

  1. యత్ మదర్థం తదేవ సుఖం -

(భగవంతుని కొఱకు ఏది యగునో అదే సుఖము).

  1. “నహితృప్తేః పరం సుఖం”. (యోగశిఖోపనిషత్)

(తృప్తి పొందుటకంటె ఉత్తమమైన సుఖము లేదు).

  1. బ్రహ్మానంద సుఖము -

  2. “ఆత్మజ్ఞానం సుఖం నిత్యం అనిత్యం భోగజం స్మృతం నాశాత్మకం తు తత్త్యాజ్యం వేద శాస్త్రార్థ చింతకైః ||”.

(దేవీ భాగవతము)

(ఆత్మ జ్ఞానమే - ఆత్మను గుఱించి తెలుసుకొనుటయే నిత్యమైన సుఖము - భోగములవలన కలిగిన సుఖము నిత్యముగా నుండదు - దానిని విడిచిపెట్టవలెను - అని వేదార్థమును తెలిసినవారు చెప్పుదురు).

  1. ప్రత్యగద్వయానందాత్మకం.

(ప్రత్యగాత్మకు అద్వయ బ్రహ్మానందసుఖానుభవము).

  1. సచ్చిదానందరూపం జ్ఞాత్వా ఆనందరూపయాస్థితిః, సైవ సుఖం. (నిరాలంబనోపనిషత్)

(సత్ చిత్ అనందములు రూపముగా గల పరబ్రహ్మను తెలుసుకొని ఆనందముతో నుండుట). (సత్ అనగా అన్ని కాలములందుండునది, చిత్ అనగా అన్నింటికి చైతన్యము జ్ఞానము కలిగించునది, ఆనందము అనగా ఇహలోక పరలోక సుఖములకు మించిన సుఖము అయినది పరబ్రహ్మము - అట్టి పరబ్రహ్మ జ్ఞానము కలిగియుండుటచేత కలుగు సుఖము).

  1. “యావై భూమా తత్సుకం”

(భూమా యనునది యేది కలదో అదియే సుఖము).

  1. విషయేంద్రియాద్యజన్యం నిరాయాసమనాబాధం సుషుప్తి సమాధ్యా దా వభి వ్యక్త స్వరూప సుఖమిత్యర్థః -

(విషయములు - ఇంద్రియములు - వాటి వలన కలిగినది కాక, ఆయాసములేనిదే కలిగునది, బాధ లేనిది - దేనిచేతను నష్టము చెందకుండునది, సిషుప్తిలోను, సమాధి అవస్థలోను వ్యక్తమగు (కనబడు, అనుభవమగు) స్వరూప సుఖము - భగవంతుని యొక్క స్వస్వరూపము, యధార్థస్వరూపము, తానే భగవంతుని స్వరూపము అగుట - అనుభవించునప్పటి సుఖము).

  1. వ. జీవనోపాయంబునకు నిట్టట్టు దిరుగక, కార్పణ్యంబు లేక జీవించుచు,మహాసర్పంబు తెఱంగున సంతోషంబున నాత్మారాముండై యెద్దియుం గోరక బ్రతికెడు సుగుణునికిం గల సుఖంబు గామలోభంబుల దశ దిశలం బరిధావనంబు సేయువానికి సిద్ధింపదు).

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 457)

  1. “నాస్తి బుద్ధిర యుక్తస్య వ చా యుక్తస్య భావనా |

న చా భావయుతః శాంతి రశాంతస్య కు తస్సుఖం ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 66)

“పుంసో హ్య జిత చిత్తస్య బుద్ధేర్వేదాత వాక్యజా |

నోత్పద్యతే (అ)స్య, తద్బుద్థ్యభావే నాస్త్యేవ భావనా |

న్మిధి ధ్యాసనరూపా యా శాంతి హేతుః స్థిరాత్మకా |

నిది ధ్యాసన శూన్యస్య వాస్త్య విద్యా పరిక్షయః |

సాక్షాత్కారః పరాత్మైక్య తత్వస్యానంద కారణం |

తత్సాక్షాత్కార శున్యస్యమోక్షానందః కుతో భవేత్ ||“. (గీతాభావప్రకాశము - 2 - 6 - 26 to 29)

(మనో జయము లేనివానికి వేదాంత వాక్యములవలన కలుగు బుద్ధి (జ్ఞానము) కలుగదు - అఘ్ట్టి బుద్ధి లేనివానికి నిదిధ్యాసనరూపమైనదిన్నీ, స్థిరమైనదిన్నీ, శాంతికి కారణమగునదిన్నీ అయిన భావన కుదరదు - భావన లేనివానికి అవిద్య నశించదు. జీవాత్మ పరమాత్మ ఒకటేయను అభిప్రాయము కలుగదు. అది కలుగనందున శాంతి లేదు, శాంతి లేనివానికి సుఖమెట్లు కలుగును ? కలగదు అని అర్థము).

