ఈ స్థూల రూపంబు కంటె నదృష్ట గుణంబయి యశ్రుతంబయిన వస్తువగుటం జేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి కొండొక రూపంబు వీరచితంబై యుండు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 30)
సూక్ష్మత్వాత్ సూక్ష్మ శరీరం - స్థూల ప్రపంచ లయస్థానం.
(సూక్ష్మముగా - చిన్నదిగా - నుండుటవలన సూక్ష్మ శరీరమని చెప్పబడినది - స్థూల ప్రపంచము ఈ సూక్ష్మ శరీరములో లయమగును).
బుద్ధ్యాద్య విద్యాపి చ కామ కర్మాణి పుర్యష్టకం సూక్ష్మశరీర మాహుః |
ఇదం శరీరం శ్రుణు సూక్ష్మ సంజ్ఞితం లింగత్వ పంచీకృత భూత సంభవం |
సవాసనం కర్మ ఫలాను భావకం స్వాజ్ఞానతో అనాది రూపాధిరాత్మనః ||“. (శ్రీశంకరః - వివేకచూడామణి)
(జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, శబ్దము మొదలగు విషయములు, పంచ ప్రాణములు, బుద్ధి మొదలగునవి, అవిద్య, కామకర్మలు అను ఎనిమిది పురములు గలది సూక్ష్మ శరీరము)
(బ్రహ్మవిద్యా సుధార్ణవము - 6)
శ్లో||. పంచప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం |
అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం ||.
“తత్ర ప్రాణః పంచ, కర్మేంద్రియాణి పంచ, మనః ఏకం, బుద్ధిశ్చ ఏకః ఇతి సప్త దశతత్వాని మలిత్వాలింగం ఇత్యుచ్యతే”.
(పంచీకృతముకాని పంచభూతముల కార్యము, పదిహేడు తత్వములతో కూడినది సూక్ష్మశరీరమని చెప్పబడుచున్నది - పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు కలిసి పదియేడు తత్వములు కలిసి లింగశరీరము, లేక, సూక్ష్మశరీరము అయినది).
(స్థూల శరీరమువలె ప్రత్యక్షప్రమాణము ద్వారా గోచరముకానిది (కనబడనిది) యగుటచేత సూక్ష్మ శరీరమని చెప్పబడుచున్నది).
(కర్మేంద్రియములతో కలిసి మనస్సు, మనోమయకోశము, ప్రాణములు అయిదు కలిసి ప్రాణమయకోశము, జ్ఞానేంద్రియములతో కూడి బుద్ధి విజ్ఞానమయకోశము - ఈ మూడు కోశములు కలది లింగ శరీరము - సూక్ష్మ శరీరము).
“పంచప్రాణ మనో బుద్ధి దశేంద్రియ సమన్వితం |
అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం ||“. (మైత్రేయ శ్రుతిః)
“తచ్చద్విధం - పరమపరం చ; తత్ర పరం హిరణ్యగర్భ లింగశరీరం మహత్తత్త్వం అపరం అస్మదాది లింగశరీరం అహంకారః ఇత్యాఖ్యాయతే”. (వేదాంత పరిభాషా - ధర్మరాజాధ్వరీంద్ర)
“తత్ర బ్రహ్మాండ వ్యాపిత్వాత్ ఆద్యంపరం, దేహమాత్ర వ్యాపిత్వాత్ ద్వితీయ మపరమిత్యాశయం”.
(పూర్వము చెప్పిన ప్రకారము పంచీకృతముకాని పంచభూతములతో కూడిన లింగ శరీరము - సూక్ష్మ శరీరము, పరలోక యాత్ర నిర్వహించునది, మోక్షము కలుగువరకు ఉండునది, మనోబుద్ధులతో కూడినది. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు కలిసి యుండునది - మైత్రేయశ్రుతి ఇట్లే చెప్పుచున్నది -పంచ ప్రాణములు, మనస్సు, బుద్ధి, పది ఇంద్రియములతో కూడినదిన్నీ, పంచీకరణముకాని భూతములవలన కలిగినదిన్నీ అయినది సూక్ష్మశరీరము - ఇది భోగసాధనము).
(చనిపోయి యముని మందిరమునకు పోవును - అని చెప్పబడినది. యముడు అనగా, నివృత్తి. దాని ఆలయము అనగా సూక్ష్మ దేహము - దానిలో జీవుని ఉనికి).
