← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూక్ష్మ దర్శి sūkṣma darśi

Original — తెలుగు
  1. సామాన్యముగ ఎవరికిని కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన వస్తువులను చూడగల శక్తి గలవాడు.

  2. “ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |

దృశ్యతే త్వగ్ర్య యా బుద్ధ్యా సూక్ష్మ యా సూక్ష్మ దర్శిభిః –”

(పరమాత్మ సమస్త భూతములందు గూఢముగా నున్నాడు - సాధారణముగా కంటికి కనబడని సూక్ష్మరూపముతో నున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మమగు వస్తువులను యోగదృష్టిచే చూచెడి శక్తి గలవారిచే వారి కుశాగ్రబుద్ధిచేతను ఈ పరమాత్మ చూడబడుచున్నాడు - శ్రీమహావిష్ణువు అన్ని వస్తువులలోను, అన్ని ప్రదేశములందును సూక్ష్మరూపమైన నరసింహరూపముతో నున్నపుడు ప్రహ్లాదుడు చూడగలిగెను - కాని ఆ సూక్ష్మరూపములోనున్న శ్రీనరసింహమూర్తిని హిరణ్యకశిపుడు చూడలేక స్తంబములోనుండి స్తూలరూపములో నరసింహరూపముగా ఆవిర్భవించినపుడే చూడ గలిగెను - ప్రహ్లాదుడు సూక్ష్మాతిసూక్ష్మ వసువులను చూడగలుగు శక్తి గలవాడు, మహాభక్తుడు - అందుచేత సూక్ష్మరూపములోనున్న భగవంతుని చూడకలిగెను - అతని తండ్రికి ఆ శక్తి లేదు).

సూక్ష్మపంచభూతములు = ఈశ్వరేచ్ఛావశాత్ మాయా తమోగుణ ప్రథానా భవతి తాదృశతమోగణ ప్రథానమాయా సకాశాత్ ఆకాశ వాయు తేజో జల పృధివ్యాత్మక పంచభూతాని ఉత్పద్యంతే. తేషు భూతేషు క్రమేణ శబ్ద స్పర్శరూపరసగందాభ్య గుణాః వర్తంతే - మాయా యాః సకాశాత్ శబ్దసహితాకాశః ఉత్పన్నః, ఆకాశాద్వాయుః వాయోః ఆకాశ కార్యత్వాత్ కారణ గుణేన శబ్దేన స్వాసాధారణ గుణస్పర్శేన చ ద్విగుణో వాయుః. వాయోరగ్నిః సంభూతః. కారణాకాశ వాయు గుణాభ్యాం శబ్ద స్పర్శాభ్యాం స్వాసాధారణ గుణేన త్రిగుణో అగ్నిః, అగ్నేరాపః సంభూతాః. కారణాకాశ వాయ్వగ్ని గుణైః శబ్ద స్పర్శ రూపైః స్వసాధారణ గుణేన చ చతుర్గుణాః ఆపః అద్భ్యః పృధివీ సంభూతా. కారణాకాశ వాయ్వగ్న్య బ్గుణై శబ్దస్పర్శరూపరసైః స్వాసాధారణ గంధ గుణేన చ పంచ గుణాపృధివీ. ఆకాశే ప్రతిధ్వనిరూప శబ్దో వర్తతే. వాయౌ చీ సీత శబ్దః శీతోష్ణ కఠినానాం విలక్షణ స్పర్శశ్చ వర్తతే. అగ్నౌ భుగ్ భుగ్ శబ్దః ఉష్ణ స్పర్శః ప్రకాశాఖ్య రూపం చ వర్తతే - జలే చిలిచిలి శబ్దః, శీతస్పర్సః, శుక్లరూపం మధుర రసశ్చ వర్తతే. లవణ తిక్తతాది రసాస్తు పృధివీ సంబంధా దేవ జలే విభాంతి. మాధుర్యమేవ స్వాభావికరసో జలస్య. సచ హరీ తస్యామలకాది భక్షణ సంస్కృత రసనయా జలపానే అభివ్యజ్యతే. పృధివ్యాం కటకటా శబ్దః అనుష్ణా శీతస్పర్శః, శుక్ల కేష్ణ పీత రక్త హరితాది రూపం, మధురామ్ల లవణ కటు కషాయ తిక్తాఖ్య షడ్రసాః, సుగంధ దుర్గంధ రూప ద్వివిధ గంధశ్చ వర్తతే. ఇత్థం ఆకాశే ఏకో గుణః, వాయౌ ద్వౌ, అగ్నౌ త్రయః, జలే చత్వారః, పృధివ్యాం పంచగుణాః - తత్రాపి ప్రతిభూతం ప్రాతిస్విక గుణస్తు ఏక ఏవ, తదితర గుణాః కారణాత్ అనుగతాః.

