← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూక్ష్మ పదం sūkṣma padaṃ

Original — తెలుగు

యత్ సూక్ష్మం హి పదం విరాజితే తత్సూక్ష్మపదం, బ్రహ్మ స్వమాత్రమితి.

(సూక్ష్మమైన గమ్యస్థానము - భగవంతుని స్థానము - “పద్యతే గమ్యతే ఇతి పదం” - భగవంతుని పొందవలసిన స్థానము - జీవులన్నియు ప్రలయకాలమందు చేరలసిన స్థానము. అదియే బ్రహ్మమాత్రము. ప్రకృతితో కలియక భగవంతుడొక్కడే - కేవలము భగవంతుడే - యుండు స్థితి. పరబ్రహ్మ అనినను, పరమపదమనినను ఒక్కటే - వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు –

“క. పరమ బ్రహ్మమనంగా

పరతత్వమనంగ పరమపదమనగను నీ

శ్వరుడన, గృష్ణుడన జగ

ద్భరింతుండు నారాయణుండు దా వెలుగొందున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)

Transliteration

yat sūkṣmaṃ hi padaṃ virājitē tatsūkṣmapadaṃ, brahma svamātramiti.

(sūkṣmamaina gamyasthānamu - bhagavaṃtuni sthānamu - “padyatē gamyatē iti padaṃ” - bhagavaṃtuni poṃdavalasina sthānamu - jīvulanniyu pralayakālamaṃdu cēralasina sthānamu. adiyē brahmamātramu. prakṛtitō kaliyaka bhagavaṃtuḍokkaḍē - kēvalamu bhagavaṃtuḍē - yuṃḍu sthiti. parabrahma aninanu, paramapadamaninanu okkaṭē - vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu –

“ka. parama brahmamanaṃgā

paratatvamanaṃga paramapadamanaganu nī

śvaruḍana, gṛṣṇuḍana jaga

dbhariṃtuṃḍu nārāyaṇuṃḍu dā velugoṃdun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.