  1. “అనాదౌ సంసారే జనిమృతిమయే భ్రాంతినిబిడే |

నిమగ్నానాం పుంసాం క్వచిదపి సుఖం నాస్తి విమలం |

తపో భిర్వా దౌ నైః క్రతుభిరపి వేదాను వచనైః |

ఋతే (అ)త్యంతప్రేమ్ణా హరిపదసరోజే చ సుఖదే ||“. (గీతాభావప్రకాశము - 12 - 1)

(జనన మరణములతో నిండియుండి భ్రాంతి కలుగచేయు అనాది కాలమునుండి వచ్చుచున్న ఈ సంసారమందు మునిగియుండు జనులకు తపస్సువలనగాని, దానములవలన గాని, యజ్ఞ యాగములవలనగాని సుఖమును కలుగచేయు శ్రీహరిపాదములందు అత్యంత భక్తి కలిగి యుండిననే తప్ప శాంతి కలుగదు - సుఖము కలుగదు).

  1. సుఖం చ ద్వివిధం - సాతిశయం, నిరతిశయం చేతి - తత్ర సాతిశయం సుఖం విషయాను సంగ జనితాంతః కరణ వృత్తి తారతమ్య కృతానంద లేశావిర్భావవిశేషః తథా భూత వృత్యా విషయా వచ్ఛిన్నానంద స్యైవ ప్రతిబింబనాత్ ఆనంద సముద్రస్య బ్రహ్మణః ఆనంద లేశావిర్భావ విశేషః ఇత్యర్థః (శివదత్తః)

(సుఖము రెండు విధములు - సాతిశయసుఖము, నిరతిశయసుఖము. సాతిశయసుఖమనగా విషయములకు ఇంద్రియములకు సన్నికర్షము - (దగ్గరగా నుండుటవలన) కలిగిన అంతఃకరణ వృత్తి తారతమ్యము - దానివలన కలుగు ఆనందలేశము - ఆనంద సముద్రుడగు బ్రహ్మ యొక్క ఆనందలేశము ఆవిర్భవించుట. (బ్రహ్మానందము).

Transliteration
  1. tanaku anukūlamaina anubhavamu.

  2. cittasyā hlādanaṃ sukhaṃ: (gītābhāvaprakāśamu - 10 - 4,5)

(cittamunaku saṃtōṣamu kaluguṭayē sukhamu)

  1. anukūla dravyādi lābhēna buddhisvā sthyaṃ sukhaṃ.

(anukūlamainaṭlu dravyamu modalagunavi labhiṃcuṭacēta buddhi svasthata kaligiyuṃḍuṭa sukhamu).

  1. viṣaya saṃgajā prītiḥ -

(viṣayamulatōḍi saṃbaṃdhamuvalana kalugu prīti).

  1. śamaśca paramaṃ sukhaṃ -

(śamamu parama sukhamu - goppa sukhamu - utkṛṣṭamaina sukhamu).

  1. “vairāśyaṃ paramaṃ sukhaṃ”.

(dēniyaṃdunu āśalēkuṃḍuṭayē parama sukhamu).

  1. iṃdriyāṇāṃ hi viṣaya sēvātṛṣṇātaḥ nivṛttiḥ sukhaṃ.

(viṣayamula anubhavamunuṃḍi iṃdriyamulanu nivṛtti cēyuṭa sukhamu).

  1. parama prēmāspadī bhūta niratiśayānaṃdaḥ. (vicārasāgaramu)

(parama prēmaku āspadamaina niratiśayānaṃdamu).

  1. mōkṣānaṃdaṃ

(mōkṣamu kaluguṭavalana kalugu ānaṃdamu - mōkṣamunaṃdu kalugu ānaṃdamu - mōkṣamē ānaṃdamu).

  1. “ātmānukūlānu bhavaḥ” (śrīmān rāmānujaḥ)

(ātmaku anukūlamaina anubhavamu).