(భగవంతుని ఇచ్ఛాప్రకారము (“స అకామయత”) మాయ (ప్రకృతి) తమోగుణము ప్రధానముగా గలది ఆయెను - తమో గుణము ప్రధానముగా గల ఆ మాయనుండి (ప్రకృతినుండి) ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి యను పంచభూతములు పుట్టుచున్నవి. ఆ పంచభూతములందు వరుసగా శబ్దము, స్పర్శము, రూపము, రసము గంధము అను పేర్లుగల గుణములున్నవి. మాయనుండి శబ్దముతో కూడిన (శబ్దము అను గుణముతో కూడిన) ఆకాశము పుట్టెను- ఆకాశమునుండి వాయువు పుట్టెను - వాయువు ఆకాశము యొక్క కార్యమగుటవలన ఆ కారణవస్తువు యొక్క గుణమైన శబ్దముతో పాటు, తన యొక్క అసాధారణగుణమైన స్పర్శతో రెండు గుణములు (శబ్దము, స్పర్శము) కలది ఆయెను - వాయువు వలన అగ్ని కలిగెను. అగ్నికి కారణములైన అకాశము వాయువులయొక్క - గుణములైన శబ్ద స్పర్శలతో పాటు తన అసాధారణగుణమైన రూపముతో కలిసి మూడు గుణములు కలది ఆయెను. అగ్ని నుండి జలము కలిగెను - జలము దానికి కారణములైన ఆకాశము వాయువు అగ్ని అను మూడింటి గుణములైన శబ్ద స్పర్శ రూపములతో కలిసి తన అసాధారణ గుణమైన రసముతో కలిసి నాలుగు గుణములు కలది ఆయెను - జలమునుండి భూమి పుట్టెను - తనకు కారణములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలముల గుణములైన శబ్ద స్పర్శ రూప రసములతో కలిసి తన అసాధారణగుణమైన గంధముతో కలిసి అయిదు గుణములు కలది ఆయెను - ఆకాశమందు ప్రతిధ్వని రూపమైన శబ్దమున్నది. వాయువు నందు చీశీత శబ్దము శీతోష్ణ కఠినముల విలక్షణమైన స్పర్శ ఉన్నది. అగ్ని యందు భుగ భుగమను శబ్దము, ఉష్ణము (వేడిమి), స్పర్శము, ప్రకాశించుట అను రూపములు కలవు. జలమందు చిలి చిలి శబ్దము, చల్లగా తగులుట, తెల్లని రూపము, తియ్యని రసము కలవు. జలమందు ఉప్పు, చేదు మొదలగు రసములు జలమునకు పృధివితో సంబంధము కలుగుట వలననే కలుగుచున్నవి. మధురముగా (తియ్యగా) నుండుటయే జలము యొక్క స్వాభావికరసము - అది ఉసిరికవాటితో కలిసి త్రాగినపుడు ఆ యారు రుచులుగలదిగా నగును - పృధివిలో కట కట శబ్దము కలదు, వేడిమి, చల్లదనము లేని స్పర్శగుణము, శుక్ల (తెల్లని), నల్లని, ఎర్రని, పచ్చని మొదలగు రూపముగలది. తీపు, ఉప్పు, పులుపు, చేదు, కారము, వగరు అను ఆరు రసములు కలది, సుగంధము, దుర్గంధము అను రెండు విధములైన గంధములు గలది. ఈ విధముగా ఆకాశమునందు ఒకే గుణము, వాయువునందు రెండుగుణములు, అగ్నియందు మూడు గుణములు, జలమునందు నాలుగు గుణములు, పృధివియందు అయిదు గుణములు ఉన్నవి. అయినను ప్రతి భూతముయొక్క స్వాభావిక గుణమొక్కటే. దానిలోని యితర గుణములు దాని కారణవస్తువులవలన దానికి వచ్చి చేరినందున కలిగినవి)