(సుషుప్తి, మూర్చ, మరణము, ప్రలయము, జ్ఞానము అను ఈ పంచ అవస్థలందును లింగదేహము (సూక్ష్మశరీరము) దాని కారణమైన అజ్ఞానమందే లీనమగును. అందుచేత సూక్ష్మశరీరము వ్యభిచారి, మార్పులు గలది, అసద్వస్తువు. ఎల్లకాలమందును ఉండనిది. ఆత్మ అన్నికాలములందుండునది కనుక మార్పులు లేనిది. అందుచేత సద్రూపము - (నిత్యము). ఆత్మ సద్రూపమగుటచేత సూక్ష్మశరీరము కానిది. సూక్ష్మశరీరము ఆత్మకు సంబంధించినది కాదు - సూక్ష్మశరీరము పంచీకృతము కాని పంచమహాభూతముల కార్యము - అందుచేత నేను సూక్ష్మశరీరము కాను. కర్తృత్వము, భోక్తృత్వము, సుఖ దుఃఖములు మొదలగు సూక్ష్మశరీర ధర్మములు నేను కాదు. ఆ ధర్మములు నావికవు. ఆ ధర్మములకు నేను సాక్షిని - వాటికంటె వేరైనవాడను).
ఆకాశాదులైన పంచభూతములయొక్క సాత్వికాంశముల వలన వ్యష్టిగా శ్రోత్ర త్వక్చ క్షు ర్జిహ్వాఘ్రాణములనెడి పంచజ్ఞానేంద్రియములు ఏర్పడుచున్నవి. అయిదు అంశల సమాహారముచేత (సమష్ఠిచేత) అంతఃకరణము ఏర్పడుచున్నది. ఈ అంతఃకరణము మనోబుద్ధి చిత్తాహంకారరూపముల నాల్గు రీతుల నొప్పుచుండును - ఇది సాత్విక సృష్టి యన్నమాట. పంచభూతములయొక్క రాజసగుణాంశలచేత వ్యష్టిగా వాక్పాణి పాదోపస్థ పాయువు లేర్పడుచున్నవి. ఈ పంచ రజోంశముల సమష్టిగా దేహములోని ప్రాణాపానాది పంచకమేర్పడుచున్నది. ఇది రాజస సృష్టి - - - పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనో బుద్ధి చిత్తాహంకారము వెరసి 19 దియు సూక్ష్మశరీరమగుచున్నది. ఇది తైజస దేహము - ఇది యున్నట్లు కార్యములను బట్టి ఊహించుకొనవలనేకాని - - ఇది ఇంద్రియగోచరముకాదు).
దీనినే లింగ శరీరమందురు -
“ఉష్ణ ఏవ జీవిష్య ఞ్ఛీతో మరిష్యన్”
(బ్రతికి యున్నవాడు శరీరమందు వేడిమి కలవాడగును, మృతినొందినపుడు శరీరము చల్లబడును. ఈ వేడిమి స్థూల శరీరమునకు సంబంధించినదికాదు. సూక్ష్మ శరీరమే ఈ వేడిమికి ఆశ్రయమైనది. అది పోవుటయే - శరీరము చల్లబడుటయే మరణము - సూక్ష్మశరీరము స్థూలశరీరములో ఉన్నపుడు వేడిమి ఉండుట, అది లేనపుడు - వేడిమి లేకుండుటవలన ఆ వేడిమి సూక్ష్మ శరీర ధర్మమే).
