(సూక్ష్మ వస్తువులను - సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులను, చూడగలిగే శక్తి, జ్ఞానము, బుద్ధి గలవారు - అట్లు ఇంద్రియములు అవ్యక్తమువఱకు గల ఒకదానికంటె ఒకటి సూక్ష్మతరమైన వస్తువులను చూడగల శక్తి గలవారు).
మనసశ్చ పరా బుద్ధిః, బుద్ధేరాత్మా మహాన్ పరః |
మహతః పరమవ్యక్తం |
అవ్యక్తాత్ పురుషః పరః |
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః ||
ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్ర ప్రకాశతే ||
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః ||. (కఠోపనిషత్)
(ఇంద్రియములకన్న అర్థములు (తన్మాత్రలు) పరములు, ఉత్కృష్టమైనవి, గొప్పవి, శక్తివంతములైనవి - సూక్ష్మములు. అర్థములకంటె మనస్సు ఉత్కృష్టమైనది - సూక్ష్మము - ఈ ప్రకారము మనస్సు కన్న బుద్ధి, బుద్ధికన్న మహత్తత్త్వము, మహత్తత్త్వముకన్న అవ్యక్తము, (ప్రధానము, ప్రకృతి), అవ్యక్తముకన్న పురుషుడు (పరమాత్మ) ఉత్కృష్టమైనవాడు - పురుషునికంటె - పరమాత్మ కంటె - ఉత్కృష్టమైనది మఱిలేదు - పురుషుడే పరబ్రహ్మ, పరాకాష్ట (అన్నింటికంటె ఉత్కృష్టమైనది - అదియె పరాగతి - పరమగతి - మోక్షము - గమ్యస్థానము - ఈ ప్రకారము ఒకదానికంటె ఒకటి పరమమైనది - ఉత్కృష్టమైనది - సూక్ష్మమైనది అని చెప్పబడినది - సూక్ష్మమైనకొలది హెచ్చుగా శక్తి వంతమైనది).
(పైన చెప్పిన ప్రకారము స్థూల వస్తువులకంటె సూక్ష్మవస్తువులు, వాటికంటె సూక్ష్మమైనవి, ఇంకా సూక్ష్మమైనవి - అన్నింటికంటె సూక్ష్మమైనది భగవంతుడు అని చెప్పుటచేత భగవంతుడు - పరమాత్మ, పురుషుడు - వఱకు చెప్పబడిన యీ సూక్ష్మవస్తువులన్నింటిని - భగవంతుని వఱకు చూచుటకు తగిన శక్తి సామర్థ్యములు గలవారు సూక్ష్మదర్శినులు).
“ఇంద్రియేభ్యః పరాహ్యర్ధాః ఇత్యాది ప్రకారేణ సూక్ష్మతా పారంపర్య దర్శనేన పరం సూక్ష్మం ద్రష్టుం శీలం యేషాంతే సూక్ష్మదర్శినః - పండితాః” (శ్రీశంకరః)
(ఇంద్రియములకంటె అర్థములు ఉత్కృష్టమైనవి అని ఒకదానికంటె ఒకటి సూక్ష్మమైనది, ఉత్మృష్టమైనది, వ్యాపకము అని చెప్పుటచేత అన్నింటికంటె సూక్ష్మము, వ్యాపకము అయిన పరబ్రహ్మను చూడగలుగువారు సూక్ష్మదర్శినులు).
“క. ఇందుగలడందు లేడని
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెతకి చూచిన
నందందే గలడు, దానవగ్రణి వింటే”
అని ప్రహ్లాదుడు తండ్రితో చెప్పెను - ఇది సిద్ధాంత వచనము - మన దృష్టికి కనబడకుండా, లోన డాగియున్నట్లుండు పరమాత్మను చూచుట యెట్లనగా - కుశాగ్రబుద్ధి – (దర్భయొక్క చివరి వలె సూదిగా, తీక్ష్ణముగా నుండు బుద్ధి) కలిగియుండి, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగలవారు - సూరులు - చూడగలరని చెప్పబడినది. ప్రతి వస్తువులోను సూక్ష్మాతి సూక్ష్మరూపములో నుండు భగవంతుడు సాధారణముగా అందఱికి కనబడకపోయినా సూక్ష్మ దృష్టిగలిగి, కుశాగ్రబుద్ధిగలవారికి కనబడును. అందఱికి కనబడనంతమాత్రమున భగవంతుడు లేడు అనుకొనుటకు వీలులేదు - అన్నింటిలోను భగవంతుని చూడవలెనన్న యోగాభ్యాసముచేత గాని, భక్తిచేత గాని సూక్ష్మదృష్టి సంపాదించవలెను. ప్రహ్లాదుడు భక్తి, సూక్ష్మదృష్టి కలవాడగుటచేతనే అన్నింటిలోను భగవంతుని చూడగలిగెను. ప్రహ్లాదుని తండ్రికి భక్తి గాని, సూక్ష్మదృష్టిగాని లేనందున సూక్ష్మరూపములో అన్నింటిలోనున్న పరమాత్ముని చూడలేకపోయెను. పరమాత్మ స్థూలరూపముతో శ్రీనృసింహావతారములో ఆవిర్భవించినపుడే చూడగలిగెను.