  1. “రజసత్వంబులచే నుపబృమ్హితంబై వికారంబునొందిన మహత్తత్త్వంబువలనం దమః ప్రథానంబై దివ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్య శక్తి అయిన రాజసంబును గ్రియా శక్తి యైన తామసంబును జ్ఞాన శక్తి అయిన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబువలన నభంబు గకిగె. నభంబునకు సూక్ష్మ రూపంబు భూత దృశ్యంబునకు బోధికంబైన శబ్దంబు గుణంబగు - నిభంబువలన వాయువు గలిగె - వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండు - అది దేహంబులందుండుటం జేసి ప్రాణరూపంబై ఇంద్రియమనిశ్సరీరపాటవంబైన యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు - వాయువు వలన రూప స్పర్శ శబ్దంబులనియెడు గుణంబులు మూడింటితోడ దేజంబు గలిగె. తేజంబువలన రసరూప స్పర్శ శబ్దంబులనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు కలిగె. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబులనియెడి గుణంబు లయిదింటితోడ బృధివి గలిగె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

  1. “తామసాహంకారంబువలన శబ్ద సర్శ రూప రస గంధంబు లుదయించె. అందు శబ్దంబు నిజగుణంబైన శబ్దంబువలన నాకాశంబు బుట్టించె, గగనంబు గాల మాయాన్శ యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శ తన్మాత్రంబువలన వాయువుం గలిగించె. బవనుండు నభోబలంబున రూప తన్మాత్రంబువలన లోక లోచనంబైన తేజంబు నుత్పాదించె. తేజంబు గాక మాయాంశ యోగంబున, నుత్తమ శ్లోకుని విలోకనంబున బవమాన యుక్తంబగుచు రసతన్మాత్రంబువలన నంబువులం బుట్టించె. సలిలంబు గాల మయాంశ యోగంబునం పరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజో యుక్తంబైన గంధ గుణంబు వలనం బృధివి గలిగించె. అందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజంబునకు శబ్ద సర్శ రూపంబులును, సలిలంబునకు శబ్ద స్పర్శ రూప రసంబులును బృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధంబులును గుణంబులై యుండు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)