యధోక్తం తేజః ప్రమాణతః చ కారాత్ స్వరూపతశ్చ త్రసరేణువత్ సూక్ష్మం, తస్య నాడీ ద్వారా నిష్క్రమణ శ్రుత్యా తథా సూక్ష్మ త్వస్యోపలబ్ధే రిత్యర్థః - “సూక్ష్మం ప్రమాణ తశ్చ తధోవలబ్ధేః” - (బ్రహ్మ సూత్రములు - 4 - 2 - 6)
అత ఏవ చ దేహా న్నిర్గచ్చన్ పార్శ్వ స్థైర్నోపలభ్యతే |
అత ఏవ చ పార్శ్వ స్థైర్నోప సూక్ష్మత్వాన్నాస్య స్థూల శరీరస్యోపమలేన దేహాది నిమిత్తే నేతరత్ సూక్ష్మం శరీరముపమృద్యతే. (అతః సూక్ష్మత్వారేవ శరీరోపమర్దేన స్వయం నోపమృద్యతే ఇత్యర్థః ” స్థూల దేహ ఏష ఉపలభ్యమానం ఊష్మా అస్యైవ సూక్ష్మ తేజస ఏవ ధర్మః, సత్యేన తస్మిన్ తదుపలబ్ధేః, తదభావే మృత దేహే తదనుపలబ్దే రిత్య స్వయ వ్యతిరేకాభ్యాం తదర్థస్సైవోపపత్తేర్థః -“.”తదాచ శ్రుతిః - ” ఏష ఏవైష జీవిష్యం, చ్ఛీతో మరిష్యన్నితి” (బ్రహ్మసూత్రభాష్యం - 4 - 2 - 11)
(పైన చెప్పిన ప్రకారము జీవుడు చనిపోయినపుడు అతని స్థూల శరీరములోని వేడిమి (తేజస్సు) ప్రమాణమును బట్టి దాని రూపమును బట్టి త్రసరేణువువలె సూక్ష్మమైనది. “సూక్ష్మం ప్రమాణ తశ్చ తధోపలబ్దేః” (బ్రహ్మసూత్రములు - 4 - 2 - 6)
అని బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి. సుషుమ్నా నాడీ ద్వారముగుండా తేజస్సు (ప్రాణము) శరీరమునునుండి పోవును అని శ్రుతి చెప్పుచున్నది. దీనికి ప్రమాణము - అందుచేతనే - సూక్ష్మముగానుండునదగుటచేతనే). శరీరము విడిచి పోవునపుడు దగ్గరనుండువారలకు కనబడదు. అందుచేతనే - స్థూలశరీరముకంటె (సూక్ష్మశరీరము) సూక్ష్మమైనది కనుకనే స్థూలశరీరము నశించినప్పటికీ సూక్ష్మశరీరము నశించదు - స్థూల శరీరములోనుండు వేడిమి ఈ సూక్ష్మశరీరమునకు సంబంధించిన తేజస్సు యొక్క ధర్మమే. ఆ తేజస్సు (వేడిమి) కలిగియున్నంతసేపు స్థూల శరీరము బ్రతికి యున్నదని చెప్పబడును. ఆ వేడిమి స్థూలదేహములో లేనపుడు ఆ స్థూలదేహము మరణించినదని చెప్పబడును. అందుచేత ఆ తేజస్సు సూక్ష్మశరీరమునదేకాని స్థూలశరీరమునదికాదు - అందుచేతనే బ్రతికి యున్నవాడు వేడిమి కలవాడు, చనిపోయినవాడు వేడిమి లేనివాడు అని చెప్పబడెను).
ī sthūla rūpaṃbu kaṃṭe nadṛṣṭa guṇaṃbayi yaśrutaṃbayina vastuvaguṭaṃ jēsi vyaktaṃbugāka sūkṣmaṃbai karacaraṇādulu lēka jīvuniki koṃḍoka rūpaṃbu vīracitaṃbai yuṃḍu. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 30)
sūkṣmatvāt sūkṣma śarīraṃ - sthūla prapaṃca layasthānaṃ.
(sūkṣmamugā - cinnadigā - nuṃḍuṭavalana sūkṣma śarīramani ceppabaḍinadi - sthūla prapaṃcamu ī sūkṣma śarīramulō layamagunu).
buddhyādya vidyāpi ca kāma karmāṇi puryaṣṭakaṃ sūkṣmaśarīra māhuḥ |
idaṃ śarīraṃ śruṇu sūkṣma saṃjñitaṃ liṃgatva paṃcīkṛta bhūta saṃbhavaṃ |
savāsanaṃ karma phalānu bhāvakaṃ svājñānatō anādi rūpādhirātmanaḥ ||“. (śrīśaṃkaraḥ - vivēkacūḍāmaṇi)
(jñānēṃdriyamulu, karmēṃdriyamulu, śabdamu modalagu viṣayamulu, paṃca prāṇamulu, buddhi modalagunavi, avidya, kāmakarmalu anu enimidi puramulu galadi sūkṣma śarīramu)
(brahmavidyā sudhārṇavamu - 6)
ślō||. paṃcaprāṇamanō buddhi daśēṃdriya samanvitaṃ |
apaṃcīkṛta bhūtōtthaṃ sūkṣmāṃgaṃ bhōgasādhanaṃ ||.
“tatra prāṇaḥ paṃca, karmēṃdriyāṇi paṃca, manaḥ ēkaṃ, buddhiśca ēkaḥ iti sapta daśatatvāni malitvāliṃgaṃ ityucyatē”.