  1. “saṃtōṣaḥ paramō lābhaḥ satsaṃgaṃ paramaṃ dhanaṃ |

vicāraḥ paramaṃ jñānaṃ śamaśca paramaṃ sukhaṃ”. (yōgavāśiṣṭamu)

(saṃtōṣamu paramalābhamu, satpuruṣula saṃgamu, goppa dhanamu, bhagavaṃtuni guṟiṃci vicāriṃcuṭa (ālōcana cēyuṭa), goppa jñānamu, śamamu parama sukhamu).

  1. “nacēṃdrasya sukhaṃ kiṃcit na sukhaṃ cakravartinaḥ |

sukhamasti viraktisya munē rēkāṃta jīvinaḥ ||“. (padma purāṇamu - uttarakhaṃḍamu - 4 - 76)

(dēvēṃdrunaku sukhamu lēdu - cakravartiki sukhamu lēdu - aḍavulalō ēkāṃta sthalamuna virakti poṃdi jīviṃcuvānidē sukhamu).

  1. “nāsti satya samaṃ sukhaṃ, nāsti rāgasamaṃ duḥkhaṃ |

nāsti tyāgasamaṃ sukhaṃ “.

(anurāgamu kaligiyuṃḍuṭavalana kalugu duḥkhamutōsamānamaina duḥkhamu lēdu; tyāgamutōnu, satyamu tōnu samānamaina sukhamu lēdu).

  1. “va. niyamādi guṇa sahitatvaṃbunu, madbhaktiyuktiyu nanunadiyē sukhaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

  2. va. - - - maunavrata brahmacarya kṣamā japatapaṃbulunu, na tidhisatkāraṃbunu.barahitaṃbunu, cauryādi rahitatvaṃbunu nanunavi modalainavi niyamaṃbulanaṃbaḍu - - - “niyamādi guṇa sahitatvaṃbunu, madbhaktiyuktiyu yanunaviye sukhaṃbu” -

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

  1. “yasmin sukhē śikralakṣērapi jalarāśau tṛṇamiva tucchitvēna ūhyatē utprēkṣyatē tadāvyaṃ sukhaṃ”.

(dēvēṃdra bhōgamu kūḍā samudramulō gaḍḍipōcavale tuccamainadani ūhiṃcuṭavalana kaligina sukhamē modaṭi sukhamu).

  1. yat madarthaṃ tadēva sukhaṃ -

(bhagavaṃtuni koṟaku ēdi yagunō adē sukhamu).

  1. “nahitṛptēḥ paraṃ sukhaṃ”. (yōgaśikhōpaniṣat)

(tṛpti poṃduṭakaṃṭe uttamamaina sukhamu lēdu).

  1. brahmānaṃda sukhamu -

  2. “ātmajñānaṃ sukhaṃ nityaṃ anityaṃ bhōgajaṃ smṛtaṃ nāśātmakaṃ tu tattyājyaṃ vēda śāstrārtha ciṃtakaiḥ ||”.

(dēvī bhāgavatamu)

(ātma jñānamē - ātmanu guṟiṃci telusukonuṭayē nityamaina sukhamu - bhōgamulavalana kaligina sukhamu nityamugā nuṃḍadu - dānini viḍicipeṭṭavalenu - ani vēdārthamunu telisinavāru ceppuduru).

  1. pratyagadvayānaṃdātmakaṃ.

(pratyagātmaku advaya brahmānaṃdasukhānubhavamu).

  1. saccidānaṃdarūpaṃ jñātvā ānaṃdarūpayāsthitiḥ, saiva sukhaṃ. (nirālaṃbanōpaniṣat)

(sat cit anaṃdamulu rūpamugā gala parabrahmanu telusukoni ānaṃdamutō nuṃḍuṭa). (sat anagā anni kālamulaṃduṃḍunadi, cit anagā anniṃṭiki caitanyamu jñānamu kaligiṃcunadi, ānaṃdamu anagā ihalōka paralōka sukhamulaku miṃcina sukhamu ayinadi parabrahmamu - aṭṭi parabrahma jñānamu kaligiyuṃḍuṭacēta kalugu sukhamu).

  1. “yāvai bhūmā tatsukaṃ”

(bhūmā yanunadi yēdi kaladō adiyē sukhamu).