  2. “భగవద్భక్తి ప్రేరితంబయిన తమసాహంకారంబువలన శబ్దతన్మాత్రంబు పుట్టె - దానివలన నాకాశంబును, నాకాశంబువలన శ్రోత్రేంద్రియంబును బుట్టె. శ్రోత్రంబు శబ్ద గ్రాహి యయ్యె. శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞాన జనకంబయ్యె. మఱియు శబ్ద తన్మాత్రంబువలన నాకాశంబయి యాయాకాశంబు భూతంబులకు భూతాభ్యంతరంబుల నవకాశంబిచ్చుటయు, నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయంబగుటయు నను లక్షణంబులు గలిగియుండు కాలగతిచే వికారంబునొందు శబ్ద తన్మాత్రంబు లక్షణంబగు నభంబువలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును, వాయువుచే స్పర్శగ్రాహియై త్వగింద్రియంబును బుట్టె. మృదుత్వంబును, కఠినత్వంబును శైత్యంబును నుష్ణత్వంబును నను నివి స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పంబడు - మఱియు, వాయువునకు జాలనంబును పరస్పర విభాక కరణంబును, దన్మేళనంబును, ద్రవ్య శబ్ద నేతృత్వంబు నగు - అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబు నొందించుట ద్రవ్య నేతృత్వంబు. దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యమగునట్లొనరించుట శబ్ద నేతృత్వంబు, సర్వేంద్రియాత్మకత్వంబు ననునవి లక్షణంబులై యుండు - దైవ ప్రేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు నవి లక్షణంబులై యుండు - దైవ పేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును, దానివలన దేజంబును కుట్టె. రూపంబు నేత్రేంద్రియ గాహకంబయ్యె. నేత్రగతంబయిన రూపంబునకు నుపలంభ కత్వంబును ద్రవ్యాకార సమత్వంబును, ద్రవ్యంబునకు నుపసర్జనంబగుటయు ద్రవ్య పరిణామ ప్రతీతియు నివి రూప వృత్తులనంబడు. తైజసంబునకు సాధారణంబులగు ధర్మంబులు ద్యోతంబనం బ్రకాశంబు, పచనంబన దిండులాదుల పాకంబు, పిపాసా నిమిత్తంబైన పానంబు, క్షున్నిమిత్తకంబైన యోదనంబు హిమమర్దనంబగు శోషణంబు (ఆర్చుట) నను నివి వృత్తులై యుండు. రూపతన్మాత్రంబువలన దైవ చోదితంబై వికారంబు నొందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె. రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె - జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యె. ఆ రసంబేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయ, తిక్త, కట్వామ్ల మధురాది బేదంబుల ననేక విధంబయ్యె. వెండియు సాంసరిక ద్రవ్య వికారంబునం జేసి యార్ద్రంబగుటయు, ముద్ద గట్టుటయు తృప్తి దాతృత్వంబును, జీవనంబును, దిన్యై క్లబ్య నివర్తనంబును, మృదూకరణంబును, దాప నివారణంబును, గూపగతంబైన కలంబు దివియ మఱిఉయు నుద్గమించుటయును నను నివి జలవృత్తులనంబడు. రసతన్మాత్రంబు వలన దైవ చోదితంబై వికారంబునం బొందిన జలంబు వలన గంధ తన్మాత్రంబు పుట్టె. దానివలనం బృధ్వియు గలిగె. ఘ్రాణంబు గంధగ్రాహకంబయ్యె. అందు గంధం బేకంబయ్యు వ్యంజనాది గతంబయి హింగ్వాది నిమిత్తంబయిన మిశ్ర గంధంబను కరంభంబును, గృంజనాది గతంబయిన పూతి గంధంబును, ఘనసారాది నిమిత్తంబైన సుగంధంబును, శతపత్రాది గతంబగు శాంతి గంధంబును, లశునాది (వెల్లుల్లి) గతంబైన యుగ్ర గంధంబును, బర్యుషిత చిత్రాన్నాది గతంబయిన యామ్మగంధంబును ద్రవ్యాయువ వైషమ్యంబునం జేసి యనేక విధంబై యుణ్డు. అదియునుం గాక ప్రతిమాది రూపంబులం జేసి సాకారతా పాదనంబగు భావంబును జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షంబయిన స్థితియును జాలాధ్యాధారత యను ధారణంబును, నాకాశాద్యవచ్ఛేదకంబును, సకల ప్రాణి పుంస్త్వ భి వ్యక్త కరణంబును, ననునివి పృధ్వీ వృత్తులనంబడు - - - నభో(అ)సాధారణ గుణ శబ్ద విశేష గ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వసాధారణ గుణ విశేష గ్రాహకంబు స్పర్శంబును, దేజో (అ)సాధారణ గుణ విశేషగ్రాహకంబు చక్షురాంద్రియంబును నభో(అ)సాధారణ గుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్య సాధారణ గుణగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు, శబ్దాది కార్యంబులగు వాయువ్యాదులందు గారణా స్వయంబున నిన్నింటికిం బృధ్వీ సంబంధంబు గలుగుటం జేసి భూమి యందు శబ్ద స్పర్శ రూప రసగంధంబులు గలుగుట - - - ||”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)

  1. భూత తన్మాత్రంబులు - శబ్ద స్పర్శ రూప రస గంధములు - (తత్ + మాత్రం = తన్మాత్రం) - అవి అంతమాత్రమే అయినవి. అనగా పంచభూతములు సూక్ష్మరూపములో నుండి వేటికి అవి వేరు వేరుగా నున్నప్పటి స్థితి - ఒకదానితో ఒకటి కలియక నుండు స్థితి - పంచీకరణముకాని స్థితిలోనున్నవి.
Transliteration
  1. sāmānyamuga evarikini kaṃṭiki kanabaḍani sūkṣmātisūkṣmamaina vastuvulanu cūḍagala śakti galavāḍu.

  2. “ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmā na prakāśatē |

dṛśyatē tvagrya yā buddhyā sūkṣma yā sūkṣma darśibhiḥ –”

(paramātma samasta bhūtamulaṃdu gūḍhamugā nunnāḍu - sādhāraṇamugā kaṃṭiki kanabaḍani sūkṣmarūpamutō nunnāḍu. sūkṣmāti sūkṣmamagu vastuvulanu yōgadṛṣṭicē cūceḍi śakti galavāricē vāri kuśāgrabuddhicētanu ī paramātma cūḍabaḍucunnāḍu - śrīmahāviṣṇuvu anni vastuvulalōnu, anni pradēśamulaṃdunu sūkṣmarūpamaina narasiṃharūpamutō nunnapuḍu prahlāduḍu cūḍagaligenu - kāni ā sūkṣmarūpamulōnunna śrīnarasiṃhamūrtini hiraṇyakaśipuḍu cūḍalēka staṃbamulōnuṃḍi stūlarūpamulō narasiṃharūpamugā āvirbhaviṃcinapuḍē cūḍa galigenu - prahlāduḍu sūkṣmātisūkṣma vasuvulanu cūḍagalugu śakti galavāḍu, mahābhaktuḍu - aṃducēta sūkṣmarūpamulōnunna bhagavaṃtuni cūḍakaligenu - atani taṃḍriki ā śakti lēdu).

