(కనబడకపోవుటవలన సూక్ష్మము అని చెప్పబడినది)
(పరమాణువు మొదలగు వాటివలె కంటికి గోచరము కానివాడు, కనబడనివాడు - అంతచిన్నది).
(అణువు వలె చిన్నదైన రూపము కలది - అతికష్టముతో చూచుటకు వీలగునది)
సుదుర్జ్ఞేయం (తెలుసుకొనుటకు చాల కష్టమైనది)
నామ రూప విభాగానర్హ నిరతిశయ సూక్ష్మదశాం ఆపన్నం ఇత్యర్థః -
(నామరూపములతో వేరు వేరుగా లేనటువంటి అత్యంత సూక్ష్మదశలో నున్నది)
(వేరు వేరు నామరూపములు గలదిగా విభజించుటకు అర్హముకాని సూక్ష్మరూపములో నుండు చిదచిద్వస్తువు. అన్నింటికంటెను సూక్ష్మమైనదగుటచేత అన్నింటిలోపల వ్యాపించి యుండగల సమర్థత గలది).
- “సర్వగతం సు సూక్ష్మం” (ముండకోపనిషత్) - ఇతి శ్రుతేః -
(శబ్దము మొదలగు సూక్ష్మ వస్తువులు ఆకాశము మొదలగు వాటి స్థూల రూపమునకు కారణము - వాటివలె కారణ వస్తువు తనకు లేనిది కనుక సూక్ష్మము. అన్నింటిలోను ఉండునది కనుక మిక్కిలి సూక్ష్మమైనది. (అన్నింటికంటె సూక్ష్మమైనది) అని శ్రుతి చెప్పుచున్నది)
(“అణువుకంటె చిన్నది - చిన్నదానికంటె చిన్నది, మహత్తత్త్వముకంటె పెద్దది”. అను శ్రుతి వాక్యమునకు అర్థము ఈక్రిందివిధమముగానున్నది - భూమి కన్న జలము సూక్ష్మము, వ్యాపకము; జలముకన్న అగ్ని సూక్ష్మము, వ్యాపకము; అగ్నికన్న వాయువు, వాయువు కన్న ఆకాశము సూక్ష్మము, వ్యాపకము - అన్నింటిలోను - ముందు చెప్పినవాటన్నింటిలోను వ్యాపించియుండునది) ఆకాశము కంటె మాయ, లేక, ప్రకృతి సూక్ష్మము, వ్యాపకము. మాయకంటె ఆత్మ సూక్ష్మము, వ్యాపకము - అన్నింటిలోను వ్యాపించియుండు ప్రకృతిలో కూడ వ్యాపించియుండునది కనుక, ప్రకృతికన్న సూక్ష్మమైనది అని ఇట్లు ఆత్మ అన్నింటికంటె సూక్ష్మమైనది, వ్యాపకమైనది అని శ్రుతిలో చెప్పబడినది).
సర్వాతీత తరం సూక్ష్మం తస్మై సూక్షాత్మనేనమః ||. (మహాభారతము)
(అన్నింటిలోను నిత్యము ఉండునది, ప్రాణులందఱి హృదయమందుండునది, అన్నింటికంటె మించి సూక్ష్మముగా నుండునది అయినది చైతన్యము. అట్టి సూక్ష్మ వస్తువునకు నమస్కారము).
సూక్ష్మాత్ సూక్ష్మంచ యద్బ్రహ్మ తస్మై సూక్ష్మాత్మనే నమః ||“. (మహాభారతము)
(సూక్ష్మములగు వస్తువులను చూచువారు ఎవరిని సూక్ష్మాతి సూక్ష్మమని తెలుసుకొనుచున్నారో అట్టి సూక్ష్మమైనదానికంటె సూక్ష్మమైన పరబ్రహ్మ కొఱకు నమస్కారము)
(కనబడక పోవుటవలన సూక్ష్మమైనది)
(kanabaḍakapōvuṭavalana sūkṣmamu ani ceppabaḍinadi)
(paramāṇuvu modalagu vāṭivale kaṃṭiki gōcaramu kānivāḍu, kanabaḍanivāḍu - aṃtacinnadi).
(aṇuvu vale cinnadaina rūpamu kaladi - atikaṣṭamutō cūcuṭaku vīlagunadi)
sudurjñēyaṃ (telusukonuṭaku cāla kaṣṭamainadi)
nāma rūpa vibhāgānarha niratiśaya sūkṣmadaśāṃ āpannaṃ ityarthaḥ -
(nāmarūpamulatō vēru vērugā lēnaṭuvaṃṭi atyaṃta sūkṣmadaśalō nunnadi)
(vēru vēru nāmarūpamulu galadigā vibhajiṃcuṭaku arhamukāni sūkṣmarūpamulō nuṃḍu cidacidvastuvu. anniṃṭikaṃṭenu sūkṣmamainadaguṭacēta anniṃṭilōpala vyāpiṃci yuṃḍagala samarthata galadi).
- “sarvagataṃ su sūkṣmaṃ” (muṃḍakōpaniṣat) - iti śrutēḥ -
(śabdamu modalagu sūkṣma vastuvulu ākāśamu modalagu vāṭi sthūla rūpamunaku kāraṇamu - vāṭivale kāraṇa vastuvu tanaku lēnidi kanuka sūkṣmamu. anniṃṭilōnu uṃḍunadi kanuka mikkili sūkṣmamainadi. (anniṃṭikaṃṭe sūkṣmamainadi) ani śruti ceppucunnadi)
(“aṇuvukaṃṭe cinnadi - cinnadānikaṃṭe cinnadi, mahattattvamukaṃṭe peddadi”. anu śruti vākyamunaku arthamu īkriṃdividhamamugānunnadi - bhūmi kanna jalamu sūkṣmamu, vyāpakamu; jalamukanna agni sūkṣmamu, vyāpakamu; agnikanna vāyuvu, vāyuvu kanna ākāśamu sūkṣmamu, vyāpakamu - anniṃṭilōnu - muṃdu ceppinavāṭanniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi) ākāśamu kaṃṭe māya, lēka, prakṛti sūkṣmamu, vyāpakamu. māyakaṃṭe ātma sūkṣmamu, vyāpakamu - anniṃṭilōnu vyāpiṃciyuṃḍu prakṛtilō kūḍa vyāpiṃciyuṃḍunadi kanuka, prakṛtikanna sūkṣmamainadi ani iṭlu ātma anniṃṭikaṃṭe sūkṣmamainadi, vyāpakamainadi ani śrutilō ceppabaḍinadi).
sarvātīta taraṃ sūkṣmaṃ tasmai sūkṣātmanēnamaḥ ||. (mahābhāratamu)
(anniṃṭilōnu nityamu uṃḍunadi, prāṇulaṃdaṟi hṛdayamaṃduṃḍunadi, anniṃṭikaṃṭe miṃci sūkṣmamugā nuṃḍunadi ayinadi caitanyamu. aṭṭi sūkṣma vastuvunaku namaskāramu).
sūkṣmāt sūkṣmaṃca yadbrahma tasmai sūkṣmātmanē namaḥ ||“. (mahābhāratamu)
(sūkṣmamulagu vastuvulanu cūcuvāru evarini sūkṣmāti sūkṣmamani telusukonucunnārō aṭṭi sūkṣmamainadānikaṃṭe sūkṣmamaina parabrahma koṟaku namaskāramu)
(kanabaḍaka pōvuṭavalana sūkṣmamainadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.