  1. viṣayēṃdriyādyajanyaṃ nirāyāsamanābādhaṃ suṣupti samādhyā dā vabhi vyakta svarūpa sukhamityarthaḥ -

(viṣayamulu - iṃdriyamulu - vāṭi valana kaliginadi kāka, āyāsamulēnidē kaligunadi, bādha lēnidi - dēnicētanu naṣṭamu ceṃdakuṃḍunadi, siṣuptilōnu, samādhi avasthalōnu vyaktamagu (kanabaḍu, anubhavamagu) svarūpa sukhamu - bhagavaṃtuni yokka svasvarūpamu, yadhārthasvarūpamu, tānē bhagavaṃtuni svarūpamu aguṭa - anubhaviṃcunappaṭi sukhamu).

  1. va. jīvanōpāyaṃbunaku niṭṭaṭṭu dirugaka, kārpaṇyaṃbu lēka jīviṃcucu,mahāsarpaṃbu teṟaṃguna saṃtōṣaṃbuna nātmārāmuṃḍai yeddiyuṃ gōraka bratikeḍu suguṇunikiṃ gala sukhaṃbu gāmalōbhaṃbula daśa diśalaṃ baridhāvanaṃbu sēyuvāniki siddhiṃpadu).

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 457)

  1. “nāsti buddhira yuktasya va cā yuktasya bhāvanā |

na cā bhāvayutaḥ śāṃti raśāṃtasya ku tassukhaṃ ||“. (śrīmadbhagavadgīta - 2 - 66)

“puṃsō hya jita cittasya buddhērvēdāta vākyajā |

nōtpadyatē (a)sya, tadbudthyabhāvē nāstyēva bhāvanā |

nmidhi dhyāsanarūpā yā śāṃti hētuḥ sthirātmakā |

nidi dhyāsana śūnyasya vāstya vidyā parikṣayaḥ |

sākṣātkāraḥ parātmaikya tatvasyānaṃda kāraṇaṃ |

tatsākṣātkāra śunyasyamōkṣānaṃdaḥ kutō bhavēt ||“. (gītābhāvaprakāśamu - 2 - 6 - 26 to 29)

(manō jayamu lēnivāniki vēdāṃta vākyamulavalana kalugu buddhi (jñānamu) kalugadu - aghṭṭi buddhi lēnivāniki nididhyāsanarūpamainadinnī, sthiramainadinnī, śāṃtiki kāraṇamagunadinnī ayina bhāvana kudaradu - bhāvana lēnivāniki avidya naśiṃcadu. jīvātma paramātma okaṭēyanu abhiprāyamu kalugadu. adi kaluganaṃduna śāṃti lēdu, śāṃti lēnivāniki sukhameṭlu kalugunu ? kalagadu ani arthamu).

  1. “anādau saṃsārē janimṛtimayē bhrāṃtinibiḍē |

nimagnānāṃ puṃsāṃ kvacidapi sukhaṃ nāsti vimalaṃ |

tapō bhirvā dau naiḥ kratubhirapi vēdānu vacanaiḥ |

ṛtē (a)tyaṃtaprēmṇā haripadasarōjē ca sukhadē ||“. (gītābhāvaprakāśamu - 12 - 1)

(janana maraṇamulatō niṃḍiyuṃḍi bhrāṃti kalugacēyu anādi kālamunuṃḍi vaccucunna ī saṃsāramaṃdu munigiyuṃḍu janulaku tapassuvalanagāni, dānamulavalana gāni, yajña yāgamulavalanagāni sukhamunu kalugacēyu śrīharipādamulaṃdu atyaṃta bhakti kaligi yuṃḍinanē tappa śāṃti kalugadu - sukhamu kalugadu).

  1. sukhaṃ ca dvividhaṃ - sātiśayaṃ, niratiśayaṃ cēti - tatra sātiśayaṃ sukhaṃ viṣayānu saṃga janitāṃtaḥ karaṇa vṛtti tāratamya kṛtānaṃda lēśāvirbhāvaviśēṣaḥ tathā bhūta vṛtyā viṣayā vacchinnānaṃda syaiva pratibiṃbanāt ānaṃda samudrasya brahmaṇaḥ ānaṃda lēśāvirbhāva viśēṣaḥ ityarthaḥ (śivadattaḥ)

(sukhamu reṃḍu vidhamulu - sātiśayasukhamu, niratiśayasukhamu. sātiśayasukhamanagā viṣayamulaku iṃdriyamulaku sannikarṣamu - (daggaragā nuṃḍuṭavalana) kaligina aṃtaḥkaraṇa vṛtti tāratamyamu - dānivalana kalugu ānaṃdalēśamu - ānaṃda samudruḍagu brahma yokka ānaṃdalēśamu āvirbhaviṃcuṭa. (brahmānaṃdamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.