sūkṣmapaṃcabhūtamulu = īśvarēcchāvaśāt māyā tamōguṇa prathānā bhavati tādṛśatamōgaṇa prathānamāyā sakāśāt ākāśa vāyu tējō jala pṛdhivyātmaka paṃcabhūtāni utpadyaṃtē. tēṣu bhūtēṣu kramēṇa śabda sparśarūparasagaṃdābhya guṇāḥ vartaṃtē - māyā yāḥ sakāśāt śabdasahitākāśaḥ utpannaḥ, ākāśādvāyuḥ vāyōḥ ākāśa kāryatvāt kāraṇa guṇēna śabdēna svāsādhāraṇa guṇasparśēna ca dviguṇō vāyuḥ. vāyōragniḥ saṃbhūtaḥ. kāraṇākāśa vāyu guṇābhyāṃ śabda sparśābhyāṃ svāsādhāraṇa guṇēna triguṇō agniḥ, agnērāpaḥ saṃbhūtāḥ. kāraṇākāśa vāyvagni guṇaiḥ śabda sparśa rūpaiḥ svasādhāraṇa guṇēna ca caturguṇāḥ āpaḥ adbhyaḥ pṛdhivī saṃbhūtā. kāraṇākāśa vāyvagnya bguṇai śabdasparśarūparasaiḥ svāsādhāraṇa gaṃdha guṇēna ca paṃca guṇāpṛdhivī. ākāśē pratidhvanirūpa śabdō vartatē. vāyau cī sīta śabdaḥ śītōṣṇa kaṭhinānāṃ vilakṣaṇa sparśaśca vartatē. agnau bhug bhug śabdaḥ uṣṇa sparśaḥ prakāśākhya rūpaṃ ca vartatē - jalē cilicili śabdaḥ, śītasparsaḥ, śuklarūpaṃ madhura rasaśca vartatē. lavaṇa tiktatādi rasāstu pṛdhivī saṃbaṃdhā dēva jalē vibhāṃti. mādhuryamēva svābhāvikarasō jalasya. saca harī tasyāmalakādi bhakṣaṇa saṃskṛta rasanayā jalapānē abhivyajyatē. pṛdhivyāṃ kaṭakaṭā śabdaḥ anuṣṇā śītasparśaḥ, śukla kēṣṇa pīta rakta haritādi rūpaṃ, madhurāmla lavaṇa kaṭu kaṣāya tiktākhya ṣaḍrasāḥ, sugaṃdha durgaṃdha rūpa dvividha gaṃdhaśca vartatē. itthaṃ ākāśē ēkō guṇaḥ, vāyau dvau, agnau trayaḥ, jalē catvāraḥ, pṛdhivyāṃ paṃcaguṇāḥ - tatrāpi pratibhūtaṃ prātisvika guṇastu ēka ēva, taditara guṇāḥ kāraṇāt anugatāḥ.