(paṃcīkṛtamukāni paṃcabhūtamula kāryamu, padihēḍu tatvamulatō kūḍinadi sūkṣmaśarīramani ceppabaḍucunnadi - paṃcaprāṇamulu, manassu, buddhi, paṃca jñānēṃdriyamulu paṃca karmēṃdriyamulu kalisi padiyēḍu tatvamulu kalisi liṃgaśarīramu, lēka, sūkṣmaśarīramu ayinadi).
(sthūla śarīramuvale pratyakṣapramāṇamu dvārā gōcaramukānidi (kanabaḍanidi) yaguṭacēta sūkṣma śarīramani ceppabaḍucunnadi).
(karmēṃdriyamulatō kalisi manassu, manōmayakōśamu, prāṇamulu ayidu kalisi prāṇamayakōśamu, jñānēṃdriyamulatō kūḍi buddhi vijñānamayakōśamu - ī mūḍu kōśamulu kaladi liṃga śarīramu - sūkṣma śarīramu).
“paṃcaprāṇa manō buddhi daśēṃdriya samanvitaṃ |
apaṃcīkṛta bhūtōtthaṃ sūkṣmāṃgaṃ bhōgasādhanaṃ ||“. (maitrēya śrutiḥ)
“taccadvidhaṃ - paramaparaṃ ca; tatra paraṃ hiraṇyagarbha liṃgaśarīraṃ mahattattvaṃ aparaṃ asmadādi liṃgaśarīraṃ ahaṃkāraḥ ityākhyāyatē”. (vēdāṃta paribhāṣā - dharmarājādhvarīṃdra)
“tatra brahmāṃḍa vyāpitvāt ādyaṃparaṃ, dēhamātra vyāpitvāt dvitīya maparamityāśayaṃ”.
(pūrvamu ceppina prakāramu paṃcīkṛtamukāni paṃcabhūtamulatō kūḍina liṃga śarīramu - sūkṣma śarīramu, paralōka yātra nirvahiṃcunadi, mōkṣamu kaluguvaraku uṃḍunadi, manōbuddhulatō kūḍinadi. paṃca jñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu, paṃca prāṇamulu kalisi yuṃḍunadi - maitrēyaśruti iṭlē ceppucunnadi -paṃca prāṇamulu, manassu, buddhi, padi iṃdriyamulatō kūḍinadinnī, paṃcīkaraṇamukāni bhūtamulavalana kaliginadinnī ayinadi sūkṣmaśarīramu - idi bhōgasādhanamu).
(canipōyi yamuni maṃdiramunaku pōvunu - ani ceppabaḍinadi. yamuḍu anagā, nivṛtti. dāni ālayamu anagā sūkṣma dēhamu - dānilō jīvuni uniki).
(suṣupti, mūrca, maraṇamu, pralayamu, jñānamu anu ī paṃca avasthalaṃdunu liṃgadēhamu (sūkṣmaśarīramu) dāni kāraṇamaina ajñānamaṃdē līnamagunu. aṃducēta sūkṣmaśarīramu vyabhicāri, mārpulu galadi, asadvastuvu. ellakālamaṃdunu uṃḍanidi. ātma annikālamulaṃduṃḍunadi kanuka mārpulu lēnidi. aṃducēta sadrūpamu - (nityamu). ātma sadrūpamaguṭacēta sūkṣmaśarīramu kānidi. sūkṣmaśarīramu ātmaku saṃbaṃdhiṃcinadi kādu - sūkṣmaśarīramu paṃcīkṛtamu kāni paṃcamahābhūtamula kāryamu - aṃducēta nēnu sūkṣmaśarīramu kānu. kartṛtvamu, bhōktṛtvamu, sukha duḥkhamulu modalagu sūkṣmaśarīra dharmamulu nēnu kādu. ā dharmamulu nāvikavu. ā dharmamulaku nēnu sākṣini - vāṭikaṃṭe vērainavāḍanu).
ākāśādulaina paṃcabhūtamulayokka sātvikāṃśamula valana vyaṣṭigā śrōtra tvakca kṣu rjihvāghrāṇamulaneḍi paṃcajñānēṃdriyamulu ērpaḍucunnavi. ayidu aṃśala samāhāramucēta (samaṣṭhicēta) aṃtaḥkaraṇamu ērpaḍucunnadi. ī aṃtaḥkaraṇamu manōbuddhi cittāhaṃkārarūpamula nālgu rītula noppucuṃḍunu - idi sātvika sṛṣṭi yannamāṭa. paṃcabhūtamulayokka rājasaguṇāṃśalacēta vyaṣṭigā vākpāṇi pādōpastha pāyuvu lērpaḍucunnavi. ī paṃca rajōṃśamula samaṣṭigā dēhamulōni prāṇāpānādi paṃcakamērpaḍucunnadi. idi rājasa sṛṣṭi - - - paṃca jñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu, paṃca prāṇamulu, manō buddhi cittāhaṃkāramu verasi 19 diyu sūkṣmaśarīramagucunnadi. idi taijasa dēhamu - idi yunnaṭlu kāryamulanu baṭṭi ūhiṃcukonavalanēkāni - - idi iṃdriyagōcaramukādu).