“మ. హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప, శ్రీ
నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల, నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 267)
(sūkṣma vastuvulanu - sūkṣmāti sūkṣma vastuvulanu, cūḍagaligē śakti, jñānamu, buddhi galavāru - aṭlu iṃdriyamulu avyaktamuvaṟaku gala okadānikaṃṭe okaṭi sūkṣmataramaina vastuvulanu cūḍagala śakti galavāru).
manasaśca parā buddhiḥ, buddhērātmā mahān paraḥ |
mahataḥ paramavyaktaṃ |
avyaktāt puruṣaḥ paraḥ |
puruṣānna paraṃ kiṃcit sā kāṣṭhā sā parāgatiḥ ||
ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmāna pra prakāśatē ||
dṛśyatē tvagryayā buddhyā sūkṣmayā sūkṣmadarśibhiḥ ||. (kaṭhōpaniṣat)
(iṃdriyamulakanna arthamulu (tanmātralu) paramulu, utkṛṣṭamainavi, goppavi, śaktivaṃtamulainavi - sūkṣmamulu. arthamulakaṃṭe manassu utkṛṣṭamainadi - sūkṣmamu - ī prakāramu manassu kanna buddhi, buddhikanna mahattattvamu, mahattattvamukanna avyaktamu, (pradhānamu, prakṛti), avyaktamukanna puruṣuḍu (paramātma) utkṛṣṭamainavāḍu - puruṣunikaṃṭe - paramātma kaṃṭe - utkṛṣṭamainadi maṟilēdu - puruṣuḍē parabrahma, parākāṣṭa (anniṃṭikaṃṭe utkṛṣṭamainadi - adiye parāgati - paramagati - mōkṣamu - gamyasthānamu - ī prakāramu okadānikaṃṭe okaṭi paramamainadi - utkṛṣṭamainadi - sūkṣmamainadi ani ceppabaḍinadi - sūkṣmamainakoladi heccugā śakti vaṃtamainadi).
(paina ceppina prakāramu sthūla vastuvulakaṃṭe sūkṣmavastuvulu, vāṭikaṃṭe sūkṣmamainavi, iṃkā sūkṣmamainavi - anniṃṭikaṃṭe sūkṣmamainadi bhagavaṃtuḍu ani ceppuṭacēta bhagavaṃtuḍu - paramātma, puruṣuḍu - vaṟaku ceppabaḍina yī sūkṣmavastuvulanniṃṭini - bhagavaṃtuni vaṟaku cūcuṭaku tagina śakti sāmarthyamulu galavāru sūkṣmadarśinulu).
“iṃdriyēbhyaḥ parāhyardhāḥ ityādi prakārēṇa sūkṣmatā pāraṃparya darśanēna paraṃ sūkṣmaṃ draṣṭuṃ śīlaṃ yēṣāṃtē sūkṣmadarśinaḥ - paṃḍitāḥ” (śrīśaṃkaraḥ)
(iṃdriyamulakaṃṭe arthamulu utkṛṣṭamainavi ani okadānikaṃṭe okaṭi sūkṣmamainadi, utmṛṣṭamainadi, vyāpakamu ani ceppuṭacēta anniṃṭikaṃṭe sūkṣmamu, vyāpakamu ayina parabrahmanu cūḍagaluguvāru sūkṣmadarśinulu).
“ka. iṃdugalaḍaṃdu lēḍani
saṃdēhamu valadu, cakri sarvōpagatuṃ
ḍeṃdeṃdu vetaki cūcina
naṃdaṃdē galaḍu, dānavagraṇi viṃṭē”
ani prahlāduḍu taṃḍritō ceppenu - idi siddhāṃta vacanamu - mana dṛṣṭiki kanabaḍakuṃḍā, lōna ḍāgiyunnaṭluṃḍu paramātmanu cūcuṭa yeṭlanagā - kuśāgrabuddhi – (darbhayokka civari vale sūdigā, tīkṣṇamugā nuṃḍu buddhi) kaligiyuṃḍi, sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagalavāru - sūrulu - cūḍagalarani ceppabaḍinadi. prati vastuvulōnu sūkṣmāti sūkṣmarūpamulō nuṃḍu bhagavaṃtuḍu sādhāraṇamugā aṃdaṟiki kanabaḍakapōyinā sūkṣma dṛṣṭigaligi, kuśāgrabuddhigalavāriki kanabaḍunu. aṃdaṟiki kanabaḍanaṃtamātramuna bhagavaṃtuḍu lēḍu anukonuṭaku vīlulēdu - anniṃṭilōnu bhagavaṃtuni cūḍavalenanna yōgābhyāsamucēta gāni, bhakticēta gāni sūkṣmadṛṣṭi saṃpādiṃcavalenu. prahlāduḍu bhakti, sūkṣmadṛṣṭi kalavāḍaguṭacētanē anniṃṭilōnu bhagavaṃtuni cūḍagaligenu. prahlāduni taṃḍriki bhakti gāni, sūkṣmadṛṣṭigāni lēnaṃduna sūkṣmarūpamulō anniṃṭilōnunna paramātmuni cūḍalēkapōyenu. paramātma sthūlarūpamutō śrīnṛsiṃhāvatāramulō āvirbhaviṃcinapuḍē cūḍagaligenu.
“ma. hari sarvākṛtulaṃ galaṃḍanucu brahlāduṃḍu bhāṣiṃpa sa
tvaruḍai yeṃdunu lēḍu lēḍani sutun daityuṃḍu tarjiṃpa, śrī
narasiṃhākṛtinuṃḍe nacyutuḍu nānā jaṃgamasthāvarō
tkara garbhaṃbula, nanni dēśamula nuddaṃḍa prabhāvaṃbunan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 267)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.