(bhagavaṃtuni icchāprakāramu (“sa akāmayata”) māya (prakṛti) tamōguṇamu pradhānamugā galadi āyenu - tamō guṇamu pradhānamugā gala ā māyanuṃḍi (prakṛtinuṃḍi) ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi yanu paṃcabhūtamulu puṭṭucunnavi. ā paṃcabhūtamulaṃdu varusagā śabdamu, sparśamu, rūpamu, rasamu gaṃdhamu anu pērlugala guṇamulunnavi. māyanuṃḍi śabdamutō kūḍina (śabdamu anu guṇamutō kūḍina) ākāśamu puṭṭenu- ākāśamunuṃḍi vāyuvu puṭṭenu - vāyuvu ākāśamu yokka kāryamaguṭavalana ā kāraṇavastuvu yokka guṇamaina śabdamutō pāṭu, tana yokka asādhāraṇaguṇamaina sparśatō reṃḍu guṇamulu (śabdamu, sparśamu) kaladi āyenu - vāyuvu valana agni kaligenu. agniki kāraṇamulaina akāśamu vāyuvulayokka - guṇamulaina śabda sparśalatō pāṭu tana asādhāraṇaguṇamaina rūpamutō kalisi mūḍu guṇamulu kaladi āyenu. agni nuṃḍi jalamu kaligenu - jalamu dāniki kāraṇamulaina ākāśamu vāyuvu agni anu mūḍiṃṭi guṇamulaina śabda sparśa rūpamulatō kalisi tana asādhāraṇa guṇamaina rasamutō kalisi nālugu guṇamulu kaladi āyenu - jalamunuṃḍi bhūmi puṭṭenu - tanaku kāraṇamulaina ākāśamu, vāyuvu, agni, jalamula guṇamulaina śabda sparśa rūpa rasamulatō kalisi tana asādhāraṇaguṇamaina gaṃdhamutō kalisi ayidu guṇamulu kaladi āyenu - ākāśamaṃdu pratidhvani rūpamaina śabdamunnadi. vāyuvu naṃdu cīśīta śabdamu śītōṣṇa kaṭhinamula vilakṣaṇamaina sparśa unnadi. agni yaṃdu bhuga bhugamanu śabdamu, uṣṇamu (vēḍimi), sparśamu, prakāśiṃcuṭa anu rūpamulu kalavu. jalamaṃdu cili cili śabdamu, callagā taguluṭa, tellani rūpamu, tiyyani rasamu kalavu. jalamaṃdu uppu, cēdu modalagu rasamulu jalamunaku pṛdhivitō saṃbaṃdhamu kaluguṭa valananē kalugucunnavi. madhuramugā (tiyyagā) nuṃḍuṭayē jalamu yokka svābhāvikarasamu - adi usirikavāṭitō kalisi trāginapuḍu ā yāru ruculugaladigā nagunu - pṛdhivilō kaṭa kaṭa śabdamu kaladu, vēḍimi, calladanamu lēni sparśaguṇamu, śukla (tellani), nallani, errani, paccani modalagu rūpamugaladi. tīpu, uppu, pulupu, cēdu, kāramu, vagaru anu āru rasamulu kaladi, sugaṃdhamu, durgaṃdhamu anu reṃḍu vidhamulaina gaṃdhamulu galadi. ī vidhamugā ākāśamunaṃdu okē guṇamu, vāyuvunaṃdu reṃḍuguṇamulu, agniyaṃdu mūḍu guṇamulu, jalamunaṃdu nālugu guṇamulu, pṛdhiviyaṃdu ayidu guṇamulu unnavi. ayinanu prati bhūtamuyokka svābhāvika guṇamokkaṭē. dānilōni yitara guṇamulu dāni kāraṇavastuvulavalana dāniki vacci cērinaṃduna kaliginavi)

  1. “rajasatvaṃbulacē nupabṛmhitaṃbai vikāraṃbunoṃdina mahattattvaṃbuvalanaṃ damaḥ prathānaṃbai divyajñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbu galige. adiyu rūpāṃtaraṃbu loṃducu dravya śakti ayina rājasaṃbunu griyā śakti yaina tāmasaṃbunu jñāna śakti ayina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye. aṃdu bhūtādiyaina tāmasāhaṃkāraṃbuvalana nabhaṃbu gakige. nabhaṃbunaku sūkṣma rūpaṃbu bhūta dṛśyaṃbunaku bōdhikaṃbaina śabdaṃbu guṇaṃbagu - nibhaṃbuvalana vāyuvu galige - vāyuvunakuṃ barānvayaṃbuna śabdaṃbu sparśaṃbu nanu reṃḍu guṇaṃbulu galigi yuṃḍu - adi dēhaṃbulaṃduṃḍuṭaṃ jēsi prāṇarūpaṃbai iṃdriyamaniśsarīrapāṭavaṃbaina yōjassahōbalaṃbulaku hētuvai vartiṃcu - vāyuvu valana rūpa sparśa śabdaṃbulaniyeḍu guṇaṃbulu mūḍiṃṭitōḍa dējaṃbu galige. tējaṃbuvalana rasarūpa sparśa śabdaṃbulaniyeḍu nālugu guṇaṃbulatōḍa jalaṃbu kalige. jalaṃbu valana gaṃdha rasa rūpa sparśa śabdaṃbulaniyeḍi guṇaṃbu layidiṃṭitōḍa bṛdhivi galige”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