dīninē liṃga śarīramaṃduru -
“uṣṇa ēva jīviṣya ñchītō mariṣyan”
(bratiki yunnavāḍu śarīramaṃdu vēḍimi kalavāḍagunu, mṛtinoṃdinapuḍu śarīramu callabaḍunu. ī vēḍimi sthūla śarīramunaku saṃbaṃdhiṃcinadikādu. sūkṣma śarīramē ī vēḍimiki āśrayamainadi. adi pōvuṭayē - śarīramu callabaḍuṭayē maraṇamu - sūkṣmaśarīramu sthūlaśarīramulō unnapuḍu vēḍimi uṃḍuṭa, adi lēnapuḍu - vēḍimi lēkuṃḍuṭavalana ā vēḍimi sūkṣma śarīra dharmamē).
yadhōktaṃ tējaḥ pramāṇataḥ ca kārāt svarūpataśca trasarēṇuvat sūkṣmaṃ, tasya nāḍī dvārā niṣkramaṇa śrutyā tathā sūkṣma tvasyōpalabdhē rityarthaḥ - “sūkṣmaṃ pramāṇa taśca tadhōvalabdhēḥ” - (brahma sūtramulu - 4 - 2 - 6)
ata ēva ca dēhā nnirgaccan pārśva sthairnōpalabhyatē |
ata ēva ca pārśva sthairnōpa sūkṣmatvānnāsya sthūla śarīrasyōpamalēna dēhādi nimittē nētarat sūkṣmaṃ śarīramupamṛdyatē. (ataḥ sūkṣmatvārēva śarīrōpamardēna svayaṃ nōpamṛdyatē ityarthaḥ ” sthūla dēha ēṣa upalabhyamānaṃ ūṣmā asyaiva sūkṣma tējasa ēva dharmaḥ, satyēna tasmin tadupalabdhēḥ, tadabhāvē mṛta dēhē tadanupalabdē ritya svaya vyatirēkābhyāṃ tadarthassaivōpapattērthaḥ -“.”tadāca śrutiḥ - ” ēṣa ēvaiṣa jīviṣyaṃ, cchītō mariṣyanniti” (brahmasūtrabhāṣyaṃ - 4 - 2 - 11)
(paina ceppina prakāramu jīvuḍu canipōyinapuḍu atani sthūla śarīramulōni vēḍimi (tējassu) pramāṇamunu baṭṭi dāni rūpamunu baṭṭi trasarēṇuvuvale sūkṣmamainadi. “sūkṣmaṃ pramāṇa taśca tadhōpalabdēḥ” (brahmasūtramulu - 4 - 2 - 6)
ani brahmasūtramulu ceppucunnavi. suṣumnā nāḍī dvāramuguṃḍā tējassu (prāṇamu) śarīramununuṃḍi pōvunu ani śruti ceppucunnadi. dīniki pramāṇamu - aṃducētanē - sūkṣmamugānuṃḍunadaguṭacētanē). śarīramu viḍici pōvunapuḍu daggaranuṃḍuvāralaku kanabaḍadu. aṃducētanē - sthūlaśarīramukaṃṭe (sūkṣmaśarīramu) sūkṣmamainadi kanukanē sthūlaśarīramu naśiṃcinappaṭikī sūkṣmaśarīramu naśiṃcadu - sthūla śarīramulōnuṃḍu vēḍimi ī sūkṣmaśarīramunaku saṃbaṃdhiṃcina tējassu yokka dharmamē. ā tējassu (vēḍimi) kaligiyunnaṃtasēpu sthūla śarīramu bratiki yunnadani ceppabaḍunu. ā vēḍimi sthūladēhamulō lēnapuḍu ā sthūladēhamu maraṇiṃcinadani ceppabaḍunu. aṃducēta ā tējassu sūkṣmaśarīramunadēkāni sthūlaśarīramunadikādu - aṃducētanē bratiki yunnavāḍu vēḍimi kalavāḍu, canipōyinavāḍu vēḍimi lēnivāḍu ani ceppabaḍenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.