(విద్వాంసులు, పండితులు, ఇంద్రుడు మొదలగువారు, సూరి జనులు).
(విజ్ఞానము కలవారు - బ్రహ్మవేత్తలు - బ్రహ్మ జ్ఞానము కలవారు).
సుధియః (మంచి బుద్ధి కలవారు).
అకుంఠిత జ్ఞాన శాలినః; యోగినః; వివేకినః -
(మొక్కవోని - తీక్ష్ణమైన జ్ఞానము కలవారు; యోగులు, వివేకము గలవారు).
(మూడు కాలములందును - భూత భవిష్యద్వర్తమాన కాలములందును - జరుగునది చూడగలవారు - పరిపూర్ణమైన జ్ఞానము కలవారు కొందఱున్నారని తెలియవచ్చుచున్నది - అట్టివారున్నారనుట స్పష్టమే)..
(భక్త్యుద్రేకముతో, నిర్మలమైన మనస్సుతో దోషము లేని మనస్సుతో పరబ్రహ్మను చూచువారు; లేక, నారాయణుడని పరబ్రహ్మ యొక్క - స్థానమైన పరమ పదమను పేరుగల దానిని (వైకుంఠమును) చూచువారు. పరమపదమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే పరమపదము - వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము).
(ఆ పరబ్రహ్మయైన విష్ణుని యొక్క ఉత్కృష్టమైన స్థానమగు వైకుంఠమును సూరిజనులు ఎల్లపుడు చూచుచుండెదరు).
(vidvāṃsulu, paṃḍitulu, iṃdruḍu modalaguvāru, sūri janulu).
(vijñānamu kalavāru - brahmavēttalu - brahma jñānamu kalavāru).
sudhiyaḥ (maṃci buddhi kalavāru).
akuṃṭhita jñāna śālinaḥ; yōginaḥ; vivēkinaḥ -
(mokkavōni - tīkṣṇamaina jñānamu kalavāru; yōgulu, vivēkamu galavāru).
(mūḍu kālamulaṃdunu - bhūta bhaviṣyadvartamāna kālamulaṃdunu - jarugunadi cūḍagalavāru - paripūrṇamaina jñānamu kalavāru koṃdaṟunnārani teliyavaccucunnadi - aṭṭivārunnāranuṭa spaṣṭamē)..
(bhaktyudrēkamutō, nirmalamaina manassutō dōṣamu lēni manassutō parabrahmanu cūcuvāru; lēka, nārāyaṇuḍani parabrahma yokka - sthānamaina parama padamanu pērugala dānini (vaikuṃṭhamunu) cūcuvāru. paramapadamē parabrahmamu, parabrahmamē paramapadamu - vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu).
(ā parabrahmayaina viṣṇuni yokka utkṛṣṭamaina sthānamagu vaikuṃṭhamunu sūrijanulu ellapuḍu cūcucuṃḍedaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.