  1. “tāmasāhaṃkāraṃbuvalana śabda sarśa rūpa rasa gaṃdhaṃbu ludayiṃce. aṃdu śabdaṃbu nijaguṇaṃbaina śabdaṃbuvalana nākāśaṃbu buṭṭiṃce, gaganaṃbu gāla māyānśa yōgaṃbunaṃ buṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna sparśa tanmātraṃbuvalana vāyuvuṃ galigiṃce. bavanuṃḍu nabhōbalaṃbuna rūpa tanmātraṃbuvalana lōka lōcanaṃbaina tējaṃbu nutpādiṃce. tējaṃbu gāka māyāṃśa yōgaṃbuna, nuttama ślōkuni vilōkanaṃbuna bavamāna yuktaṃbagucu rasatanmātraṃbuvalana naṃbuvulaṃ buṭṭiṃce. salilaṃbu gāla mayāṃśa yōgaṃbunaṃ paramēśvarānugrahaṃbu galigi tējō yuktaṃbaina gaṃdha guṇaṃbu valanaṃ bṛdhivi galigiṃce. aṃdu gaganaṃbunaku śabdaṃbunu, vāyuvunaku śabda sparśaṃbulunu, dējaṃbunaku śabda sarśa rūpaṃbulunu, salilaṃbunaku śabda sparśa rūpa rasaṃbulunu bṛdhiviki śabda sparśa rūpa rasa gaṃdhaṃbulunu guṇaṃbulai yuṃḍu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)

