← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూక్ష్మ సృష్టి sūkṣma sṛṣṭi

Original — తెలుగు
  1. “అపంచీ కృత భూతాని, తత్కార్య భూతాంతః కరణప్రాణ కర్మేంద్రియాణి సూక్ష్మ సృష్టిః -” ఇతి.

(పంచీ కరణముకాని పంచభూతములు, వాటి కార్యములైన అంతఃకరణము, ప్రాణములు, కర్మేంద్రియములు, - ఇవి సూక్ష్మ సృష్టి). (అపంచీకృతభూతములు, మఱియు, వీని కార్యములయిన అంతఃకరణము, పంచప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు - ఈ ఇరువది యొకటి తత్వములు గూడి సూక్ష్మ సృష్టి యనబడును).

  1. “పంచభూతములనుండి పుట్టిన అయిదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణములు నాలుగు, అయిదు కర్మేంద్రియములు కూడి పందొమ్మిది అవయవములు కలిసి లింగ శరీరమైనది - సూక్ష్మశరీరమైనది. ఈ సూక్ష్మశరీరముకూడ వృక్షవనములట్లు ప్రత్యేకమై వ్యష్టి సూక్ష్మ శరీరమనియు, సముదాయ రూపమైన సమష్టి సూక్ష్మ శరీరమనియు చెప్పబడును - వ్యష్టి సూక్ష్మ శరీరుని ప్రతిభాసికుడు, స్వప్న కల్పితుడు తైజసుడు అని వ్యవహరించుచున్నారు - సమష్టి సూక్ష్మ శరీరము కల ఈశ్వరుడు హిరణ్యగర్భుడని ప్రాణుడని సూత్రాత్మ అని పిలువబడుచున్నాడు - ఇది సూక్ష్మ ప్రపంచ సృష్టి ప్రకారము”-
Transliteration
  1. “apaṃcī kṛta bhūtāni, tatkārya bhūtāṃtaḥ karaṇaprāṇa karmēṃdriyāṇi sūkṣma sṛṣṭiḥ -” iti.

(paṃcī karaṇamukāni paṃcabhūtamulu, vāṭi kāryamulaina aṃtaḥkaraṇamu, prāṇamulu, karmēṃdriyamulu, - ivi sūkṣma sṛṣṭi). (apaṃcīkṛtabhūtamulu, maṟiyu, vīni kāryamulayina aṃtaḥkaraṇamu, paṃcaprāṇamulu, paṃca jñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu - ī iruvadi yokaṭi tatvamulu gūḍi sūkṣma sṛṣṭi yanabaḍunu).

  1. “paṃcabhūtamulanuṃḍi puṭṭina ayidu jñānēṃdriyamulu, aṃtaḥkaraṇamulu nālugu, ayidu karmēṃdriyamulu kūḍi paṃdommidi avayavamulu kalisi liṃga śarīramainadi - sūkṣmaśarīramainadi. ī sūkṣmaśarīramukūḍa vṛkṣavanamulaṭlu pratyēkamai vyaṣṭi sūkṣma śarīramaniyu, samudāya rūpamaina samaṣṭi sūkṣma śarīramaniyu ceppabaḍunu - vyaṣṭi sūkṣma śarīruni pratibhāsikuḍu, svapna kalpituḍu taijasuḍu ani vyavahariṃcucunnāru - samaṣṭi sūkṣma śarīramu kala īśvaruḍu hiraṇyagarbhuḍani prāṇuḍani sūtrātma ani piluvabaḍucunnāḍu - idi sūkṣma prapaṃca sṛṣṭi prakāramu”-
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.