(పృధివి మొదలుకొని అవ్యక్తము (ప్రకృతి) వఱకు గల ఒకదానికంటె ఒకటి మిక్కిలి సూక్ష్మమైనవి. వీటి అన్నింటికి పైన ఉన్నవాడు కనుక భగవంతుడు అన్నింటికంటె సఊక్ష్మమైనవాడు - సూక్ష్మమైన వాటికంటె సూక్ష్మమైనవాడు).
(పృధివి మొదలగు వాటియందు ఒకదానికంటె ఒకటి గుణములు తక్కువైనకొలది ఒకదాని కంటె ఒకటి సూక్ష్మము - పరమాత్మ యందు గుణము లేనందున (నిర్గుణుడు) అన్నింటికంటె సూక్ష్మమైనవాడు).
(స్థూలరూపములోనున్న కార్యవస్తువు లయించగా - నశించగా - దాని కారణమైన సూక్ష్మవస్తువు మిగులును - అది నశించిన దాని కారణవస్తువు మిగులును - ఇట్లు వెనుకకు వెనుకకు వెళ్ళిన అన్ని కార్య కఆరణవస్తువులకు కారణమైన (మూలకారణమైన) భగవంతుడు సన్మాత్రుడు అగుటవలన మిగిలియుండును - స్థూల వస్తువు నశించగా దానికి కారణవస్తువులైన సూక్ష్మ వస్తువు, అది నశించగా దానికి కారణమైనది - ఈ ప్రకారముగా కార్య కారణ వస్తువులన్నియు నశించగా, వాటి అన్నింటికంటె సూక్ష్మమైనదగుటచేత పరమాత్మ మిగిలి యుండును).
(సూక్ష్మమైన ఆకాశముకంటె ఎక్కువ సూక్ష్మమైనది, అన్నింటికి కారణమైనది యగుటవలన అన్నింటికంటె సూక్ష్మమైనది భగవంతుడే).
(సమస్త చేతన వస్తువులలోను ప్రవేశించి యుండు శక్తిగల వాడగుటచేత వాటి అన్నింటికంటె మిక్కిలి సూక్ష్మ మైనవాడు).
(తలవెంట్రుకను నులువుగా కోటి ముక్కలుగా చీరిన, అందులో ఒకభాగముకంటె మిక్కిలిసూక్ష్మమైనవాడు ఆత్మ).
(మనో వ్యాపారముకంటె హెచ్చుగా సూక్ష్మమైనది. అనగా, స్థూల సూక్ష్మముల పరిమాణము లేనివాడు)
(pṛdhivi modalukoni avyaktamu (prakṛti) vaṟaku gala okadānikaṃṭe okaṭi mikkili sūkṣmamainavi. vīṭi anniṃṭiki paina unnavāḍu kanuka bhagavaṃtuḍu anniṃṭikaṃṭe saūkṣmamainavāḍu - sūkṣmamaina vāṭikaṃṭe sūkṣmamainavāḍu).
(pṛdhivi modalagu vāṭiyaṃdu okadānikaṃṭe okaṭi guṇamulu takkuvainakoladi okadāni kaṃṭe okaṭi sūkṣmamu - paramātma yaṃdu guṇamu lēnaṃduna (nirguṇuḍu) anniṃṭikaṃṭe sūkṣmamainavāḍu).
(sthūlarūpamulōnunna kāryavastuvu layiṃcagā - naśiṃcagā - dāni kāraṇamaina sūkṣmavastuvu migulunu - adi naśiṃcina dāni kāraṇavastuvu migulunu - iṭlu venukaku venukaku veḷḷina anni kārya kaāraṇavastuvulaku kāraṇamaina (mūlakāraṇamaina) bhagavaṃtuḍu sanmātruḍu aguṭavalana migiliyuṃḍunu - sthūla vastuvu naśiṃcagā dāniki kāraṇavastuvulaina sūkṣma vastuvu, adi naśiṃcagā dāniki kāraṇamainadi - ī prakāramugā kārya kāraṇa vastuvulanniyu naśiṃcagā, vāṭi anniṃṭikaṃṭe sūkṣmamainadaguṭacēta paramātma migili yuṃḍunu).
(sūkṣmamaina ākāśamukaṃṭe ekkuva sūkṣmamainadi, anniṃṭiki kāraṇamainadi yaguṭavalana anniṃṭikaṃṭe sūkṣmamainadi bhagavaṃtuḍē).
(samasta cētana vastuvulalōnu pravēśiṃci yuṃḍu śaktigala vāḍaguṭacēta vāṭi anniṃṭikaṃṭe mikkili sūkṣma mainavāḍu).
(talaveṃṭrukanu nuluvugā kōṭi mukkalugā cīrina, aṃdulō okabhāgamukaṃṭe mikkilisūkṣmamainavāḍu ātma).
(manō vyāpāramukaṃṭe heccugā sūkṣmamainadi. anagā, sthūla sūkṣmamula parimāṇamu lēnivāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.