  2. “bhagavadbhakti prēritaṃbayina tamasāhaṃkāraṃbuvalana śabdatanmātraṃbu puṭṭe - dānivalana nākāśaṃbunu, nākāśaṃbuvalana śrōtrēṃdriyaṃbunu buṭṭe. śrōtraṃbu śabda grāhi yayye. śabdaṃ barthaṃbunaku nāśrayaṃbai śrōtaku jñāna janakaṃbayye. maṟiyu śabda tanmātraṃbuvalana nākāśaṃbayi yāyākāśaṃbu bhūtaṃbulaku bhūtābhyaṃtaraṃbula navakāśaṃbiccuṭayu, nātma prāṇēṃdriyādulaku nāśrayaṃbaguṭayu nanu lakṣaṇaṃbulu galigiyuṃḍu kālagaticē vikāraṃbunoṃdu śabda tanmātraṃbu lakṣaṇaṃbagu nabhaṃbuvalana sparśaṃbunu, sparśaṃbuvalana vāyuvunu, vāyuvucē sparśagrāhiyai tvagiṃdriyaṃbunu buṭṭe. mṛdutvaṃbunu, kaṭhinatvaṃbunu śaityaṃbunu nuṣṇatvaṃbunu nanu nivi sparśaṃbunaku sparśatvaṃbani ceppaṃbaḍu - maṟiyu, vāyuvunaku jālanaṃbunu paraspara vibhāka karaṇaṃbunu, danmēḷanaṃbunu, dravya śabda nētṛtvaṃbu nagu - aṃdu gaṃdhavaṃtaṃbagu dravyaṃbunu ghrāṇēṃdriyaṃbu noṃdiṃcuṭa dravya nētṛtvaṃbu. dūrasthaṃbagu śabdaṃbunu śrōtrēṃdriya grāhyamagunaṭlonariṃcuṭa śabda nētṛtvaṃbu, sarvēṃdriyātmakatvaṃbu nanunavi lakṣaṇaṃbulai yuṃḍu - daiva prēritaṃbai sparśatanmātra guṇakaṃbagu navi lakṣaṇaṃbulai yuṃḍu - daiva pēritaṃbai sparśatanmātra guṇakaṃbagu vāyuvu valana rūpaṃbunu, dānivalana dējaṃbunu kuṭṭe. rūpaṃbu nētrēṃdriya gāhakaṃbayye. nētragataṃbayina rūpaṃbunaku nupalaṃbha katvaṃbunu dravyākāra samatvaṃbunu, dravyaṃbunaku nupasarjanaṃbaguṭayu dravya pariṇāma pratītiyu nivi rūpa vṛttulanaṃbaḍu. taijasaṃbunaku sādhāraṇaṃbulagu dharmaṃbulu dyōtaṃbanaṃ brakāśaṃbu, pacanaṃbana diṃḍulādula pākaṃbu, pipāsā nimittaṃbaina pānaṃbu, kṣunnimittakaṃbaina yōdanaṃbu himamardanaṃbagu śōṣaṇaṃbu (ārcuṭa) nanu nivi vṛttulai yuṃḍu. rūpatanmātraṃbuvalana daiva cōditaṃbai vikāraṃbu noṃdu tējassu valana rasatanmātraṃbu puṭṭe. rasatanmātraṃbuvalana jalaṃbu puṭṭe - jihva yanu rasanēṃdriyaṃbu rasagrāhakaṃbayye. ā rasaṃbēkaṃbai yuṃḍiyu bhūtavikāraṃbunaṃ jēsi kaṣāya, tikta, kaṭvāmla madhurādi bēdaṃbula nanēka vidhaṃbayye. veṃḍiyu sāṃsarika dravya vikāraṃbunaṃ jēsi yārdraṃbaguṭayu, mudda gaṭṭuṭayu tṛpti dātṛtvaṃbunu, jīvanaṃbunu, dinyai klabya nivartanaṃbunu, mṛdūkaraṇaṃbunu, dāpa nivāraṇaṃbunu, gūpagataṃbaina kalaṃbu diviya maṟiuyu nudgamiṃcuṭayunu nanu nivi jalavṛttulanaṃbaḍu. rasatanmātraṃbu valana daiva cōditaṃbai vikāraṃbunaṃ boṃdina jalaṃbu valana gaṃdha tanmātraṃbu puṭṭe. dānivalanaṃ bṛdhviyu galige. ghrāṇaṃbu gaṃdhagrāhakaṃbayye. aṃdu gaṃdhaṃ bēkaṃbayyu vyaṃjanādi gataṃbayi hiṃgvādi nimittaṃbayina miśra gaṃdhaṃbanu karaṃbhaṃbunu, gṛṃjanādi gataṃbayina pūti gaṃdhaṃbunu, ghanasārādi nimittaṃbaina sugaṃdhaṃbunu, śatapatrādi gataṃbagu śāṃti gaṃdhaṃbunu, laśunādi (vellulli) gataṃbaina yugra gaṃdhaṃbunu, baryuṣita citrānnādi gataṃbayina yāmmagaṃdhaṃbunu dravyāyuva vaiṣamyaṃbunaṃ jēsi yanēka vidhaṃbai yuṇḍu. adiyunuṃ gāka pratimādi rūpaṃbulaṃ jēsi sākāratā pādanaṃbagu bhāvaṃbunu jalādi vilakṣaṇa trayāṃtara nirapēkṣaṃbayina sthitiyunu jālādhyādhārata yanu dhāraṇaṃbunu, nākāśādyavacchēdakaṃbunu, sakala prāṇi puṃstva bhi vyakta karaṇaṃbunu, nanunivi pṛdhvī vṛttulanaṃbaḍu - - - nabhō(a)sādhāraṇa guṇa śabda viśēṣa grāhakaṃbu śrōtraṃbunu, vāyvasādhāraṇa guṇa viśēṣa grāhakaṃbu sparśaṃbunu, dējō (a)sādhāraṇa guṇa viśēṣagrāhakaṃbu cakṣurāṃdriyaṃbunu nabhō(a)sādhāraṇa guṇa viśēṣagrāhakaṃbu rasanēṃdriyaṃbunu, bhūmya sādhāraṇa guṇagrāhakaṃbu ghrāṇēṃdriyaṃbunu, nākāśādi guṇaṃbulagucu, śabdādi kāryaṃbulagu vāyuvyādulaṃdu gāraṇā svayaṃbuna ninniṃṭikiṃ bṛdhvī saṃbaṃdhaṃbu galuguṭaṃ jēsi bhūmi yaṃdu śabda sparśa rūpa rasagaṃdhaṃbulu galuguṭa - - - ||”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)

  1. bhūta tanmātraṃbulu - śabda sparśa rūpa rasa gaṃdhamulu - (tat + mātraṃ = tanmātraṃ) - avi aṃtamātramē ayinavi. anagā paṃcabhūtamulu sūkṣmarūpamulō nuṃḍi vēṭiki avi vēru vērugā nunnappaṭi sthiti - okadānitō okaṭi kaliyaka nuṃḍu sthiti - paṃcīkaraṇamukāni sthitilōnunnavi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.